నాగబాబు ఆధ్వర్యంలో జనసేన నేతలతో నియోజకవర్గాలతో సమీక్ష సమావేశం...
నాగబాబు ఆధ్వర్యంలో జనసేన నేతలతో నియోజకవర్గాలతో సమీక్ష సమావేశం రెండో రోజు కొనసాగుతుంది. నెల్లూరు సిటీ, కోవూరు, సూళ్లూరుపేట నియోజకవర్గాల నేతలతో సమావేశం.. పాల్గొన్న జనసేన పార్టీ నేతలు అజయ్ కుమార్, మనక్రాంత్ రెడ్డిలు
PFI కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన ఎన్ఐఏ..
PFI కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన ఎన్ఐఏ.. మోస్ట్ వాంటెడ్ లిస్టులో తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు యువకులు.. తెలంగాణకు చెందిన అబ్దుల్ సలీం, అబ్దుల్ అహ్మద్.. ఏపీకి చెందిన షేక్ అహ్మద్ కోసం గాలిస్తున్న అధికారులు.. తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళకు చెందిన 11 మంది, కర్ణాటకకు చెందిన ఐదుగురు.. తమిళనాడుకు చెందిన ఐదుగురు వ్యక్తుల కోసం ఎన్ఐఏ గాలింపు..
హైదరాబాద్: ధర్నా చౌక్‌ను యధావిధిగా కొనసాగించేందుకు ప్రభుత్వ నిర్ణయం..
హైదరాబాద్: ధర్నా చౌక్‌ను యధావిధిగా కొనసాగించేందుకు ప్రభుత్వ నిర్ణయం.. ధర్నా చౌక్‌ను పరిశీలించిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్.. ధర్నా చౌక్‌లో సౌకర్యాలు మెరుగుపరిచేందుకు కృషి చేస్తాం.. ధర్నా చౌక్‌లో ఎవరైనా ఆందోళనలు చేపట్టవచ్చు.. ధర్నాలు నడుస్తున్న సమయంలో రోడ్లను మూసివేసే ప్రసక్తే లేదు.. ట్రాఫిక్‌కి ఇబ్బంది లేకుండా ధర్నాలు చేపట్టవచ్చు. -సీపీ కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి..
హైదరాబాద్: తెలంగాణలో 9 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ..
హైదరాబాద్: తెలంగాణలో 9 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ.. నిర్మల్ అడిషనల్ కలెక్టర్‌గా ఫైజాన్ అహ్మద్.. హన్మకొండ అడిషనల్ కలెక్టర్‌గా రాధాగుప్త.. ములుగు అడిషనల్ కలెక్టర్‌గా పి.శ్రీజ.. రాజన్న సిరిసిల్ల అడిషనల్ కలెక్టర్‌గా పి.గౌతమి.. జనగామ అడిషన్ కలెక్టర్‌గా పర్మార్ పింకేష్‌కుమార్ లలిత్‌కుమార్.. మహబూబాబాద్ అదనపు కలెక్టర్‌గా లెనిన్ వత్సల్ టోప్పో.. మహబూబ్‌నగర్ అడిషనల్ కలెక్టర్‌గా శివేంద్ర ప్రతాప్.. వనపర్తి అదనపు కలెక్టర్‌గా సంచిత్ గంగ్వార్.. జయశంకర్ భూపాలపల్లి అదనపు కలెక్టర్‌గా పి.కధీరవన్ నియామకం.
సిద్దిపేట జిల్లా కలెక్టర్ గన్‌మెన్ ఆత్మహత్య..
సిద్దిపేట జిల్లా కలెక్టర్ గన్‌మెన్ ఆత్మహత్య.. భార్య, ఇద్దరు పిల్లల్ని చంపేసి గన్‌తో కాల్చుకున్న నరేశ్.. మృతులు ఆకుల నరేష్, భార్య చైతన్య, కుమారుడు రేవంత్, కుమార్తె హిమశ్రీ.. చిన్నకోడూర్ మండలం రామునిపట్లలో ఘటన
హైదరాబాద్: ప్రజావాణికి భారీగా జనం...
హైదరాబాద్: ప్రజావాణికి భారీగా జనం, మంగళ, శుక్రవారం ప్రజావాణి నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం, తమ సమస్యలను చెప్పుకునేందుకు జనం క్యూ.. ప్రజా వాణికి మంత్రులు.. ఫిర్యాదులు స్వీకరణ, సమస్య తీవ్రత బట్టి అధికారులకు ఆదేశాలు.. ఎక్కువగా భూ సమస్యలు, పెన్షన్ల సమస్యలపై వస్తున్న ప్రజలు.
తిరుమల:అన్ని కంపార్టుమెంట్లు నిండి వెలుపల క్యూ లైన్‌లో వేచివున్న భక్తులు..
తిరుమల: వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు నిండి వెలుపల క్యూ లైన్‌లో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 56,049 మంది భక్తులు, తలనీలాలు సమర్పించిన 26,748 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ. 3.97 కోట్లు
చర్ల:మీచౌంగ్ తుఫాను వలన నష్టపోయిన మిర్చి రైతులని ఆదుకోవాలి సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ డిమాండ్
మీచౌంగ్ తుఫాను వలన నష్టపోయిన మిర్చి రైతులని ఆదుకోవాలి సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ డిమాండ్
గత వారం రోజుల కిందట కురిసిన మీచౌoగ్ తుఫాను వలన నష్టపోయిన మిర్చి రైతులని ఆదుకోవాలని కౌలు రైతులకి నష్టపరిహారం చెల్లించాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ మండల నాయకులు కనితి భాను ప్రకాష్ నష్ట పోయిన మిర్చి పంటలను పరిశీలించారు అఖిలభారత రైతుకూలీ సంఘం ఏఐకేఎంఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు చర్ల మండలంలోని ఉన్న వున్న మిర్చీ పంటలు తుఫాను కారణంగా నష్టపోయిన పంటలను పరిశీలన చేయడం జరిగిందని అన్నారు అనంతరం వారు మాట్లాడుతూ రాత్రింబవళ్లు కష్టపడి వడ్డీలకి అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టుకున్న మిర్చి పంటలు తుఫాను కారణంగా ఒక్కసారి నేలమట్టం కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు కష్టపడి సాగు చేసుకున్న పంట ఒక్కసారి నేలమట్టం కావడంతో రైతు ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ప్రభుత్వమే రైతులను అదుకోవాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీగా డిమాండ్ చేశారు అధికారులు తక్షణమే దెబ్బతిన్న పంటలను సర్వే చేయాలని కౌలు రైతులకు నష్టపరిహారం చెల్లించాలని మిర్చి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు దేశానికి వెన్నుముక ఆ రైతే అని ప్రలాభాలు పలకటం కాదు ఈ ప్రభుత్వాలు నేల రాలుతున్న ఈ రైతన్నల పంటలను చూసి ఎందుకు ఈ ప్రభుత్వాలు చలిచట్లేద అని ప్రశ్నించారు తక్షణమే నష్టపోయిన పంటలకు సర్వే నిర్వహించి తక్షణమే నష్టపరిహాన్ని రైతులకు అందించే విధంగా ప్రభుత్వం ఆలోచన చేయాలని పంట నష్ట వివరాల కోసం అధికారులను ఆదేశించాలని కోరారు కార్యక్రమంలో చిరిగిడి నరేష్ బుర్ర సమ్మక్క ఇర్ఫా సమ్మక్క బాయఅమ్మ అలవాల రమణ రాణి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
అమరావతి: పార్టీ అనుబంధ విభాగాల పదవుల భర్తీపై వైసీపీ ఫోకస్..
అమరావతి: పార్టీ అనుబంధ విభాగాల పదవుల భర్తీపై వైసీపీ ఫోకస్.. ఇప్పటికే పార్టీ యువ, మహిళా విభాగం కార్యవర్గాన్ని ప్రకటించిన పార్టీ.. ఇవాళ మరో ఆరు విభాగాల కార్యవర్గాల ప్రకటన.. పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిగా జంగా కృష్ణ మూర్తి నియామకం.. క్రిస్టియన్ మైనారిటీ విభాగం అధ్యక్షుడిగా ఎం.జాన్సన్.. పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఖాదర్ బాషా.. రైతు విభాగం అధ్యక్షుడిగా ఎం.వి.ఎస్. నాగిరెడ్డి.. పార్టీ వాణిజ్య విభాగం అధ్యక్షులుగా కుప్పం ప్రసాద్, పల్లపోతు మురళీకృష్ణ.. చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా గంజి చిరంజీవి.
Dec 17 2023, 12:34