TS: సీఎం కాన్వాయ్ తో ప్రజలకు ఇబ్బంది రానివ్వొద్దు: సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
హైదరాబాద్: సీఎం కాన్వాయ్ వెళ్తున్న సమయంలో సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీస్ అధికారులకు సూచించారు.
సీఎం కాన్వాయ్ లోని 15 వాహనాలను 9 వాహనాలకు తగ్గించి, తాను ప్రయాణించే మార్గంలో ప్రజలకు ఇబ్బంది కలవకుండా ట్రాఫిక్ జామ్ లు లేకుండా, ట్రాఫిక్ ను నిలిపివేయకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ పోలీస్ అధికారులకు సూచించారు.
ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి తాను విస్తృత స్థాయిలో పర్యటనలను చేయాల్సి ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో తాను ప్రయాణించే మార్గంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఏవిధమైన చర్యలు తీసుకోవాలో సూచించాలని పోలీస్ అధికారులను సీఎం కోరారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా, ఇంట్లో కూర్చోవడం తనకు సాధ్యం కాదని సీఎం రేవంత్ అన్నారు.

						






నల్లగొండ పట్టణం లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల కు చెందిన విద్యార్థిని అక్షిత.. చదరంగంలో ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్ కు ఎంపిక కాబడిందని కళాశాల ఇన్చార్జి ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ ఎస్. రాజారామ్ తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గన్ శ్యామ్ మరియు అధ్యాపకులు ఆమెను అభినందిస్తూ సంతోషం వ్యక్తం చేశారు.

Dec 15 2023, 21:59
- Whatsapp
 
								    - Facebook
 
							       
								  - Linkedin
 
								  - Google Plus
 
								 
							   
0- Whatsapp
 
								    - Facebook
 
							       
								  - Linkedin
 
								  - Google Plus
 
								 
							   
14.3k