TS: కొత్తగా ఇల్లు నిర్మించుకునే పేదలకు ఐదు లక్షలు, ఎస్సీ ఎస్టీలకు ఆరు లక్షలు: గవర్నర్
తెలంగాణలో కొత్త ఇల్లు నిర్మించుకునే పేదలకు 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తామని గవర్నర్ తమిళసై తెలిపారు. అదేవిధంగా కొత్తగా ఇల్లు నిర్మించుకునే ఎస్సీ, ఎస్టీలకు ఆరు లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని తెలిపారు. అసైన్డు, పోడు భూములకు త్వరలోనే పట్టాలు పంపిణీ చేస్తామని గవర్నర్ తెలిపారు.
కాలేశ్వరం, మేడిగడ్డ, అన్నారం మ్యారేజీల్లో అవినీతిపై విచారణ జరిపిస్తామని గవర్నర్ తమిళసై అన్నారు.
కృష్ణా జలాలలో రాష్ట్రానికి దక్కాల్సిన వాటా సాధనకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. అమరవీరుల కుటుంబాలకు 250 చ.గజాల ఇంటి స్థలం, గౌరవభృతి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

						




నల్లగొండ పట్టణం లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల కు చెందిన విద్యార్థిని అక్షిత.. చదరంగంలో ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్ కు ఎంపిక కాబడిందని కళాశాల ఇన్చార్జి ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ ఎస్. రాజారామ్ తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గన్ శ్యామ్ మరియు అధ్యాపకులు ఆమెను అభినందిస్తూ సంతోషం వ్యక్తం చేశారు.



Dec 15 2023, 14:33
- Whatsapp
 
								    - Facebook
 
							       
								  - Linkedin
 
								  - Google Plus
 
								 
							   
0- Whatsapp
 
								    - Facebook
 
							       
								  - Linkedin
 
								  - Google Plus
 
								 
							   
25.0k