TS: మహాలక్మి పథకం వల్ల లాభాలు: ప్రొఫెసర్ నాగేశ్వర్
మహిళలకు, ఆడపిల్లలకు బస్సులో ఉచిత ప్రయాణం తో ప్రైవేట్ వెహికల్స్, సొంత వెహికల్స్ ను తగ్గించే అవకాశం ఉంది. దాంతో పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గనుంది. పట్టణ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు కూడా కొంతవరకు తగ్గే అవకాశం ఉంది.
మహిళలకు రక్షణ ఉండే అవకాశం ఉంది.
పెట్రోల్, డీజిల్ ఖర్చు తగ్గటం తో తెలంగాణ కుటుంబాలకే కాదు దేశానికి కూడా పరోక్షంగా మేలు జరిగే అవకాశం ఉంది.
ఇక దీని నిర్వహణకయ్యే ఖర్చు
రైతుబంధు మొత్తం 1 కోటి 43 లక్షల ఎకరాల భూమికి ప్రతి ఆరు నెలలకు చెల్లించే 7 వేల కోట్ల 15 లక్షల రూపాయలు అయితే ఇందులో కేవలం సాగు యోగ్యమైన భూమి 53 లక్షల 51 వేల ఎకరాలు మాత్రమే దీనికి 2 వేల కోట్ల 67 లక్షలు మాత్రమే ఖర్చవుతుంది ఇక దున్నే భూమికే గనక మనం రైతుబంధు ఇచ్చినట్లయితే దాదాపుగా 4000 కోట్ల రూపాయలు రైతుబంధు ద్వారా మిగులుతుంది.
ఇక మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ద్వారా రోజుకు 4 కోట్లు అంటే నెలకు 120 కోట్లు 6 నెలలకు కేవలం 720 కోట్లు మాత్రమే ఖర్చవుతుంది. పైగా దీని ద్వారా మహిళా ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగులకు సగటున నెలకు 2000 నుండి 7000 రూపాయల వరకు ఆదా అవుతుంది.











Dec 14 2023, 23:02
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
32.5k