NLG: నాగార్జునసాగర్ నియోజకవర్గ ఐఎన్టీయూసీ అధ్యక్షుడిగా అన్వరుద్దీన్

నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జయవీర్ రెడ్డి ,ఐఎన్టియుసి జిల్లా అధ్యక్షులు అంబటి సోమన్న లు మంగళవారం నాగార్జునసాగర్ నియోజకవర్గ ఐఎన్టియుసి అధ్యక్షుడిగా హాలియా పట్టణానికి చెందిన షేక్ అన్వరుద్దీన్ కు నియామక పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా అన్వరుద్దిన్ మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి,ఐఎన్టియుసి జాతీయ అధ్యక్షులు జి.సంజీవరెడ్డి, ఐఎన్టియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కుందూరు రఘువీర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు కర్ణాటి లింగారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి మరియు నియోజకవర్గ, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు ధన్యవాదాలు అని తెలిపారు. ఐఎన్టీయూసీ, కాంగ్రస్ పార్టీ బలోపేతానికి, కృషి చేస్తానని మరియు సంఘటిత, అసంఘటిత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షులు మోయుద్దిన్, నియోజకవర్గ ఎన్.ఎస్.యు.ఐ అధ్యక్షులు సాజిద్, మైనార్టీ నాయకులు షకీల్ బాబా, శర్ఫుద్దిన్, అబ్దుల్ బిన్ సోహెల్ పాషా తదితరులు పాల్గొన్నారు.
Dec 13 2023, 10:23
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
5.3k