TS: పోలీస్ కమిషనర్లకు స్థానచలనం..రాచకొండ పోలీస్ కమిషనర్ గా సుధీర్ బాబు
తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి నియమించింది. అదేవిధంగా సైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా అవినాష్ మహంతి, రాచకొండ పోలీస్ కమిషనర్ గా సుధీర్ బాబును నియమించింది. అయితే హైదరాబాదు పాత సీపీ సందీప్ శాండిల్య ను నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ గా ప్రభుత్వం బదిలీ చేసింది. ఇక సైదరాబాద్, రాచకొండ ప్రస్తుత సిపి లైన స్టీఫెన్ రవీంద్ర, చౌహన్ లను డిజిపి ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.






నల్లగొండ: ఈనెల 11వ తేదీ నుండి 15వ తేదీ వరకు కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు యూనివర్సిటీలో జరిగే సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ ఫుట్బాల్ పోటీలలో పాల్గొనే మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఫుట్బాల్ టీం కెప్టెన్ గా.. నల్గొండ పట్టణంలోని చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ కు చెందిన ఫుట్బాల్ క్రీడాకారుడు బొమ్మపాల సాయి చంద్ర సిద్ధార్థ ఎన్నికయ్యాడని, ఎం.జి.యూ ఫిజికల్ డైరెక్టర్ మురళి మరియు శ్రీనివాసరెడ్డి లకు క్లబ్ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని హెడ్ కోచ్ మద్ది కరుణాకర్ తెలిపాడు.




Dec 12 2023, 20:23
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
5.8k