ఈనెల 17 నుండి తెలంగాణలో ఆరు రోజులపాటు రాహుల్ పర్యటన

హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో రాజకీయం హీటెక్కింది. నిత్యం ఎమ్మెల్యే అభ్యర్థులు, వివిధ పార్టీల సీనియర్ నాయకులు తమ అభ్యర్థిని గెలిపించాలని జోరుగా ప్రచారం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో కాం‍గ్రెస్‌ అగ్రనేత ఎంపీ రాహుల్‌ గాంధీ.. తెలంగాణలో 6 రోజుల పాటు పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగానే ఆయన తెలంగాణలో పర్యటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 17వ తేదీ నుండి తెలంగాణలో రాహుల్ పర్యటన ఉండనున్నట్లు సమాచారం.

నవంబర్‌ 17వ తేదీన తెలంగాణకు రానున్న రాహుల్‌ గాంధీ.. అదే రోజు పాలకుర్తి, వరంగల్, భువనగిరిలో కాంగ్రెస్‌ నిర్వహించే సభల్లో పాల్గొంటారు. అక్కడి నుంచి వరుసగా ఆరు రోజుల పాటు ఆయన సభల్లో పాల్గొననున్నారు.

ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ప్రతీ నియోజకవర్గంలోనూ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన అగ్రనేతల పర్యటనలు ఉండేలా కాంగ్రెస్‌ కసరత్తులు చేస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ సమావేశాలు ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారు.

NLG: సొంత గూటికి చేరిన లెంకలపల్లి సర్పంచ్ పాక నగేష్ యాదవ్

నల్లగొండ జిల్లా:

మర్రిగూడ మండలం, లెంకలపల్లి గ్రామ సర్పంచి పాక నగేష్.. తన అనుచరులతో కలిసి, ఈ రోజు మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి ఆయనకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పాక అంజయ్య, పెంబళ్ళ సోమయ్య, పెంబళ్ళ మల్లయ్య, అబ్బనబోయిన దశరథ, ఏర్పుల జన్నయ్య, అధిముళ్ల మట్టయ్య, కర్నాటి సైదులు, దాసరి వెంకన్న, పగిళ్ళ రాజశేఖర్, కాటగొని రమేష్, పగిళ్ళ హరీష్, పాక పరమేష్, మేతరి రమేష్, పెంబళ్ళ రవీందర్, దాసరి గణేష్, కొంగల నవీన్,గంట సాయి, ఏర్పుల శేఖర్, కాటం భరత్, ఐతగోని రామ్ చరణ్, కుందారపు సాయి, బన్నీ, తదితరులు పాల్గొన్నారు.

TS: నేడు సొంత నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి ప్రచారం

హైదరాబాద్: నేడు టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి సోమవారం తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. పలు గ్రామాలలో కార్నర్ మీటింగ్ లలో ఆయన పాల్గొంటారు.

రేపు వర్ధన్నపేట, స్టేషన్ ఘనపూర్, కామారెడ్డి నియోజకవర్గాలలో ప్రచారం చేయనున్నారు. అదేవిధంగా ఈనెల 15వ తేదీన బోథ్, నిర్మల్ మరియు జనగామ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించనున్నారు.

NLG: క్రీడాకారులందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపిన చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ వ్యవస్థాపకులు బొమ్మపాల గిరిబాబు

ఈ దీపావళి పండుగ క్రీడాకారుల జీవితాలలో వెలుగులు నింపి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని, పాఠశాల దశ నుండే మంచి క్రమశిక్షణ ,పట్టుదల తో చదువుతూ క్రీడలను అలవాటు చేసుకుంటే అద్భుతమైన జీవితాన్ని సాధించవచ్చునని తెలియజేస్తూ, క్రీడాకారులకు, క్రీడాధికారులకు, ఒలంపిక్ అసోసియేషన్ ప్రతినిధులకు, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులకు, క్రీడా పోషకులకు, క్రీడలను ప్రోత్సహించే ప్రతి ఒక్కరికి.. చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ పక్షాన దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని క్లబ్ వ్యవస్థాపకులు బొమ్మపాల గిరిబాబు తెలిపారు.

NLG: లెంకలపల్లి లో చల్లమల్ల కృష్ణా రెడ్డి ఎన్నికల ప్రచారం

నల్లగొండ జిల్లా:

మర్రిగూడెం మండలం లెంకలపల్లి గ్రామంలో, బిజేపి మునుగోడు ఎమ్మేల్యే అభ్యర్ధి చల్లమల్ల కృష్ణా రెడ్డి సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కోలాటం, డప్పు వాయిద్యాల తో ఆయన కు స్వాగతం పలికారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక్క అవకాశం ఇవ్వండి, మునుగోడు నియోజక వర్గాన్ని అభివృద్ది చేసి చూపిస్తా, లేనట్లయితే మరోసారి ఓటు అడగమని అన్నారు. ప్రజలు కమలం పువ్వు గుర్తు కు ఓటు వేసి తనను గెలిపించాలన్నారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, పాల్గొన్నారు.

TS: భౌతిక శాస్త్ర అధ్యాపకులు డా. రేఖా వెంకటేశ్వర్లు కు 'గురు స్పందన అవార్డు'

ఖమ్మం: జిల్లా కేంద్రం లో జరిగిన TREND (టీచర్స్ రిలేషన్షిప్ ఇన్ ఎడ్యుకేషన్ ఫర్ నేషనల్ డెవలప్మెంట్) కార్యక్రమంలో.. నల్లగొండ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల భౌతిక శాస్త్రం సహాయ ఆచార్యులు డాక్టర్ రేఖా వెంకటేశ్వర్లు ను "గురు స్పందన "అవార్డు తో సత్కరించారు.

"ఆత్మ హత్యల రహిత భారత నిర్మాణం" లక్ష్యం తో నిర్వహిస్తున్న అనేక సేవా కార్యక్రమాలలో వాలంటీర్ గా నేను సైతం అంటూ సేవలు అందిస్తున్నందుకు గాను  "స్పందన ఈద ఇంటర్నేషనల్ ఫౌండేషన్" డైరెక్టర్ డాక్టర్ శామ్యూల్ రెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ వెంకటేశ్వర్లు ను సత్కరించారు.

డైరెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థినీ విద్యార్థులు, యువత, మహిళలు వివిధ కారణాల చేత ఆత్మ హత్య లతో జీవితాలు కోల్పోతున్నారని, వాటిని కూకటి వేళ్లతో సహా నిర్మూలించాలని భావించి, TREND కార్యక్రమం ద్వారా ఉపాధ్యాయులను ఈ ఉద్యమం లో భాగస్వాములు చేస్తూ వారిని గురు స్పందన అవార్డు తో సత్కరిస్తున్నామని తెలిపారు. 

ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ ఘన్ శ్యామ్, సహ అధ్యాపకులు, మిత్రులు శ్రేయోభిలాషులు డాక్టర్ వెంకటేశ్వర్లు కు అభినందనలు తెలిపారు.

SB NEWS TELANGANA

NLG: ఏ విధమైన ప్రలోభాలకు లొంగకుండా ఓటును వినియోగించుకోవాలి: జై భీమ్ సాహో యూత్

నల్లగొండ జిల్లా:

మర్రిగూడ: జై భీమ్ సాహో యూత్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద, యూత్ ప్రెసిడెంట్ ఈద గిరీశ్వర్ ఆధ్వర్యంలో ఆదివారం, ఓటు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డా.బిఆర్ అంబేద్కర్ కృషి ఫలితంగా అన్ని వర్గాల ప్రజలకు ఓటు హక్కు లభించిందని.. డబ్బులకో, మద్యానికో, కులానికో, మతానికో, మరే విధమైన ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలన్నారు. కార్యక్రమంలో ఈద రమేష్, ప్రభుదాస్, సురేష్, అభి సందేశ్, కాశీ, వెంకటేష్, శివరాజ్, తదితరులు పాల్గొన్నారు.

NLG: ఏ విధమైన ప్రలోభాలకు లొంగకుండా ఓటును వినియోగించుకోవాలి: జై భీమ్ సాహో యూత్

నల్లగొండ జిల్లా:

మర్రిగూడ: జై భీమ్ సాహో యూత్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద, యూత్ ప్రెసిడెంట్ ఈద గిరీశ్వర్ ఆధ్వర్యంలో ఓటు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డా.బిఆర్ అంబేద్కర్ కృషి ఫలితంగా అన్ని వర్గాల ప్రజలకు ఓటు హక్కు లభించిందని.. డబ్బులకో, మద్యానికో, కులానికో, మతానికో, మరే విధమైన ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలన్నారు. కార్యక్రమంలో ఈద రమేష్, ప్రభుదాస్, సురేష్, అభి సందేశ్, కాశీ, వెంకటేష్, శివరాజ్, తదితరులు పాల్గొన్నారు.

TS:దీపావళి శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ తమిళసై సౌందరరాజన్

TS: తెలంగాణ ప్రజలకు తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. సమాజంలోని చెడుపై విజయం సాధించి, శాంతి, సోదర భావం, మతసామరస్యం కూడిన సమాజ నిర్మాణానికి ఈ పండుగ స్ఫూర్తిదాయకం అని అన్నారు. 

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక గా దీపావళి పండుగ జరుపుకుంటామని గవర్నర్ తెలిపారు. ఆత్మనిర్బర్ భారత్ స్ఫూర్తితో పండుగ సందర్భంగా స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేసి, ఇక్కడి ఉత్పత్తి దారులకు చేయూతను అందించాలని ఆమె కోరారు. ఈ దీపావళి పండుగ అందరి జీవితాలలో వెలుగులు నింపాలని, పండుగను ఆనందంగా జరుపుకోవాలని అన్నారు.

బీరు, బిర్యానీ, డబ్బులకు ఓటును అమ్ముకోకండి: ఆలిండియా సమతా సైనిక్ దళ్

ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లోంగకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలి 

*ఆలోచించి సరైన వ్యక్తికి ఓటు వేయండి: ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్

దేవరకొండ: పట్టణంలోని అంబేద్కర్ గ్రంథాలయంలో శనివారం ఏఐఎస్ఎస్డి నియోజకవర్గ అధ్యక్షులు చిట్యాల గోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో, ఏఐఎస్ఎస్డి జిల్లా అధ్యక్షులు మద్దిమడుగు బిక్షపతి, జిల్లా ఉపాధ్యక్షులు యేకుల సురేష్ పాల్గొని మాట్లాడుతూ.. ప్రజలు ఎంతో చైతన్యంతో ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని, ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా ఉండాలని, బీరు, బిర్యానీ, డబ్బులకు ఓటును అమ్ముకోకండి అని అన్నారు.

సరైన వ్యక్తిని ఎన్నుకోమని ఈ సందర్భంగా తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అందుగుల లక్ష్మీనారాయణ, కొడ్రపల్లి సురేష్, సిగ శ్రీనివాస్, జినుకుంట్ల రాఘవ, తదితరులు పాల్గొన్నారు.