TS: నేడు సొంత నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి ప్రచారం

హైదరాబాద్: నేడు టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి సోమవారం తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. పలు గ్రామాలలో కార్నర్ మీటింగ్ లలో ఆయన పాల్గొంటారు.

రేపు వర్ధన్నపేట, స్టేషన్ ఘనపూర్, కామారెడ్డి నియోజకవర్గాలలో ప్రచారం చేయనున్నారు. అదేవిధంగా ఈనెల 15వ తేదీన బోథ్, నిర్మల్ మరియు జనగామ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించనున్నారు.

NLG: క్రీడాకారులందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపిన చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ వ్యవస్థాపకులు బొమ్మపాల గిరిబాబు

ఈ దీపావళి పండుగ క్రీడాకారుల జీవితాలలో వెలుగులు నింపి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని, పాఠశాల దశ నుండే మంచి క్రమశిక్షణ ,పట్టుదల తో చదువుతూ క్రీడలను అలవాటు చేసుకుంటే అద్భుతమైన జీవితాన్ని సాధించవచ్చునని తెలియజేస్తూ, క్రీడాకారులకు, క్రీడాధికారులకు, ఒలంపిక్ అసోసియేషన్ ప్రతినిధులకు, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులకు, క్రీడా పోషకులకు, క్రీడలను ప్రోత్సహించే ప్రతి ఒక్కరికి.. చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ పక్షాన దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని క్లబ్ వ్యవస్థాపకులు బొమ్మపాల గిరిబాబు తెలిపారు.

NLG: లెంకలపల్లి లో చల్లమల్ల కృష్ణా రెడ్డి ఎన్నికల ప్రచారం

నల్లగొండ జిల్లా:

మర్రిగూడెం మండలం లెంకలపల్లి గ్రామంలో, బిజేపి మునుగోడు ఎమ్మేల్యే అభ్యర్ధి చల్లమల్ల కృష్ణా రెడ్డి సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కోలాటం, డప్పు వాయిద్యాల తో ఆయన కు స్వాగతం పలికారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక్క అవకాశం ఇవ్వండి, మునుగోడు నియోజక వర్గాన్ని అభివృద్ది చేసి చూపిస్తా, లేనట్లయితే మరోసారి ఓటు అడగమని అన్నారు. ప్రజలు కమలం పువ్వు గుర్తు కు ఓటు వేసి తనను గెలిపించాలన్నారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, పాల్గొన్నారు.

TS: భౌతిక శాస్త్ర అధ్యాపకులు డా. రేఖా వెంకటేశ్వర్లు కు 'గురు స్పందన అవార్డు'

ఖమ్మం: జిల్లా కేంద్రం లో జరిగిన TREND (టీచర్స్ రిలేషన్షిప్ ఇన్ ఎడ్యుకేషన్ ఫర్ నేషనల్ డెవలప్మెంట్) కార్యక్రమంలో.. నల్లగొండ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల భౌతిక శాస్త్రం సహాయ ఆచార్యులు డాక్టర్ రేఖా వెంకటేశ్వర్లు ను "గురు స్పందన "అవార్డు తో సత్కరించారు.

"ఆత్మ హత్యల రహిత భారత నిర్మాణం" లక్ష్యం తో నిర్వహిస్తున్న అనేక సేవా కార్యక్రమాలలో వాలంటీర్ గా నేను సైతం అంటూ సేవలు అందిస్తున్నందుకు గాను  "స్పందన ఈద ఇంటర్నేషనల్ ఫౌండేషన్" డైరెక్టర్ డాక్టర్ శామ్యూల్ రెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ వెంకటేశ్వర్లు ను సత్కరించారు.

డైరెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థినీ విద్యార్థులు, యువత, మహిళలు వివిధ కారణాల చేత ఆత్మ హత్య లతో జీవితాలు కోల్పోతున్నారని, వాటిని కూకటి వేళ్లతో సహా నిర్మూలించాలని భావించి, TREND కార్యక్రమం ద్వారా ఉపాధ్యాయులను ఈ ఉద్యమం లో భాగస్వాములు చేస్తూ వారిని గురు స్పందన అవార్డు తో సత్కరిస్తున్నామని తెలిపారు. 

ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ ఘన్ శ్యామ్, సహ అధ్యాపకులు, మిత్రులు శ్రేయోభిలాషులు డాక్టర్ వెంకటేశ్వర్లు కు అభినందనలు తెలిపారు.

SB NEWS TELANGANA

NLG: ఏ విధమైన ప్రలోభాలకు లొంగకుండా ఓటును వినియోగించుకోవాలి: జై భీమ్ సాహో యూత్

నల్లగొండ జిల్లా:

మర్రిగూడ: జై భీమ్ సాహో యూత్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద, యూత్ ప్రెసిడెంట్ ఈద గిరీశ్వర్ ఆధ్వర్యంలో ఆదివారం, ఓటు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డా.బిఆర్ అంబేద్కర్ కృషి ఫలితంగా అన్ని వర్గాల ప్రజలకు ఓటు హక్కు లభించిందని.. డబ్బులకో, మద్యానికో, కులానికో, మతానికో, మరే విధమైన ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలన్నారు. కార్యక్రమంలో ఈద రమేష్, ప్రభుదాస్, సురేష్, అభి సందేశ్, కాశీ, వెంకటేష్, శివరాజ్, తదితరులు పాల్గొన్నారు.

NLG: ఏ విధమైన ప్రలోభాలకు లొంగకుండా ఓటును వినియోగించుకోవాలి: జై భీమ్ సాహో యూత్

నల్లగొండ జిల్లా:

మర్రిగూడ: జై భీమ్ సాహో యూత్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద, యూత్ ప్రెసిడెంట్ ఈద గిరీశ్వర్ ఆధ్వర్యంలో ఓటు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డా.బిఆర్ అంబేద్కర్ కృషి ఫలితంగా అన్ని వర్గాల ప్రజలకు ఓటు హక్కు లభించిందని.. డబ్బులకో, మద్యానికో, కులానికో, మతానికో, మరే విధమైన ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలన్నారు. కార్యక్రమంలో ఈద రమేష్, ప్రభుదాస్, సురేష్, అభి సందేశ్, కాశీ, వెంకటేష్, శివరాజ్, తదితరులు పాల్గొన్నారు.

TS:దీపావళి శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ తమిళసై సౌందరరాజన్

TS: తెలంగాణ ప్రజలకు తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. సమాజంలోని చెడుపై విజయం సాధించి, శాంతి, సోదర భావం, మతసామరస్యం కూడిన సమాజ నిర్మాణానికి ఈ పండుగ స్ఫూర్తిదాయకం అని అన్నారు. 

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక గా దీపావళి పండుగ జరుపుకుంటామని గవర్నర్ తెలిపారు. ఆత్మనిర్బర్ భారత్ స్ఫూర్తితో పండుగ సందర్భంగా స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేసి, ఇక్కడి ఉత్పత్తి దారులకు చేయూతను అందించాలని ఆమె కోరారు. ఈ దీపావళి పండుగ అందరి జీవితాలలో వెలుగులు నింపాలని, పండుగను ఆనందంగా జరుపుకోవాలని అన్నారు.

బీరు, బిర్యానీ, డబ్బులకు ఓటును అమ్ముకోకండి: ఆలిండియా సమతా సైనిక్ దళ్

ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లోంగకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలి 

*ఆలోచించి సరైన వ్యక్తికి ఓటు వేయండి: ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్

దేవరకొండ: పట్టణంలోని అంబేద్కర్ గ్రంథాలయంలో శనివారం ఏఐఎస్ఎస్డి నియోజకవర్గ అధ్యక్షులు చిట్యాల గోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో, ఏఐఎస్ఎస్డి జిల్లా అధ్యక్షులు మద్దిమడుగు బిక్షపతి, జిల్లా ఉపాధ్యక్షులు యేకుల సురేష్ పాల్గొని మాట్లాడుతూ.. ప్రజలు ఎంతో చైతన్యంతో ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని, ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా ఉండాలని, బీరు, బిర్యానీ, డబ్బులకు ఓటును అమ్ముకోకండి అని అన్నారు.

సరైన వ్యక్తిని ఎన్నుకోమని ఈ సందర్భంగా తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అందుగుల లక్ష్మీనారాయణ, కొడ్రపల్లి సురేష్, సిగ శ్రీనివాస్, జినుకుంట్ల రాఘవ, తదితరులు పాల్గొన్నారు.

నార్కట్ పల్లి మండలంలో బీఎస్పీ జోరుగా ప్రచారం

గ్రామ గ్రామాన హారతులతో ఘన స్వాతం పలికిన ఆడపడుచులు

ప్రియదర్శిని ని అక్కున చేర్చుకున్న ఆడపడుచులు

 వృద్ధాప్యంలో కూడా తన ఆకలి తీర్చిన అవ్వ

ఒక్క అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా

- మేడి ప్రియదర్శిని

నకిరేకల్ నియోజకవర్గ బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మేడి ప్రియదర్శిని ఎన్నికల ప్రచారంలో భాగంగా నార్కట్ పల్లి మండలంలోని వివిధ గ్రామాలలో శనివారం ప్రచారం నిర్వహించడం జరిగింది.

ప్రచార కార్యక్రమంలో భాగంగా బెండల్ పహాడ్, పెద్దబావిగూడెం, పెరుమాండ్ల బావి, బజాకుంటా గ్రామాలలో ప్రచార నిర్వహించడం జరిగింది. గ్రామ ప్రజలు ఆమెను తమ బిడ్డగా సాదరంగా ఆహ్వానించారు. రానున్న ఎన్నికల్లో ఆమెను గెలిపిస్తామని ప్రజలు ముక్తకంఠంతో తెలుపుతున్నారు. ప్రజలు తాము నూతన పాలన కావాలని కోరుకుంటున్నట్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో మేడి ప్రియదర్శిని గెలిపించుకుంటామని అంటున్నారు.

ఈ ప్రచారంలో భాగంగా వివిధ గ్రామాల ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే అభ్యర్థి మేడి ప్రియదర్శిని మాట్లాడుతూ.. అర్హులైన నిరుపేదలకు డబల్ బెడ్ రూమ్ లు రావాలంటే, అర్హులైన నిరుపేద దళితులకు ఎకరం భూమి పంచాలంటే, చదువుకునే నిరుపేద పిల్లలకు నాణ్యమైన విద్య అందాలంటే, గిరిజన బతుకులు మారాలంటే బహుజన్ సమాజ్ పార్టీ ఏనుగు గుర్తుకు ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్, మండల అధ్యక్షులు చెరుకుపల్లి శాంతి కుమార్, మండల ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్,జైచందన్, జె.శ్రీనివాస్, మల్లేష్, వినయ్, మహేష్, మల్లికార్జున్ బి ఎస్ పి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

TS: నల్లగొండ ఎన్జీ కళాశాల అధ్యాపకుడు మామిడి లింగస్వామి.. విద్యా సేవా రత్న అవార్డుకు ఎంపిక

HYD: జగతి ఆర్ట్స్ హైద్రాబాద్ వారు ప్రతి సంవత్సరం నిర్వహించే చిల్డ్రన్ డే లో భాగంగా.. చిల్డ్రన్ కల్చరల్ పేస్ట్-2023 కార్యక్రమంలో భాగంగా, విద్యా సేవా రత్నా అవార్డులు మరియు కళా సేవా రత్నా అవార్డులను జగతి ఆర్ట్స్ నిర్వాహకులు రింగు సైదులు ప్రకటించారు. ఇందులో భాగంగా విద్యా సేవా రత్న అవార్డును మామిడి లింగస్వామి MA ,M.Ed, M.P.A (Master of Perfirming Arts)

SET /NET(M.Phil) విద్యార్హతలతో పాటు విద్యారంగంలో 16 సoవత్సరాలు పైగా డిగ్రీ, బి.యడ్, డి.యడ్ విద్యా సంస్థలలో విశేషమైన సేవకి మరియు వివిధ సామాజిక సేవలను గుర్తిoచి మామిడి లింగస్వామి ని ఎంపిక చెయ్యడం జరిగిందని ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సినిగీత రచయిత, జాతీయ ఉత్తమ గీత రచన అవార్డు గ్రహీత సుద్దాల అశోక్ తేజ చేతుల మీదుగా అవార్డును ప్రదానం చేస్తున్నామని 15.11.2023 బుధవారం త్యాగరాయ గానసభ లో ప్రదానం చేస్తామని తెలిపారు. ఈ అవార్డు గ్రహీత నల్లగొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా పనిచేస్తున్నారు.