TS: నల్లగొండ ఎన్జీ కళాశాల అధ్యాపకుడు మామిడి లింగస్వామి.. విద్యా సేవా రత్న అవార్డుకు ఎంపిక
HYD: జగతి ఆర్ట్స్ హైద్రాబాద్ వారు ప్రతి సంవత్సరం నిర్వహించే చిల్డ్రన్ డే లో భాగంగా.. చిల్డ్రన్ కల్చరల్ పేస్ట్-2023 కార్యక్రమంలో భాగంగా, విద్యా సేవా రత్నా అవార్డులు మరియు కళా సేవా రత్నా అవార్డులను జగతి ఆర్ట్స్ నిర్వాహకులు రింగు సైదులు ప్రకటించారు. ఇందులో భాగంగా విద్యా సేవా రత్న అవార్డును మామిడి లింగస్వామి MA ,M.Ed, M.P.A (Master of Perfirming Arts)
SET /NET(M.Phil) విద్యార్హతలతో పాటు విద్యారంగంలో 16 సoవత్సరాలు పైగా డిగ్రీ, బి.యడ్, డి.యడ్ విద్యా సంస్థలలో విశేషమైన సేవకి మరియు వివిధ సామాజిక సేవలను గుర్తిoచి మామిడి లింగస్వామి ని ఎంపిక చెయ్యడం జరిగిందని ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సినిగీత రచయిత, జాతీయ ఉత్తమ గీత రచన అవార్డు గ్రహీత సుద్దాల అశోక్ తేజ చేతుల మీదుగా అవార్డును ప్రదానం చేస్తున్నామని 15.11.2023 బుధవారం త్యాగరాయ గానసభ లో ప్రదానం చేస్తామని తెలిపారు. ఈ అవార్డు గ్రహీత నల్లగొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా పనిచేస్తున్నారు.





నల్గొండ జిల్లా చండూరు: 








Nov 11 2023, 15:01
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
13.1k