TS: నల్లగొండ ఎన్జీ కళాశాల అధ్యాపకుడు మామిడి లింగస్వామి.. విద్యా సేవా రత్న అవార్డుకు ఎంపిక

HYD: జగతి ఆర్ట్స్ హైద్రాబాద్ వారు ప్రతి సంవత్సరం నిర్వహించే చిల్డ్రన్ డే లో భాగంగా.. చిల్డ్రన్ కల్చరల్ పేస్ట్-2023 కార్యక్రమంలో భాగంగా, విద్యా సేవా రత్నా అవార్డులు మరియు కళా సేవా రత్నా అవార్డులను జగతి ఆర్ట్స్ నిర్వాహకులు రింగు సైదులు ప్రకటించారు. ఇందులో భాగంగా విద్యా సేవా రత్న అవార్డును మామిడి లింగస్వామి MA ,M.Ed, M.P.A (Master of Perfirming Arts)

SET /NET(M.Phil) విద్యార్హతలతో పాటు విద్యారంగంలో 16 సoవత్సరాలు పైగా డిగ్రీ, బి.యడ్, డి.యడ్ విద్యా సంస్థలలో విశేషమైన సేవకి మరియు వివిధ సామాజిక సేవలను గుర్తిoచి మామిడి లింగస్వామి ని ఎంపిక చెయ్యడం జరిగిందని ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సినిగీత రచయిత, జాతీయ ఉత్తమ గీత రచన అవార్డు గ్రహీత సుద్దాల అశోక్ తేజ చేతుల మీదుగా అవార్డును ప్రదానం చేస్తున్నామని 15.11.2023 బుధవారం త్యాగరాయ గానసభ లో ప్రదానం చేస్తామని తెలిపారు. ఈ అవార్డు గ్రహీత నల్లగొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా పనిచేస్తున్నారు.

HYD: ప్రముఖ చలనచిత్ర నటుడు చంద్రమోహన్ ఇక లేరు...

ప్రముఖ చలనచిత్ర నటుడు చంద్రమోహన్ కొద్దిసేపటి క్రితం ఆసుపత్రిలో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చంద్రమోహన్.. హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస వదిలారు.

మొత్తం 932 సినిమాల్లో వివిధ పాత్రల్లో నటించి, తెలుగు ప్రేక్షకులను అలరించారు చంద్రమోహన్. ఆయన మరణంతో తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ఆయన మరణంతో తెలుగు సినీ పరిశ్రమ మరో దిగ్గజ నటుడిని కోల్పోయింది. ఆయన వయస్సు 82 సంవత్సరాలు. ఈ రోజు ఉదయం 8:45 నిమిషాలకు ఆయన తుదిశ్వాస విడిచారని వైద్యులు తెలిపారు. చంద్రమోహన్ కు భార్య జలంధర, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

NLG: భారీ సంఖ్యలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ కు హాజరైన నాయకులు, కార్యకర్తలు


నల్గొండ జిల్లా చండూరు:

నేడు కాంగ్రెస్ పార్టీ మునుగోడు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నామినేషన్ సందర్భంగా.. చండూరు మండలం బంగారు గడ్డ మీదుగా బారీ గా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల తో రాజగోపాల్ రెడ్డి.. చండూర్ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి బయలుదేరారు.

చండూర్ వరకు భారీ సంఖ్యలో కార్యకర్తలు ఆయన వెంట బయలుదేరి వెళ్లారు. అంతరం రాజగోపాల్ రెడ్డి చండూర్ ప్రధాన కూడలి వద్ద ప్రసంగించారు. తదుపరి చండూరు ఎన్నికల అధికారి కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు.

NLG:సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ కబడ్డీ పోటీలకు ఎంపికైన చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ కు చెందిన 5గురు క్రీడాకారులు

నల్లగొండ: నేటి నుండి ఈ నెల 14 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ JNTU యూనివర్సిటీలో జరిగే సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ కబడ్డీ పోటీలకు నల్గొండ చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ చెందిన 4గురు క్రీడాకారులు మహాత్మా గాంధీ యూనివర్సిటీ కబడ్డీ జట్టు తరఫున మరియు KL యూనివర్సిటీ జట్టు తరపున ఒక్కరు మొత్తం 5గురు క్రీడాకారులు ఎంపికైనారని క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు మందడి నర్సిరెడ్డి బొమ్మపాల గిరిబాబు తెలిపారు.

మహాత్మా గాంధీ యూనివర్సిటీ జట్టు తరఫున, ఎన్జీ కాలేజీలో డిగ్రీ చదువుతూ ఫిజికల్ డైరెక్టర్ మల్లేష్ అందిస్తున్న సహకారంతో కుంటిగొర్ల కోటేష్, చింత రవితేజ, మరియు హాలియా ప్రభుత్వ కాలేజ్ లో డిగ్రీ చదువుతున్న పేర్ల మధు, దుగ్యాల సందీప్ లు ఎంపికైనారని, వీరందరూ ప్రస్తుతం హైదరాబాద్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా గచ్చిబౌలి కబడ్డీ అకాడమీలో శిక్షణ పొందుతున్నారని, మరియు పిల్లి భరత్ హైదరాబాద్ KL యూనివర్సిటీ నందు

BCA చదువుతూ సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ పోటీలకు ఎంపికైనారని, వీరందరూ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కోచ్ లైన శ్రీనివాసరావు, భాస్కరరావు ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా నిరంతరం కబడ్డీ క్రీడలో శిక్షణ పొందుతూ, చదువులో మరియు జాతీయస్థాయి కబడ్డీ క్రీడల్లో రాణిస్తూ మన జిల్లాకు మంచి పేరు తీసుకొస్తున్నారని బొమ్మపాల గిరిబాబు తెలియజేశారు.

TS: ఒక్కసారి అవకాశం ఇవ్వండి సిర్పూర్ రూపురేఖలు మారుస్తా: డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్

సిర్పూర్: గడ్డపై నీలి జెండా ఎగరవేసి దోపిడి పాలనను అంతం చేయాలని అందుకు ఒక్కసారి అవకాశం ఇచ్చి భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. శుక్రవారం సిర్పూర్ లో నామినేషన్ సందర్భంగా కాగజ్ నగర్, సిర్పూర్ లో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం ర్యాలీని ఉద్దేశించి మాట్లాడారు. కాంట్రాక్టుల్లో కమీషన్ల కోసమే కేసీఆర్ ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టును మేడిగడ్డ కు తరలించి ప్రాజెక్టు అంచనాలను రూ.1.15 లక్షల కోట్లకు పెంచి, 30 వేల కోట్లు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.

సిర్పూర్ రైతాంగానికి సాగునీరు అందించే జగన్నాథ్ పూర్,పిపి రావు ప్రాజెక్టులతో పాటు తుమ్మిడిహట్టి, సాండ్ గాం, రణవిల్లి,కోర్సిని,గూడెం,హుడికిలి, లోనవెల్లి,సూర్జాపూర్,జంబుగ ఎత్తిపోతల ప్రాజెక్టులను పూర్తి చేయడంలో బీఅర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు.

ఎస్పీఎం కార్మికులు రూ.35 వేలు ఇస్తానన్న బోనస్ ఎందుకు చెల్లించలేదని ప్రశ్నించారు. ఏళ్ల తరబడి పోడు భూములు సాగుచేసుకుంటున్న ఆదివాసీలకు పోడు పట్టాలు ఇవ్వలడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఆరె కులాన్ని ఓబీసి జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు.స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మూడు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించినా సిర్పూర్ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ఎలాంటి అభివృద్ధి చేయని బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ మళ్లీ ఓట్లను ఎలా అడుగుతుందని ప్రశ్నించారు. సిర్పూర్ గడ్డపై కోనప్ప అరాచకాలు, అక్రమాలు, దుష్ట పాలన నుంచి సిర్పూర్ ప్రజలకు విముక్తి లభించాలంటే బీఎస్పీని భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు.

TS: చివరి లిస్ట్ విడుదల చేసిన కాంగ్రెస్

హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎ ఐ సి సి పెండింగ్ సీట్లకు ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారు చేసింది.

పఠాన్ చెరువు సీటు మార్చిన ఏఐసీసీ, నీలం మధు కు బదులుగా కాట శ్రీనివాస్ గౌడ్ కు ఇచ్చింది.

చార్మినార్- మహమ్మద్ ముజీబ్ 

ఈ మధ్య కాలంలో బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన మందుల సామ్యూల్ కు తుంగతుర్తి సీటు ఇచ్చారు.

సూర్యాపేట సీటు మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి కి కేటాయించింది.

మిర్యాలగూడ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బత్తుల లక్ష్మారెడ్డి (బి ఎల్ ఆర్ ) కి కేటాయించింది.

చండూర్: భారీ జన సమూహంతో ర్యాలీగా వచ్చి.. నామినేషన్ వేసిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
మునుగోడు బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి..ఈరోజు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి చండూరు పట్టణ కేంద్రంలోని ఎన్నికల అధికారి కార్యాలయంలో నామినేషన్ వేశారు. అంగడిపేట నుండి కొనసాగిన ఈ బైక్ ర్యాలీ లో నియోజకవర్గంలోని పలు గ్రామాల నుండి భారీ సంఖ్యలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కూసుకుంట్ల అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చండూరు లో ఎన్నికల అధికారి కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.. అనంతరం చండూరు చౌరస్తాలో నిర్వహించిన బహిరంగ సమావేశంలో మాట్లాడుతూ.. తక్కువ సమయంలోనే సాధ్యమైనంత ఎక్కువ అభివృద్ధి పనులు చేశానని, మరోసారి అవకాశం ఇస్తే మునుగోడు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి తనని గెలిపించాలని ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు.

మునుగోడు బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి..ఈరోజు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి చండూరు పట్టణ కేంద్రంలోని ఎన్నికల అధికారి కార్యాలయంలో నామినేషన్ వేశారు. అంగడిపేట నుండి కొనసాగిన ఈ బైక

'ఓటు మనదే సీటు మనదే కలిసుంటే రాజ్యాధికారం మనదే' పోస్టర్ ఆవిష్కరణ

నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండల కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద, మహనీయుల పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో, మహానాడు మర్రిగూడెం మండల అధ్యక్షులు నాగిల్ల మారయ్య ఏర్పాటు చేసిన సమావేశం లో 'ఓటు మనదే సీటు మనదే కలిసుంటే రాజ్యాధికారం మనదే' పోస్టర్ ను గురువారం ఆవిష్కరించారు. ఈనెల 14న చండూరులో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్గ యాదయ్య, మహనీయుల పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ జిల్లా వెంకటేష్ మాదిగ మహనీయుల పొలిటికల్ ఫ్రంట్ మునుగోడు ఇంచార్జి ఎమ్ ఎస్ ఎఫ్ జాతీయ నాయకులు మాట్లాడుతూ.. మునుగోడు ఎన్నికలలో బహుజన వాదాన్ని వినిపించడానికి, పల్లె పల్లెకు మహనీయుల పొలిటికల్ ఫ్రంట్ పనిచేస్తుందని, బీసీ ఎస్సీ ఎస్టీ, మైనారిటీ, అగ్ర వర్ణ పేదల ను ఏకం చేస్తూ.. ప్రధాన పార్టీలకు దీటుగా గ్రామస్థాయి నుండి మన ఓటు మనమే తీసుకోవాలని నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు. 

ఈ కార్యక్రమంలో మహనీయుల పొలిటికల్ ఫ్రంట్ నియోజకవర్గ అధ్యక్షులు నారపాక అంజి, మహనీయుల పొలిటికల్ ఫ్రంట్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి నెల్లికంటి రాఘవేంద్ర యాదవ్, సురేష్, రాములు, నరసింహ, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

NLG: చిట్యాల మండలంలో ఉవ్వెత్తున సాగుతున్న బీఎస్పీ ప్రచారం

నకిరేకల్ నియోజకవర్గంలో బీఎస్పీ పార్టీ ప్రచార కార్యక్రమంలో భాగంగా.. చిట్యాల మండలంలోని వివిధ గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. ప్రజలు బీఎస్పీ అభ్యర్థి మేడి ప్రియదర్శిని ని సాదరంగా ఆహ్వానిస్తున్నారు. చిట్యాల మండలానికి గత ప్రభుత్వాలు చేసినటువంటి మోసాలను ప్రజలు ఆమె కు చెప్పడం జరిగింది. ఎస్సీ,ఎస్టీ బీసీ మైనార్టీల బతుకులు మారాలంటే బహుజన్ సమాజ్ పార్టీ ఏనుగు గుర్తుకే ఓటేస్తామని ఆయా గ్రామాల ప్రజలు ఆమెకు హామీ ఇస్తున్నారు. ప్రచారంలో బాగంగా ప్రజలనుద్దేశించి మేడి ప్రియదర్శిని మాట్లాడుతూ పేదలకు నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం అందాలంటే, చిట్యాల మండలంలోని గ్రామాలు అభివృద్ధి జరగాలంటే మండలానికి కార్పొరేట్ స్థాయి పాఠశాల రావాలంటే మరియు అత్యాధునికమైన వైద్య సౌకర్యాలు కలిగిన హాస్పిటల్ రావాలంటే.. బహుజన్ సమాజ్ పార్టీ ఏనుగు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రియదర్శిని ప్రజలను కోరారు.

ప్రజలు గత పాలన మీద ప్రజలు విసుగు చెంది బీసీ,ఎస్టీ,ఎస్సీ మైనార్టీ పేదలంతా ప్రత్యామ్నాయ పార్టీగా బిఎస్పికి వైపు చిట్యాల మండలంలో ప్రజలు బ్రహ్మారథం పడుతున్నారని ఆమె అన్నారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్,నియోజకవర్గ చేరికల కమిటీ కన్వీనర్ మునుగోటి సత్తయ్య,మండల అధ్యక్షులు జోగు శేఖర్,యోగి, కృష్ణ, మల్లేష్, మహేష్ బి ఎస్ పి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

చండూరు: ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన చందు నాయక్

నల్లగొండ జిల్లా: అసెంబ్లీ ఎన్నికలు 2023 నేపథ్యంలో.. మర్రిగూడెం మండలంలోని అజిలాపురం గ్రామానికి చెందిన మెగావత్ చందు నాయక్, మునుగోడు నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా బుధవారం చండూరు మండల కేంద్రంలోని ఎన్నికల అధికారి కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. 

ఈ సందర్భంగా చందు నాయక్ మాట్లాడుతూ.. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన తనను నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. గెలిపిస్తే విద్య, వైద్య రంగాల అభివృద్ధికి, ఉద్యోగాల కల్పన కోసం కృషి చేస్తానన్నారు.