'ఓటు మనదే సీటు మనదే కలిసుంటే రాజ్యాధికారం మనదే' పోస్టర్ ఆవిష్కరణ

నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండల కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద, మహనీయుల పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో, మహానాడు మర్రిగూడెం మండల అధ్యక్షులు నాగిల్ల మారయ్య ఏర్పాటు చేసిన సమావేశం లో 'ఓటు మనదే సీటు మనదే కలిసుంటే రాజ్యాధికారం మనదే' పోస్టర్ ను గురువారం ఆవిష్కరించారు. ఈనెల 14న చండూరులో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్గ యాదయ్య, మహనీయుల పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ జిల్లా వెంకటేష్ మాదిగ మహనీయుల పొలిటికల్ ఫ్రంట్ మునుగోడు ఇంచార్జి ఎమ్ ఎస్ ఎఫ్ జాతీయ నాయకులు మాట్లాడుతూ.. మునుగోడు ఎన్నికలలో బహుజన వాదాన్ని వినిపించడానికి, పల్లె పల్లెకు మహనీయుల పొలిటికల్ ఫ్రంట్ పనిచేస్తుందని, బీసీ ఎస్సీ ఎస్టీ, మైనారిటీ, అగ్ర వర్ణ పేదల ను ఏకం చేస్తూ.. ప్రధాన పార్టీలకు దీటుగా గ్రామస్థాయి నుండి మన ఓటు మనమే తీసుకోవాలని నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మహనీయుల పొలిటికల్ ఫ్రంట్ నియోజకవర్గ అధ్యక్షులు నారపాక అంజి, మహనీయుల పొలిటికల్ ఫ్రంట్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి నెల్లికంటి రాఘవేంద్ర యాదవ్, సురేష్, రాములు, నరసింహ, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.
Nov 10 2023, 09:36
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
12.3k