యరగండ్లపల్లి: బిఆర్ఎస్ పార్టీలో చేరిన బీజేపీ వార్డు మెంబర్లు

NLG: మర్రిగూడెం మండలం, యరగండ్లపల్లి గ్రామానికి చెందిన బిజెపి వార్డు మెంబర్లు రమేష్, స్వామి, మరికొంతమంది గ్రామ యువకులు ఈరోజు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వారికి గులాబీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నూతనంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించడానికి కృషి చేస్తామని తెలిపారు.

ఎన్నికలవేళ మాలలను అనిచివేసి ప్రయత్నం జరుగుతుంది: నాగిళ్ల మారయ్య

నల్గొండ జిల్లా, మర్రిగూడెం: మాల మహానాడు మర్రిగూడ మండల అధ్యక్షుడు నాగిళ్ల మారయ్య ఆధ్వర్యంలో బుధవారం మర్రిగూడ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మాల సోదరులు, విద్యావంతులు, మేధావులు, వివిధ హోదాలో పనిచేసినటువంటి సోదరులారా ఆలోచన చేయండి. మన ముందు భవిష్యత్తులో పెద్ద ఉప్పెన ఉంది. ఎన్నికలవేళ మాలలను అనిచివేసే ప్రయత్నం జరుగుతుంది. మాలలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. మాలలకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం, వర్గీకరణ అంశం మళ్ళీ తెరపైకి తెచ్చి ప్రభుత్వాలు గద్దె ఎక్కుదామని ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. బిజెపి ప్రభుత్వం మరోసారి కేంద్రంలో అధికారాన్ని చేపట్టాలని తహతహలాడుతున్నారు. రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో  ప్రభుత్వాలకు మాలలు తగిన బుద్ధి చెప్పాలని కోరుతున్నాను. వర్గీకరణ జరిగితే మన బ్రతుకులు కుడితిలో పడ్డ ఎలుక మాదిరిగా మారుతాయని తెలిపారు. ఇటీవల జరిగిన ఒక సభలో హరీష్ రావు మాట్లాడుతూ.. ఒక వర్గానికి మద్దతిస్తూ మరొక వర్గాన్ని పాతాళానికి తొక్కే ప్రయత్నం చేస్తూ మాట్లాడుతున్నారని అన్నారు. ఒకే ఒక విషయం చెప్తున్న మీ ప్రభుత్వాలు నడవడానికి మాల ముఖ్య సలహాదారులు కావాలి కానీ, మాకు నాయకత్వం వహించే హక్కు లేదు, ఎందుకంటే మేము సలహాలు ఇస్తే మీరు రాజ్యమేలుతారు కదా, ఈ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలంటే ధర్మం వైపు ఓటు అనే వజ్రాయుధాన్ని ఉపయోగించి ఆ మహానీయుడు కలలు కన్నా స్వరాజ్యం రావాలని కోరుకుంటున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో వెంకట్, ప్రసాద్ ఈద అభి సందేశ్, వంపు చరణ్, శివరాజ్, కోరే అజయ్, తదితరులు పాల్గొన్నారు

నల్లగొండ: కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

నల్లగొండ పట్టణంలో కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మంగళవారం ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా మంగళవారం భారీ సంఖ్యలో నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కోమటిరెడ్డి అభిమానులు నల్లగొండకు చేరుకుని భారీ ర్యాలీ నిర్వహించారు. 

అశేష జనంతో కోమటిరెడ్డి భారీ ర్యాలీ నిర్వహించి ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసిన అనంతరం పెద్ద గడియారం సెంటర్లో రోడ్ షో నిర్వహించి, చెయ్యి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని, కాంగ్రెస్ సంక్షేమ పథకాలు ఆరు గ్యారెంటీ పథకాల గురించి ప్రజలకు వివరించారు. తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవిని తాను తృణప్రాయంగా వదిలేశానని అన్నారు. ఏ హోదాలో ఉన్నా నల్లగొండ ప్రజలకు సేవ చేస్తానని అన్నారు. బిఆర్ఎస్ పాలనలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు అని విమర్శించారు. 

తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీ సంక్షేమ పథకాలను అమల్లోకి తెస్తామని అన్నారు. కార్యక్రమంలో వేలాదిమంది యువతీ యువకులు, మహిళలు, పురుషులు, కోలాటం కళాకారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కోమటిరెడ్డి అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

భారీ జన సమూహంతో బిఎస్పి శ్రేణుల మధ్య నామినేషన్ వేసిన మేడి ప్రియదర్శిని

నల్లగొండ జిల్లా, నకిరేకల్ నియోజకవర్గం

బహుజన్ సమాజ్ పార్టీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థి మేడి ప్రియదర్శిని ముందుగా నకిరేకల్ లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, అనంతరం అక్కడి నుండి భారీ ర్యాలీగా బయలుదేరి నామినేషన్ దాఖలు చేశారు.

అనంతరం ఆమె ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. గత మూడు సంవత్సరాలుగా బహుజన్ సమాజ్ పార్టీ ఇన్చార్జిగా ఉంటూ.. ప్రతి ఒక్క ప్రజా సమస్యలపై ప్రజలకు మద్దతుగా ఉంటూ పోరాటం చేయడం జరుగుతుంది అన్నారు. 

ప్రతి గ్రామ గ్రామానికి, పల్లె పల్లెకు తిరుగుతూ ఉంటే ప్రజలు ఏనుగు గుర్తుకు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు వర్గ పోరు తప్ప ప్రజా సమస్యల పైన పట్టించుకోలేదని విమర్శించారు. రాజ్యాంగమే మేనిఫెస్టో ఉండే విధంగా బహుజన్ సమాజ్ పార్టీ విద్యా ,వైద్యం ,ఉపాధి ఉండే విధంగా కృషి చేస్తాను. ప్రజల పక్షాన ఉంటానని ఒకసారి ఏనుగు గుర్తు ఓటు వేసి గెలిపించాలని కోరారు. 

ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకురాలు మర్రి శోభ, నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్, నియోజకవర్గ ఉపాధక్షులు పావిరాల నర్సింహా యాదవ్, వివిధ మండల అధ్యక్షులు మండల కమిటీ లు బూత్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

రేపు నామినేషన్‌ వేయనున్న బిఎస్పి అభ్యర్థి మేడి ప్రియదర్శిని
నల్లగొండ జిల్లా, నకిరేకల్ నియోజకవర్గం బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మేడి ప్రియదర్శిని, మంగళవారం నకిరేకల్ ఎన్నికల అధికారి కార్యాలయంలో ఉదయం 11 గంటలకు నామినేషన్ వేయనున్నారు. కార్యకర్తలతో కలసి పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
TS: సీఎం కెసిఆర్ కాన్వాయ్ ని తనిఖీ చేసిన పోలీసులు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ఎన్నికల కమీషన్‌ అన్ని చర్యలు తీసుకుంటోంది. ఎంతటి వారి వాహనాన్ని అయినా అధికారులు ఆపి తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో కొత్తగూడెం లో ఆదివారం బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభ కోసం వచ్చిన సీఎం కేసీఆర్‌ ప్రయాణించే ప్రగతిపథం వాహనాన్ని ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. 

ఇటీవలే మంత్రి కేటీఆర్‌ తో పాటు, హోం మంత్రి మహమూద్‌ అలీల వాహనాలను కూడా ఎన్నికల అధికారులు తనిఖీలు చేసిన విషయం తెలిసిందే.

నిన్న సీఎం వాహనం తనఖీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఏదైనా సమాచారం మేరకు సీఎం వాహనాన్ని తనిఖీ చేసారా? లేదా సాధారణ విధుల్లో భాగంగానే తనిఖీ చేశారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.

తిరుమల: 7 కంపార్ట్‌మెంట్ లలో వేచి ఉన్న భక్తులు

తిరుమలలో నేడు సోమవారం కావడంతో భక్తుల రద్దీ పెద్దగా లేకపోయినా క్యూ లైన్‌ లలో మాత్రం భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు.

నేడు తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని ఏడు కంపార్ట్‌మెంట్లలో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లో టోకెన్లు లేకుండా స్వామి వారి దర్శనానికి 8 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. 

నిన్న ఆదివారం కావడంతో తిరుమలలో భక్తులతో రద్దీగా ఉన్నది.తిరుమల శ్రీవారిని 78,389 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 23,466 మంది భక్తులు తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న హుండీ ఆదాయం రూ. 3.87 కోట్లు అని ఆలయ అధికారులు తెలిపారు.

అంగడిపేట: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని బిఆర్ఎస్ ప్రచారం

నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం:

చండూరు మున్సిపాలిటీ పరిధిలోని అంగడిపేట 4వ వార్డులో.. మునుగోడు నియోజకవర్గ బిఆర్ఎస్ ఎమ్మేల్యే అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం.. ఆ పార్టీ నాయకులు ప్రతి గడప గడపకు తిరిగి ప్రచారం నిర్వహించారు. జరగబోయే ఎన్నికలలో భారీ మెజారిటీతో ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని.. కెసిఆర్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ ప్రచారం చేసారు. 4వ వార్డు బిఆర్ఎస్ అధ్యక్షులు ఇరిగి రామకృష్ణ, బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు ఇరిగి రామన్న, పోలే యాదయ్య, పులిజాల యాదయ్య, పనస అశోక్, బోల్లేపల్లి కృష్ణ, ఇరిగి లింగస్వామి, పులిజాల వెంకన్న, ఇరిగి రాజ్ కుమార్, కాటేపాక మహేందర్, బోల్లేపల్లి మల్లేష్, మర్రి రాజు, రాచకొండ రాజు, బోల్లేపల్లి అజయ్ కుమార్, ఎస్కేబషీర్, ఇరిగి వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

TS: 14 మంది ఎమ్మెల్యే అభ్యర్థులతో సిపిఎం తొలి జాబితా విడుదల

తెలంగాణ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల కొరకు... సిపిఎం పార్టీ వివిధ నియోజకవర్గాలకు 14 మంది ఎమ్మెల్యే అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసింది.

భద్రాచలం (ఎస్టి) - కారం పుల్లయ్య

అశ్వ రావు పేట (ఎస్టి)- పిట్టల అర్జున్

పాలేరు - తమ్మినేని వీరభద్రం

మధిర (ఎస్సీ) - పాలడుగు భాస్కర్

వైరా (ఎస్టి) - బుక్య వీరభద్రం

ఖమ్మం - ఎర్ర శ్రీకాంత్

సత్తుపల్లి (ఎస్సీ) - మాచర్ల భారతి 

మిర్యాలగూడ - జూలకంటి రంగారెడ్డి

నకిరేకల్ (ఎస్సీ) - బొజ్జ చిన్న వెంకులు

భువనగిరి - కొండమడుగు నరసింహ

జనగాం - మోకు కనకా రెడ్డి

ఇబ్రహీంపట్నం - పగడాల యాదయ్య

పటాన్ చెరువు - జె. మల్లికార్జున్

ముషీరాబాద్ - ఎం. దశరథ

ఇక రాష్ట్రంలో మరికొన్ని స్థానాలకు మలి జాబితా ప్రకటించే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు తెలుపుతున్నారు.

NLG: టీబి అనుమానిత లక్షణాలు ఉన్నవారికి ఉచితంగా మందులు అందజేస్తారు: డాక్టర్ చైతన్య

మర్రిగూడెం: టీబి అనుమానిత లక్షణాలు ఉన్నవారికి ఉచిత మందులు ప్రభుత్వ ఆసుపత్రిలో అందజేస్తారని డాక్టర్ చైతన్య తెలిపారు. శనివారం మండలంలోని తమ్మడపల్లి గ్రామపంచాయతీ వద్ద టీబి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ.. ఆరోగ్యవంతులుగా ఉంటూ గ్రామాన్ని, మండలాన్ని టీబి రహిత మండలంగా చేయుటకు సహకారాన్ని అందించాలని కోరారు. తదుపరి లక్షణాలున్న వారి నుండి తెమడ శాంపిల్స్ సేకరించి ఆసుపత్రికి పంపారు. గ్రామ సెక్రెటరీ శిరీష, డాక్టర్ చైతన్య, ఎస్ టి ఎస్ సైదులు, ల్యాబ్ టెక్నీషియన్ చారి, ఏఎన్ఎం ఫైమీన్ ,ఆశ కలమ్మ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.