రేపు నామినేషన్‌ వేయనున్న బిఎస్పి అభ్యర్థి మేడి ప్రియదర్శిని
నల్లగొండ జిల్లా, నకిరేకల్ నియోజకవర్గం బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మేడి ప్రియదర్శిని, మంగళవారం నకిరేకల్ ఎన్నికల అధికారి కార్యాలయంలో ఉదయం 11 గంటలకు నామినేషన్ వేయనున్నారు. కార్యకర్తలతో కలసి పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
TS: సీఎం కెసిఆర్ కాన్వాయ్ ని తనిఖీ చేసిన పోలీసులు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ఎన్నికల కమీషన్‌ అన్ని చర్యలు తీసుకుంటోంది. ఎంతటి వారి వాహనాన్ని అయినా అధికారులు ఆపి తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో కొత్తగూడెం లో ఆదివారం బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభ కోసం వచ్చిన సీఎం కేసీఆర్‌ ప్రయాణించే ప్రగతిపథం వాహనాన్ని ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. 

ఇటీవలే మంత్రి కేటీఆర్‌ తో పాటు, హోం మంత్రి మహమూద్‌ అలీల వాహనాలను కూడా ఎన్నికల అధికారులు తనిఖీలు చేసిన విషయం తెలిసిందే.

నిన్న సీఎం వాహనం తనఖీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఏదైనా సమాచారం మేరకు సీఎం వాహనాన్ని తనిఖీ చేసారా? లేదా సాధారణ విధుల్లో భాగంగానే తనిఖీ చేశారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.

తిరుమల: 7 కంపార్ట్‌మెంట్ లలో వేచి ఉన్న భక్తులు

తిరుమలలో నేడు సోమవారం కావడంతో భక్తుల రద్దీ పెద్దగా లేకపోయినా క్యూ లైన్‌ లలో మాత్రం భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు.

నేడు తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని ఏడు కంపార్ట్‌మెంట్లలో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లో టోకెన్లు లేకుండా స్వామి వారి దర్శనానికి 8 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. 

నిన్న ఆదివారం కావడంతో తిరుమలలో భక్తులతో రద్దీగా ఉన్నది.తిరుమల శ్రీవారిని 78,389 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 23,466 మంది భక్తులు తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న హుండీ ఆదాయం రూ. 3.87 కోట్లు అని ఆలయ అధికారులు తెలిపారు.

అంగడిపేట: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని బిఆర్ఎస్ ప్రచారం

నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం:

చండూరు మున్సిపాలిటీ పరిధిలోని అంగడిపేట 4వ వార్డులో.. మునుగోడు నియోజకవర్గ బిఆర్ఎస్ ఎమ్మేల్యే అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం.. ఆ పార్టీ నాయకులు ప్రతి గడప గడపకు తిరిగి ప్రచారం నిర్వహించారు. జరగబోయే ఎన్నికలలో భారీ మెజారిటీతో ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని.. కెసిఆర్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ ప్రచారం చేసారు. 4వ వార్డు బిఆర్ఎస్ అధ్యక్షులు ఇరిగి రామకృష్ణ, బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు ఇరిగి రామన్న, పోలే యాదయ్య, పులిజాల యాదయ్య, పనస అశోక్, బోల్లేపల్లి కృష్ణ, ఇరిగి లింగస్వామి, పులిజాల వెంకన్న, ఇరిగి రాజ్ కుమార్, కాటేపాక మహేందర్, బోల్లేపల్లి మల్లేష్, మర్రి రాజు, రాచకొండ రాజు, బోల్లేపల్లి అజయ్ కుమార్, ఎస్కేబషీర్, ఇరిగి వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

TS: 14 మంది ఎమ్మెల్యే అభ్యర్థులతో సిపిఎం తొలి జాబితా విడుదల

తెలంగాణ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల కొరకు... సిపిఎం పార్టీ వివిధ నియోజకవర్గాలకు 14 మంది ఎమ్మెల్యే అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసింది.

భద్రాచలం (ఎస్టి) - కారం పుల్లయ్య

అశ్వ రావు పేట (ఎస్టి)- పిట్టల అర్జున్

పాలేరు - తమ్మినేని వీరభద్రం

మధిర (ఎస్సీ) - పాలడుగు భాస్కర్

వైరా (ఎస్టి) - బుక్య వీరభద్రం

ఖమ్మం - ఎర్ర శ్రీకాంత్

సత్తుపల్లి (ఎస్సీ) - మాచర్ల భారతి 

మిర్యాలగూడ - జూలకంటి రంగారెడ్డి

నకిరేకల్ (ఎస్సీ) - బొజ్జ చిన్న వెంకులు

భువనగిరి - కొండమడుగు నరసింహ

జనగాం - మోకు కనకా రెడ్డి

ఇబ్రహీంపట్నం - పగడాల యాదయ్య

పటాన్ చెరువు - జె. మల్లికార్జున్

ముషీరాబాద్ - ఎం. దశరథ

ఇక రాష్ట్రంలో మరికొన్ని స్థానాలకు మలి జాబితా ప్రకటించే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు తెలుపుతున్నారు.

NLG: టీబి అనుమానిత లక్షణాలు ఉన్నవారికి ఉచితంగా మందులు అందజేస్తారు: డాక్టర్ చైతన్య

మర్రిగూడెం: టీబి అనుమానిత లక్షణాలు ఉన్నవారికి ఉచిత మందులు ప్రభుత్వ ఆసుపత్రిలో అందజేస్తారని డాక్టర్ చైతన్య తెలిపారు. శనివారం మండలంలోని తమ్మడపల్లి గ్రామపంచాయతీ వద్ద టీబి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ.. ఆరోగ్యవంతులుగా ఉంటూ గ్రామాన్ని, మండలాన్ని టీబి రహిత మండలంగా చేయుటకు సహకారాన్ని అందించాలని కోరారు. తదుపరి లక్షణాలున్న వారి నుండి తెమడ శాంపిల్స్ సేకరించి ఆసుపత్రికి పంపారు. గ్రామ సెక్రెటరీ శిరీష, డాక్టర్ చైతన్య, ఎస్ టి ఎస్ సైదులు, ల్యాబ్ టెక్నీషియన్ చారి, ఏఎన్ఎం ఫైమీన్ ,ఆశ కలమ్మ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

కుందూరు జానారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు

నాగార్జునసాగర్ నియోజకవర్గం, అనుముల మండలం, అన్నారం గ్రామపంచాయితీ సర్పంచ్ కట్టా సత్యనారాయణ రెడ్డి మరియు కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు సింగారం మారయ్య ఆధ్వర్యంలో.. మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ బైరు వెంకటేశం, బిఆర్ఎస్ ఉపాధ్యక్షుడు గోన సత్యనారాయణ, యూత్ అధ్యక్షుడు కేసాని శ్రీనివాసరెడ్డి, కట్టా చల్లారెడ్డి లు బిఆర్ఎస్ కు రాజీనామా చేసి కుందూరు జానారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.

ఈ కార్యక్రమంలో అనుముల మండలపార్టీ అధ్యక్షులు కుందూరు వెంకట్ రెడ్డి, అనుముల మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు వద్దరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ముక్కాముల సర్పంచ్ నరేందర్, చింతగూడెం సర్పంచ్ రాములు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కుందూరు రాజేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు చల్ల మట్టారెడ్డి, తదితరులు పాల్గొన్నారు..

తిమ్మారెడ్డి గూడెంలో బిఆర్ఎస్ ఇంటింటి ప్రచారం

మునుగోడు నియోజకవర్గంలో ప్రచారంలో భాగంగా తిమ్మారెడ్డి గూడెం లోని యాదవ్స్ కాలనీలో బిఆర్ఎస్ నాయకులు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని, కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు.

బూత్ కమిటీ జక్కల శీను, గ్రామ శాఖ అధ్యక్షులు ఉట్కూర్ రవీందర్ రెడ్డి, గుణ యాదయ్య శిరసావాడ అచ్చాలు, రాసాల రమేష్, టేకులపల్లి వెంకటయ్య, జక్క లింగయ్య, గుండెబోయిన నాగయ్య, గుండెబోయిన వెంకటయ్య, గుండబోయిన కొమురయ్య, జక్కల వెంకటయ్య, జక్కల శీను, జక్కల యాదయ్య, గుండెబోయిన యాదయ్య, ఎడ్ల సత్తయ్య, జక్కల శివ, సాయిలు, తదితరులు పాల్గొన్నారు.

నకిరేకల్: ప్రజా ఏజండా పై అభ్యర్థులను నిలదీయండి: CPI (M-L) న్యూడెమోక్రసీ

ఓట్ల కోసం గ్రామాలకు వచ్చే పాలకవర్గ పార్టీల అభ్యర్థులను ప్రజా సమస్యలపై,విద్య,వైద్యం, ఉపాధి అంశాలపై నిలదీయాలని CPI (M-L) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఎం.డేవిడ్ కుమార్ పిలుపునిచ్చారు.

నకిరేకల్ పట్టణంలోని కామ్రేడ్ యానాల మల్లారెడ్డి స్మారక భవనంలో శనివారం ప్రజా సంఘాల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. మద్యం, డబ్బు, కులం, మతం పేరుతో తప్పుడు మార్గంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, ఉచిత పథకాలు అంటూ ప్రలోభాలకు గురిచేసి గెలవలనుకునే పార్టీల అభ్యర్థులను ప్రశ్నించాలని అన్నారు. నిరుద్యోగం, నిరక్షరాస్యత, ఆకలి, దారిద్ర్యం, దోపిడీ, రైతుల ఆత్మహత్యలు, మహిళలపై దాడులు, మద్యం, డ్రగ్స్, గంజాయి లాంటివి తెలంగాణలో ఎక్కువగా రాజ్యమేలుతున్నాయని విమర్శించారు. వీటి నివారణకు ఏమి చర్యలు తీసుకున్నారో అడగండని అన్నారు. గతంలో రాని మార్పు ఈ సారి గెలిపిస్తే ఎలా సాధ్యం అవుతుందో ప్రశ్నించాలన్నారు.

ఈ కార్యక్రమంలో CPI (M-L) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఇందూరు సాగర్, అఖిల భారత రైతు-కూలీ సంఘం జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు జ్వాల వెంకటేశ్వర్లు, అంబటి చిరంజీవి, పి.ఓ.డబ్ల్యూ జిల్లా కార్యదర్శి పజ్జూరి ఉపేంద్ర, పి.వై.ఎల్ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు మామిడోజు వెంకటేశ్వర్లు, బి.వి చారి,ఇఫ్టూ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు బొంగరాల నర్సింహా, బొమ్మిడి నగేష్, పి.డి.ఎస్.యూ జిల్లా కార్యదర్శి పోలె పవన్, ఏ. ఐ.కె.ఎం.ఎస్ జిల్లా నాయకులు సిలువేరు జానయ్య, అంబటి వెంకటేశం,కుంభం వెంకటేశం,బీరెడ్డి సత్తిరెడ్డి, అయోధ్య, చెరుకు సైదులు,పసుపులేటి సోమయ్య,బండారు వెంకన్న,అనిల్ తదితరులు పాల్గొన్నారు.

గుడ్డిగా ఓటు వేయొద్దు, పోటీ చేస్తున్న వ్యక్తి.. అభ్యర్థి వెనక ఉన్న పార్టీ, దాని చరిత్రను ప్రజలు చూడాలి: కేసీఆర్

భైంసా: ఎన్నికలు రాగానే ఎవరెవరో వస్తారు.. ఏవేవో చెప్తారు. ఎవరో చెప్పిన అబద్ధాలు నమ్మి మోసపోవద్దు..గుడ్డిగా ఓటు వేయొద్దు.. పోటీ చేస్తున్న వ్యక్తి.. అభ్యర్థి వెనక ఉన్న పార్టీ.. దాని చరిత్రను ప్రజలు చూడాలి.

ప్రజల పట్ల పార్టీల దృక్పథం చూసి.. వివేకంతో ఓటు వేయాలి అని కెసిఆర్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. నిర్మల్‌ జిల్లాలోని భైంసా లో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని కేసీఆర్‌ ప్రసంగించారు.