సూర్యాపేట లో బీఎస్పీ కి షాక్

బీఎస్పీ ను వీడి మూకుమ్మడిగా బీఆర్ఎస్ లో చేరిన 13 వ వార్డ్ గాంధీనగర్ కు చెందిన మత్స్య పారిశ్రామిక సంఘం సభ్యులు

   మత్స్యకార వృత్తిని ప్రోత్సహించి మా జీవితాల్లో వెలుగులు నింపిన బీఆర్ఎస్ వైపే మా ప్రయాణం అంటూ సూర్యాపేట లో మత్స్యకారులు తేల్చిచెప్పారు. తెలిసో తెలియక బీఎస్పీ లోకి వెళ్ళిన తాము తిరిగి బీఆర్ఎస్ పార్టీ లోకి రావడం ఆనందంగా ఉందన్నారు. సూర్యాపేట లోని 13 వ వార్డ్ గాంధీనగర్ కు చెందిన మత్స్య పారిశ్రామిక సంఘం 

సభ్యులు బి. ఎస్పీ కి రాజీనామా చేసి మూకుమ్మడిగా బీఆర్ఎస్ లో చేరారు. విద్యానగర్ లోని పార్టీ కార్యాలయం వద్ద గులాబీ కండువాతో మంత్రి జగదీష్ రెడ్డి తిరిగి పార్టీలోకి ఆహ్వానించారు. చేరిన వారిలో బంటు మారయ్య, దువ్వ మల్లేష్, గోడదాటి సైదులు, దాసరి ఉప్పలయ్య, తిరుపతి రవి, మొర రామచంద్రు, చెన్నబోయిన అంజయ్య, లక్ష్మయ్య, బుచ్చి బాబు తో పాటు వంద మంది మత్స్యకారులు బీఆర్ఎస్ లో చేరారు..13 వ వార్డ్ అధ్యక్షుడు రఫీ, జనార్దన్ ఆధ్వర్యం లో చేరికలు జరిగాయి.

సూర్యాపేట లో కొనసాగుతున్న బీఆర్ఎస్ దూకుడు బీఎస్పీ కి నై.. బీఆర్ఎస్ కే జై అంటున్న గాంధీనగర్ వాసులు

   సాధారణ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న వేళ సూర్యాపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ దూకుడు కొనసాగుతుంది. సూర్యాపేట శాసనసభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి చేసిన అభివృద్ధితో ఇప్పటికే హ్యాట్రిక్ విజయాన్ని ఖాయం చేసుకోగా, అభివృద్ధికి ఆకర్షితులై కాంగ్రెస్ ,బిజెపి ల నుండి వెల్లువలా కొనసాగుతున్న చేరికలతో బీఆర్ఎస్ అభ్యర్ధి జగదీష్ రెడ్డి భారీ మెజార్టీ దిశగా దూసుకుపోతున్నారు. తాజాగా బీఎస్పీ కి నై అంటూ పట్టణం లోని గాంధీనగర్ , బాషానాయక్ తండా కు చెందిన నేతలు, కార్యకర్తలు మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. చేరిన వారిలో పురాణపు యాదగిరి, అంజయ్య, ప్రసాద్, రామకృష్ణ, చిన్నరాములు, చిన గురుస్వామి, సాయి కుమార్ తో పాటు 54మంది బిజెపి, కాంగ్రెస్ కార్యర్తలు బీఆర్ఎస్ లో చేరారు.13 వ వార్డ్ అధ్యక్షుడు రఫీ, జానయ్య, జనార్దన్ ఆధ్వర్యం లో చేరికలు జరిగాయి. ఇక చివ్వెంల మండలం వట్టి ఖమ్మం పహాడ్ లో రౌతు నర్సింహ రావు ఆధ్వర్యం లో 58 మంది కాంగ్రెస్, బిజెపి లకు చెందిన యాదవ సోదరులు, ఇతర పార్టీల కార్యకర్తలు మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. అభివృద్ధి కి మద్దతుగా పార్టీ లో చేరిన వారందరికీ గులాబీ కండువాకప్పి మంత్రి జగదీష్ రెడ్డి సాదరస్వాగతం పలికారు.

దేశాన్ని రాష్ట్రాన్ని 50 ఏళ్లపాటు పాలించిన కాంగ్రెస్‌ ప్రజలకు ఏం మేలు చేసిందని బీఆర్ఎస్ అధినేతముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్‌ ప్రశ్నించారు

అర్మూరులో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం మాట్లాడుతూ.. రైతుబంధు దుబారా అని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారని, రైతులకు 24 గంటల కరెంట్‌ అవసరం లేదని చెబుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ఆదాయం పెరిగేకొద్దీ సంక్షేమ పథకాలు పెంచుతున్నామని చెప్పారు. తెలంగాణ కోసమే బీఆర్ఎస్ పుట్టిందన్న కేసీఆర్‌.. ఆర్మూర్‌ నియోజకవర్గ అభ్యర్థి జీవన్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరికలు

 సూర్యాపేట నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ లోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. తాజాగా ఆత్మకూరు మండలం పీపా నాయక్ తండ పరిధిలోని

కరోని తండాకు చెందిన ఉప సర్పంచ్ చంద్రు నాయక్, వార్డ్ మెంబర్లు యాదగిరి ,లింగ లతో పాటు 40 మంది బిజెపి కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు. నూతనంగా చేరిన వారికి గులాబీ కండువా కప్పి మంత్రి జగదీష్ రెడ్డి సాదరంగా స్వాగతం పలికారు.

గ్రామ గ్రామాన నీరాజనాలు పడుతు ముచ్చటగా మూడోసారి కేసీఆర్ సీఎం కావాలని నలగొండ గడ్డపై గులాబీ జెండా ఎగరాలని ఆశిస్తున్న తిప్పర్తి మండల ప్రజలు

బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి ప్రచారంలో భాగంగా నేడు తిప్పర్తి మండలం యాపలగూడెం మామిడాల మరికొన్ని గ్రామాలలో ప్రచారం నిర్వహించారు వారితో పాటు రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి రాష్ట్ర నాయకులు చకిలం అనిల్ కుమార్ గారితో కలిసి ప్రచారం నిర్వహించారు.

అనంతరం వారు మాట్లాడుతూ....

రైతు గోస తెలిసిన నాయకుడు రైతు బాంధవుడు కేసీఆర్ గారు రైతుల పక్షపాతిగా నిలుస్తూ రైతుబంధు రైతు బీమా పథకాలను ప్రవేశపెట్టి వ్యవసాయం దండగ అనే స్థాయి నుంచి వ్యవసాయం పండగల మార్చిన ఘనుడు కేసీఆర్ అని తెలిపారు

వికలాంగులకు వృద్ధులకు ఆసరా పించను కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల ద్వారా బాసటగా నిలిచాడని తెలిపారు

ప్రజలందరూ ఈనెల 30న జరగబోయే ఎన్నికలలో తమ విలువైన ఓటును కారు గుర్తుపై వేసి కేసిఆర్ మూడోసారి సీఎంగా అసెంబ్లీకి పంపే బాధ్యత మన అందరిదని కోరారు

ఈ కార్యక్రమంలో ఎంపిటిసిలు సర్పంచులు వివిధ హోదాలో ఉన్న ప్రజాప్రతినిధులు మరియు జిల్లా తిప్పర్తి మండల గ్రామ సాయి నాయకులు సీనియర్ కార్యకర్తలు పాల్గొన్నారు....

ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవసాయ క్షేత్రంలో ముగిసిన రాజశ్యామల యాగం

ఎర్రవల్లిలోని ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవసాయ క్షేత్రంలో విశాఖ శ్రీ శారదాపీఠం చేపట్టిన రాజశ్యామలా సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగం ముగిసింది. వైదిక నియమాలను అనుసరిస్తూ మూడు రోజులపాటు యాగాన్ని నిర్వహించారు. శుక్రవారం మధ్యాహ్నం మహా పూర్ణాహుతితో యాగ క్రతువు పూర్తయింది. తెలంగాణ ప్రజలందరినీ రాజశ్యామల అమ్మవారు అనుగ్రహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ యాగాన్ని నిర్వహించారని పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి కంకణం కట్టుకున్న నాయకుడు కేసీఆర్‌ అని ప్రశంసించారు. సశాస్త్రీయంగా యాగాన్ని పూర్తి చేసామని స్పష్టం చేసారు. ఈ యాగంతో తెలంగాణలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం అవుతుందని చెప్పారు.

ధర్మపురి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.

ఎప్పుడైనా.. ఎక్కడైనా.. ఎన్నికల్లో గెలవాల్సింది ప్రజలు అని.. రాజకీయ పార్టీలు కాదని సీఎం కేసీఆర్ ఉద్ఘాటించారు. అందుకే ఎన్నికలు వచ్చినప్పుడు అభ్యర్థిని మాత్రమే కాకుండా అతడి వెనక ఉన్న పార్టీ గుణగణాలు, చరిత్ర చూసి బాగా ఆలోచించి ఓటు వేయాలని ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ గారిని కారు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. 

ఎర్రవల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారి వ్యవసాయ క్షేత్రం వేదికగా చేపట్టిన రాజశ్యామలా సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగం రెండో రోజూ కొనసాగుతోంది

యాగంలో ఈరోజు ప్రధానంగా రాజశ్యామల యంత్ర పూజ నిర్వహించారు. ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్‌ దంపతులు స్వయంగా ఈ పూజలో పాల్గొన్నారు. విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములు యాగ క్రతువును పర్యవేక్షిస్తున్నారు.

బీఆర్ఎస్ కు జై కొడుతున్న దివ్యాంగులు

బీఆర్ఎస్ ప్రభుత్వ హ్యాట్రిక్ ను కాంక్షిస్తూ ట్రై మోటార్ సైకిల్ పై ప్రచారం

 ప్రచారానికి శ్రీకారం చుట్టిన మేడ్చల్ జిల్లా శామీర్ పేట కు చెందిన మహేష్ అనే దివ్యాంగుడు

సూర్యాపేట కు చేరుకున్న ప్రచార యాత్ర

సూర్యాపేట పార్టీ కార్యాలయం లో జెండాఊపి ప్రచారయాత్ర ను ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి

ప్రమాదవశాత్తు ఎమ్మెల్సీ గారి కాన్వాయ్ వాహనం తగిలి వ్యక్తికి గాయాలు

స్వయంగా హాస్పిటల్ కు తీసుకెళ్ళి వైద్య సహాయం అందించి ఆదుకుంటామని హామీ ఇచ్చిన శ్రీనివాస్ రెడ్డి గారు 

ములుగు నియోజకవర్గం బి అర్ ఎస్ పార్టీ ఎన్నికల ఇన్ చార్జీ, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తన ప్రచారానికి వెళుతుండగా, దామెర మండలం ఊరుగొండ వద్ద ఆ గ్రామానికి చెందిన దేవులపల్లి సాంబయ్య హటాత్తుగా రోడ్డు దాటే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు ఎమ్మెల్సీ కాన్వాయ్ లోని ఒక వాహనం తగిలి, స్వల్పంగా గాయపడ్డాడు. వెంటనే ఎమ్మెల్సీ స్వయంగా ఆ వ్యక్తిని సమీపంలోని హాస్పిటల్ కు తీసుకెళ్లారు. వైద్యం అందించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. సాంబయ్య కుటుంబ సభ్యులను పిలిపించి, వారికి ధైర్యం చెప్పారు. వైద్య ఖర్చులు భరించడం తో పాటు, ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. దీంతో, సాంబయ్య కుటుంబం ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.