మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరికలు
సూర్యాపేట నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ లోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. తాజాగా ఆత్మకూరు మండలం పీపా నాయక్ తండ పరిధిలోని
కరోని తండాకు చెందిన ఉప సర్పంచ్ చంద్రు నాయక్, వార్డ్ మెంబర్లు యాదగిరి ,లింగ లతో పాటు 40 మంది బిజెపి కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు. నూతనంగా చేరిన వారికి గులాబీ కండువా కప్పి మంత్రి జగదీష్ రెడ్డి సాదరంగా స్వాగతం పలికారు.











Nov 04 2023, 13:37
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
5.5k