TS: జూనియర్ కళాశాలలో చేరేందుకు చివరి అవకాశం

తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు పొందేందుకు గడువును అధికారులు మరోసారి పొడిగించారు. కళాశాలలో చేరేందుకు నవంబరు 10 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు ఇంటర్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ప్రైవేటు కళాశాలల్లో చేరేవారు రెండు వేల రూపాయలు ఆలస్య రుసుం చెల్లించాలని, ప్రభుత్వ కళాశాలల్లో మాత్రం ఎలాంటి రుసుము ఉండదని బోర్డు కమిషనర్ నవీన్ మిత్తల్ తెలిపారు.

అమరవీరుల పోరాట స్పూర్తితో.. సమసమాజం కోసం పోరాడుదాం: CPI (M-L) న్యూడెమోక్రసీ

నల్లగొండ: భూమి, భుక్తి, విముక్తి కొరకు ప్రాణాలర్పించిన సిపిఐ (ఎం-ఎల్) అమరవీరుల స్పూర్తితో దేశంలో దోపిడీ, పీడన, అసమానతలకు వ్యతిరేకంగా పోరాడుదాం అని, సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఇందూరు సాగర్ అన్నారు. అమరవీరుల వారోత్సవాల సందర్భంగా CPI (M-L) న్యూడెమోక్రసీ పార్టీ ఇచ్చిన పిలుపుతో భాగంగా పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శ్రామిక భవన్ లో పార్టీ పట్టణ కార్యదర్శి బొమ్మిడి నగేష్,రైతు-కూలీ సంఘం జిల్లా నాయకులు సత్తిరెడ్డి లు ఎర్రజెండా ఎగురవేసి అమరవీరులకు నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా సీపీఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ జిల్లా ఇందూరు సాగర్ మాట్లాడుతూ.. భూమి, భుక్తి, విముక్తి కొరకు,ఆదివాసి,గిరిజన,దళిత, బహుజన హక్కుల కోసం అనేక పోరాటాలు నిర్వహించి తమ అమూల్యమైన ప్రాణాలను అర్పించిన విప్లవ అమరవీరులకు నివాళులు అర్పించాలని, భారత విప్లవ పోరాటాలలో ఎంతోమంది అమరవీరులు తమ ఉన్నతమైన చదువులని, ఉద్యోగాలని, కుటుంబాలని వదిలేసి పేద ప్రజల కోసం ప్రాణాలను గడ్డిపోచ వలె వదిలారని వారి త్యాగాల ఆశయాల సాధనలో మనందరం పోరాటాలు చేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అమరవీరుల స్పూర్తితో దోపిడీ,అవినీతి,పాలకుల విధానాలపై పోరాడాలని, ఎన్నికల్లో అవినీతి అభ్యర్థులను ఓడించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ నాయకులు బొంగరాల నర్సింహా, బొమ్మిడి నగేష్, బీరెడ్డి సత్తిరెడ్డి, ఏమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, దాసరి నర్సింహా, జానపాటి శంకర్, బి.వి చారి, బొమ్మపాల అశోక్, మామిడాల ప్రవీణ్,,అంజి,లింగయ్య,అశోక్, రాజు,ఉపేందర్,తదితరులు పాల్గొన్నారు.

నల్లగొండ: 38 వ వార్డులో బోయినపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం

తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారాల పర్వం కొనసాగుతుంది. నల్లగొండ పట్టణంలో 38వ వార్డ్ లో కౌన్సిలర్ బోయనపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ తోనే అన్ని వర్గాలకు సంక్షేమ పాలన అందుతుందని, ఆరు గ్యారెంటీ పథకాలను వివరిస్తూ.. చెయ్యి గుర్తుకు ఓటు వేసి, నల్లగొండ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని భారీ మెజార్టీ తో గెలిపించాలని ఓటర్లను కోరారు.

కార్యక్రమంలో ఐతరాజు పవన్ కళ్యాణ్, లక్ష్మణ్, మునగాల పవన్, ఉమేష్, సాయి, గిరి, నాగరాజు, మరియు పలువురు మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

స్వేరో స్టూడెంట్స్ యూనియన్ నల్లగొండ జిల్లా ఉపాధ్యాక్షుడిగా ఎన్నికైన కలకొండ కిరణ్

నాంపల్లి మండలం, సుంకిశాల గ్రామానికి చెందిన కలకొండ కిరణ్ ను స్వేరో స్టూడెంట్స్ యూనియన్ నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడుగా గురువారం ఎన్నుకొని, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ యడవల్లి సురేష్ మరియు జిల్లా అధ్యక్షుడు ఆకులపల్లి నరేష్ ఆధ్వర్యంలో నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సందీప్, యాదగిరి, ఆదర్శ్ తదితరులు పాల్గొన్నారు.

NLG: అభివృద్ధి చేస్తా ఆశీర్వదించి అసెంబ్లీకి పంపండి: ప్రియదర్శిని

రామన్నపేట మండలం, జనంపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ఏనుగు గుర్తుకు ఓటు వెయ్యాలని నకిరేకల్ బిఎస్పి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మేడి ప్రియదర్శిని కోరారు. బహుజన్ సమాజ్ పార్టీ కు ఓట్ వేస్తె మీ ఇంటి దగ్గరికి వచ్చి పనిచేస్తారని ఆమె అన్నారు. యువత మేలుకో రాజకీయాలు తెలుసుకో, నాయకత్వాన్ని నేర్చుకో పవిత్రమైన ఏనుగు గుర్తు పై ఓటు వేయాలిసిందిగా ఓటర్లను కోరారు. కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్, మండల అధ్యక్షులు మేడి సంతోష్,మండల ఉపాధక్షులు గుని రాజు, ప్రధాన కార్యదర్శి నకిరేకంటి నర్సింహా,కార్యదర్శి బందెల అనిత, మండల మహిళ కన్వినర్ కక్కిరేణి శిరీష, గ్రామ కన్వీనర్ నవీన్, బి ఎస్ పి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

మునుగోడు నియోజకవర్గంలో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న చందు నాయక్

నల్లగొండ జిల్లా:

మునుగోడు నియోజకవర్గం, మర్రిగూడెం మండలం అజిలాపురం గ్రామానికి చెందిన ఎస్టి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి మెగావత్ చందు నాయక్, డిగ్రీ ఉత్తీర్ణుడు.. మునుగోడు నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నట్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తనను ఆదరించి గెలిపించినట్లయితే విద్యా వైద్య రంగాలను అభివృద్ధి పరుస్తూ, ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తానని, ఎమ్మెల్యేగా తనకు వచ్చే జీతం డబ్బులతో ఫ్రీ కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తానని తెలిపారు.

దోపిడి లేని సమాజ స్థాపన కోసం, కార్మికుల హక్కుల కోసం పోరాడేది ఏఐటీయూసీ: చాపల శ్రీను

నల్లగొండ జిల్లా:

మునుగోడు: ఏఐటీయూసీ జనరల్ బాడీ సమావేశం బెల్లం శివయ్య అధ్యక్షత బుధవారం మండల కేంద్రంలో సిపిఐ ఆఫీసులో జరిగింది. ఈ సమావేశానికి సిపిఐ మండల కార్యదర్శి చాపల శ్రీను హాజరై మాట్లాడుతూ.. దోపిడీ లేని సమాజ స్థాపన కోసం, కార్మికుల హక్కుల కోసం పోరాడేది ఏఐటీయూసీ అని అన్నారు.

పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తూ కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ఘోరంగా విఫలమైందని అన్నారు. అదేవిధంగా రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ పథకాలు అసలైన కార్మికులకు అందకుండా తన అనుకున్న వారికి ఇవ్వడం సరైనది కాదని వారు అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో విచారణ చేసి అర్హులైన భవన నిర్మాణ కార్మికులకు గృహలక్ష్మీ గాని దళిత బంధువు గాని బీసీ బందు గాని ఇవ్వాలని మరియు ప్రతి కార్మికునికి టూ వీలర్ వాహనం ఇవ్వాలని కోరారు.కార్మికునికి ఎలాంటి ప్రమాదం జరిగిన ప్రమాద బీమా కింద పది లక్షల రూపాయలు చెల్లించాలని, వారి కుటుంబంలో అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

నవంబర్ 30న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కార్మికులు ఒక్కటై తమ ఓటు ద్వారా అవినీతిపరులకు బుద్ధి చెప్పాలని, నిజమైన నికారసుగా కార్మికుల పక్షాన నిలబడే నాయకున్ని పరిశీలించి గెలిపించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో మాలాద్రి, భీమనపల్లి స్వామి, ఏర్పు నరసింహ, నగేష్, హుస్సేన్, దొమ్మాటి గిరి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

నల్లగొండలో వైభవంగా స్వేరో స్టూడెంట్ నాయకుడు అనుముల సురేష్ వివాహం

నల్లగొండ: పట్టణంలో స్వేరో స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అనుముల సురేష్ వివాహ మహోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ స్వేరో సంఘాల నాయకులు, పీపీఎల్ రాష్ట్ర కమిటీ మరియు జిల్లా నాయకులు, వివిధ సంఘాల రాష్ట్ర మరియు జిల్లా నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను పలువురు నాయకులు ఆశీర్వదించారు.

NLG: ఎన్జీ కళాశాలలో సైబర్ క్రైమ్ ఫై అవగాహన కార్యక్రమం

నల్లగొండ: నాగార్జున ప్రభుత్వ కళాశాల నందు జాతీయ సేవా పథకం( ఎన్ఎస్ఎస్) యూనిట్ల ఆధ్వర్యంలో.. బుధవారం సైబర్ క్రైమ్ ఫై అవగాహన కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డా.ఎస్.ఉపేందర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సైబర్ క్రైమ్ నల్లగొండ విభాగ డీఎస్పీ టి.లక్ష్మినారాయణ హాజరై మాట్లాడుతూ.. సమాజంలో జరుగుతున్న ఆన్లైన్ మోసాలను గురించి వివరించారు. ఆన్లైన్ మోసాల పట్ల ఎలా జాగ్రత్తగా ఉండాలో సూచించారు. ఒకవేళ వాటి బారిన పడితే ఏ విధంగా న్యాయం పొందాలో విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ నాగార్జున, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు ఈ.యాదగిరి రెడ్డి, ఎం.వెంకట్ రెడ్డి, ఎన్.వేణు, ఎస్.యాదగిరి, కె.శివరాణి, లైబ్రేరియన్ ఏ.దుర్గాప్రసాద్ మరియు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు

NLG: మహిళా కళాశాల అధ్యాపకుడు రేఖ వెంకటేశ్వర్లు కు పీహెచ్డీ స్నాతక అవార్డు

నల్గొండ: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నందు భౌతిక శాస్త్ర సహాయ ఆచార్యులు గా విధులు నిర్వహిస్తున్న రేఖ వెంకటేశ్వర్లు.. ఉస్మానియా విశ్వవిద్యాలయం 83 వ స్నాతకోత్సవం లో ఫిజిక్స్ సబ్జెక్టు నందు పీహెచ్డీ స్నాతక అవార్డును మంగళవారం హైదరాబాదులో ఓయూ వీసీ రవీందర్, Adobe సీఈవో శాంతన్ నారాయన్ చేతులమీదుగా అందుకున్నారు. వారు ప్రో. ఏ.సదానందచారి పర్యవేక్షణ లో 'నానో విక్షేపిత సూపర్ అయానిక పదార్థాల విద్యుత్ వాహకత్వం' పై అధ్యయనం చేశారు. 

ఈ సందర్భంగా డా.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. విద్యాభ్యాసం ప్రారంభం నుండి నేటి దాకా తనను ప్రోత్సహించిన తల్లి తండ్రులకు, కుటుంబ సభ్యులకు, గురువులకు, సహ అధ్యాపకులకు మరియు మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు.

పీహెచ్డీ గైడ్ ప్రో.సదానందచారి, ప్రో.నరేందర్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ ఘన్ శ్యామ్ మరియు టీచింగ్ మరియు నాన్ టీచింగ్ సిబ్బంది తదితరులు రేఖ వెంకటేశ్వర్లు ను అభినందించారు .