అమరవీరుల ఆశయాలపై పోరాడుదాం:న్యూడెమోక్రసీ చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్

అమరవీరుల ఆశయాల కై పోరాడుదాం.అమరవీరుల ఫొటోలకు స్థూపలకు పూల మాలలతో చర్ల మండలంలో నివాళులర్పించిన న్యూడెమోక్రసీ శ్రేణులు.
CPI (M-L) న్యూడెమోక్రసీ నాయకులు ముసలి సతీష్
భూమి, భుక్తి,విముక్తి కొరకు ప్రాణాలర్పించిన సిపిఐ (ఎం-ఎల్)న్యూ డెమోక్రసీ అమరవీరులకు
పూల మాలలతో విప్లవ జోహార్లు చర్ల మండలం ప్రజలతో నాయకులతో అర్పిండం జరిగింది న్యూడెమోక్రసీ చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్* మాట్లాడుతూ
భూమి, భుక్తి, విముక్తి కొరకు,ఆదివాసి,గిరిజన,దళిత, బహుజన బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం అనేక పోరాటాలు నిర్వహించి తమ అమూల్యమైన ప్రాణాలను నులివెచనైనా రక్తాన్ని అర్పించిన విప్లవ అమరవీరులకు నివాళులు అర్పించాలని, భారత విప్లవ పోరాటాలలో ఎంతోమంది అమరవీరులు తమ ఉన్నతమైన చదువులని,ఉద్యోగాలని,కుటుంబాలని వదిలేసి పేద ప్రజల కోసం ప్రాణాలను గడ్డి పోచ వలె వదిలారని వారి త్యాగాల ఆశయాల సాధనలో మనందరం పోరాటాలు చేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
తెల్ల బట్టల వాళ్ళను చూస్తే భయపడే ఆదివాసి,గిరిజన,దళితులకు హక్కులను తెలియజేసి లక్షలాది ఎకరాల భూములను పంచి వెనకబడిన గ్రామాలకు విద్య, వైద్యం, విద్యుత్తు, రోడ్డు, రవాణా, కనీస సౌకర్యాల కోసమే పోరాటాలు నిర్వహించి గోదావరి లోయ పరిహాక ప్రాంతంలో లక్షలాది ఎకరాల భూములను ప్రజలకు పంచి పెట్టిన చరిత్ర ఈ నక్సల్ల్బారి ,
ప్రతిఘటన ఉద్యమానిదేనని వారన్నారు.కామ్రేడ్ వెంపటాపు సత్యం,ఆదిభట్ల కైలాసం,భత్తుల వెంకటేశ్వరరావు,
నీలం రామచంద్రయ్య,
పొట్ల రామనర్సయ్య, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ నుండి మొదలుకొని గుండాలలో జరిగిన కామ్రేడ్ పూనెం లింగన్న ఎన్ కౌంటర్ వరకు ఎందరో వీరులు ప్రాణాలు ఇచ్చారని వారన్నారు. నల్లగొండ జిల్లాలో కామ్రేడ్ యానాల మల్లారెడ్డి,విక్రమన్న,వీరారెడ్డి, బూరుగు అంజన్న,పలస బిక్షం,జెన్ను సార్,తోట సోమన్న లాంటి ఎందరో అమరులయ్యారని, ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క పోరాట చరిత్ర ఉందని అది నేటి తరానికి తెలియజేయాల్సిన బాధ్యత కర్తవ్యం మన మీద ఉందని వారన్నారు అమరవీరుల సంస్మరణ సభలను జిల్లా వ్యాప్తంగా జరపాలని ఆయన ఈ సమావేశంలో తెలియజేశారు. విప్లవకారుల పోరాటాలను చరిత్రను,నక్సల్ భరీ పోరాటాలను చరిత్రను,అమరవీరుల త్యాగాలను ప్రజలకు వివరించాలని విద్యార్థి,యువకులు అమరుల ఆశయాలతో రాబోయే తరానికి కాబోయే వారసులుగా నిలబడాలని ఉద్యమాలకు ఊపిరిగా నిలబడాలని పిలుపునిచ్చారు.అమరవీరుల స్పూర్తితో BRS మతోన్మాద BJP దోపిడీ,అవినీతి,పాలకుల విధానాలపై పోరాడాలని, ఎన్నికల్లో అవినీతి అభ్యర్థులను ఓడించాలని సతీష్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు చిరిగిడి నరేష్ కణితి బానుప్రకాష్ బొర్ర సమ్మక్క సప్కా నాగలక్ష్మి ఇర్ప సమ్మక్క కనకమ్మ నాగలక్ష్మి సీతమ్మ రమేష్ రాజు తదితరులు పాల్గొన్నారు.
Nov 02 2023, 14:03
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
3.7k