నల్లగొండలో వైభవంగా స్వేరో స్టూడెంట్ నాయకుడు అనుముల సురేష్ వివాహం

నల్లగొండ: పట్టణంలో స్వేరో స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అనుముల సురేష్ వివాహ మహోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ స్వేరో సంఘాల నాయకులు, పీపీఎల్ రాష్ట్ర కమిటీ మరియు జిల్లా నాయకులు, వివిధ సంఘాల రాష్ట్ర మరియు జిల్లా నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను పలువురు నాయకులు ఆశీర్వదించారు.

NLG: ఎన్జీ కళాశాలలో సైబర్ క్రైమ్ ఫై అవగాహన కార్యక్రమం

నల్లగొండ: నాగార్జున ప్రభుత్వ కళాశాల నందు జాతీయ సేవా పథకం( ఎన్ఎస్ఎస్) యూనిట్ల ఆధ్వర్యంలో.. బుధవారం సైబర్ క్రైమ్ ఫై అవగాహన కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డా.ఎస్.ఉపేందర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సైబర్ క్రైమ్ నల్లగొండ విభాగ డీఎస్పీ టి.లక్ష్మినారాయణ హాజరై మాట్లాడుతూ.. సమాజంలో జరుగుతున్న ఆన్లైన్ మోసాలను గురించి వివరించారు. ఆన్లైన్ మోసాల పట్ల ఎలా జాగ్రత్తగా ఉండాలో సూచించారు. ఒకవేళ వాటి బారిన పడితే ఏ విధంగా న్యాయం పొందాలో విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ నాగార్జున, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు ఈ.యాదగిరి రెడ్డి, ఎం.వెంకట్ రెడ్డి, ఎన్.వేణు, ఎస్.యాదగిరి, కె.శివరాణి, లైబ్రేరియన్ ఏ.దుర్గాప్రసాద్ మరియు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు

NLG: మహిళా కళాశాల అధ్యాపకుడు రేఖ వెంకటేశ్వర్లు కు పీహెచ్డీ స్నాతక అవార్డు

నల్గొండ: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నందు భౌతిక శాస్త్ర సహాయ ఆచార్యులు గా విధులు నిర్వహిస్తున్న రేఖ వెంకటేశ్వర్లు.. ఉస్మానియా విశ్వవిద్యాలయం 83 వ స్నాతకోత్సవం లో ఫిజిక్స్ సబ్జెక్టు నందు పీహెచ్డీ స్నాతక అవార్డును మంగళవారం హైదరాబాదులో ఓయూ వీసీ రవీందర్, Adobe సీఈవో శాంతన్ నారాయన్ చేతులమీదుగా అందుకున్నారు. వారు ప్రో. ఏ.సదానందచారి పర్యవేక్షణ లో 'నానో విక్షేపిత సూపర్ అయానిక పదార్థాల విద్యుత్ వాహకత్వం' పై అధ్యయనం చేశారు. 

ఈ సందర్భంగా డా.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. విద్యాభ్యాసం ప్రారంభం నుండి నేటి దాకా తనను ప్రోత్సహించిన తల్లి తండ్రులకు, కుటుంబ సభ్యులకు, గురువులకు, సహ అధ్యాపకులకు మరియు మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు.

పీహెచ్డీ గైడ్ ప్రో.సదానందచారి, ప్రో.నరేందర్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ ఘన్ శ్యామ్ మరియు టీచింగ్ మరియు నాన్ టీచింగ్ సిబ్బంది తదితరులు రేఖ వెంకటేశ్వర్లు ను అభినందించారు .

TS: ఎన్నికలవేళ బిజెపికి బిగ్ షాక్.. బిజెపికి రాజీనామా చేసిన వివేక్ వెంకటస్వామి

TS: రాష్ట్రంలో ఎన్నికల వేళ బీజేపీకి భారీ షాక్ తగిలింది. బీజేపీ మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి బీజేపీకి రాజీనామ చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో ఆయన భేటీ కానున్నట్టు సమాచారం. ఆయన, ఆయన కుమారుడు కాంగ్రెస్లో చేరనున్నట్లు తెలుస్తోంది. చెన్నూరు అసెంబ్లీ టికెట్ ను వివేక్ కొడుకు వంశీకి కేటాయించాలని కాంగ్రెస్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.

NLG: వీసీ చేతుల మీదుగా పిహెచ్డి పొందిన ఆనందం దుర్గ ప్రసాద్

నల్లగొండ: అందరికీ విద్యా, ఉపాధి అవకాశాల కోసం 'e- లైబ్రరీ' స్థాపకుడు మరియు నాగార్జున ప్రభుత్వ కళాశాలలో సీనియర్ అసిస్టెంట్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్న డా. ఆనందం దుర్గాప్రసాద్ కు.. హైదరాబాదు ఉస్మానియా యూనివర్సిటీ 83 వ సందర్భంగా, మంగళవారం ఓయు లోని ఠాగూర్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పీహెచ్డీ అవార్డును.. ఓయూ వీసీ రవీందర్ మరియు Adobe సీఈవో శాంతన్ నారాయన్ చేతుల మీదుగా పొందారు. అదేవిధంగా వివిధ రంగాలలో పిహెచ్డి అవార్డులు పొందిన పలువురికి ఓయూ వీసీ మరియు Adobe సీఈఓ లు అందజేశారు.

ఈ సందర్భంగా  https://elibrarytelangana.blogspot.com స్థాపకుడు డాక్టర్ ఆనందం దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. ఈ అవార్డు తనపై మరింత బాధ్యతను పెంచిందని, విద్యారంగంలో మరిన్ని సేవలు అందించడానికి ఎల్లవేళలా కృషి చేస్తూ ఉంటానని తెలిపారు.

కార్యక్రమంలో వివిధ రంగాలలో పిహెచ్డి అవార్డులు పొందిన ఉన్నత విద్యావంతులు, ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.

81.5 కోట్ల భారతీయుల ఆధార్ డేటా లీక్!

ఆధార్ వివరాలపై మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. 

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) వద్ద ఉన్న భారతీయుల వివరాలు సైబర్ దొంగలకు చిక్కినట్లు తెలుస్తోంది.

 81.5 కోట్ల మంది పౌరుల బయోమెట్రిక్ వివరాలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయంటూ డార్క్ వెబ్లో పేర్కొనడం చర్చనీయాంశమైంది. 

దీనిపై CBI దర్యాప్తు చేయనుంది. డేటా ఎక్కడి నుంచి లీక్ అయిందో తెలియాల్సి ఉంది.

RR: ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న చేరికల జోష్

బిఆర్ఎస్ పార్టీకి రాజీనామాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న పలు గ్రామాల నాయకులు కార్యకర్తలు, మైనార్టీ సోదరులు.

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని పలు గ్రామాల బిఆర్ఎస్ పార్టీ నాయకులు మంగళవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డి క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా మల్ రెడ్డి రంగారెడ్డి.. పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించడం జరిగింది.

పార్టీలో చేరిన వారి ముఖ్య వివరాలు.

అబ్దుల్లాపూర్ మెట్ మండలం బిఆర్ఎస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ నసీరుద్దీన్ బృందం కాంగ్రెస్ పార్టీలో చేరిక.

బాటసింగారం గ్రామ మాజీ ఉపసర్పంచ్ బిఆర్ఎస్ పార్టీ మైనార్టీ నాయకుడు సాలం ఖాన్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.

పసుమాముల గ్రామం నుండి బిజెపి నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.

మంచాల మండలం చాంద్ ఖాన్ గూడ బిఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.*

ఆదిభట్ల మున్సిపాలిటీ కొంగరకలాన్ గ్రామ యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.

అబ్దుల్లాపూర్ మెట్, పెద్ద అంబర్ పేట పరిసర ప్రాంతాల ఆర్.ఎం.పి వైద్యులు మల్ రెడ్డి రంగారెడ్డి గారిని కలిసి పూర్తి సంఘీభావం తెలియజేశారు.

HYD: నగరంలో 144 సెక్షన్ అమలు: సిపి సందీప్ శాండిల్య

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లి ఎన్నికల దృష్ట్యా జంట నగరాల్లో శాంతి భద్రతలను పరిరక్షించేందుకు నగరంలోని 15 నియోజకవర్గాలకు చెందిన రిటర్నింగ్‌ కార్యాలయాలకు 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నట్లు నగర సిపి సందీప్‌ శాండిల్య ప్రకటించారు.

ఈ నిబంధనలు నవంబర్‌ 3 నుంచి 15వ తేదీ ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు అమలులో ఉంటాయని తెలిపారు. అప్పటి వరకు ఐదుగురి కంటే ఎక్కువ మంది ఉండటాన్ని నిషేధించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించడానికి ప్రయత్నించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

నల్గొండ లో ఘనంగా జాతీయ ఐక్యతా దినోత్సవం

నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్లు, వ్యాయామ విద్యా విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని "జాతీయ ఐక్యత దినోత్సవం" నిర్వహించారు. 

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా.ఎస్ ఉపేందర్ ముందుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ జాతీయ ఐక్యత భావంతో కలిసిమెలిసి ఉండాలని, ఈర్ష్య, ద్వేషాలు, పగలు, ప్రతీకారాలు ప్రక్కకు పెట్టి సమాజ అభివృద్ధి కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. 

పటేల్ యొక్క దేశ సేవలను గుర్తు చేసుకొని, నేటి యువతరం వారిని ఆదర్శంగా తీసుకొని దృఢమైన ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని అన్నారు. విద్యార్థులు ఐకమత్యంగా ఉండి, దేశ సమగ్రతను, భద్రతను కాపాడడానికి స్వయంగా అంకితం కావాలని, భారత దేశ అంతర్గత భద్రతను పటిష్ట పరచడానికి స్వయంగా కదిలి సత్యనిష్టతో ముందుకెళ్లాలన్నారు. అదే విధంగా విద్యార్థుల చేత "ఐక్యత ప్రతిజ్ఞ" చేయించారు. తదనంతరం "రన్ ఫర్ యూనిటీ" అనే పరుగును నిర్వహించారు. 

ఈ కార్యక్రమంలో ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం అధికారులు ఇ.యాదగిరి రెడ్డి, ఎమ్. వెంకట్ రెడ్డి,కే.శివరాని,ఫిజికల్ డైరెక్టర్ కే.మల్లేశ్ మరియు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు

నవంబర్ 1 నుండి 9 వరకు అమరవీరుల సంస్మరణ సభలను జరపండి: CPI (M-L) న్యూడెమోక్రసీ

నల్లగొండ: భూమి, భుక్తి, విముక్తి కొరకు ప్రాణాలర్పించిన సిపిఐ (ఎం-ఎల్) అమరవీరులకు విప్లవ జోహార్లు అర్పించాలని, నవంబర్ 1 నుంచి 9 వరకు అమరవీరుల సంస్మరణ సభలు నిర్వహించాలని.. సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ నల్లగొండ జిల్లా కమిటీ.. విప్లవ శ్రేణులకు, సానుభూతి పరులకు, ప్రజలకు పిలునిస్తుందని CPI (M-L) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఇందూరు సాగర్ అన్నారు. జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.