HYD: బీఎస్పీ రాష్ట్ర కార్యాలయంలో నిరసనలు..

నల్లగొండ జిల్లా:

మునుగోడు నియోజకవర్గంలో బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు పెండెం ధనుంజయ నేతకు బీఎస్పీ టికెట్ ఇవ్వాలని, సోమవారం బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో, మునుగోడు మండలాల అధ్యక్షులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీసీ సామాజిక వర్గానికి చెందిన పెండెం ధనుంజయ నేత.. బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అర్హుడని వారికే బీఎస్పీ టికెట్ కేటాయించాలని కోరారు.

NLG: రేపు గవర్నర్ చేతుల మీదుగా డాక్టరేట్ అవార్డు తీసుకోనున్న ఎన్జీ కళాశాల అధ్యాపకులు

రేపు హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయం 83వ కాన్వకేషన్ సందర్భంగా, యూనివర్సిటీ ఛాన్స్లర్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరియు ఎడబో(Adobe ) సిఈఓ శాంతన్నారాయణ , యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ రవీందర్ చేతుల మీదుగా నల్లగొండలోని నాగార్జున కళాశాల అధ్యాపకులు డాక్టరేట్ తీసుకోనున్నారు.

డాక్టర్.సయ్యద్ మునీర్- చరిత్రలో , డాక్టర్.ఆనందం దుర్గాప్రసాద్ -గ్రంధాలయ సమాచార శాస్త్రంలో, డాక్టర్.శీలం యాదగిరి-రాజనీతి శాస్త్రంలో, డాక్టర్.గంజి భాగ్యలక్ష్మి- జంతు శాస్త్రంలో, డాక్టర్.నాగుల వేణు- ప్రభుత్వ పాలన శాస్త్రంలో, డాక్టర్.టి.సైదులు -తెలుగు సబ్జెక్టులో డాక్టరేట్ అవార్డు అందుకోబోతున్నారని, కళాశాల నుంచి ఆరుగురు అధ్యాపకులు ఒకే సంవత్సరంలో డాక్టర్ అవార్డు పొందడం హర్షం వ్యక్తం చేస్తూ, తద్వారా కళాశాలలో విద్యార్థులలో పరిశోధన అభివృద్ధి తీసుకురావడానికి ఎంతో అవకాశం ఉందని, జిజ్ఞాస ప్రాజెక్టులు, పరిశోధన వ్యాసాలు ,విద్యార్థుల్లో పరిశోధన ఆసక్తిని పెంపొందించడానికి ఎంతగానో దోహదపడుతుందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ తెలిపారు

TS: ఓటరు నమోదుకు రేపే తుది గడువు

హైదరాబాద్‌: తెలంగాణలో ఎన్నికల సందడి మొదలైంది. ప్రధాన పార్టీల అభ్యర్ధులు ఓటర్లను ఆకర్షించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇప్పటికీ ఓటు పొందని వారు.. కొత్తగా ఓటు పొందేందుకు దరఖాస్తులు చేసుకుంటున్నారు. వీరితోపాటు ఓటర్ల జాబితా రెండో ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా ఇటీవల ప్రకటించిన తుది జాబితాలో పేరు లేని వారంతా కొత్తగా మళ్లీ ఓటు పొందేందుకు దరఖాస్తులు చేసుకుంటున్నారు.

జాబితాలో పేరు ఉన్నా వారి నివాసం వేరే చోటికి మార్చినా, పేరు ఇతర వివరాలు తప్పుగా అచ్చు అయ్యి ఉన్నా వారంతా నవంబర్‌ 30న జరగనున్న రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికల్లో ఓటేసేందుకు అనర్హులుగా ఎంచబడతారు.

ఇలాంటి వారి కోసం కేంద్ర ఎన్నికల సంఘం అక్టోబర్‌ 31వ తేదీలోపు అవకాశాన్ని కల్పించింది. కొత్త ఓటర్ల నమోదు కోసం ఫారం 6, ఇతర ప్రాంతాలకు ఓటు బదిలీ, పేరు, ఫొటో వివరాలను సరి చేసుకోవడానికి 8 దరఖాస్తులను అక్టోబర్ 31తేదీలోగా సమర్పిస్తే వారందరికీ ఓటు హక్కు లభిస్తుంది.

ఇలా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారితో ప్రత్యేకంగా అనుబంధ ఓటర్ల జాబితాను ఎన్నికల యంత్రాంగం ప్రచురించనుంది. తుది ఓటర్ల జాబితా తో పాటు అనుబంధ ఓటర్ల జాబితాలోని ఓటర్లకు వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించనున్నారు.

కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం నామినేషన్ల ప్రక్రియ ముగింపునకు 10 రోజుల ముందు నాటికి వచ్చిన ఓటరు నమోదు దరఖాస్తులను మాత్రమే పరిశీలనలోకి తీసుకుంటారు. అందులో అర్హులైన వారికి ఎన్నికల్లో ఓటేసేందుకు అవకాశం కల్పిస్తారు.

నవంబర్‌ 3న తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడనుంది. అదే నెల 10వ తేదీతో నామినేషన్ల దాఖలుకు గడువు ముగియనుంది. ఇక నామినేషన్ల దాఖలుకు సరిగ్గా 10 రోజుల ముందు అంటే అక్టోబర్‌ 31వ తేదీ నాటికి ఓటర్ల నమోదు దరఖాస్తులు నిలిపివేస్తారు.

గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించనున్నారు.

విజయనగర రైల్వే ప్రమాదానికి మానవ తప్పిదమే కారణం! : ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే అధికారి

ఏపీ: ఆదివారం విశాఖ నుండి విజయనగరం వైపు బయలుదేరిన విశాఖ-పలాస (08532) రైలు. వెనుక నుంచి కొద్ది నిమిషాల తేడాతో ప్రారంభమైన విశాఖ-రాయగడ (08504) రైలు. కంటకాపల్లి - అలమండ మధ్య నెమ్మదిగా వెళ్తున్న పలాస రైలు ను ఢీ కొట్టిన రాయగడ రైలు. రాయగడ ప్యాసింజర్‌ రైలు లోకో పైలట్ వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

రెడ్‌ సిగ్నల్‌ను రాయగడ లోకో పైలట్ పట్టించుకోలేదు. ఫలితంగానే ఘోర ప్రమాదం సంభవించిందని ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్‌ విశ్వజిత్‌ సాహూ సోమవారం తెలిపారు. అయితే దర్యాప్తు తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయని స్పష్టం చేశారు.

విజయనగరం రైలు ప్రమాదం లో 13కు చేరిన మృతుల సంఖ్య

AP: విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంటకాపల్లి వద్ద ఆదివారం రాత్రి రైలు ప్రమాదం జరిగింది. విశాఖపట్నం- పలాస వెళ్తున్న ప్రత్యేక ప్యాసింజర్ రైలు కొత్త వలస మండలం అలమండ - కంటకాపల్లి వద్ద సిగ్నల్ లేకపోవడంతో పట్టాలపై ఆగి వుంది. అదే సమయంలో దాని వెనకాలే వస్తున్న విశాఖ - రాయగడ రైలు.. ఆగి ఉన్న ప్యాసింజర్ రైలు (విశాఖ -పలాస) ను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ఆదివారం నాటికి ఆరుగురు ప్రయాణికులు మృతి చెందారు. పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. సహాయక బృందాలు ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకొని గాయపడినవారిని ఆస్పత్రులకు తరలిస్తున్నారు.

రైళ్లు ఢీకొనడంతో ఘటనా స్థలంలో విద్యుత్ వైర్లు తెగిపోయాయి. దీంతో ఆ ప్రాంతమంతా నిన్న రాత్రి అంధకారం నెలకొంది. దీంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది.

హెల్ప్ లైన్ నెంబర్ లు:

8106053051

8106053052

8500041670

8500041671

నేడు మృతుల సంఖ్య 13 కు చేరింది సుమారు 50 మందికి పైగా గాయాలు అయ్యాయి.ఘటన స్థలంలో కొనసాగుతున్న సహాయక చర్యలు. రైలు ప్రమాదం జరగడంతో పలు రైళ్ల రాకపోకలకు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే..మృతుల కుటుంబాలకు 10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి 2.50 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి 50 వేల చొప్పున ఎక్స్గ్రేషియా ను రైల్వే శాఖ ప్రకటించింది.

పెద్దవూర: జయవీర్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన 50 కుటుంబాలు

నల్లగొండ జిల్లా, నాగార్జునసాగర్ నియోజకవర్గం:

పెద్దవూర మండలం, తంగేళ్ల తాండ గ్రామానికి చెందిన నాయకులు, కార్యకర్తల 50 కుటుంబాలు బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి నాగార్జున సాగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి  జయవీర్ కుందూరు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది.

ఈ సందర్భంగా జయవీర్ నూతనంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జయవీర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కార్యకర్తలను కోరారు. ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పని చేయాలని, రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నల్లగొండ: కాంగ్రెస్ లో చేరిన బిజెపి పట్టణ మాజీ అధ్యక్షుడు మొరిశెట్టి నాగేశ్వరరావు

నల్లగొండలో రాజకీయ జోష్ పెరిగింది. 2023 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పలువురు నాయకులు వ్యూహాత్మకంగా వ్యవహరించి పార్టీలు మారుతున్నారు.

ఈ నేపథ్యంలో నల్గొండ పట్టణంలోని 36 వార్డు మాజీ కౌన్సిలర్, పట్టణ బిజెపి మాజీ అధ్యక్షుడు మొరిశెట్టి నాగేశ్వరరావు ఈరోజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. నాగేశ్వరరావు కు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

బహుజనులను ఏకం చేసి రాజ్యాధికారం సాధిస్తాం: బిఎస్పి నకిరేకల్ ఎమ్మెల్యే అభ్యర్థి మేడి ప్రియదర్శిని

నల్లగొండ జిల్లా:

నార్కట్ పల్లి మండలం లో ఎన్నికల ప్రచారాన్ని బి ఎస్ పి నకిరేకల్ ఎమ్మెల్యే అభ్యర్థి మేడి ప్రియదర్శిని ప్రారంభించారు. నార్కట్ పల్లి మండలం కొండకిందిగూడెం, కొండపాకగూడెం, పోతినేనిపల్లి గ్రామాల్లో గడప గడప కు బొట్టు పెట్టుకుంటూ, ఈ సారి ఏనుగు గుర్తుకు ఓట్ వేసి తనను గెలిపించి అసెంబ్లీ కి పంపిచాలని కోరారు.

ఆమె మాట్లాడుతూ.. ఇంటింటికీ బహుజన్ సమాజ్ పార్టీని తీసుకెళ్లడంతో పాటు గడపగడపకు ఏనుగు గుర్తును మోసుకెళ్తామని బిఎస్పి ఎమ్మెల్యే అభ్యర్థి మేడి ప్రియదర్శిని చెబుతున్నారు.

ప్రజల పక్షాల నిలబడతామని భరోసా కల్పిస్తున్నారు. ఈ సారి నకిరేకల్ గడ్డపై నీలిజెండాను ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ‘ఓటు హమారా.. సీట్ తుమ్హరా.. నహీ ఛలేగా’ అంటున్నారు. బహుజనులను ఏకం చేసి రాజ్యాధికారం సాధిస్తామని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్, చేరికల కమిటీ కన్వీనర్ మునుగోటి సత్తయ్య, శేఖర్, వనజ, సంతోష,రమేష్,శేఖర్, మస్తాన్,మహేష్, యోగి, ఉదయ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA

RR: కాంగ్రెస్ లో చేరిన సింగిల్ విండో డైరెక్టర్ గంట శ్రీనివాసరెడ్డి

బిఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ సీనియర్ నాయకులు, సింగిల్ విండో డైరెక్టర్ గంట శ్రీనివాసరెడ్డి మరియు మరి కొంత మంది కార్యకర్తలు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డి నూతనంగా పార్టీలో చేరిన వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

SB NEWS RR DIST

SB NEWS TELANGANA

టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ తెలంగాణ అధ్యక్షులు ఎలిశాల రవి ప్రసాద్ కు శుభాకాంక్షలు తెలిపిన బొమ్మపాల గిరిబాబు

నల్గొండ జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలిశాల రవి ప్రసాద్, నేడు తిరుమల తిరుపతి దేవస్థానం లోకల్ అడ్వైజరీ కమిటీ తెలంగాణ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా, హైదరాబాద్ జూబ్లీహిల్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా TTD చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి హాజరై నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు పాల్గొని రవిప్రసాద్ కు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA