నల్లగొండ: కాంగ్రెస్ లో చేరిన బిజెపి పట్టణ మాజీ అధ్యక్షుడు మొరిశెట్టి నాగేశ్వరరావు

నల్లగొండలో రాజకీయ జోష్ పెరిగింది. 2023 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పలువురు నాయకులు వ్యూహాత్మకంగా వ్యవహరించి పార్టీలు మారుతున్నారు.

ఈ నేపథ్యంలో నల్గొండ పట్టణంలోని 36 వార్డు మాజీ కౌన్సిలర్, పట్టణ బిజెపి మాజీ అధ్యక్షుడు మొరిశెట్టి నాగేశ్వరరావు ఈరోజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. నాగేశ్వరరావు కు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

బహుజనులను ఏకం చేసి రాజ్యాధికారం సాధిస్తాం: బిఎస్పి నకిరేకల్ ఎమ్మెల్యే అభ్యర్థి మేడి ప్రియదర్శిని

నల్లగొండ జిల్లా:

నార్కట్ పల్లి మండలం లో ఎన్నికల ప్రచారాన్ని బి ఎస్ పి నకిరేకల్ ఎమ్మెల్యే అభ్యర్థి మేడి ప్రియదర్శిని ప్రారంభించారు. నార్కట్ పల్లి మండలం కొండకిందిగూడెం, కొండపాకగూడెం, పోతినేనిపల్లి గ్రామాల్లో గడప గడప కు బొట్టు పెట్టుకుంటూ, ఈ సారి ఏనుగు గుర్తుకు ఓట్ వేసి తనను గెలిపించి అసెంబ్లీ కి పంపిచాలని కోరారు.

ఆమె మాట్లాడుతూ.. ఇంటింటికీ బహుజన్ సమాజ్ పార్టీని తీసుకెళ్లడంతో పాటు గడపగడపకు ఏనుగు గుర్తును మోసుకెళ్తామని బిఎస్పి ఎమ్మెల్యే అభ్యర్థి మేడి ప్రియదర్శిని చెబుతున్నారు.

ప్రజల పక్షాల నిలబడతామని భరోసా కల్పిస్తున్నారు. ఈ సారి నకిరేకల్ గడ్డపై నీలిజెండాను ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ‘ఓటు హమారా.. సీట్ తుమ్హరా.. నహీ ఛలేగా’ అంటున్నారు. బహుజనులను ఏకం చేసి రాజ్యాధికారం సాధిస్తామని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్, చేరికల కమిటీ కన్వీనర్ మునుగోటి సత్తయ్య, శేఖర్, వనజ, సంతోష,రమేష్,శేఖర్, మస్తాన్,మహేష్, యోగి, ఉదయ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA

RR: కాంగ్రెస్ లో చేరిన సింగిల్ విండో డైరెక్టర్ గంట శ్రీనివాసరెడ్డి

బిఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ సీనియర్ నాయకులు, సింగిల్ విండో డైరెక్టర్ గంట శ్రీనివాసరెడ్డి మరియు మరి కొంత మంది కార్యకర్తలు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డి నూతనంగా పార్టీలో చేరిన వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

SB NEWS RR DIST

SB NEWS TELANGANA

టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ తెలంగాణ అధ్యక్షులు ఎలిశాల రవి ప్రసాద్ కు శుభాకాంక్షలు తెలిపిన బొమ్మపాల గిరిబాబు

నల్గొండ జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలిశాల రవి ప్రసాద్, నేడు తిరుమల తిరుపతి దేవస్థానం లోకల్ అడ్వైజరీ కమిటీ తెలంగాణ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా, హైదరాబాద్ జూబ్లీహిల్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా TTD చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి హాజరై నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు పాల్గొని రవిప్రసాద్ కు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA

కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరికలు

మునుగోడు నియోజకవర్గం నారాయణపురం మండలం నాగవారిగూడెం గ్రామం నుండి 20 కుటుంబాలు వివిధ పార్టీల నుండి ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం బిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు.

ఈ సందర్భంగా నూతనంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ.. బిఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు. నూతనంగా పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA

NLG: జరగబోయే ఎన్నికల్లో వామపక్ష లౌకిక శక్తులకు ఓటు వేయండి: సిపిఎం జిల్లా కార్య వర్గ సభ్యులు బండ శ్రీశైలం

నల్లగొండ జిల్లా:

చండూరు: ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ ప్రభుత్వం వామపక్షాలను మోసం చేసిందని, ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో వామపక్ష లౌకిక శక్తులకు ఓటు వేయాలని, బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించాలని సిపిఎం జిల్లా కార్య వర్గ సభ్యులు బండ శ్రీశైలం ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం చండూరు మండల కేంద్రంలో సిపిఎం మండల కమిటీ సమావేశం కంచర్ల రవి అధ్యక్షతన సమావేశం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో దళిత బంధు, బీసీ బందు, గృహలక్ష్మి సంక్షేమ పథకాలు బిఆర్ఎస్ కార్యకర్తలకు తప్ప అర్హులైన నిరుపేదలకు అందలేదని వారు విమర్శించారు. బిఆర్ఎస్ ప్రభుత్వం మునుగోడు ఉప ఎన్నికల ముందు గీత కార్మికులకు ద్విచక్ర వాహనాలు ఇస్తామని హామీ ఇచ్చి, ఇంతవరకు అమలు చేయలేదని గుర్తు చేశారు. ఉప ఎన్నికల్లో కమ్యూనిస్టుల మద్దతు లేకుండా బిఆర్ఎస్ గెలిచేదా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు దాటినా.. అర్హులైన నిరుపేదలకు, కొత్తగా పెండ్లీలు అయినా పేదలకు ఇంతవరకు కొత్త రేషన్ కార్డులు, కొత్త పింఛన్లు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. బిఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించలేదని, హఠాత్తుగా అధికార ప్రభుత్వం 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తాననడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఉప ఎన్నికల ముందు ప్రజలకు అనేక హామీలు ఇచ్చి, అమలు చేయలేదని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శిమోగుదాల వెంకటేశం, చండూరు మండల సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ గౌడ్, సిపిఎం సీనియర్ నాయకులు చిట్టిమల్ల లింగయ్య,, కొత్తపల్లి నరసింహ, గౌసియా బేగం, తదితరులు పాల్గొన్నారు.

NLG: దేవరకొండ నియోజకవర్గం లో బిఆర్ఎస్ కు భారీ షాక్

నల్లగొండ జిల్లా, దేవరకొండ నియోజకవర్గం లో బీఆర్ఎస్ కు చెందిన దేవరకొండ మున్సిపల్ చైర్మన్ అలంపల్లి నర్సింహ, దేవరకొండ ఎంపిపి నల్లగసు జాన్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ వడిత్య దేవేందర్ నాయక్, పలు గ్రామాల సర్పంచ్ లు, ఎంపిటిసి లు శనివారం భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ లో బాలు నాయక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరినారు. వారికి దేవరకొండ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

NLG: సొంత గూటికి చేరిన నాయకులు

నల్గొండ: పట్టణంలోని 21 వార్డు కౌన్సిలర్ పరహత్ ఫర్జానా ఇబ్రహీం మరియు కంచనపల్లి ఎంపీటీసీ సహదేవ్ దోమలపల్లి ఎంపిటిసి దేశగాని నరసింహ, శనివారం హైదరాబాద్లో కాంగ్రెస్ నాయకులు భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 

ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. బెదిరింపులతో తెరాస పార్టీలో చేర్చుకొని, చేరిన తర్వాత మండల అభివృద్ధిని ఏ మాత్రం పట్టించుకోకుండా, సొంత ప్రయోజనాలే చూసుకున్న భూపాల్ రెడ్డిని మరోసారి నమ్మడానికి నల్గొండ ప్రజలు సిద్ధంగా లేరని.. ఆయన ఓటమి ఇప్పటికే ఖాయం అయిందని అందుకే పాత కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందుకు వస్తున్నారు, రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే. కాబట్టి ఎవరు అదైర్యపడోద్దు అని అన్నారు.

మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం వస్తుంది. అందరికీ సంక్షేమ ఫలాలు అందుతాయని, ఇండ్లు లేని వారికి ఆనాడే ఎన్నో ఇందిరమ్మ ఇండ్లు కట్టించామని, రైతులకు పేదలకు యువతకు, అన్ని వర్గాల ప్రజల సంక్షేమం.. ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అవుతుందని, రాబోయే 32 రోజులు కలిసి కట్టుగా కష్టపడితే కాంగ్రెస్స్ పార్టీ అధికారం లోకి వస్తుంది. 5 సం. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం అని కార్యకర్తలకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు.

NLG: తైక్వాండో పోటీలలో నాగార్జున కళాశాల విద్యార్థులకు పతకాలు

నల్లగొండ: మహాత్మా గాంధీ యూనివర్సిటీ లో నిన్న నిర్వహించిన అంతర్ కళాశాలల తైక్వాండో పోటీలలో నాగార్జున ప్రభుత్వ కళాశాల విద్యార్థులు పతకాలు సాధించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్ డా. ఉపేందర్ తెలిపారు. 

విద్యార్థులు సంపత్ కుమార్ (ఫైనలియర్) మరియు అనీస్ (సెకండ్ ఇయర్), సంపత్ కుమార్ (ఫస్ట్ ఇయర్) బంగారు పతకాలు సాధించగా, షేక్ షోయిబ్, శ్రీకాంత్ రెడ్డి వెండి పతకాలు, పాటిల్ వినయ్ రజిత పథకం సాధించారు. అయితే బంగారు పతకం సాధించిన విద్యార్థులు రాజస్థాన్ లో వచ్చే నెల 2వ తేదీ నుండి 5వ తేదీ వరకు జరుగనున్న అంతర్ విశ్వవిద్యాలయాల టోర్నమెంట్ కు ఎంపికైనట్లు తెలిపారు. 

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఉపేందర్, వైస్ ప్రిన్సిపాల్ డా. మునీర్, COE నాగరాజు కళాశాల ఫిజికల్ డైరెక్టర్ కడారి మల్లేష్, యాదగిరి రెడ్డి, డా. దుర్గాప్రసాద్, తదితరులు విద్యార్థులను అభినందించారు.

SB NEWS NALGONDA DIST

చంద్రగ్రహణం కారణంగా 8 గంటల పాటు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

తిరుమల: పాక్షిక చంద్రగ్రహణం కారణంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని ఈ రోజు రాత్రి 7.05 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 3.15 గంటల వరకు మూసివేయనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

29న తెల్లవారుజామున 1.05 నుంచి 2.22 గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం ఉంది. గ్రహణ సమయానికి 6 గంటల ముందు తలుపులు మూసివేయడం ఆనవాయితి ఉంది. తెల్లవారుజామున 3.15 గంటలకు వ్యక్తిగత శుద్ధి, సుప్రభాతసేవ అనంతరం ఆలయ తలుపులు తెరుస్తారు. గ్రహణం కారణంగా నేడు సహస్ర దీపాలంకార సేవ, మరియు వికలాంగులకు, వృద్ధులకు సౌకర్యాలు రద్దు చేసినట్లు తిరుమల దేవస్థానం తెలిపింది.