NLG: జరగబోయే ఎన్నికల్లో వామపక్ష లౌకిక శక్తులకు ఓటు వేయండి: సిపిఎం జిల్లా కార్య వర్గ సభ్యులు బండ శ్రీశైలం

నల్లగొండ జిల్లా:

చండూరు: ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ ప్రభుత్వం వామపక్షాలను మోసం చేసిందని, ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో వామపక్ష లౌకిక శక్తులకు ఓటు వేయాలని, బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించాలని సిపిఎం జిల్లా కార్య వర్గ సభ్యులు బండ శ్రీశైలం ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం చండూరు మండల కేంద్రంలో సిపిఎం మండల కమిటీ సమావేశం కంచర్ల రవి అధ్యక్షతన సమావేశం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో దళిత బంధు, బీసీ బందు, గృహలక్ష్మి సంక్షేమ పథకాలు బిఆర్ఎస్ కార్యకర్తలకు తప్ప అర్హులైన నిరుపేదలకు అందలేదని వారు విమర్శించారు. బిఆర్ఎస్ ప్రభుత్వం మునుగోడు ఉప ఎన్నికల ముందు గీత కార్మికులకు ద్విచక్ర వాహనాలు ఇస్తామని హామీ ఇచ్చి, ఇంతవరకు అమలు చేయలేదని గుర్తు చేశారు. ఉప ఎన్నికల్లో కమ్యూనిస్టుల మద్దతు లేకుండా బిఆర్ఎస్ గెలిచేదా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు దాటినా.. అర్హులైన నిరుపేదలకు, కొత్తగా పెండ్లీలు అయినా పేదలకు ఇంతవరకు కొత్త రేషన్ కార్డులు, కొత్త పింఛన్లు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. బిఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించలేదని, హఠాత్తుగా అధికార ప్రభుత్వం 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తాననడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఉప ఎన్నికల ముందు ప్రజలకు అనేక హామీలు ఇచ్చి, అమలు చేయలేదని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శిమోగుదాల వెంకటేశం, చండూరు మండల సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ గౌడ్, సిపిఎం సీనియర్ నాయకులు చిట్టిమల్ల లింగయ్య,, కొత్తపల్లి నరసింహ, గౌసియా బేగం, తదితరులు పాల్గొన్నారు.

NLG: దేవరకొండ నియోజకవర్గం లో బిఆర్ఎస్ కు భారీ షాక్

నల్లగొండ జిల్లా, దేవరకొండ నియోజకవర్గం లో బీఆర్ఎస్ కు చెందిన దేవరకొండ మున్సిపల్ చైర్మన్ అలంపల్లి నర్సింహ, దేవరకొండ ఎంపిపి నల్లగసు జాన్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ వడిత్య దేవేందర్ నాయక్, పలు గ్రామాల సర్పంచ్ లు, ఎంపిటిసి లు శనివారం భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ లో బాలు నాయక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరినారు. వారికి దేవరకొండ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

NLG: సొంత గూటికి చేరిన నాయకులు

నల్గొండ: పట్టణంలోని 21 వార్డు కౌన్సిలర్ పరహత్ ఫర్జానా ఇబ్రహీం మరియు కంచనపల్లి ఎంపీటీసీ సహదేవ్ దోమలపల్లి ఎంపిటిసి దేశగాని నరసింహ, శనివారం హైదరాబాద్లో కాంగ్రెస్ నాయకులు భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 

ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. బెదిరింపులతో తెరాస పార్టీలో చేర్చుకొని, చేరిన తర్వాత మండల అభివృద్ధిని ఏ మాత్రం పట్టించుకోకుండా, సొంత ప్రయోజనాలే చూసుకున్న భూపాల్ రెడ్డిని మరోసారి నమ్మడానికి నల్గొండ ప్రజలు సిద్ధంగా లేరని.. ఆయన ఓటమి ఇప్పటికే ఖాయం అయిందని అందుకే పాత కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందుకు వస్తున్నారు, రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే. కాబట్టి ఎవరు అదైర్యపడోద్దు అని అన్నారు.

మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం వస్తుంది. అందరికీ సంక్షేమ ఫలాలు అందుతాయని, ఇండ్లు లేని వారికి ఆనాడే ఎన్నో ఇందిరమ్మ ఇండ్లు కట్టించామని, రైతులకు పేదలకు యువతకు, అన్ని వర్గాల ప్రజల సంక్షేమం.. ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అవుతుందని, రాబోయే 32 రోజులు కలిసి కట్టుగా కష్టపడితే కాంగ్రెస్స్ పార్టీ అధికారం లోకి వస్తుంది. 5 సం. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం అని కార్యకర్తలకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు.

NLG: తైక్వాండో పోటీలలో నాగార్జున కళాశాల విద్యార్థులకు పతకాలు

నల్లగొండ: మహాత్మా గాంధీ యూనివర్సిటీ లో నిన్న నిర్వహించిన అంతర్ కళాశాలల తైక్వాండో పోటీలలో నాగార్జున ప్రభుత్వ కళాశాల విద్యార్థులు పతకాలు సాధించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్ డా. ఉపేందర్ తెలిపారు. 

విద్యార్థులు సంపత్ కుమార్ (ఫైనలియర్) మరియు అనీస్ (సెకండ్ ఇయర్), సంపత్ కుమార్ (ఫస్ట్ ఇయర్) బంగారు పతకాలు సాధించగా, షేక్ షోయిబ్, శ్రీకాంత్ రెడ్డి వెండి పతకాలు, పాటిల్ వినయ్ రజిత పథకం సాధించారు. అయితే బంగారు పతకం సాధించిన విద్యార్థులు రాజస్థాన్ లో వచ్చే నెల 2వ తేదీ నుండి 5వ తేదీ వరకు జరుగనున్న అంతర్ విశ్వవిద్యాలయాల టోర్నమెంట్ కు ఎంపికైనట్లు తెలిపారు. 

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఉపేందర్, వైస్ ప్రిన్సిపాల్ డా. మునీర్, COE నాగరాజు కళాశాల ఫిజికల్ డైరెక్టర్ కడారి మల్లేష్, యాదగిరి రెడ్డి, డా. దుర్గాప్రసాద్, తదితరులు విద్యార్థులను అభినందించారు.

SB NEWS NALGONDA DIST

చంద్రగ్రహణం కారణంగా 8 గంటల పాటు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

తిరుమల: పాక్షిక చంద్రగ్రహణం కారణంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని ఈ రోజు రాత్రి 7.05 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 3.15 గంటల వరకు మూసివేయనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

29న తెల్లవారుజామున 1.05 నుంచి 2.22 గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం ఉంది. గ్రహణ సమయానికి 6 గంటల ముందు తలుపులు మూసివేయడం ఆనవాయితి ఉంది. తెల్లవారుజామున 3.15 గంటలకు వ్యక్తిగత శుద్ధి, సుప్రభాతసేవ అనంతరం ఆలయ తలుపులు తెరుస్తారు. గ్రహణం కారణంగా నేడు సహస్ర దీపాలంకార సేవ, మరియు వికలాంగులకు, వృద్ధులకు సౌకర్యాలు రద్దు చేసినట్లు తిరుమల దేవస్థానం తెలిపింది.

TS: 45 మందితో కాంగ్రెస్ రెండో జాబితా విడుదల

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పలు నియోజకవర్గాలకు ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటిస్తూ రెండో జాబితాను విడుదల చేసింది. మొదటి జాబితాలో 55 మంది పేర్లు ప్రకటించిన కాంగ్రెస్ రెండో జాబితాలో 45 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.

నియోజకవర్గాల వారిగా అభ్యర్థుల పేర్లు:

1. సిర్పూర్- రావి శ్రీనివాస్

2. అసిఫాబాద్ (ఎస్టీ)- అజ్మీరా శ్యామ్

3. ఖానాపూర్ (ఎస్టీ)- వెద్మ బొజ్జు

4. ఆదిలాబాద్- కంది శ్రీనివాస్ రెడ్డి

5. బోథ్ (ఎస్టీ)- వెన్నెల అశోక్

6. ముథోల్- బోస్లె నారాయణ రావు పాటిల్

7. ఎల్లారెడ్డి- కే.మదన్ మోహన్ రావు

8. నిజామాబాద్ రూరల్- డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి

9. కోరుట్ల- జువ్వాది నర్సింగరావు

10. చొప్పదండి (ఎస్సీ)- మేడిపల్లి సత్యం

11. హుజూరాబాద్- వడితెల ప్రణవ్

12. హుస్నాబాద్- పొన్నం ప్రభాకర్

13. సిద్దిపేట- పూజల హరికృష్ణ

14. నర్సాపూర్- ఆవుల రాజిరెడ్డి

15. దుబ్బాక- చెరుకు శ్రీనివాస్ రెడ్డి

16. కూకట్‌పల్లి- బండి రమేష్

17. ఇబ్రహీంపట్నం- మల్ రెడ్డి రంగారెడ్డి

18. ఎల్బీనగర్- మధుయాష్కి గౌడ్

19. మహేశ్వరం- కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి

20. రాజేంద్రనగర్- కస్తూరి నరేందర్

21. శేరిలింగంపల్లి- వి. జగదీశ్వర్ గౌడ్

22. తాండూర్- బయ్యని మనోహర్ రెడ్డి

23. అంబర్‌పేట్- రోహిన్ రెడ్డి

24. ఖైరతాబాద్- పి. విజయారెడ్డి

25. జూబ్లీహిల్స్- మహ్మద్ అజహరుద్దీన్

26. సికింద్రాబాద్ కంటోన్మెంట్ (ఎస్సీ)- డాక్టర్ జీవీ వెన్నెల(గద్దర్ కుమార్తె) 

27. నారాయణపేట- డా. పర్ణిక చిట్టెం రెడ్డి

28. మహబూబ్ నగర్- యెన్నం శ్రీనివాస్ రెడ్డి

29. జడ్చర్ల- జె.అనిరుధ్ రెడ్డి

30. దేవరకద్ర- గావినోళ్ల మధుసూధన్ రెడ్డి

31. మక్తల్- వాకిటి శ్రీహరి

32. వనపర్తి- డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి

33. దేరకొండ (ఎస్టీ)- నేనావత్ బాలూ నాయక్

34. మునుగోడు- కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

35. భువనగిరి- కుంభం అనిల్ కుమార్ రెడ్డి

36. జనగామ- కొమ్మూరి ప్రతాప్ రెడ్డి

37. పాలకుర్తి- యశశ్విని

38. మహబూబాబాద్ (ఎస్టీ)- డా. మురళీ నాయక్

39. పరకాల- రేవూరి ప్రకాశ్ రెడ్డి

40. వరంగల్ పశ్చిమ- నాయిని రాజేందర్ రెడ్డి

41. వరంగల్ తూర్పు- కొండా సురేఖ

42. వర్ధన్నపేట (ఎస్సీ)- కేఆర్. నాగరాజు

43.పినపాక (ఎస్టీ)- పాయం వెంకటేశ్వర్లు

44. ఖమ్మం- తుమ్మల నాగేశ్వరరావు

45. పాలేరు- పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

వట్టే జానయ్య ఆధ్వర్యంలో బీఎస్పీ లో భారీ చేరికలు

సూర్యాపేట: మండలం ఇమాంపేట గ్రామంలో పలు పార్టీలకు రాజీనామా చేసి 600 మంది వరకు కార్యకర్తలు బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వట్టే జానయ్య యాదవ్ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు బీఎస్పీలో చేరారు. 

ఈ సందర్భంగా వట్టే జానయ్య యాదవ్ మాట్లాడుతూ.. దళితులకు మూడు ఎకరాలు భూమి ఇస్తామని చెప్పిన కెసిఆర్ ప్రభుత్వం, ఇమాంపేట గ్రామంలో దళితుల భూములు లాక్కొని మిషన్ భగీరథ కార్యాలయాలు ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసం అని అన్నారు.

బీఎస్పీ లో చేరిన వారిలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు నాగిరెడ్డి వెంకట నరసింహారెడ్డి, టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ ఉపాధ్యక్షులు కుంచం ఉపేందర్, గ్రామ వార్డు మెంబర్ సొప్పరి నాగమణి లాలయ్య, నగిరి వెంకటమ్మ అంజయ్య, మాజీ వార్డు సభ్యులు నగిరి అంజయ్య, సాగాల సోమమ్మ, సొప్పరి నాగమ్మ, డప్పు కళాకారుడు సామల కృష్ణయ్య, సర్దార్ నగేష్, చలక రవి, సతీష్ హరీష్ లతోపాటు 600 మంది వరకు ఉన్నారు.

అనంతరం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

నకిరేకల్ : బిఎస్పి కి ఓటు వేసి అసెంబ్లీకి పంపిస్తే.. అభివృద్ధి అంటే ఎట్లా ఉంటదో చూపిస్తా: మేడి ప్రియదర్శిని

నల్లగొండ జిల్లా: నకిరేకల్ పట్టణ కేంద్రం, మరియు పలు గ్రామాలలో ఎన్నికల ప్రచారం లో భాగంగా భాగంగా బి ఎస్ పి నకిరేకల్ ఎమ్మెల్యే అభ్యర్థి మేడి ప్రియదర్శిని ఆధ్వర్యంలో.. గడపగడపకు బీఎస్పీ ప్రగతి భవన్ కు ఆర్ఎస్పి అనే నినాదంతో ఇంటింటా తిరిగి ఏనుగు గుర్తు, బీఎస్పీ మేనిఫెస్టోను బహుజన సిద్ధాంతాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా మేడి ప్రియదర్శిని మాట్లాడుతూ.. ఈ సారి బిఎస్పి కి ఓట్ వేసి ఏనుగు గుర్తును అసెంబ్లీ కి పంపిస్తే అభివృద్ధి అంటే ఎట్లా ఉంటాదో చూపిస్తా అని అన్నారు. ప్రతి ఒక్కరు ఏనుగు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్, మహిళా కన్వీనర్ మర్రి శోభ, చేరికల కమిటీ కన్వీనర్ మునుగోటి సత్తయ్య, రామన్నపేట మండల అధ్యక్షులు మేడి సంతోష్, విజయ్, సైదులు, తదితరులు పాల్గొన్నారు.

SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA

Streetbuzz National News App

NLG: ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్ తైక్వాండో మహిళా విభాగం లో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల కు చెందిన విద్యార్థిని లకు గోల్డ్ మెడల్

నల్లగొండ: నేడు మహాత్మా గాంధీ యూనివర్సిటీలో జరిగిన ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్ తైక్వాండో మహిళా విభాగం లో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల కు చెందిన ఇద్దరు విద్యార్థినులు సరయు, మేఘన అత్యంత ప్రతిభ కనపరిచి గోల్డ్ మెడల్ సాధించారు. అదేవిధంగా వీరు వచ్చేనెల 3,4 తేదీలలో రాజస్థాన్ యూనివర్సిటీలో తైక్వాండో విభాగంలో ఎం.జి యూనివర్సిటీ తరపున పాల్గొననున్నారు. 

ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డా.ఘన్ శ్యామ్, ఇంచార్జ్ ఫిజికల్ డైరెక్టర్ డా.రాజారామ్, వైస్ ప్రిన్సిపాల్ భాస్కర్ రెడ్డి, దేవవాని, నరేష్, వెంకటకృష్ణ, తదితరుల అధ్యాపకులు ఇద్దరు విద్యార్థినిలను అభినందించారు.

కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్న వివిధ పార్టీల ప్రముఖ నాయకులు

ఢిల్లీ: తెలంగాణకు చెందిన వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు.

కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నవారిలో 

1. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి - మాజీ ఎమ్మెల్యే

2. మోత్కుపల్లి నరసింహులు - మాజీ మంత్రి

3. ఏనుగు రవీందర్ రెడ్డి - మాజీ ఎమ్మెల్యే

4. ఆకుల లలిత - ఎమ్మెల్సీ

5. నేతి విద్యా సాగర్ - మాజీఎమ్మెల్సీ, శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్

6. సంతోష్ కుమార్ - మాజీ ఎమ్మెల్సీ

7. కపిలవాయి దిలీప్ కుమార్ - మాజీ ఎమ్మెల్సీ

8. నీలం మధు ముదిరాజ్ - పటాన్ చెరువు బిఆర్ఎస్ నాయకులు ఉన్నారు

ఈ సందర్భంగా నాయకులకు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే.. కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వారి వెంట పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తదితరులు ఉన్నారు.

SB NEWS TELANGANA

SB NEWS NATIONAL NEWS APP