Telangananews

Oct 28 2023, 14:04

సింగపూర్‌లో కాలేజీ అమ్మాయిపై అత్యాచారం.. భారతీయుడికి 16 ఏళ్ల జైలు

కాలేజీ అమ్మాయిపై అత్యాచారం కేసులో ఓ భారతీయుడికి సింగపూర్ కోర్టు 16 ఏళ్ల జైలుశిక్ష విధించింది. 4 మే 2019లో ఓ యూనివర్సిటీ విద్యార్థిని రాత్రి పొద్దుపోయాక బస్‌స్టాప్‌కు నడుచుకుంటూ వెళ్తోంది. అక్కడ క్లీనర్‌గా పనిచేస్తున్న 26 ఏళ్ల చిన్నయ్య ఆమెకు తప్పుడు సమాచారం ఇచ్చి వేరే మార్గంలోకి మళ్లించాడు. ఆ తర్వాత ఆమెపై దాడిచేసి గాయపరిచి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. 

యువతిపై దాడిచేసిన చిన్నయ్య ఆమె గొంతు నొక్కడంతో ఊపిరి ఆడలేదని, అతడి చెయ్యిని అక్కడి నుంచి తీసే ప్రయత్నం చేసిందని డిప్యూటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కయాల్ పిల్లే తెలిపారు. అయితే, పట్టువిడవని చిన్నయ్య సైలెంట్‌గా ఉండాలని, అరిచి గింజుకున్నా ఇక్కడెవరూ రారని హెచ్చరించాడు. అత్యాచారం అనంతరం ఆమె వస్తువులతో అక్కడి నుంచి పరారయ్యాడు. 

ఆమె ఫోన్ చిన్నయ్య తీసుకెళ్లిన బ్యాగ్‌లో ఉండిపోవడంతో బాయ్‌ఫ్రెండ్‌కు విషయం చెప్పలేకపోయింది. ఆ తర్వాత అతి కష్టం మీద ఓ స్నేహితుడికి జరిగింది చెప్పగా, అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత రోజే చిన్నయ్యను అరెస్ట్ చేశారు. తాజాగా విచారణ పూర్తి కాగా చిన్నయ్యకు 16 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.

Telangananews

Oct 28 2023, 14:03

మరణించిన కుమారుడి ఆస్తికి ఫస్ట్ క్లాస్ వారసురాలు తల్లే.. కర్ణాటక హైకోర్టు కీలక తీర్పు

ఉమ్మడి కుటుంబంలో మరణించిన కుమారుడి ఆస్తికి ఆమె తల్లి క్లాస్-1 వారసురాలిగా మారుతుందని కర్ణాటక హైకోర్టు తీర్పు చెప్పింది. టీఎన్ సుశీలమ్మ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ హెచ్‌పీ సందేశ్.. మరణించిన కొడుకు ఆస్తిపై తల్లికి ఎలాంటి హక్కులు ఉండవంటూ చిక్కమగళూరు జిల్లా ప్రిన్సిపల్, సెషన్స్ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును కొట్టివేశారు. 

మరణించిన కుమారుడి ఆస్తికి తల్లి ఫస్ట్ క్లాస్ వారసురాలు అవుతుందని తీర్పులో పేర్కొన్నారు. కేసు విచారణ సందర్భంగా ప్రతివాదుల తరపు న్యాయవాది సెషన్స్ కోర్టు తీర్పును సమర్థించారు. పిత్రార్జిత ఆస్తిలో ఆమెకు వాటా కేటాయించే సమయానికే సుశీలమ్మ కుమారుడు మరణించాడని, కాబట్టి సెషన్స్ కోర్టు ఆదేశాలను సవరించాల్సిన అవసరం లేదని వాదించారు. 

ఈ వాదనలను హైకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. మరణించిన కుమారుడు సంతోష్ ఆస్తికి ఆమె ఫస్ట్ క్లాస్ వారసురాలు అవుతుందని స్పష్టం చేసింది. సంతోష్‌కు తల్లి, భార్య, కుమారుడు ఉన్నారు. హిందూ అవిభాజ్య కుటుంబంలో సుశీలమ్మే ఫస్ట్ క్లాస్ వారసురాలు అవుతుందని, కాబట్టి సంతోష్ ఆస్తిలో అసలు అప్పీలుదారైన సుశీలమ్మకు వాటా దక్కుతుందని పేర్కొంది. సెషన్స్ కోర్టు తీర్పు లోపభూయిష్టంగా ఉందని పేర్కొంటూ దానిని కొట్టివేసింది.

Telangananews

Oct 27 2023, 09:55

తెలంగాణ ఎన్నికల కోసం బీజేపీ భారీ కసరత్తు, సీటు షేరింగ్ విషయంలో అమిత్ షాతో చర్చిస్తున్న పవన్ కళ్యాణ్.

నవంబర్ 30 అసెంబ్లీ ఎన్నికలకు ముందస్తు ఎన్నికల పొత్తుపై బిజెపి తెలంగాణ యూనిట్ మరియు నటుడు మరియు రాజకీయ నాయకుల మధ్య కొనసాగుతున్న చర్చల కొనసాగింపుగా, జనసేన వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ దేశ రాజధానిలో కేంద్ర మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. జనసేన వర్గాల సమాచారం ప్రకారం, పవన్ కళ్యాణ్, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌తో కలిసి బుధవారం హోంమంత్రి షాను కలిశారు, ఆయన హైదరాబాద్ రాకముందే తెలంగాణ బిజెపి నాయకత్వం మరియు పవన్ కళ్యాణ్ ఒక అవగాహనకు రావాలని కోరారు.

శుక్రవారం ఇక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (SVPNPA)లో జరగనున్న ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) ప్రొబేషనర్ల 75వ (రెగ్యులర్ రిక్రూట్) బ్యాచ్‌ల పాసింగ్ అవుట్ పరేడ్‌ను అమిత్ షా సమీక్షిస్తారు మరియు ఎన్నికల ర్యాలీలో కూడా ప్రసంగిస్తారు. ‘కళ్యాణ్‌, మనోహర్‌ ఇద్దరూ నిన్న రాత్రి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. కళ్యాణ్‌ ఈరోజు జనసేన తెలంగాణా నేతలతో చర్చలు జరిపి ఎలాంటి నిర్ధారణకు రానున్నారు’ అని జనసేన వర్గాలు మీడియాకు తెలిపాయి.

కేంద్ర మంత్రి, తెలంగాణ బిజెపి చీఫ్ జి కిషన్ రెడ్డి బుధవారం దేశ రాజధానిలో విలేకరులతో మాట్లాడుతూ తాను ఇప్పటికే హైదరాబాద్‌లో కళ్యాణ్‌తో సమావేశమయ్యానని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ముందస్తు ఎన్నికల పొత్తుపై ప్రాథమిక చర్చలు జరిపినట్లు చెప్పారు. జనసేన ఎన్డీయేలో భాగమని, బీజేపీ జాతీయ నాయకత్వంతో పవన్ కల్యాణ్ చర్చిస్తున్నారని చెప్పారు. నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు గానూ 32 నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుందని అక్టోబర్ 2న ప్రకటించారు. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల కోసం పవన్ కళ్యాణ్ ఇటీవల తెలుగుదేశం పార్టీ (టీడీపీ)తో పొత్తును ప్రకటించిన సంగతి తెలిసిందే.

Telangananews

Aug 21 2023, 10:33

మరికొన్ని గంటల్లో బిఆర్ఎస్ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్కు ముహర్తం ఫిక్స్..!

బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. సమయం సైతం ఫిక్స్ అయింది. నేడు పంచమి కావడంతో మధ్యాహ్నం 12.03 నుంచి 12.30 మధ్య 27 నిమిషాల పాటు బాగుండడంతో తొలి జాబితా అభ్యర్థులను ప్రకటించనున్నారు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్లో మీడియా వేదికగా అభ్యర్థులను ప్రకటించనున్నారు. అందుకు సంబంధించిన తొలి జాబితాను సిద్ధం చేశారు.

అయితే తొలి జాబితా విడుదల కానునడంతో సిట్టింగ్లతో పాటు ఆశావాహుల్లో ఉత్కంఠ నెలకొంది. మొదటి జాబితాలో తమ పేరు ఉంటుందా ఉండదా అని ఆరా తీస్తున్నారు. గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి నేడు తెరపడనుంది...

Telangananews

May 19 2023, 13:11

ఇవ్వాళ రేపు రాష్ట్రంలో వర్ష సూచన

తెలంగాణలో బండలు పగిలేలా ఎండలు మండిపోతున్నాయి. బయటికి వస్తే భగభగలాడిస్తోన్న ఎండలతో.. ఇంట్లో ఉంటే చెమలు కారిపోయి ఉక్కపోతతో జనాలు అల్లాడిపోతున్నారు. అయితే.. ఈ నేపథ్యంలోనే.. వాతావరణ శాఖ చల్లటి కబురు వినిపించింది. భానుడి ప్రతాపం నుంచి ఉపశమనం కలింగించేలా వర్ష సూచన ఉందంటూ.. కూల్ కూల్ న్యూస్ అందించింది. అయితే.. ఇవాళ, రేపు కొంత పొడి వాతావరణం నెలకొంటుందని.. ఎల్లుండి మాత్రం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

   

ఇవాళ, రేపు రాష్ట్రంలో పొడి వాతావరణం

ఎల్లుండి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్ష సూచన

తెలంగాణలో గత వారం రోజులుగా భానుడు నిప్పులు కురిపిస్తూ.. తన ప్రతాపం చూపిస్తున్నాడు. భగభగా మండిపోతున్న ఎండలతో బయటికి రావాలంటేనే భయపడుతోన్న పరిస్థితి నెలకొంది. అయితే.. ఇలాంటి సమయంలోనే.. వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. ఓవైపు ఎండలు.. మరోవైపు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న ప్రజలకు ఉపశమనం కలిగించే కూల్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు, రేపు రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని చెప్పిన వాతావరణ శాఖ.. ఎల్లుండి మాత్రం పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కరిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. అందులోనూ.. ప్రధానంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వాతావరణ శాఖ అంచనా గనుక నిజమైనట్టయితే.. రాష్ట్ర ప్రజలకు మండుతోన్న ఎండల నుంచి కొంత ఉపశమనం దొరికే అవకాశం ఉంది.

Telangananews

Apr 18 2023, 11:21

తెలంగాణ గురుకుల పోస్టుల్లో 80% మహిళలకే..*

2,876 ఉద్యోగాలకుగాను 2,301 వారికే..

లెక్చరర్‌, ఇతర పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..

డెమో తరగతులకు 25 మార్కులు..

రాష్ట్రంలో గురుకుల డిగ్రీ, జూనియర్‌ కళాశాలల్లో లెక్చరర్లు, ఫిజికల్‌ డైరెక్టర్లు, లైబ్రేరియన్‌ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు దాఖలు ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైంది. జూనియర్‌ కళాశాలల్లో 2,008 పోస్టులు, డిగ్రీ కళాశాలల్లో 868 పోస్టులకు సమగ్ర ఉద్యోగ ప్రకటనలను గురుకుల బోర్డు వెబ్‌సైట్లో పొందుపరిచింది. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు మే 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు గడువుగా పేర్కొంది. మొత్తం 2,876 పోస్టుల భర్తీకి వెలువరించిన ఈ ప్రకటనల్లో 2,301 పోస్టులు మహిళలకు రిజర్వు అయ్యాయి. అంటే దాదాపు 80 శాతం వారికి దఖలుపడ్డాయి. అలానే జనరల్‌ కింద పేర్కొన్న మిగిలిన పోస్టులకు పురుషులతో పాటు మహిళలూ పోటీపడవచ్చు. గురుకులాల నిబంధనల మేరకు మహిళా విద్యాసంస్థల్లోని పోస్టులకు మహిళలే అర్హులు కావడంతో వారికి అదనపు ప్రయోజనం లభిస్తోంది. ఎస్సీ గురుకుల సొసైటీలో డిగ్రీ కళాశాలలన్నీ మహిళలవే కావడం గమనార్హం. ఈ విద్యాసంస్థల్లో పోస్టుల భర్తీకి ప్రత్యేక రోస్టర్‌ను అమలు చేయనున్నారు.

పరీక్షల షెడ్యూలును త్వరలో వెబ్‌సైట్లో పొందుపరుస్తామని గురుకుల బోర్డు వెల్లడించింది. పరీక్షలను ఓఎంఆర్‌ పద్ధతిలో లేదా కంప్యూటర్‌ ఆధారితంగా (సీబీఆర్‌టీ) ఆన్‌లైన్లో నిర్వహించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. హాల్‌టికెట్లను పరీక్ష తేదీకి వారం రోజుల ముందు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని సూచించింది.

జూనియర్‌ లెక్చరర్‌, ఫిజికల్‌ డైరెక్టర్‌, లైబ్రేరియన్‌ పోస్టులకు పేపర్‌-1 అందరికీ ఒకటే(కామన్‌) ఉంటుందని, ఈ పరీక్ష తెలుగు, ఆంగ్ల మాధ్యమంలో ఉంటుందని బోర్డు తెలిపింది. పేపర్‌-2, 3 ఆంగ్ల మాధ్యమంలో ఉంటాయి.

ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద రిజర్వేషన్లు పొందాలని భావిస్తున్న అభ్యర్థులు 2023 జనవరి 1 తరువాత తీసుకున్న ఆదాయ ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని గురుకుల బోర్డు తెలిపింది.

గురుకుల డిగ్రీ, జూనియర్‌ కళాశాలల్లో పోస్టులకు డెమో మార్కుల విధానాన్ని బోర్డు యథాతథంగా కొనసాగిస్తోంది. వీటికి 25 మార్కులు ఉంటాయని తెలిపింది.

పరీక్ష ఫీజు రూ.1,200

ఈ పోస్టులకు పరీక్ష ఫీజు సాధారణ అభ్యర్థులకు రూ.1,200, రాష్ట్రానికి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌, దివ్యాంగులకు రూ.600గా బోర్డు నిర్ణయించింది. ఇతర రాష్ట్రాలకు చెందిన రిజర్వుడు అభ్యర్థులకు ఫీజు రాయితీ లేదు. పరీక్షలను అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తారు.

Telangananews

Apr 13 2023, 15:13

నిన్న ఢిల్లీ వెళ్లిన బండి... పార్టీ బలోపేతంపై చర్చించామన్న సంజయ్​

బీజేపీ హైకమాండ్ పిలుపుతో తెలంగాణ పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ నిన్న ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడెనిమిది నెలల టైం మాత్రమే ఉండడంతో  హైకమాండ్​ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తున్నది.

 బీఆర్ఎస్, కాంగ్రెస్​లో ఉన్న అసంతృప్తులను పార్టీలో చేర్చుకుని బీజేపీని బలోపేతం చేయాలనే చర్యలలో భాగంగానే సంజయ్​కి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చినట్లు సమాచారం.

రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై జాతీయ నేతలతో చర్చించినట్లు, అక్రమ అరెస్ట్​ గురించి అడిగినట్లు, కేసీఆర్​ అరాచకాలన్నీ పార్టీ పెద్దలకు వివరించినట్లు సంజయ్​ తెలిపారు.

 బూత్​ స్వశక్తి కరణ్​ అభి యాన్​ మీటింగ్​లో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చినట్లు చెప్పారు. జూపల్లి చేరికపై డీకే అరుణ మాట్లాడారని, 15న వరంగల్​లో నిరుద్యోగ మార్చ్​ నిర్వహిస్తున్నామని తెలిపారు.

Telangananews

Apr 13 2023, 14:44

యాచకురాలి దారుణ హత్య... భర్త పక్కనే వుండగానే...

సికింద్రాబాద్ లోని రాణిగంజ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ సమీపంలో యాచకురాలు అర్ధ రాత్రి దారుణ హత్యకు గురైంది. 

ఫుట్ పాత్ పై నిద్రస్తున్న మహిళ పై గుర్తు తెలియని వ్యకి, భర్త చూస్తుండగానే బండరాయి వేసి హత్య చేశాడు. భర్త భయంతో అరుస్తున్నా తన చేయిపట్టుకుని ముందుకు లాగి ఆమెపై బండరాయి వేశాడు. దాంతో ఆమె బాధతో విలవిల లాడి అక్కడికక్కడే మృతి చెందింది.

ఘటనాస్థలికి చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Telangananews

Apr 13 2023, 14:05

రేపు హుస్సేన్‌సాగర్‌ తీరంలో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ...

రేపు 125వ అంబేడ్కర్‌ జయంత్యుత్సవాల్లో భాగంగా  హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌ తీరంలో ఎన్టీఆర్‌ గార్డెన్‌ను ఆనుకుని దాదాపు 11.80 ఎకరాల స్థలంలో అంబేడ్కర్‌ విగ్రహాన్ని

ఆవిష్కరించనుంది తెలంగాణ సర్కార్.

 అంబేడ్కర్ విగ్రహ ప్రత్యేకతలు...

అంబేడ్కర్ స్మారక ప్రాంగణ విస్తీర్ణం.. 11.80 ఎకరాలు

పీఠం నిర్మాణం, విగ్రహం ఏర్పాటు విస్తీర్ణం.. రెండు ఎకరాలు

విగ్రహ స్తూపం(పీఠం) ఎత్తు .. 50 అడుగులు

విగ్రహం వెడల్పు.. 45 అడుగులు

పీఠం వెడల్పు.. 172 అడుగులు

విగ్రహం బరువు.. 435 టన్నులు

విగ్రహం తయారీకి వినియోగించిన ఉక్కు.. 791 టన్నులు

విగ్రహం తయారీకి వినియోగించిన ఇత్తడి.. 96 మెట్రిక్ టన్నులు

విగ్రహం తయారీకి రోజూ పని చేసిన కార్మికులు.. 425 మంది

దేశంలోనే అతి ఎత్తయిన 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున ప్రముఖ శిల్పి రామ్ వి సుతార్ రూపొందించారు.

Telangananews

Apr 12 2023, 11:27

Telangana : ముగిసిన 10th Exams... రిజల్ట్స్ మాత్రం అప్పుడే...

తెలంగాణలో 10th పరీక్షలకు 4,86,194 మంది విద్యార్థులకుగాను, 4,84,384 మంది విద్యార్థులు (99.63శాతం) హజరుకాగా, ఈ పరీక్షలు నిన్నటితో ముగిశాయి. 

పరీక్షలు ముగియడంతో విద్యార్థులకు మే 31వ తేదీ వరకు సెలవులు కొనసాగనున్నాయి.

 ఇక పదవ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం రేపటి నుంచి ఈ నెల 21 వరకు జరగనుంది. ఫలితాలు మాత్రం మే 10వ తేదీన వెలువడే ఛాన్స్ ఉందని సమాచారం.

 జూన్ ఒకటో తేదీ నుంచి 2023 - 24 ఇంటర్ అకాడమిక్ ఇయర్ ప్రారంభం కానుంది.