నకిరేకల్ : బిఎస్పి కి ఓటు వేసి అసెంబ్లీకి పంపిస్తే.. అభివృద్ధి అంటే ఎట్లా ఉంటదో చూపిస్తా: మేడి ప్రియదర్శిని

నల్లగొండ జిల్లా: నకిరేకల్ పట్టణ కేంద్రం, మరియు పలు గ్రామాలలో ఎన్నికల ప్రచారం లో భాగంగా భాగంగా బి ఎస్ పి నకిరేకల్ ఎమ్మెల్యే అభ్యర్థి మేడి ప్రియదర్శిని ఆధ్వర్యంలో.. గడపగడపకు బీఎస్పీ ప్రగతి భవన్ కు ఆర్ఎస్పి అనే నినాదంతో ఇంటింటా తిరిగి ఏనుగు గుర్తు, బీఎస్పీ మేనిఫెస్టోను బహుజన సిద్ధాంతాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా మేడి ప్రియదర్శిని మాట్లాడుతూ.. ఈ సారి బిఎస్పి కి ఓట్ వేసి ఏనుగు గుర్తును అసెంబ్లీ కి పంపిస్తే అభివృద్ధి అంటే ఎట్లా ఉంటాదో చూపిస్తా అని అన్నారు. ప్రతి ఒక్కరు ఏనుగు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్, మహిళా కన్వీనర్ మర్రి శోభ, చేరికల కమిటీ కన్వీనర్ మునుగోటి సత్తయ్య, రామన్నపేట మండల అధ్యక్షులు మేడి సంతోష్, విజయ్, సైదులు, తదితరులు పాల్గొన్నారు.

SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA

Streetbuzz National News App

NLG: ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్ తైక్వాండో మహిళా విభాగం లో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల కు చెందిన విద్యార్థిని లకు గోల్డ్ మెడల్

నల్లగొండ: నేడు మహాత్మా గాంధీ యూనివర్సిటీలో జరిగిన ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్ తైక్వాండో మహిళా విభాగం లో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల కు చెందిన ఇద్దరు విద్యార్థినులు సరయు, మేఘన అత్యంత ప్రతిభ కనపరిచి గోల్డ్ మెడల్ సాధించారు. అదేవిధంగా వీరు వచ్చేనెల 3,4 తేదీలలో రాజస్థాన్ యూనివర్సిటీలో తైక్వాండో విభాగంలో ఎం.జి యూనివర్సిటీ తరపున పాల్గొననున్నారు. 

ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డా.ఘన్ శ్యామ్, ఇంచార్జ్ ఫిజికల్ డైరెక్టర్ డా.రాజారామ్, వైస్ ప్రిన్సిపాల్ భాస్కర్ రెడ్డి, దేవవాని, నరేష్, వెంకటకృష్ణ, తదితరుల అధ్యాపకులు ఇద్దరు విద్యార్థినిలను అభినందించారు.

కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్న వివిధ పార్టీల ప్రముఖ నాయకులు

ఢిల్లీ: తెలంగాణకు చెందిన వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు.

కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నవారిలో 

1. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి - మాజీ ఎమ్మెల్యే

2. మోత్కుపల్లి నరసింహులు - మాజీ మంత్రి

3. ఏనుగు రవీందర్ రెడ్డి - మాజీ ఎమ్మెల్యే

4. ఆకుల లలిత - ఎమ్మెల్సీ

5. నేతి విద్యా సాగర్ - మాజీఎమ్మెల్సీ, శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్

6. సంతోష్ కుమార్ - మాజీ ఎమ్మెల్సీ

7. కపిలవాయి దిలీప్ కుమార్ - మాజీ ఎమ్మెల్సీ

8. నీలం మధు ముదిరాజ్ - పటాన్ చెరువు బిఆర్ఎస్ నాయకులు ఉన్నారు

ఈ సందర్భంగా నాయకులకు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే.. కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వారి వెంట పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తదితరులు ఉన్నారు.

SB NEWS TELANGANA

SB NEWS NATIONAL NEWS APP

తిరుమల: టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 12 గంటల సమయం

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 31 కంపార్టుమెంట్ లలో భక్తులు వేచి ఉన్నారని ఆలయ అధికారులు వెల్లడించారు. టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుందని టిటిడి అధికారులు తెలిపారు. 

నిన్న శ్రీవారిని 62,055 మంది భక్తులు దర్శించుకున్నారు. 27,088 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.58 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

NLG: శివన్నగూడెంకు నీళ్లు తీసుకొచ్చే బాధ్యత నాదే: సీఎం కేసీఆర్

నల్లగొండ జిల్లా:

మునుగోడు: మండలకేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభకు బిఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేశామని తెలిపారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు ఆగం కావొద్దు ఆలోచించి ఓట్లు వేయాలని సూచించారు.

దశాబ్దాల కాలంగా కాంగ్రెస్ పాలించినప్పటికీ ఇక్కడ ఫ్లోరోసిస్ సమస్య తీర్చలేదని, వాజ్ పేయి ప్రభుత్వంలో కూడా సమస్యలు తీర్చలేదని, కానీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఫ్లోరోసిస్ సమస్య తీర్చామని తెలిపారు.

బిఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల కరెంటు ఇస్తున్నది. కర్ణాటకలో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇవాళ ఐదు గంటలు కూడా కరెంటు ఇవ్వడం లేదని రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పింఛన్లు మరింత పెంచుతాం, రేషన్ కార్డులు ఉన్న కుటుంబాలకు ఆరోగ్య భీమా ఇస్తాం, రేషన్ కార్డులు ఉన్న ప్రతి కుటుంబానికి సన్న బియ్యం ఇస్తామని అన్నారు.

మునుగోడు రాజకీయ చైతన్యం ఉన్న ప్రాంతమని, పూటకో పార్టీ మారే నేతలు సిద్ధాంతం లేకుండా ఎన్నికల్లో దిగుతున్నారని, డబ్బులతో ఏదైనా చేయొచ్చు అనుకుంటున్నారు. అలాంటి నేతలకు బుద్ధి చెప్పాలి. మనం చైతన్యం చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కెసిఆర్ అన్నారు.

పాలమూరు రిజర్వాయర్ పూర్తి అయితే దిండి కి, శివన్న గూడెం ప్రాజెక్టుకు నీళ్లు వస్తాయని శివన్నగూడెం కు నీళ్ళు తీసుకొచ్చే బాధ్యత తనదే అని సీఎం అన్నారు. ఆ నాటి ఉద్యమ సమయంలో తన వెంట కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఉప ఎన్నికల్లో చూపించిన చైతన్యం వచ్చే ఎన్నికల్లో కూడా చూపించాలని అన్నారు 

కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఇతర బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

SB NEWS TELANGANA

TS: నేడు అచ్చంపేట, వనపర్తి, మునుగోడు ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్న సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్..ఈ రోజు అచ్చంపేట, వనపర్తి, మునుగోడు ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటారు. నేడు మధ్యాహ్నం 3 గంటలకు మునుగోడు ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు. బీఎస్పీ పార్టీ నాయకులను ముందస్తు అరెస్టు చేశారు. 

అయితే సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో ప్రగతి నివేదన తో పాటు, మునుగోడు ప్రజలకు ఉప ఎన్నికల్లో మాదిరిగా ఈ సారి ఏమైనా వరాల జల్లులు కురిపిస్తారా అని ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ప్రగతి నివేదన సభకు వెళ్లేందుకు జిల్లా వ్యాప్తంగా పార్టీ నాయకులు ఏర్పాట్లు చేసుకున్నారు.

Mane Praveen
సిర్పూర్ లో బీఎస్పీ జెండా ఎగరడం ఖాయం: ఆర్ఎస్పీ

TS: సిర్పూర్ నియోజవర్గం పరిధిలోని చింతల మానేపల్లి మండలంలో బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేపట్టిన ఎన్నికల ప్రచారానికి అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మహిళలు, యువకులు ఆయనకు సాదర స్వాగతం పలికి బీఎస్పీ శ్రేణులలో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా ఆర్ఎస్పీ మాట్లాడుతూ.. సిర్పూర్ లో బీఎస్పీ జెండా ఎగరడం ఖాయమని అన్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని నందికొండ, బాబాపూర్, లంబడిహెట్టి, రణవెళ్ళి, బూరవెల్లి గ్రామాల్లో పర్యటిస్తూ పార్టీ శ్రేణులను, ప్రజలను మమేకం చేస్తూ ప్రతి గడపను తడుతూ, బీఎస్పీ విజయానికి తోడ్పాటు ఇవ్వాలని ఓటర్లను కోరుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.

NLG: పాలకవర్గాల మోసపూరిత వాగ్దానాల కు ప్రజలు మోసపోవద్దు: CPI-ML న్యూడెమోక్రసీ పిలుపు

శాలి గౌరారం: పాలకవర్గాల మోసపూరిత వాగ్దానాలకు ప్రజలు మరోసారి మోసపోవద్దని,ఓట్లకోసం గ్రామాలకు వచ్చే వివిధ రాజకీయ పార్టీలు అభ్యర్థులను ప్రజలు నిలదీయాలని CPI (M-L) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఇందూరు సాగర్,అంబటి చిరంజీవి లు ప్రజలకు పిలుపునిచ్చారు.

శాలి గౌరారం మండలం చిత్తలూరు గ్రామంలో CPI (M-L) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో విలేఖర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు పాల్గొని మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో దేశంలో మోడీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని అన్నారు. తొమ్మిదేండ్లలో నిరుద్యోగం, దారిద్య్రం, ఆకలి చావులు, ధరల పెరుగుదల, రైతులు ఆత్మహత్యలు, మహిళలపై దాడులు పెరిగిపోయాయని అన్నారు. కార్పొరేట్ కు రాయితీలు, ప్రజలపై పన్నుల భారం మోపి.. దేశ సంపదను కొల్లగొట్టారని ఆరోపించారు.

రాష్ట్రంలో దళిత ముఖ్యమంత్రి మొదలుకొని రైతు రుణమాఫీ వరకు, డబల్ బెడ్రూం నుండి మూడెకరాల భూమి వరకు అన్ని ఆచరణలో అమలు కానీ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు బిఆర్ఎస్ పథకాలుగా మార్చి, సొంత పార్టీలోని ఉన్నత వర్గాలకు మాత్రమే ఇచ్చారని విమర్శించారు. ప్రభుత్వ భూములను ఆక్రమించి దళారులకు కట్టబెట్టారని పేర్కొన్నారు. తిరిగి ఎన్నికల్లో గెలవడానికి ప్రజలకు మోసపూరిత హామీలు ఇస్తున్నారని ఆరోపించారు. గ్రామాల్లోకి వచ్చే రాజకీయ నాయకులను గత హామీలతో పాటు నియోజకవర్గ అభివృద్ధి పై, రోడ్లు, తాగునీరు, ఐకేపీ సెంటర్స్, తదితర అంశాలపై నిలదీయాలని పిలుపునిచ్చారు.

SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA

మునుగోడు కు రానున్న సీఎం కేసీఆర్.. ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయండి: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

NLG: ఈనెల 26న, అనగా రేపు మధ్యాహ్నం 3 గంటలకు మునుగోడు లో జరిగే ప్రజా ఆశీర్వాద సభకు బిఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ విచ్చేస్తున్నారు.

ఈ సందర్భంగా మునుగోడు ఎమ్మెల్యే, బిఆర్ఎస్ నాయకులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. మునుగోడు నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు అధిక సంఖ్యలో.. సీఎం కేసీఆర్ సభలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఒక ప్రకటనలో కోరారు.

SB NEWS

SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA