సిర్పూర్ లో బీఎస్పీ జెండా ఎగరడం ఖాయం: ఆర్ఎస్పీ

TS: సిర్పూర్ నియోజవర్గం పరిధిలోని చింతల మానేపల్లి మండలంలో బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేపట్టిన ఎన్నికల ప్రచారానికి అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మహిళలు, యువకులు ఆయనకు సాదర స్వాగతం పలికి బీఎస్పీ శ్రేణులలో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా ఆర్ఎస్పీ మాట్లాడుతూ.. సిర్పూర్ లో బీఎస్పీ జెండా ఎగరడం ఖాయమని అన్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని నందికొండ, బాబాపూర్, లంబడిహెట్టి, రణవెళ్ళి, బూరవెల్లి గ్రామాల్లో పర్యటిస్తూ పార్టీ శ్రేణులను, ప్రజలను మమేకం చేస్తూ ప్రతి గడపను తడుతూ, బీఎస్పీ విజయానికి తోడ్పాటు ఇవ్వాలని ఓటర్లను కోరుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.

NLG: పాలకవర్గాల మోసపూరిత వాగ్దానాల కు ప్రజలు మోసపోవద్దు: CPI-ML న్యూడెమోక్రసీ పిలుపు

శాలి గౌరారం: పాలకవర్గాల మోసపూరిత వాగ్దానాలకు ప్రజలు మరోసారి మోసపోవద్దని,ఓట్లకోసం గ్రామాలకు వచ్చే వివిధ రాజకీయ పార్టీలు అభ్యర్థులను ప్రజలు నిలదీయాలని CPI (M-L) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఇందూరు సాగర్,అంబటి చిరంజీవి లు ప్రజలకు పిలుపునిచ్చారు.

శాలి గౌరారం మండలం చిత్తలూరు గ్రామంలో CPI (M-L) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో విలేఖర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు పాల్గొని మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో దేశంలో మోడీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని అన్నారు. తొమ్మిదేండ్లలో నిరుద్యోగం, దారిద్య్రం, ఆకలి చావులు, ధరల పెరుగుదల, రైతులు ఆత్మహత్యలు, మహిళలపై దాడులు పెరిగిపోయాయని అన్నారు. కార్పొరేట్ కు రాయితీలు, ప్రజలపై పన్నుల భారం మోపి.. దేశ సంపదను కొల్లగొట్టారని ఆరోపించారు.

రాష్ట్రంలో దళిత ముఖ్యమంత్రి మొదలుకొని రైతు రుణమాఫీ వరకు, డబల్ బెడ్రూం నుండి మూడెకరాల భూమి వరకు అన్ని ఆచరణలో అమలు కానీ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు బిఆర్ఎస్ పథకాలుగా మార్చి, సొంత పార్టీలోని ఉన్నత వర్గాలకు మాత్రమే ఇచ్చారని విమర్శించారు. ప్రభుత్వ భూములను ఆక్రమించి దళారులకు కట్టబెట్టారని పేర్కొన్నారు. తిరిగి ఎన్నికల్లో గెలవడానికి ప్రజలకు మోసపూరిత హామీలు ఇస్తున్నారని ఆరోపించారు. గ్రామాల్లోకి వచ్చే రాజకీయ నాయకులను గత హామీలతో పాటు నియోజకవర్గ అభివృద్ధి పై, రోడ్లు, తాగునీరు, ఐకేపీ సెంటర్స్, తదితర అంశాలపై నిలదీయాలని పిలుపునిచ్చారు.

SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA

మునుగోడు కు రానున్న సీఎం కేసీఆర్.. ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయండి: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

NLG: ఈనెల 26న, అనగా రేపు మధ్యాహ్నం 3 గంటలకు మునుగోడు లో జరిగే ప్రజా ఆశీర్వాద సభకు బిఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ విచ్చేస్తున్నారు.

ఈ సందర్భంగా మునుగోడు ఎమ్మెల్యే, బిఆర్ఎస్ నాయకులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. మునుగోడు నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు అధిక సంఖ్యలో.. సీఎం కేసీఆర్ సభలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఒక ప్రకటనలో కోరారు.

SB NEWS

SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA

TS: బిజెపికి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరబోతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలువురు కీలక నేతలు వ్యూహాత్మక నిర్ణయాలు చేపట్టి పార్టీలు మారుతున్నారు. ఇదే తరహాలో మునుగోడు మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత బిజెపి నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. బిజెపికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కెసిఆర్ కుటుంబ పాలన నుంచి తెలంగాణను విముక్తి చేయాలనే నా ఆశయం మరో ఐదు వారాల్లో నెరవేరుతుందని భావిస్తున్నాను. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది. ప్రజలు మార్పును కోరుకుంటున్నట్టు స్పష్టమవుతోంది. ఏడాదిన్నర క్రితం తెలంగాణలో అధికార బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదిగిన బిజెపి, ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో కొంత డీలా పడింది. ఇప్పుడు తెలంగాణ ప్రజలు అధికార బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ను భావిస్తున్నారు. అందుకే నేను కూడా తెలంగాణ ప్రజల ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నా అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు.

తెలంగాణలో నియంతృత్వ కుటుంబ పాలనకు చరమగీతం పాడే శక్తి భారతీయ జనతా పార్టీకే ఉందని భావించి, 15 నెలల క్రితం నేను మునుగోడు ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరిన విషయం అందరికి తెలిసిందే. గత ఏడాది అక్టోబర్ నెలాఖరున మునుగోడు అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమీషా, బిజెపి జాతీయ అధ్యక్షులు నడ్డా ఆశీస్సులతో బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి అధికార బీఆర్ఎస్ ను ఓడించినంత పని చేశాను. ఒక రాజకీయ యుద్ధం మాదిరిగా జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ 100 మంది ఎమ్మెల్యేలు, మరో వంద మంది ఇతర సీనియర్ నేతలను ప్రచారంలోకి దింపి వందల కోట్లు ఖర్చు చేయగా స్వల్ప తేడాతో నెగ్గి, నైతికంగా ఓడింది అని అభిప్రాయపడ్డారు. మునుగోడు ఉప ఎన్నికల్లో నా విజయం కోసం ప్రయత్నించిన బిజెపి నేతలు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.అధికార మార్పును కోరుకుంటున్న తెలంగాణ ప్రజల ఆలోచనలకు అనుగుణంగానే నేను కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నానని చెప్పారు.

తప్పనిసరి పరిస్థితుల్లోనే బిజెపికి రాజీనామా చేస్తున్నాను. మునుగోడు ఉప ఎన్నిక ద్వారా నాకు నియంతృత్వ కేసీఆర్ సర్కారుపై యుద్ధం చేసే అవకాశం కల్పించిన బిజెపికి ధన్యవాదాలు. కెసిఆర్ సర్కారుపై యుద్ధం చేయాలని ప్రోత్సహించిన కేంద్ర మంత్రి అమిత్ షా కు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. తెలంగాణ ప్రజల ఆలోచనల మేరకు పార్టీ మారాలని.. నేను తీసుకున్న నిర్ణయాన్ని బిజెపి పెద్దలు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానని తెలిపారు.

నాడు కాంగ్రెస్ నుంచి బిజెపిలో చేరినా, నేడు బిజెపి నుంచి కాంగ్రెస్ లోకి మారుతున్నా లక్ష్యం మాత్రం ఒకటే. కేసిఆర్ కుటుంబ పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయడమే. నేను ఏనాడూ పదవుల కోసం ఆరాట పడలేదు, తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ కోసమే తపన పడ్డాను. నియంత కెసిఆర్ పాలనను అంతమొందించేందుకు కాంగ్రెస్ లో చేరుతున్న నన్ను ఆదరించాలని రాష్ట్ర ప్రజలని కోరుతున్నానని తెలిపారు.

అక్టోబర్ 27న మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది.

NLG: మణికంఠ నగర్ లో దుర్గామాత శోభాయాత్ర సందర్భంగా అన్నదానం నిర్వహించిన కంజర శ్రీను దంపతులు

నల్గొండ: పట్టణంలోని మణికంఠ నగర్ ఆలయంలో మంగళవారం దుర్గామాత శోభాయాత్ర సందర్భంగా భవాని స్వాములకు మరియు అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

గంట్ల శశిధర్ రెడ్డి మరియు డాక్టర్ విటల్ దాతల సహకారంతో హరి గురు స్వామి, వెంకట్ గురు స్వామి, ఆశీస్సులతో కంజర శ్రీను స్వామి కుటుంబీకులు అన్నదానం చేయడం జరిగింది.

ఈ కార్యక్రమానికి భవాని స్వాములు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అదేవిధంగా వృద్ధుల ఆశ్రమం మరియు లెప్రసి, ఎస్సీ కాలనీ లలో నాగుల జ్యోతి శ్రీను దంపతులు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA

NLG: మునుగోడు లో సీపీఐ పోటీకి ఏకగ్రీవంగా తీర్మానం

నల్లగొండ : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్ పార్టీ పొత్తులో భాగంగా బలమైన పార్టీ క్యాడర్, గతంలో నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన సిపిఐ కి మునుగోడు సిటు కేటాయించాలని లేదా సొంతంగా పోటీ చేసేందుకు అనుమతి ఇవ్వాలని సిపిఐ జిల్లా కౌన్సిల్ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. సిపిఐ జిల్లా కౌన్సిల్ సమావేశం మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశానికి జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకట రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను వివరించారు.

నల్గొండ జిల్లాలో బలమైన ఉద్యమ చరిత్ర ఉన్న మునుగోడు స్థానాన్ని సిపిఐ కేటాయించాలని లేని పక్షంలో సొంతంగా పోటీ చేసేందుకు అనుమతి ఇవ్వాలని జాతీయ, రాష్ట్ర కమిటీలను జిల్లా కౌన్సిల్ సమావేశంలో కోరారు.

2018 ఎన్నికలో కాంగ్రెస్ పార్టీతో పెట్టుకున్నా, పొత్తులో ప్రతిసారి మునుగోడు నియోజకవర్గం సిపిఐ కి కేటాయించకపోవడంతో పార్టీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సమావేశానికి జిల్లా కార్యవర్గ సభ్యురాలు గిరి రామ అధ్యక్షత వహించగా జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నర్సింహా రెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శులు పల్లా దేవేందర్ రెడ్డి, లోడంగి శ్రవణ్ కుమార్, కార్యవర్గ సభ్యులు పబ్బు వీరాస్వామి, ఆర్ అంజచారి, బోల్గురి నర్సింహా, టీ వెంకటేశ్వర్లు, నల్పరాజు రామలింగయ్య, గురుజా రామచంద్రం, బొడ్డుపల్లి వెంకట్ రమణ పాల్గొన్నారు.

NLG: ఎంపీ కోమటిరెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన దుబ్బ అశోక్ సుందర్ దంపతులు
నల్లగొండ: పట్టణ బిఆర్ఎస్ మహిళ అధ్యక్షురాలు దుబ్బ రూప అశోక్ సుందర్, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ దుబ్బ అశోక్ సుందర్, ఈ రోజు హైదరబాద్ లో కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమక్షంలో తిరిగి సొంత గూటికి చేరారు. ఈ సందర్బంగా నూతనంగా పార్టీలో చేరిన వారికి, కోమటిరెడ్డి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎంపీ కోమటిరెడ్డి మాట్లాడుతూ.. పార్టీ శ్రేణులు అంతా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ వచ్చే విధంగా పనిచేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాల పై  విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు.

ఈ కార్యక్రమంలో  మున్సిపల్ వైస్ ఛైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మాజీ ఎంపీటీసీ కోమటిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA
తిరుమలలో మంగళవారం కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది...
AP: తిరుమలలో బ్రహ్మోత్సవాలు ముగిసినా భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గలేదు. భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. గత తొమ్మిది రోజులుగా తిరుమలలో బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలకు భక్తులు పోటెత్తారు. ప్రధానంగా గరుడోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరై మాడవీధుల్లో తిరిగే స్వామి వారిని దర్శించుకున్నారు. తిరుమలలో గతంలో శని, ఆదివారాలు మాత్రమే రద్దీ ఉండేది. కానీ ఇప్పుడు దసరా సెలవులు కొనసాగుతుండటంతో నేడు మంగళవారం కూడా రద్దీ ఎక్కువగానే ఉందని అధికారులు చెబుతున్నారు. నిన్న తిరుమల శ్రీవారిని 79,693 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. వీరిలో 21,864మంది తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.38 కోట్లు, ఈరోజు భక్తుల రద్దీ అధికంగానే ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ లోని పది కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్‌లో టోకెన్లు లేకుండా వెళ్లే భక్తులకు.. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

SB NEWS
TS: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన శాసనమండలి చైర్మన్

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు.. రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సోమవారం విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..

చెడుపై మంచి సాధించిన విజయానికి స్ఫూర్తిగా.. దుర్గామాత ఆశీస్సులతో, ధైర్యంగా ముందుకు కదిలి.. తాము చేపట్టిన పనులలో విజయం సాధించి, ప్రతీ ఒక్కరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.