Mane Praveen

Oct 23 2023, 13:55

TS: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన శాసనమండలి చైర్మన్

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు.. రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సోమవారం విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..

చెడుపై మంచి సాధించిన విజయానికి స్ఫూర్తిగా.. దుర్గామాత ఆశీస్సులతో, ధైర్యంగా ముందుకు కదిలి.. తాము చేపట్టిన పనులలో విజయం సాధించి, ప్రతీ ఒక్కరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.

Mane Praveen

Oct 23 2023, 13:22

లెంకలపల్లి గ్రామ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు: సర్పంచ్ పాక నగేష్

నల్లగొండ జిల్లా, మర్రిగూడెం మండలం, లెంకలపల్లి గ్రామ ప్రజలకు.. గ్రామ సర్పంచ్ పాక నగేష్ యాదవ్ సోమవారం విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా సర్పంచ్ పాక నగేష్ మాట్లాడుతూ.. దసరా పండుగను గ్రామ ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సవాల తో నిర్వహించుకోవాలని, ముక్కోటి దేవతల ఆశీర్వాదాలు గ్రామ ప్రజలందరూ పైన ఉండాలని.. సుఖ సంతోషాలతో, సిరిసంపదలతో, సంపూర్ణ ఆరోగ్యంతో, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA

Mane Praveen

Oct 23 2023, 13:01

లెంకలపల్లి గ్రామ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు: సర్పంచ్ పాక నగేష్

నల్లగొండ జిల్లా, మర్రిగూడెం మండలం, లెంకలపల్లి గ్రామ ప్రజలకు.. గ్రామ సర్పంచ్ పాక నగేష్ యాదవ్ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ పాక నగేష్ మాట్లాడుతూ.. దసరా పండుగను గ్రామ ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సవాలతో నిర్వహించుకోవాలని, ముక్కోటి దేవతల ఆశీర్వాదాలు గ్రామ ప్రజలందరూ పైన ఉండాలని.. సుఖ సంతోషాలతో, సిరిసంపదలతో, సంపూర్ణ ఆరోగ్యంతో, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA

Mane Praveen

Oct 23 2023, 09:12

నల్లగొండలో అంబరాన్ని తాకిన బతుకమ్మ సంబరాలు

నల్గొండ పట్టణంలోని, ఐదో వార్డు గరుడాద్రి నగర్ కాలనీలో సద్దుల బతుకమ్మ వేడుకను ఆదివారం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ప్రగతి శీల తల్లిదండ్రుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగుల జ్యోతి మరియు కాలనీ మహిళలు చిన్నారులు వయసుతో నిమిత్తం లేకుండా అందరూ పాల్గొని ఆనందంగా ఆట పాటలతో మరియు కోలాటాలు ఆడుతూ బతుకమ్మ సంబరాలు నిర్వహించారు.

తొమ్మిది రోజులుగా నిర్వహించిన ఈ బతుకమ్మ వేడుకలు ఆదివారం సద్దుల బతుకమ్మతో ముగిసాయి. అనంతరం పానగల్ బైపాస్ లో గల బతుకమ్మ చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు.

SB NEWS

SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA 

Mane Praveen

Oct 23 2023, 09:03

నల్లగొండలో అంబరాన్ని అంటిన బతుకమ్మ సంబరాలు

నల్గొండ పట్టణంలోని, ఐదో వార్డు గరుడాద్రి నగర్ కాలనీలో సద్దుల బతుకమ్మ వేడుకను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రగతి శీల తల్లిదండ్రుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగుల జ్యోతి మరియు కాలనీ మహిళలు, చిన్నారులు, వయసుతో నిమిత్తం లేకుండా అందరూ పాల్గొని.. ఆనందంగా ఆట పాటలతో మరియు కోలాటాలు ఆడుతూ బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. తొమ్మిది రోజులుగా నిర్వహించిన ఈ బతుకమ్మ వేడుకలు ఆదివారం సద్దుల బతుకమ్మతో ముగిసాయి. అనంతరం పానగల్ బైపాస్ లో గల బతుకమ్మ చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. SB NEWS

SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA

Mane Praveen

Oct 22 2023, 21:02

NLG: ఎమ్మెల్యే కూసుకుంట్ల సమక్షంలో బిఆర్ఎస్ లో చేరికలు

నల్లగొండ జిల్లా, మునుగోడు నియోజకవర్గం: నారాయణపురం మండలం గుజ్జ, చండూర్ మండలం కమ్మగూడం, మర్రిగూడ మండలం ఇందుర్తి గ్రామాల నుండి దాదాపు మొత్తం 100 మందికి పైగా ఇతర పార్టీ కార్యకర్తలు, నేడు మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.. గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నూతనంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ.. బిఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు, ఎన్నికల మేనిఫెస్టో కు ఆకర్షితులమై పార్టీలో చేరినట్లు తెలిపారు. కార్యక్రమంలో పలువురు బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Mane Praveen

Oct 22 2023, 14:52

52 మంది అభ్యర్థులతో బిజేపి మొదటి జాబితా విడుదల

TS: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. మొత్తం 52 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను బీజేపీ అధిష్టానం ప్రకటించింది.

అభ్యర్థుల జాబితా:

1. సిర్పూర్ - డా.పాల్వయి హరీష్ బాబు

2. బెల్లంపల్లి (ఎస్సీ) - శ్రీమతి అమరాజుల శ్రీదేవి

3. ఖానాపూర్(ఎస్టీ) - రమేష్ రాథోడ్

4. ఆదిలాబాద్ - పాయల్ శంకర్

5. బోధ్(ఎస్టీ) - సోయం బాబు రావు (ఎంపీ)

6. నిర్మల్ - ఆలేటి మహేశ్వర్ రెడ్డి

7. ముదోల్ - రామారావు పటేల్

8. ఆర్మూర్ - పైడి రాకేష్ రెడ్డి

9. జుక్కల్ (ఎస్సీ) - టీ. అరుణ తార

10. కామారెడ్డి - కే. వెంకట రమణారెడ్డి

11. నిజామాబాద్ అర్బన్ - ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా

12. బాల్కొండ - అన్నపూర్ణమ్మ ఆలేటి

13. కోరుట్ల - ధర్మపురి అరవింద్ (ఎంపీ)

14. జగిత్యాల - డా బోగా శ్రావణి

15. ధర్మపురి (ఎస్సీ) - ఎస్ కుమార్

16. రామగుండం - కందుల సంధ్యారాణి

17. కరీంగనర్ - బండి సంజయ్ (ఎంపీ)

18. చొప్పదండి (ఎస్సీ) - బొడిగే శోభ

19. సిరిసిల్ల - రాణి రుద్రమ రెడ్డి

20. మానకొండూర్ (ఎస్సీ) - ఆరేపల్లి మోహన్

21. హుజురాబాద్ - ఈటెల రాజేందర్

22. నార్సాపూర్ - ఎర్రగొళ్ల మురళీ యాదవ్

23. పఠాన్‌చెరు - టీ.నందీశ్వర్ గౌడ్

24. దుబ్బాక - రఘనందన్ రావు

25. గజ్వేల్ - ఈటెల రాజేందర్

26. కుత్భుల్లాపూర్ - కునా శ్రీశైలం గౌడ్

27. ఇబ్రహింపట్నం - నోముల దయానంద్ గౌడ్

28. మహేశ్వరం - అందెల శ్రీరాములు యాదవ్

29. ఖైరతాబాద్ - చింతల రామచంద్రారెడ్డి

30. కార్వాన్ - అమర్ సింగ్

31. గోషామహల్ - టీ రాజాసింగ్

32. చార్మినార్ - మేఘా రాణి

33. చంద్రాయణగుట్ట - సత్యనారాయణ ముదిరాజ్

34. యాకత్పురా - వీరేంద్ర యాదవ్

35. బహ్దుర్‌పురా - వై. నరేష్ కుమార్

36. కల్వకుర్తి - తల్లోజు ఆచార్య

37. కొల్లాపూర్ - అల్లెని సుధాకర్ రావు

38. నాగార్జున సాగర్ - కంకణాల నవనీత రెడ్డి

39. సూర్యపేట - సంకినేని వెంకటేశ్వర్ రావు

40. బోనగిరి - గూడూరు నారాయణ రెడ్డి

41. తుంగతుర్తి (ఎస్సీ) - కడియం రామచంద్రయ్య

42. జనగామ - డా.దశ్మంత్ రెడ్డి

43. స్టేషన్‌ఘన్‌పూర్ (ఎస్సీ) - డా.గుండె విజయ రామారావు

44. పాలకుర్తి - లేగా రామ్మోహన్ రెడ్డి

45. డోర్నకల్ (ఎస్టీ) - భుక్యా సంగీత

46. మహబుబాబాద్(ఎస్టీ) - జాతోత్ హుసేన్ నాయక్

47. వరంగల్ పశ్చిమ - రావు పద్మ

48. వరంగల్ తూర్పు - ఎర్రబెల్లి ప్రదీప్ రావు

49. వర్ధన్నపేట (ఎస్సీ) - కొండేటి శ్రీధర్

50. భూపాలపల్లి - చందుపట్ల కీర్తి రెడ్డి

51. ఇల్లందు (ఎస్టీ) - రవీంద్ర నాయక్

52. భద్రాచలం (ఎస్టీ) - కుంజా ధర్మారావు

Mane Praveen

Oct 22 2023, 11:14

TS: నేడు కొమురం భీమ్ జయంతి

అక్టోబరు 22,  1901 జన్మించిన కొమురం భీమ్.. తెలంగాణ విముక్తి కోసం అసఫ్ జహి రాజవాసానికి వ్యతిరేకంగా పోరాడిన ఉమ్మడి ఆదిలాబాద్  జిల్లాకు  చెందిన గిరిజనోద్యమ నాయకుడు.

కొమురం భీం.. ఆదిలాబాద్ అడవులలో గోండు  కుటుంబంలో జన్మించారు. ఈయన గిరిజన  గోండు తెగకు చెందిన కొమరం చిన్నూ- సోంబాయి దంపతులకు.. ఇప్పటి ఆసిఫాబాద్ జిల్లా లోని సంకేపల్లి గ్రామంలో జన్మించాడు.  పదిహేనేళ్ల వయసులో అటవీశాఖ సిబ్బంది జరిపిన దాడిలో తండ్రి మరణించగా, కొమరం కుటుంబం కరిమెర ప్రాంతంలోని సర్ధాపూర్‌కు వలస వెళ్లింది. కొమరం భీమ్ నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొరిల్లా శైలిలో పోరాడాడు. ఇతను అడవిని జీవనోపాధిగా చేసుకొని, అన్ని రకాల నిజాం అధికారాలను (అనగా న్యాయస్థానాలు, చట్టాలు) తోసిపుచ్చాడు. అతను నిజాం నవాబ్ సైనికులకు వ్యతిరేకంగా  ఆయుధాలు  తీసుకున్నాడు. పశువుల కాపర్లపై విధించిన సుంకానికి వ్యతిరేకంగా మరియు తమ భూమి లో తమదే అధికారం అని జల్ జంగల్ జమీన్(భూమి. అడవి.నీరు మాదే) అనే నినాదంతో ఉద్యమించి  1940 అక్టోబరు 27న  వీరమరణం పొందాడు. ఇప్పటికీ కొమరం భీమ్ నినాదమైన జల్ జంగల్ జమీన్ నినాదం ఎంతో ప్రాచుర్యంలో ఉంది.

Mane Praveen

Oct 22 2023, 10:47

TS: నేడు టిటిడిపి రాష్ట్ర కార్యవర్గ సమావేశం
హైదరాబాద్: టిటిడిపి రాష్ట్ర కార్యవర్గ సమావేశం, తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అధ్యక్షతన ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్, హైదరాబాద్ నందు రాష్ట్ర పార్టీ సమావేశం జరుగును. ఈ సమావేశానికి పోలిట్ బ్యూరో, కేంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యులు, పార్లమెంట్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ ఛార్జీలు, నియోజకవర్గ కో-ఆర్డినేటర్ లు హజరుకానున్నారని తెలుగుదేశం పార్టీ ఒక ప్రకటనలో తెలియచేసింది.

SB NEWS TELANGANA