తప్పు చేస్తే దొరకక తప్పదు

Oct 16 2023, 18:31

కిరాయి కార్పెంటర్ షాపులకు 4వ కేటగిరి విద్యుత్ సబ్సిడీ ఇవ్వాలి--సీఐటీయూ

  కార్పెంటర్ షాపులకి నాలుగవ కేటగిరి కింద వర్తిస్తున్న విద్యుత్ సబ్సిడీ కిరాయి షాపులకు కూడా వర్తింపచేయాలని తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చినపాక లక్ష్మీనారాయణ సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య కోరారు 

         

సోమవారం తెలంగాణ కమ్మరి వడ్రంగి కార్పెంటర్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఎలక్ట్రిసిటీ ఎస్ ఈ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1994 నంద్యాల నరసింహారెడ్డి ఎమ్మెల్యే ఉన్న కాలంలో కమ్మరి వడ్రంగి గోల్డ్ స్మిత్ తదితర షాపులకు నాలుగవ కేటగిరీ కింద విద్యుత్ సబ్సిడీ ఇచ్చే విధంగా ప్రభుత్వాన్ని అంగీకరింప చేయడం జరిగిందని తెలిపారు. నాటినుండి ఈ పథకం అమలవుతుందని అన్నారు. ఎక్కువమంది కార్పెంటర్లు సొంత షాపులు లేకుండా కిరాయి షాపులు నడుపుకుంటున్నారని వారికి విద్యుత్ సబ్సిడీ అమలు కాకపోవడంతో పూర్తి కరెంటు బిల్లు కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే సొంత షాపులకు ఇస్తున్న సబ్సిడీ మాదిరిగానే లీజు అగ్రిమెంట్ పేపర్ తీసుకొని కిరాయి షాపులకు కూడా సబ్సిడీ వర్తింప చేయాలని వారు కోరారు.

    

ఈ కార్యక్రమంలో కమ్మరి వడ్రంగి కార్పెంటర్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ ) నలగొండ పట్టణ అధ్యక్షులు సలివోజు సైదాచారి, కార్యదర్శి దాసోజు ప్రభు చారి, కోశాధికారి కే సురేష్, ఉపాధ్యక్షులు గడగోజు సైదాచారి, సహాయ కార్యదర్శి గుంటోజు సోమయాచారి, శ్రీనివాసచారి తదితరులు పాల్గొన్నారు

తప్పు చేస్తే దొరకక తప్పదు

Oct 16 2023, 18:27

దోరెపల్లి గ్రామం BRS పార్టీ నుండి BJP పార్టీ లోకి వలసల పర్వం

స్థానిక MLA& దోరెపల్లి సర్పంచ్, కనగల్ మండల అధ్యక్షుడి సొంత ఊరి నుండి BRS పార్టీ ఉప సర్పంచ్ మరియు వార్డ్ సభ్యులు ఆయన ఒంటెద్దు పోకడలకి నిరసనగా BRS పార్టీ నుండి BJP పార్టీ లోకి జాయిన్ అవ్వడం జరిగింది.

కనగల్ మండలం దోరెపల్లి గ్రామం నుండి తెలంగాణ ఉద్యమ కారుడు గ్రామ ఉప సర్పంచ్ దాసరి వెంకన్న, వార్డ్ సభ్యులు నకిరేకంటి నరేష్, మాధగోని విజయలక్ష్మి - శంకర్ , BRS పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు మాధగోని సైదులు, BRS పార్టీ మండల కార్యవర్గ సభ్యులు మాజి గ్రామ శాఖ అధ్యక్షులు మాధగోని ఏడుకొండలు,పసునూరి వెంకన్న బక్క లింగయ్య మాధగోని అశోక్ పగిల్ల రాములు బక్క శివ కుమార్ కిన్నెరా యాదయ్య దాసరి సాయిలు దాసరి లచ్చయ్య భైరగోని చంద్రయ్య మాధగోని నరేందర్ మాధగాని వెంకన్న భైరగోని శివశంకర్ పగిల్ల నర్సింహా పగిల్ల వెంకన్నబీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాధగోని శ్రీనివాస్ గౌడ్* గారి నాయకత్వాన్ని బలపరుస్తూ నేడు బీజేపీ పార్టీ కండువా కప్పుకున్నారు.

ఈ కార్యక్రమంలో BJP పార్టీ కనగల్ మండలం అధ్యక్షులు పులకరం బిక్షం దోరెపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు మాధగోని తిరుమల్ గౌడ్ శక్తి కేంద్రం ఇంచార్జి భైరగోని శేఖర్, సముద్రాల మల్లేష్ నరేష్, బాలకృష్ణ సురేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Oct 14 2023, 15:25

నల్గొండ నియోజకవర్గ ఎమ్మెల్యే భాజపా అభ్యర్థిగా అవకాశం ఇవ్వండి : పాలకూరి రవి గౌడ్

బడుగు బలహీన వర్గాల మద్దతు మరియు గౌడ సామాజిక వర్గం పూర్తి మద్దతుతో బరిలో ఉన్నాను

ఈ రోజు బిజెపి రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి కైలాస్ చౌదరి ని కలిసి నల్గొండ నియోజకవర్గము నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను బరిలో ఉన్నటువంటి విషయాన్ని నల్లగొండ బిజెపి జిల్లా అధ్యక్షులు కంకణాల శ్రీధర్ రెడ్డి సమక్షంలో వారి దృష్టికి తీసుకెళ్లి పాలకూరి రవి గౌడ్ అనే నాకు అవకాశం కల్పించాలని కోరడం జరిగింది..

 నల్లగొండ నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాల మద్దతు మరియు గౌడ సామాజిక వర్గం పూర్తి మద్దతు నాకు ఉన్నటువంటి విషయాన్ని వారికి తెలియజేసి, నల్గొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ నుండి అవకాశం కల్పించాలని కోరుతూ 

 వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది..

ఈ సందర్భంగా బిజెపి నాయకులు కంకణాల నివేదిత రెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి పాలకూరి ఏలెంద్ర గౌడ్, కట్ట వెంకట్ రెడ్డి, బిజెపి కిసాన్ మోర్చా అసెంబ్లీ కన్వీనర్ దుబ్బాక మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Streetbuzz News

SB NEWS

తప్పు చేస్తే దొరకక తప్పదు

Oct 13 2023, 16:50

రాష్ట్ర ఎక్సైజ్ మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ వి.శ్రీనివాస్ గౌడ్ ఈరోజు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావును ప్రగతి భవన్ లో మర్యాదపూర్వకంగా

ఈ సందర్భంగా తాను ప్రత్యేకంగా రూపొందించి ముద్రించిన పాలమూరు ప్రగతి నివేదిక పుస్తకాన్ని ముఖ్యమంత్రికి అందజేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధి పై సమగ్ర సమాచారంతో కూడిన పుస్తకాన్ని చూసి సీఎం హర్షం వ్యక్తం చేశారు.

పాలమూరులో జరుగుతున్న అభివృద్ధిని శాఖల వారీగా, ఆకర్షణీయమైన ఫోటోలను పొందుపరిచి సాధికారిక సమాచారంతో శ్రీనివాస్ గౌడ్ పుస్తకాన్ని రూపొందించడం పట్ల సీఎం హర్షం వ్యక్తం చేశారు. 

ఈ సందర్భంగా మంత్రి శ్రీ శ్రీనివాస్ గౌడ్ ను సీఎం శ్రీ కేసీఆర్ ఆశీర్వదించారు.

భవిష్యత్తులో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మరింతగా అభివృద్ధి చెందేలా సమిష్టి కృషి కొనసాగాలని సీఎం ఆకాంక్షించారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Oct 13 2023, 15:40

పాల్వాయి రజినికుమారి కుటుంబానికి మంత్రి జగదీష్ రెడ్డి పరామర్శ

భాజపా నాయకురాలు పాల్వాయి రజిని కుమారి కుమారి తో పాటు కుటుంబ సభ్యులను సూర్యాపేట

శాసనసభ్యులు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పరామర్శించారు.

ఇటీవల అనారోగ్యంతో రజనీకుమారి ఏకైక కుమార్తె ఐశ్వర్య స్వర్గస్తురాలయింది. ఏకైక కుమార్తెను కోల్పోయి పుట్టేడు దుఃఖంలో ఉన్న రజనీకుమారి తో పాటు ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. దురదృష్ట సంఘటనకు సంబంధించిన వివరాలను రజనీకుమారిని అడిగి తెలుసుకున్నారు. మంత్రి వెంట ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, నిమ్మల శ్రీనివాస్ గౌడ్, ఉప్పల ఆనంద్, బండారు రాజా, మతకాల చలపతిరావు, అయూబ్ ఖాన్, చింతలపాటి చిన్న శ్రీరాములు, మద్ధి శ్రీనివాస్ యాదవ్, బైరు వెంకన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Oct 12 2023, 19:35

నేడు నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు వీటి కాలనీలోని తమ క్యాంపు కార్యాలయంలో... కనగల్ మండలం రేగట్ట గ్రామానికి చెందిన 30 మంది పైగా క

ఈ సందర్భంగా కంచర్ల మాట్లాడుతూ... కెసిఆర్ నాయకత్వంలో సంబండ వర్గాలు..

 కెసిఆర్ అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందుకొని...

 సంతోషంగా ఉన్నారని అందుకే వారి నాయకత్వాన్ని అందరూ కోరుకుంటున్నారని... బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని కోరారు..

 ఈ కార్యక్రమంలో ఎంపీపీ కరీం పాషా సింగిల్ విండో చైర్మన్ వంగాల సహదేవ రెడ్డి.. మండల పార్టీ అధ్యక్షుడు అయితగోని యాదయ్య,ఎంపీటీసీ, పాలకూరి పుష్ప వెంకటేశం... సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు స్థానిక సర్పంచ్ కడారి కృష్ణయ్య,మాజీ జెడ్పిటిసి,ఎర్రోళ్ల సంజీవ, గోలి నవీన్.... పార్టీలో చేరిన వారిలో.. తిరిగి మల్ల వెంకటరమణ భోగరాజు నవీష్ అంతా సతీష్ సిరిగిమల్ల శ్రీధర్ భోగరాజు అంజయ్య సిరిగిమల్ల మల్లేష్ బొమ్మ పల్లి సైదులు తదితరులు ఉన్నారు

తప్పు చేస్తే దొరకక తప్పదు

Oct 12 2023, 19:21

నల్గొండలో గెలుపే లక్ష్యంగా గడప గడపకు బిజెపి

నల్గొండలో బీజేపీ గెలుపే లక్ష్యంగా గడప గడపకు బీజేపీ కార్యక్రమంతో ప్రజల వద్దకు వెళ్తున్నామని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

గురువారం కనగల్ మండలంలోని ధర్వేశిపురం శ్రీ రేణుక ఎల్లమ్మ వారి గుడిలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం గడప గడపకు బీజేపీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ధర్వేశిపురం మరియు కనగల్ గ్రామంలో విస్తృతంగా పర్యటించి గడప గడపకు వెళ్లి బిజెపి కి ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోడీ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. కేంద్రం ప్రవేశపెడుతున్న పథకాలను తామే ప్రవేశ పెట్టామని రాష్ర్ట ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటూ ప్రజలకు అయోమయానికి గురి చేస్తుందన్నారు. కేంద్రం నిధులతోనే గ్రామ పంచాయితీలు, మున్సిపాలిటీలు, రహాదారులు అద్భుతంగా తయారవుతున్నాయని, రేషన్ పాటు రాష్టంలో అమలయ్యే అన్ని పథకాలకు కేంద్రం నిధులు ఇస్తుందన్నారు. ప్రజలంతా గమనించి మాయ మాటలు చెప్పే పార్టీల మోసాలను పసిగట్టి రానున్న ఎన్నికలలో కాంగ్రెస్, BRS లకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. గడప గడపకు తిరుగుతూ ప్రచారం చేయడంతో పాటు ప్రజా సమస్యలను తెలుసుకుని వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు పట్టణ నాయకులు మండల నాయకుకు వివిధ మోర్చా నాయకులు శక్తి కేంద్ర ఇంచార్జిలు బూత్ అధ్యక్షులు మరియు బిజెపి నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు

తప్పు చేస్తే దొరకక తప్పదు

Oct 12 2023, 17:52

ఆశ వర్కర్లకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే మరో పోరాటం తప్పదు

      ఆశా వర్కర్లకు 18వేల ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని ఇతర న్యాయమైన సమస్యల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా జరిగిన 15 రోజుల నిరవధిక సమ్మె సందర్భంగా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావు గారు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే మరో పోరాటం తప్పదని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయు) జిల్లా గౌరవ అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ హెచ్చరించారు.

     తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సిఐటియు) నల్గొండ జిల్లా విస్తృత సమావేశం సమావేశం జిల్లా అధ్యక్షురాలు డి మహేశ్వరి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాట్లాడుతూ ఆయన ఆశ వర్కర్ల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొని ఎంతో ధైర్యంగా ఐక్యంగా వీరోచిత పోరాటం చేసిన ఆశలకు అభినందనలు తెలిపారు. సమ్మెలో భాగంగా 9న చలో హైదరాబాద్ కమిషనర్ కార్యాలయం ధర్నా సందర్భంగా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్ రావు గారు ఆశా వర్కర్ల డిమాండ్లు పరిష్కరించేందుకు ముగ్గురు ఐఏఎస్ లతో కమిటీ వేస్తామని సమస్యలు సమగ్రంగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి పరిష్కారాన్ని కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే సమ్మె జీతము పెండింగ్ ఏరియర్స్ కరోనా రిస్క్ అలవెన్స్, పెండింగ్ వేతనాలు వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని కోరారు.

     

డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఇచ్చిన హామీ మేరకు ఎన్నికల కోడ్ వచ్చినందున ఆశ వర్కర్ల సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేశామని ప్రభుత్వం మోసం చేస్తే మరో పోరాటానికి ఆశ వర్కర్లు సిద్ధమవుతారని హెచ్చరించారు. యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి తవిటి వెంకటమ్మ మాట్లాడుతూ టిబి స్ఫూటం డబ్బాలను ఆశలతో మోపించే పద్ధతి మానుకోవాలని డిమాండ్ చేశారు. పారితోషకాలు లేని పనులను ఆశ వర్కర్లు చేయవద్దని చేయవద్దని అన్నారు. ఆశ వర్కర్ల పనిబారం తగ్గించాలని జాబ్ చార్ట్ రూపొందించాలని డిమాండ్ చేశారు.

        

ఈ సమావేశంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య,జిల్లా నాయకులు భీమాగాని గణేష్, ఆశ యూనియన్ జిల్లా నాయకులు రమావత్ కవిత, వసంత, శైలు,టీ పార్వతమ్మ, ఎస్ కె సలీమా, కె. సంధ్యారాణి, ఎం పుష్పలత, ఎస్ జయమ్మ, సునీత, పూలమ్మ, బి అనూష, బి.నిర్మల, మమత, పద్మ, శ్వేత, తదితరులు పాల్గొన్నారు

తప్పు చేస్తే దొరకక తప్పదు

Oct 11 2023, 18:23

మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమ్మె తాత్కకలికవాయిదా

తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ చేస్తున్న నిరవధిక సమ్మెను తాత్కాలికంగా విరమణ చేస్తున్నట్లు సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలే సత్యనారాయణ తెలిపారు.

      

బుధవారం నల్లగొండ జిల్లా విద్య అధికారి కార్యాలయంలో సహాయ సంచాలకులు రంగాచారి కి సమ్మె విరమణ పత్రం అందజేయడం జరిగింది వారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికులకు అదనంగా పెంచిన రూ.2000 వేతనాలు చెల్లింపుకు బడ్జెట్ విడుదల చేయాలని మొత్తం సరిపడా బడ్జెట్ ను కేటాయించాలని లేదా క్రొత్త మెనూను సవరించాలని ముఖ్యమంత్రి అల్పాహారం పనికి అదనం వేతనం ఇవ్వాలని ఇతర సమస్యలు పరిష్కరించాలని సెప్టెంబర్ 28 నుండి నిరవధక సమ్మె చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ని తేదీ 9 10 2023న ఉదయం 9 గంటలకు వారి నివాసంలో సిఐటి యు ప్రతినిధి బృందం కలిసి చర్చించారని అన్నారు.ఈ సందర్భంగా వారు స్పందిస్తూ మీ సమస్యలు మా దృష్టిలో ఉన్నాయి తప్పకుండా సమస్యలను పరిష్కరిస్తామని ఇప్పటికే పెండింగ్ బిల్లులు, గౌరవితనం బడ్జెట్ విడుదల చేశామని వాటి ఫాలో కోసం అధికారిని కేటా ఇస్తామని ముఖ్యమంత్రి అల్పాహార పథకం అదనపు పనికి అదనపు వేతనం ఇవ్వాలని కోరగా

ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని ఇతర సమస్యలు కూడా పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.తెలంగాణ ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులను మరింత మోసం చేస్తుందని రెండు సంవత్సరాలుగా పెంచిన జీతాలు ఇవ్వకపోవడం సరైనది కాదని మధ్యాహ్న భోజన కార్మికులు ఈ జిల్లాలో ప్రభుత్వానికి 9 కోట్ల రూపాయలు అప్పులు పెట్టారని అధిక అప్పులు చేసి ఉన్న ఆస్తులు గాలి బొట్టులు తాకట్లు పెట్టి మధ్యాహ్న భోజన పిల్లలకు వంటలు చేసి పెడుతున్నారని ఎప్పుడు బిల్లులు అడిగినా ఎప్పుడు జీతాలు అడిగినా ఫ్రీజింగ్ లో ఉన్నాయని రకరకాల ఆరు నెలలు సంవత్సరాలు 8 నెలలు పెండింగ్లో పెడుతూ మధ్యాహ్నం భోజన కార్మికులను మరింత అప్పుల పాలు అవుతున్నరని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సమ్మె తాత్కాలిక విరమణ తప్ప సమస్యలు పరిష్కారం కాకపోతే తిరిగి మళ్ళీ ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం పై పోరాటం తప్పదని హెచ్చరించారు

       

ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి అల్లి అనురాధ ,జిల్లా నాయకులు దొడ్డి ఆండాలు, ఏకుల మహేశ్వరి, దండ పుష్పలత, వేముల ఇందిర, బొజ్జ అలివేలు, పందుల ముత్యాలి తదితరులు పాల్గొన్నారు

తప్పు చేస్తే దొరకక తప్పదు

Oct 10 2023, 11:28

నేడు, రేపు కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ రద్దు

కాజీపేట: ఆదిలాబాద్‌- తిరుపతి మధ్య కాజీపేట మీదుగా నడిచే కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ ఈనెల 10, 11 తేదీలలో రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు..

సికింద్రాబాద్‌ డివిజన్‌ పరిధిలో జరిగే ఇంటర్‌లాకింగ్‌ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే టికెట్లు రిజర్వేషన్‌ చేసుకున్న వారికి తిరిగి నగదు చెల్లిస్తామని వివరించారు. గడిచిన రెండు వారాల్లో కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేయడం ఇది రెండోసారి.

ఈనెల 15 వరకు ప్యాసింజర్లు..: కాజీపేట- డోర్నకల్‌ మధ్య నడిచే డోర్నకల్‌ ప్యాసింజరు, సికింద్రాబాద్‌- వరంగల్‌ మధ్య నడిచే పుష్‌పుల్‌, కాజీపేట -బల్లార్షా మధ్య నడిచే బల్లార్షా ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల రద్దును ఈనెల 15 వరకు పొడిగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.