కెసిఆర్ పాలనలోని గ్రామాల అభివృద్ధి: మంత్రి జగదీశ్వర్ రెడ్డి

సంక్షేమంలో దేశంలోనే ముందు వరుసలో తెలంగాణ

పని చేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలి

కాళేశ్వరం తొలి ఫలితం అందుకుంది పెన్ పహాడ్ మండలమే

 బీడు భూములుగా ఉన్న గ్రామాలు , తండాలను ససశ్యామలం చేసింది బీఆర్ఎస్

➖➖➖➖➖➖➖➖

పెన్ పహాడ్ మండలం చీదెళ్ళ గ్రామం లో బస్ షెల్టర్ ను ప్రారంభించిన మంత్రి

గిడ్డంగుల సంస్థ ఆద్వర్యంలో రూ.9.70 కోట్ల తో 10 మెట్రిక్ టన్నుల కెపాసిటీ తో నిర్మించనున్న గౌడాన్ కు శంకుస్థాపన.

➖➖➖➖➖➖➖➖

 పెన్ పహాడ్ 

తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్‌ హయాంలోనే గ్రామాలు సర్వాంగ సుందరంగా అభివృద్ధి చెందాయని సూర్యాపేట శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. పెన్ పహాడ్ మండలంలోని చీదెళ్ళ గ్రామం లో పర్యటించిన మంత్రి గ్రామం లో నూతనంగా నిర్మించిన బస్ షెల్టర్ ను ప్రారంభించారు. తమ అభిమాన నేత జగదీష్ రెడ్డి రాక ను తెలుసుకున్న గ్రామ మహిళలు పెద్ద ఎత్తున మంత్రి కి ఎదురెళ్లి స్వాగతం పలికారు. రైతులు తమ ఉత్పత్తుల ను నిలవ చేసుకోవడానికి వీలుగా రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యంలో 10 మెట్రిక్ టన్నుల కెపాసిటీ , రూ..9.70 కోట్ల రూపాయల తో గ్రామంలో నిర్మించనున్న గౌడాన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రం దేశంలోనే ముందు వరుసలో ఉందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నేడు గ్రామాలు అభివృద్ధి చెందాయంటే సీఎం కేసీఆర్‌ చొరవతోనేనని తెలిపారు.కాళేశ్వరం తొలి ఫలితం అందుకుంది పెన్ పహాడ్ మండలమే అన్నారు.2014 కు ముందు 

 బీడు భూములుగా ఉన్న గ్రామాలు , తండాలను వందలాది కిలో మీటర్ల నుండి గోదావరి జలాలను తెచ్చి ససశ్యామలం చేసింది బీఆర్ఎస్ పార్టీ నే అన్నారు.

పల్లెప్రగతి ద్వారా గ్రామానికి ఒక ట్రాక్టర్‌తో పాటు శ్మశానవాటిక, పల్లెప్రకృతి వనాలు, డంపింగ్‌ యార్డులు, హరితహారం, నర్సరీ తదితర పథకాలను ప్రవేశపెట్టడంతో నేడు పల్లెలన్నీ సర్వాంగ సుందరంగా తయారయ్యాయన్నారు.

అంతేకాకుండా అన్ని గ్రామాల్లో పంచాయతీలకు పక్కా భవనాలను నిర్మిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయడంతో ప్రజలకు పరిపాలన సౌకర్యవంతంగా మారిందన్నారు. తండా లను గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశామని, ఇప్పుడు కొత్త పంచాయతీ భవనాన్ని కూడా నిర్మిస్తున్నామని వెల్లడించారు. తెలంగాణ రాక ముందు, తెలంగాణ వచ్చాక గ్రామాలన్నీ ఎలా అభివృద్ధి చెందాయో పరిశీలించాలన్నారు. పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. గతం లో దుమ్ము దూలి తో ఉన్న రహదారులు నేడు అద్దం లా రూపుదిద్దుకున్నాయని అన్నారు. రాబోయే రోజుల్లో 

టిఆర్ఎస్ పార్టీకి అండగా నిలబడి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో ఎంపీపీ నెమ్మాది బిక్షం, జెడ్పిటిసి మామిడి అనిత అంజయ్య , మండల పార్టీ అధ్యక్షులు దొంగరి యుగంధర్, సర్పంచ్ పరెడీ సీతారాంరెడ్డి , సింగిల్ విండో చైర్మన్ వెన్న సీతారామ్ రెడ్డి , ఎంపీటీసీ జూలకంటి వెంకట్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు కీర్తి వెంకట్రావు , రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ గుర్రం అమృతా రెడ్డి. మిరియాల వెంకటేశ్వర్లు, తూముల ఇంద్రసేనారావు, వార్డ్ సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.

కొమురవెల్లి మల్లన్న ఆలయానికి షాక్.. రూ.11 కోట్లు ట్యాక్స్ కట్టాలంటూ ఐటీ శాఖ నోటీసులు

తెలంగాణలోని ప్రముఖ ఆలయం కొమురవెల్లి మల్లన్న ఆలయానికి కేంద్ర ఆదాయపు పన్ను శాఖ నోటీసులు ఇచ్చింది. రూ.11 కోట్లు పన్ను చెల్లించాలంటూ మల్లన్న దేవాలయానికి ఐటీ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు..

ఆదాయపు పన్ను మినహాయింపు కోసం గడువు ముగిసినప్పటికీ 12ఏ రిజిస్ట్రేషన్‌ను ఆలయ అధికారులు పట్టించుకోలేదు. అంతేకాదు.. దాదాపుగా 1995 నుంచి ఐటీ రిటర్న్‌లను ఆదాయపు పన్ను శాఖకు సమర్పించలేదు. 

దీనిపై ఐటీ శాఖ సీరియస్ అయ్యింది. 1995 నుంచి ఐటీ రిటర్న్‌లు, ఆడిట్ వివరాలను సమర్పించాలని నోటీసులు జారీ చేసింది.

ఆలయ అధికారుల నిర్లక్ష్యంతోనే ఐటీ నోటీసులు జారీ అయినట్లుగా తెలుస్తోంది. మొత్తం రూ.8 కోట్ల ట్యాక్స్ దీనికి రూ.3 కోట్ల జరిమానా మొత్తం రూ.11 కోట్లు చెల్లించాలని ఆదాయపు పన్ను శాఖ పేర్కొంది. అయితే ఆధ్యాత్మిక కేంద్రాలు, ధార్మిక సంస్థలపై సాధారణ వ్యక్తులు, కంపెనీలతో వ్యవహరించినట్లుగా కఠిన వైఖరిని అవలంబించొద్దని భక్తులు సూచిస్తున్నారు. మరి ఆలయ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

హీరో విశాల్ ఆరోపణలపై రంగంలోకి సీబీఐ-సెన్సార్ బోర్డులో ముగ్గురిపై కేసు నమోదు

హీరో విశాల్ నటించిన మార్క్ ఆంటోనీ చిత్రం హిందీ వెర్షన్ కు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు సెన్సార్ బోర్డు సభ్యులు రూ.7 లక్షలు లంచం అడిగారన్న ఆరోపణలపై సీబీఐ రంగంలోకి దిగింది..

సెన్సార్ బోర్డులో ముగ్గురిపై కేసు నమోదు చేసింది. మార్క్ ఆంటోనీ చిత్రం సర్టిఫికేషన్ విషయంలో అసలేం జరిగిందన్న దానిపై సీబీఐ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. త్వరలో వీరిని అరెస్టు చేసే అవకాశముంది.

తాను నటించి, నిర్మించిన మార్క్ ఆంటోనీ చిత్రం హిందీ వెర్షన్ కు క్లియరెన్స్ ఇచ్చేందుకు సెన్సార్ బోర్డు సభ్యులు రూ.7 లక్షలు లంచం డిమాండ్ చేయడంతో ఆగ్రహించిన హీరో విశాల్.. వారు అడిగిన మొత్తం రెండు విడతలుగా చెల్లించారు.

వాటికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ల వివరాలతో ఆ తర్వాత ఓ ట్వీట్ చేశారు. ఇందులో జోక్యం చేసుకోవాలని ప్రధాని మోడీతో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కోరారు. తనలాంటి వారి పరిస్దితే ఇలా ఉంటే సామాన్యుల పరిస్ధితి ఏంటని ప్రశ్నించారు.

పట్టణాల అభివృద్దే బిఆర్ఎస్ లక్ష్యం: ఎమ్మెల్సీ కోటిరెడ్డి

3వ వార్డ్ నందు....

10 లక్షల రూపాయల సిడిపి ఎమ్మెల్సీ గారి నిధుల సీసీ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన.

నల్లగొండ జిల్లా శాసనమండలి సభ్యులు యం.సి కోటిరెడ్డి

స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులతో కలిసి సీసీ రోడ్డు నిర్మాణ పనులను కొబ్బరికాయలు కొట్టి, ప్రారంభించారు.

ఎమ్మెల్సీ కోటి రెడ్డి గారు మాట్లాడుతూ.

కెసిఆర్ ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో.

అనుముల మండలం ఎంపీపీ సుమతీ పురుషోత్తం, తిరుమలగిరి సాగర్ మండలం ఎంపీపీ భగవాన్ నాయక్, మండల రైతు బంధు సమితి కోఆర్డినేటర్ రావుల చిన్న బిక్షం యాదవ్, స్థానిక మూడో వార్డు కౌన్సిలర్ అన్నపాక శ్రీనివాస్, జిల్లా మున్సిపల్ కౌన్సిల్ ఫోరం అధ్యక్షులు వర్ర వెంకటరెడ్డి, నందికొండ మున్సిపాలిటీ వార్డు కౌన్సిలర్లు రామకృష్ణ, రమేష్ జి,ఆదాసు విక్రమ్, మోహన్ నాయక్, అనుముల మండల మాజీ ఎంపీపీ అల్లి పెద్దిరాజు యాదవ్,నాయుడుపాలెం సర్పంచ్ కిరణ్ నాయక్, కొట్టాల సర్పంచ్ చింతకాయల యా వెంకటేశ్వర్లు, వీర్ల గడ్డ తండా సర్పంచ్ సంధ్యా రాము నాయక్,జిల్లా ఎంపీటీసీల పోరం అధ్యక్షులు రావుల రాంబాబు యాదవ్, మాజీ మార్కెట్ డైరెక్టర్ ఆవుల సైదులు యాదవ్, మదారి గూడెం గ్రామ పార్టీ అధ్యక్షులు బొమ్ము సైదులు యాదవ్, మాజీ పేరూరు దేవస్థానం కమిటీ చైర్మన్ మనది పురుషోత్తం యాదవ్, ముస్లిం మైనార్టీ మండల అధ్యక్షులు షేక్ గౌస్, ముస్లిం మైనార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ జానీ, టిఆర్ఎస్ పార్టీ నాయకులు పశువుల ప్రసాద్ యాదవ్, పసుల శ్రీనివాస్ యాదవ్, దుండిగల శ్రీను, జిల్లా మైనార్టీ నాయకులు అబ్దుల్ హలీం, అంజద్ ఖాన్, అజారిగూడెం ఉపసర్పంచ్ జలీల్ ఖాన్, వీర్లగడ్డ తండా ఉపసర్పంచ్ మనది శేఖర్ యాదవ్, సీనియర్ నాయకులు లక్ష్మణ్ నాయక్, కొట్టాల శ్రీను, భీమా నాయక్, ప్రభాకర్ నాయక్, సీకేయూత్ అధ్యక్షులు బండి రమేష్, 12వ వార్డు ఇన్చార్జి గోపిశెట్టి సైదులు,తెలంగాణ ఉద్యమ నాయకులు మధుచారి, మక్బూల్, జిల్లా టిఆర్ఎస్ మహిళా నాయకురాలు గంగాభవాని, తదితరులు పాల్గొన్నారు.

పలువురికి ఆర్ధిక సహాయం చేసిన కంచర్ల భూపాల్ రెడ్డీ

ఇటీవల అనారోగ్యం తో మృతి చెందిన గడ్డికొండారం గ్రామానికి చెందిన పాలడుగు సరిత, వీరమళ్ళ శంకరయ్య గార్లకు కంచర్ల భూపాల్ రెడ్డి MLA గారు 10000 వేలు చొప్పున ఆర్ధిక సహాయం చేసినారు.

ఈ కార్యక్రమం లో తిప్పర్తి TRS పార్టీ మండల అధ్యక్షులు పల్ రెడ్డి రవీందర్ రెడ్డి, DCCB డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి వనపర్తి నాగేశ్వర్ రావ్, లొడంగి గోవర్ధన్, సర్పంచ్ కంచర్ల భాస్కర్ రెడ్డి.

ఉప సర్పంచ్ భీమనపల్లి సైదులు, మైనం యుగందర్ అధ్యక్షులు,మాజీ సర్పంచ్ లు మేరెడ్డి యాదగిరి రెడ్డి, సుంకిశాల రవి.

వార్డ్ మెంబెర్స్ కంచుకొమ్ముల సైదులు, మైనం లింగయ్య, దూదిమెట్ల లింగస్వామి,కంచర్ల కొండల్ రెడ్డి,మైనం కొండయ్య, కంచర్ల పురుషోత్తం రెడ్డి,కంచర్ల రమణ రెడ్డి, భీమనపల్లి శ్రీను, కస్పరాజు సైదులు తదితరులు పాల్గొన్నారు.

దేవాలయాలకు ఐటి నోటీసులు

తెలంగాణ దేవుళ్లకు ఐటీ అధికారులు షాక్ ఇచ్చారు. నిజమే తెలంగాణలో ప్రముఖ దేవులందరికి ఐటి శాఖ నోటీసులు ఇచ్చింది. దీంతో ఒక్కసారిగా రాష్ట్రంలో దేవుళ్ళకే ఐటీ నోటీసులు అన్న చర్చ ప్రారంభమైంది.

ఆదాయపు పన్ను కట్టాలంటూ ఆలయాలకు ఐటీ నోటీసులు ఇవ్వటంతో సంచలనం గా మారింది. ప్రముఖ దేవస్థానం కొమురవెల్లి మల్లన్నకు రూ.11 కోట్లు కట్టాలంటు ఐటీ శాఖ నోటీసులు ఇచ్చింది.

కొమురెల్లి మల్లన్న దేవాలయానికి కాదు తెలంగాణలో దక్షిణ కాశీగా వెలుగొందుతున్న వేములవాడ రాజన్న టెంపుల్ తో పాటు చదువుల నిలయమైన బాసర సరస్వతి ఆలయానికి సైతం నోటీసులు పంపింది ఆదాయపన్ను శాఖ.

దేవాలయా లే టార్గెట్

తెలంగాణలోని పలు ప్రముఖ దేవాలయాలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. ఆదాయపు పన్ను కట్టాలంటూ నోటీసులు పంపించింది.

ఈ జాబితాలో కొమురవెల్లి మల్లన్న స్వామి తొలి స్థానంలో ఉన్నారు. రూ. 8 కోట్ల ట్యాక్స్ కట్టాలని, సకాలంలో పన్ను కట్టనందువల్ల మరో రూ. 3 కోట్ల జరిమానా కూడా చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. వేములవాడ రాజన్న, బాసరలోని సరస్వతి అమ్మవారి ఆలయంతో పాటు ఇంకా పలు దేవాలయాలకు కూడా నోటీసులు అందాయి.

మరోవైపు ఆలయాలకు ఐటీ నోటీసులు అందడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపార సంస్థలు, వ్యక్తుల విషయంలో వ్యవహరించినట్టు ఆలయాలపై కఠిన వైఖరిని అవలంభించడం సమంజసం కాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు..

షాద్ నగర్ లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

షాద్‌నగర్‌ నియోజకవర్గంలో గురువారం మంత్రి కేటీఆర్‌ పర్యటిస్తున్నారు. కొల్లూరులో నిర్మించిన మున్సిపల్‌ కార్యాలయ భవనం, డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను మంత్రి మహేందర్‌ రెడ్డితో కలిసి ప్రారంభించారు.

అనంతరం షాద్‌నగర్‌లో 1700 డబుల్‌ బెడ్రూం ఇండ్లను ప్రారంభించి, లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను అందజేశారు. బంజారా భవన్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం షాద్‌నగర్‌ మార్కెట్‌ యార్డులో జరిగే సభలో పాల్గొంటారు.

మధ్యా హ్నం రావిర్యాలలో విజయ మెగా డెయిరీని ప్రారంభిస్తారు. తర్వాత వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో గిరిజన భవన్‌, రోడ్‌ ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. పట్టణంలోని బ్లాక్‌ గ్రౌండ్‌లో జరిగే బహిరంగసభలో ప్రసంగిస్తారు.

సాయంత్రం 5 గంటలకు కూకట్‌పల్లి నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం కేపీహెచ్‌బీలోని కేటీఆర్‌ పార్కులో జరిగే సభలో మంత్రి కేటీఆర్‌ పాల్గొంటారు...

అంతా ఓపెన్‌గానే జరిగింది.. దీనిలో స్కామ్‌ ఎక్కడుంది?: చంద్రబాబు తరఫు న్యాయవాది వాదనలు

విజయవాడ: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు బెయిల్‌, సీఐడీ కస్టడీ పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు కొనసాగాయి. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్‌కుమార్‌ దూబే, సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు..

అవినీతి చేసినట్లు ఆధారాలు చూపించలేదు: ప్రమోద్‌కుమార్‌ దూబే

చంద్రబాబు తరఫున ప్రమోద్‌కుమార్‌ దూబే వాదిస్తూ ''స్కిల్‌ కేసుతో చంద్రబాబుకు సంబంధం లేదు. రెండేళ్ల తర్వాత రాజకీయ కారణాలతో ఈ కేసులో ఇరికించారు. డిజైన్‌ టెక్‌ సంస్థతో ఇతర సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. చంద్రబాబు సీఎం హోదాలో మాత్రమే నిధులు మంజూరు చేశారు. ఒప్పందం ప్రకారం 40 సెంటర్లను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా 2లక్షల మందికి పైగా శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించారు. అంతా ఓపెన్‌గానే జరిగింది.. ఇందులో స్కామ్‌ ఎక్కడుంది?చంద్రబాబు పాత్ర ఏముంది?ఇది పూర్తిగా రాజకీయ కక్షతో పెట్టిన కేసు. ఆయన అవినీతి చేసినట్లు ఆధారాలు కూడా చూపించలేదు. సీఐడీ కస్టడీలో విచారణకు చంద్రబాబు సహకరించారు. మరోసారి ఆయన కస్టడీ అవసరం లేదు. విచారణ సాగదీయడానికే కస్టడీ పిటిషన్‌ వేశారు. చంద్రబాబుకు బెయిల్‌ మంజూరు చేయాలి'' అని కోర్టును కోరారు. 

బ్యాంకు లావాదేవీలపై విచారించాల్సి ఉంది: పొన్నవోలు

సీఐడీ తరఫున పొన్నవోలు వాదనలు వినిపిస్తూ '' ఒప్పందంలో ఉల్లంఘనలు జరిగాయి. కేబినెట్‌ నిర్ణయం మేరకు ఒప్పందం అమలు జరగలేదు. ఆ తప్పిదాలకు చంద్రబాబే బాధ్యుడు. బ్యాంకు లావాదేవీలపై ఇంకా ఆయన్ను విచారించాల్సి ఉంది. ప్రివెన్షన్‌ ఆఫ్‌ కరప్షన్‌ యాక్ట్‌ చంద్రబాబుకు అప్లై అవుతుంది. కస్టడీకి తీసుకుని మరిన్ని విషయాలు రాబట్టాల్సిన అవసరం ఉంది''అని చెప్పారు.

తెలంగాణలో 22 లక్షలకుపైగా ఓట్లను తొలగించిన ఈసీ

హైదరాబాద్: తెలంగాణలో 2022-23 ఏడాదిలో 22 లక్షలకుపైగా ఓట్లను పరిశీలించి తొలగించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) వెల్లడించింది. శాసనసభ ఎన్నికల సన్నాహకాలపై సమీక్ష కోసం రాష్ట్రానికి వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన ముగిసింది.

ఈ నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ (సీఈసీ) ఇతర కమిషనర్లతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు విషయాలను ఆయన వెల్లడించారు.

''తెలంగాణలో స్త్రీ, పురుష ఓటర్లు దాదాపు సమానంగా ఉండటం శుభపరిణామం. సమాజంలోని అన్ని వర్గాలను ఓటింగ్లో భాగస్వామ్యం చేస్తున్నాం. యువ ఓటర్ల సంఖ్య 8 లక్షలు దాటడం ప్రశంసనీయం. రాష్ట్రంలో 2022 - 23 ఏడాదిలో 22 లక్షలకుపైగా ఓట్లను పరిశీలించి తొలగించాం. ఏకపక్షంగా ఓట్లను తొలగించలేదు. ఫామ్ అందిన తర్వాతే తొలగించాం. అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా అన్ని పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యాం. ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావంపై కొన్ని పార్టీలు ఆందోళన వెలిబుచ్చాయి. ఓటర్ల జాబితాల్లో అవకతవకలు జరగొచ్చని కొన్ని పార్టీలు ఆందోళన చెందాయి. బుధవారం ఓటర్ల తుది జాబితా కూడా వెల్లడించాం. జులై తర్వాత దరఖాస్తు చేసుకున్న 2.21 లక్షల యువతకు ఓటు హక్కు కల్పించాం. 66 నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. 18 - 19 ఏళ్ల యువ మహిళా ఓటర్లు 3.45 లక్షల మంది ఉన్నారు. తెలంగాణలో తొలిసారిగా 80 ఏళ్లు దాటిన వారు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నాం. రాష్ట్రంలో మొత్తం పోలింగ్ స్టేషన్లు 35,356 ఉండగా.. ఒక్కో పోలింగ్ స్టేషన్లో సగటు ఓటర్ల సంఖ్య 897గా ఉంది. ఫిర్యాదుల స్వీకరణ కోసం సీ విజిల్ యాప్ను అందుబాటులోకి తెచ్చాం'' అని రాజీవ్కుమార్ వివరించారు..

చండూర్ లో నూతన RDO ఆఫీస్ ను ప్రారంభించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి,

మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, MP లింగయ్య యాదవ్

ఈ కార్యక్రమంలో..

మంత్రి జగదీశ్ రెడ్డి కామెంట్స్

నూతనముగా ఆర్డీవో సేవలు అందుకోబోతున్న ఇక్కడి ప్రజలకు శుభాకాంక్షలు..

హైదరాబాద్ కి దగ్గర ఉన్న మునుగోడు వెనుకబాటుకు గురైంది.

ఫ్లోరైడ్ మహమ్మారి ఎంతో మంది చనిపోయారు..

4 ఏళ్ళలో  మునుగోడు లోనే కాదు నల్గొండ జిల్లాలో ప్లోరైడ్ ను తరిమి కొట్టిన గణత కేసీఆర్ దే ..

 

తాగు నీరు తో పాటు సాగు నీరు కోసం శివన్నగూడెం, చర్లగూడెం

కిష్టరాంపల్లి ,ప్రాజెక్టులు కడుతున్నాం...

వెనుక బడ్డ మునుగోడు ను ఒకవైపు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పనులతో

పరుగులు పెట్టిస్తున్నారు ముఖ్యమంత్రి గారు...

మునుగోడు లో గెలిచిన పది నెలల కాలంలోనే ఐదు వందల కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయి..

ఇలాంటి సమయంలో కొందరు

అభివృద్ధి కి అడ్డుపడుతున్నారు..

చేసే అభివృద్ధి పనులు అడ్డుకునే పనుల్లో కొందరు ఉన్నారు.వారికి బుద్ధి చెప్పాలి..

బీజేపీ నేత రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి అభివృద్ధి నిరోదకుడు... అతనికి ఈ సారి కూడా గట్టిగా బుద్ధి చెప్పాలి...డిపాజిట్ రాకుండా ఓడించాలి...

 మునుగోడు లో

ముఖ్యమంత్రి ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చారు..

ఆరు గ్యారెంటీ లు ఇస్తామని అనే వారు వారి అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఆరు గ్యారెంటీ లు ఏమయ్యాలు..అసలు కాంగ్రెస్ కే గ్యారంటీ లేదు... వాళ్ళ మాటలకు గ్యారంటీ ఎలా ఉంటుంది..కాంగ్రెస్ పార్టీని ఎవ్వరు నమ్మరు... కాంగ్రెస్ ఔట్ డేట్ పార్టీ....అందులో ఉన్న నాయకులు ఔట్ డేట్ నాయకులే