ఆసియా క్రీడల్లో భారత్ కు మరో పసిడి

 ఆసియా క్రీడల్లో 2023 పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో భారత త్రయం సరబ్‌జోత్ సింగ్, శివ నర్వాల్, అర్జున్ సింగ్ చీమా మొత్తం 1734 స్కోరు సాధించి స్వర్ణం గెలుచుకున్నారు.

వారి అద్భుతమైన ఆటతీరుతో కేవలం ఒక్క పాయింట్ తేడాతో చైనాను ఓడించి టీం స్వర్ణం సాధించారు. 

వియత్నంతో పటిష్ట ప్రదర్శన చేసి 1730 పాయింట్లతో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. 580 పాయింట్లు సాధించిన సరబ్జోత్ ఐదో ర్యాంక్ సాధించగా, అర్జున్ 578 పాయింట్లతో వ్యక్తిగత క్వాలిఫికేషన్ ఈవెంట్‌లో ఎనిమిదో స్థానంలో నిలిచాడు.

వీరిద్దరూ నేడు జరగనున్న పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్‌లో పోటీ పడనున్నారు.

దీంతో ప్రస్తుత ఆసియా గేమ్స్‌లో భారత్‌కు 24వ పతకం, షూటింగ్‌లో నాలుగో బంగారు పతకం లభించింది...

భారత్ పై ఆసీస్ ప్రతీకార విజయం

భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో వన్డేలో పర్యాటక ఆసీస్ విజయం సాధించింది. 353 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 49.4 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

అయితే, తొలి రెండు వన్డేల్లో గెలిచిన భారత్.. సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఓటమి పాలైనప్పటికీ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్ అగ్రస్థానంలోనే ఉంది. నెంబర్ 1 ర్యాంక్‌తోనే వన్డే వరల్డ్ కప్ వేటను ప్రారంభించనుంది.

అటు ఆస్ట్రేలియా.. వన్డేల్లో 5 ఓటముల తర్వాత తొలి విజయాన్ని నమోదు చేసింది. వన్డే వరల్డ్ కప్ ముందు కీలక ఆటగాళ్లు ఫామ్‌లోకి రావడం.. ఆ జట్టులో ఉత్సాహం నింపింది.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్ రోహిత్ శర్మ శుభారంభం అందించాడు. 57 బంతుల్లో 81 పరుగులు చేశాడు. శుభ్‌మన్ గిల్‌కు విశ్రాంతి నివ్వడం, ఇషాన్ కిషన్‌కు జ్వరం రావడంతో ఈ మ్యాచ్‌లో రోహిత్‌తో కలిసి వాషింగ్టన్ సుందర్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు.

తొలి వికెట్‌కు 74 పరుగులు జోడించిన అనంతరం సుందర్ (18) ఔట్ అయ్యాడు. అనంతరం కోహ్లీ (56), రోహిత్‌లు స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లారు. 6కు పైగా రన్ రేట్‌తో పరుగులు సాధించడంతో భారత్ లక్ష్యం దిశగా వెళ్లింది.

అయితే 21వ ఓవర్ చివరి బంతికి రోహిత్ శర్మ.. మ్యాక్స్‌వెల్ పట్టిన అద్భుతమైన రిటర్న్ క్యాచ్‌కు వెనుదిరిగాడు. అప్పటికి జట్టు స్కోరు 144. 26.5 ఓవర్ల వద్ద జట్టు స్కోరు 171 వద్ద విరాట్ కోహ్లీ కూడా క్యాచ్ ఔట్ అయ్యాడు. శ్రేయస్ అయ్యర్ (48), కేఎల్ రాహుల్ (26) కాసేపు నిలబడినా స్వల్వ వ్యవధిలోనే ఇద్దరూ వెనుదిరిగారు.

సూర్యకుమార్ యాదవ్ (8) కూడా త్వరగానే పెవిలియన్ చేరాడు. దీంతో 257 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన భారత్.. విజయావకాశాలను సంక్లిష్టం చేసుకుంది. మిగతా మూడు వికెట్లను తీసిన ఆసీస్.. 49.4 ఓవర్లలో 286 పరుగులకు భారత్‌ను ఆలౌట్ చేసింది.....

29న సీఎం జగన్‌ విజయవాడ పర్యటన

అమరావతి: సీఎం జగన్‌ ఈ నెల 29న విజయవాడలో పర్యటించనున్నారు.

విద్యా ధరపురం స్టేడియం గ్రౌండ్‌లో వైఎస్సార్‌ వాహన మిత్ర పథకం ఐదో విడత నిధుల విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు..

ఉదయం 10.15 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి వెళ్తారు.

బహిరంగ సభలో ప్రసంగించి తాడేపల్లికి చేరుకుంటారు..

గణేష్ నిమజ్జనంలో అపశృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల పట్టణంలో నిమజ్జనం వేడుకల్లో రాత్రి అపశృతి దొర్లింది.

నిమజ్జనం సందర్భంగా టపాకాయలు పేలుస్తున్న ఓ బృందం వారు కాల్చిన టపాసులు స్థానిక అంబేద్కర్ సెంటర్లో పలు దుకాణాలపై వెళ్ళగా అవి దగ్ధమయ్యాయి.

విషయం తెలుసుకున్న స్థానిక ఫైర్ సర్వీస్ వారు సంఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది...

Sbnews

అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్:రేమా రాజేశ్వరి

 జల్సా లకు అలవాటు పడిన కొందరు వ్యక్తులు పోలీస్ అధికారులకు అంతు చిక్కని రీతిలో గంజాయి రవాణా చేస్తున్నారు.

గతవారం 24 వ తేదీన ఆదివారం రాత్రి మంచిర్యాల జిల్లాలో కొందరు దుండగులు పైన ఇటుకలు..లోపల గంజాయి అక్రమంగా తరలిస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తాపడడంతో అసలు విషయం బయటపడింది 

ఒరిస్సా రాష్ట్రం మల్కాన్ గిరి నుండి గంజాయి తరలింపు కోసం కొత్త పద్ధతిని ఎంచుకున్నారు. పెద్ద మొత్తంలో గంజాయిని ట్రాక్టర్ లో ఉంచి పైన సిమెంట్ ఇటుకలు పేర్చి సరఫరా చేస్తున్నారు.

ప్రమాదవశాత్తు మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి తరలిస్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోర్లా పడింది. చేసేది లేక నిందితులు వాహనం వదిలేసి పారిపోయారు.

సమాచారం అందుకున్న పోలీసులు రోడ్డుపై పడి ఉన్న ట్రాక్టర్ ను పోలీసులు స్టేషన్ కు తరలించారు. ట్రాక్టర్ను తనిఖీ చేయగా  

 ట్రాక్టర్ పైన ఇటుకల ఉంచి క్రింద భాగాన ఉంచిన 93 బ్రౌన్ కలర్ గంజాయి ప్యాకెట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు రామగుండం సిపి రమా రాజేశ్వరి తెలిపారు.

బుధవారము ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామగుండం సిపి రేమా రాజేశ్వరి నిందితుల వివరాలు వెల్లడించారు.

1 ఈశ్వర్, 2,జగబంధు 3,క్రిశాని,4,గురు, అనే నిందితులు తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే దురాశతో సరిహద్దు రాష్ట్రాలకు గంజాయిని తరలిస్తున్నారని ఆమె అన్నారు.

నిందితులను పట్టుకునేందుకు పోలీసు బృందాలు ఒరిస్సా రాష్ట్రానికి వెళ్లి అక్కడ గాలింపు చర్యలు చేపట్టి నిధులను అదుపులోకి తీసుకున్నారు.

నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు రామగుండం సీపీ రేమా రాజేశ్వరి తెలిపారు.. నిందితులను పట్టుకోవడంలో కృషిచేసిన సుధీర్, రాం నాథ్, కేకన్ ఐపీఎస్, డీసీపీ మంచిర్యాల, మోహన్ ఏసిపి, జైపూర్ నిందితులను పట్టుకోవడానికి సహకరించిన అధికారులందరినీ రేమా రాజేశ్వరి అభినందించారు...

ఐటీ ఉద్యోగుల నిరసనల్లో తప్పేముంది: రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌: హైదరాబాద్‌ పదేళ్లపాటు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని, ఏపీకి సంబంధించిన అంశంపై ఇక్కడ నిరసన జరపొద్దు అంటే ఎలా? అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు..

నిరసనలు చేయవద్దన్న కేటీఆర్‌ వ్యాఖ్యలు అర్థరహితమన్నారు. 

''చంద్రబాబు అరెస్టు ఏపీకి మాత్రమే సంబంధించింది కాదు. చంద్రబాబు దేశ నాయకుడు. ఆయన అరెస్టుపై తెలంగాణలో నిరసనలు తెలపడంలో తప్పేముంది.

నిరసన తెలిపే వాళ్లంతా ఇక్కడి ఓటర్లే. నిరసనకారులను నియంత్రించడంలో అర్థం లేదు. నిరసన తెలిపే హక్కును ఎవరూ కాలరాయలేరు.

ఏ పార్టీ వాళ్లైనా నిరసన తెలిపే హక్కు ఉంది. ఐటీ ఉద్యోగుల నిరసనల్లో తప్పేముంది? ఉద్యమ సమయంలో అమెరికాలోనూ నిరసనలు జరిగాయి.

ఏం హక్కు ఉందని అమెరికాలో నిరసనలు చేశారు? ప్రతి సమస్యకు దిల్లీ జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళన చేస్తున్నారు?ఏం హక్కు ఉందని దిల్లీలో నిరసనలు చేశారు?'' అని రేవంత్‌ ప్రశ్నించారు.'

మోగిన సింగరేణి ఎన్నికల సైరన్

సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదలైంది. అక్టోబర్‌ 28న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎల్‌సీ ప్రకటించారు.

ఈ మేరకు ఆయన బుధవారం ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. అక్టోబర్‌ 6, 7 తేదీల్లో నామినేషన్లు స్వీక రించనున్నారు.ఆ తర్వాత స్క్రూటిని,విత్‌ డ్రాకు అవకాశం ఇవ్వనున్నారు.

28 న పోలింగ్‌ నిర్వహించనుండగా.అదే రోజు కౌంటింగ్‌ చేపట్ట నున్నారు. అయితే, మే 22న సింగరేణి ఎన్నికలు నిర్వ హించాలని కేంద్ర కార్మిక సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది.

అయితే, వరుసగా పండగలు ఉండడంతో వాయిదా వేయాలని సింగరేణి యాజమాన్యం కోరింది.

సింగరేణి సంస్థ అభ్యర్థనను తిరస్కరించిన హైకోర్టు..అక్టోబర్‌ లో ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది..

హైద‌రాబాద్ భారీ వర్షాలకు నీటిలో కొట్టుకు వచ్చిన ముసలి

హైదరాబాద్ నగరంలో ఈరోజు సాయంత్రం కురిసిన భారీ వర్షానికి వరద నీళ్ల‌కు ఒక మొస‌లి కొట్టుకొచ్చింది.

కడ్తాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి చింతలబస్తిలో ఓ నాలా నుండి కొద్దిసేపటి క్రితం  చిన్న మొసలి పిల్ల దర్శనం ఇవ్వడంతో స్థానికులు భయ ఆందోళ‌న‌కు గుర‌య్యారు.

ఈ విష‌యాన్ని వెంట‌నే పోలీసులకు సమాచారం అందించగా ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సాయంతో మొస‌లిని దొర‌క‌బ‌ట్టేందుకు య‌త్నిస్తున్నారు...

Sbnews

Sbnews

CM Bungalow: కేజ్రీవాల్ అధికారిక నివాసం వివాదం.. రంగంలోకి CBI దిల్లీ: దిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్‌ కేజ్రీవాల్ (Arvind Kejriwal).. అధికారిక నివా

దిల్లీ: దిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్‌ కేజ్రీవాల్ (Arvind Kejriwal).. అధికారిక నివాసం మరమ్మతుల కోసం కోట్ల రూపాయాలు వెచ్చించారని భాజపా ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.‌. 

తాజాగా ఈ వివాదంపై సీబీఐ ప్రాథమిక విచారణ (Preliminary Enquiry) ప్రారంభించింది. అధికారిక నివాసం మరమ్మతుల్లో 'అక్రమాలు, ఉల్లంఘనలపై' వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఈ ప్రాథమిక దర్యాప్తు (PE)ని నమోదు చేసినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు వెల్లడించారు..

దిల్లీ ప్రభుత్వంలో గుర్తించని ప్రజాసేవకులపై సీబీఐ ఈ ప్రిలిమినరీ ఎంక్వైరీ (PE)ని నమోదు చేసింది.

ప్రాథమిక విచారణ అనేది.. వచ్చిన ఆరోపణలపై రెగ్యులర్‌ ఎఫ్‌ఐఆర్‌ (FIR) నమోదు చేసేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయా? లేదా? అనే విషయాన్ని తెలుసుకునేందుకు దోహదపడుతుంది.

ఈ క్రమంలోనే అధికారిక నివాసం మరమ్మతులకు సంబంధించిన రికార్డులను సదరు శాఖ నుంచి అడిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా టెండర్‌ దస్త్రాలు, కాంట్రాక్టర్లు సమర్పించిన బిడ్లు, నిర్మాణ అనుమతులు, తదనంతరం మార్బుల్‌ ఫ్లోరింగ్‌లో మార్పులు ఇతర పనుల వివరాలను కోరినట్లు అధికారులు వెల్లడించారు..

భాజపా-జేడీఎస్‌ దోస్తీ.. దేవెగౌడ కీలక వ్యాఖ్యలు..

ల్లీ: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ భాజపా(BJP)తో తమ పార్టీ దోస్తీ కట్టడాన్ని జేడీఎస్‌(JDS) అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ(Deve Gowda) సమర్థించుకున్నారు..

అవకాశవాద రాజకీయాలను చేయబోమన్నారు. ఇటీవల భాజపాతో పొత్తు, ఎన్డీయేలో చేరిక అంశంపై జేడీఎస్‌కు చెందిన కొందరు నేతలు విభేదిస్తున్నారంటూ వచ్చిన వార్తల నేపథ్యంలో ఆయన బెంగళూరులో విలేకర్ల వద్ద కీలక వ్యాఖ్యలు చేశారు.

తమ పార్టీ లౌకిక ప్రమాణాలకు కట్టుబడి ఉందని.. మైనార్టీలను ఎప్పటికీ నిరాశపరచబోమన్నారు.

కర్ణాటకలో రాజకీయ పరిస్థితులను కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా(Amit Shah)కు వివరించినట్టు చెప్పారు.

గత పదేళ్లలో తొలిసారి హోంమంత్రి అమిత్‌ షాతో చర్చించానన్నారు. తమ పార్టీని కాపాడుకొనే లక్ష్యంతోనే 2014లోక్‌సభ ఎన్నికల్లో భాజపాతో పొత్తు పెట్టుకున్నట్టు దేవెగౌడ తెలిపారు..