నేడు నల్లగొండ తిప్పర్తి మండల కేంద్రంలో బాల త్రిపుర సుందరి దేవత ఊరికింపులు ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కంచర్ల

ఈరోజు గౌరవ శ్రీ కంచర్ల భూపాల్ రెడ్డి నల్లగొండ ఎమ్మెల్యే గారు తిప్పర్తి సర్పంచ్ రొట్టెల రమేష్ గారి ఆధ్వర్యంలో తిప్పర్తి మండల కేంద్రంలో బాల త్రిపుర సుందరి దేవత ఊరేగింపు మరియు ముత్యాలమ్మ బోనాలు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారి కి ప్రత్యేక పూజలు జరిపారు అమ్మవారి ఆశీస్సులతో తిప్పర్తి గ్రామ మండల ప్రజలు సుఖ సంతోషాలతో పాడి పంటలతో అష్ట ఐశ్వర్యాలతో చల్లగా ఉండాలని బాల త్రిపుర సుందరి అమ్మవారిని కోరుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారిని స్థానిక సర్పంచ్ మరియు గ్రామ నాయకులు ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో మండల నాయకులు గ్రామ నాయకులు గ్రామ పెద్దలు మరియు వివిధ సంఘాల యువ నాయకులు పాల్గొన్నారు

నేడు నల్లగొండ తిప్పర్తి మండల కేంద్రంలో బాల త్రిపుర సుందరి దేవత ఊరికింపులు ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కంచర్ల

Rishi Sunak: అక్షర్‌ధామ్‌లో రిషి సునాక్‌ ప్రత్యేక పూజలు

దిల్లీ: జీ20 శిఖరాగ్ర సదస్సు కోసం దిల్లీకి వచ్చిన బ్రిటన్‌ ప్రధానమంత్రి రిషి సునాక్‌ (Rishi Sunak) ఆదివారం ఉదయం అక్షర్‌ధామ్‌ ఆలయాన్ని సందర్శించారు..

అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట సతీమణి అక్షతా మూర్తి కూడా ఉన్నారు. ఆయన రాక నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో దిల్లీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

ఆలయాన్ని సందర్శించనున్నట్లు సునాక్‌ శనివారం సాయంత్రమే మీడియాకు వెల్లడించారు. హిందువుగా తాను గర్విస్తున్నానన్నారు. ఆ సంస్కృతిలోనే తాను పెరిగానని తెలిపారు. తన విశ్వాసాలే ఒత్తిడి సమయంలో తనకు సాంత్వననిస్తాయని వివరించారు. ఇటీవలే రక్షాబంధన్‌ నిర్వహించుకున్నట్లు వెల్లడించారు. తన చెల్లితో పాటు సమీప బంధువులు తనకు రాఖీలు కట్టినట్లు చెప్పారు. జన్మాష్టమి జరపుకొనేందుకు తనకు సమయం లభించలేదన్నారు..

గాంధీకి ప్రపంచ నేతల నివాళి.. దిల్లీలో వర్షాలు!

దిల్లీ: జీ20 కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం ప్రపంచ నేతలు మహాత్మాగాంధీకి నివాళి అర్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఉదయమే రాజ్‌ఘాట్‌కు చేరుకున్నారు..

ఆయన వివిధ దేశాధినేతలకు సాదరంగా స్వాగతం పలికారు. తేలికపాటి వర్షం కురుస్తున్నా.. ఆయా దేశాల అధ్యక్షులు, ప్రతినిధులు నిర్ణీత సమయానికి రాజ్‌ఘాట్‌కు చేరుకున్నారు. అనంతరం మహాత్మాగాంధీ సమాధి వద్ద నివాళులర్పించారు. అనంతరం ప్రార్థనలు జరిగాయి. ఈ కార్యక్రమం తర్వాత దేశ నాయకులంతా భారత్‌ మండపానికి చేరుకున్నారు. మండపంలోని సౌత్‌ ప్లాజాలో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. అనంతరం జీ20 మూడో సెషన్‌ అయిన 'వన్‌ ఫ్యూచర్‌' మొదలైంది. ఇది మధ్యాహ్నాం 12.30 వరకు జరుగుతుంది..

దేశ రాజధాని దిల్లీ (Delhi)లో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న జీ20 సదస్సు (G20 Summit) వేదికైన ప్రగతి మైదాన్‌ సహా పలు ప్రాంతాల్లో శనివారం రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. నేడు కూడా ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తారుగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నివేదిక ప్రకారం..

దిల్లీలో 32 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ఠ ఉష్ణోగ్రత.. 24 డిగ్రీ సెల్సియస్‌ వద్ద కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. భారీ వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి. జీ20 సదస్సు జరుగుతున్న వేళ ఈ పరిస్థితి అధికారులకు సవాల్‌గా మారింది. రాజ్‌ఘాట్‌, సఫ్దర్‌జంగ్, దిల్లీ విమానాశ్రయం, వసంత్‌ కుంజ్‌, నరేలా తదితర ప్రాంతాల్లో రాత్రి నుంచి తేలికపాటి వర్షం ప్రారంభమైంది. ఇవి ఆదివారం కూడా కొనసాగే అవకాశం ఉందని IMD ట్విటర్‌ వేదికగా వెల్లడించింది..

G20: 200 గంటలు.. 300 సమావేశాలు.. 15 ముసాయిదాలు.. దిల్లీ డిక్లరేషన్‌ వెనుక భారీ కసరత్తు

దిల్లీ: జీ20 శిఖరాగ్ర సదస్సులో నేతల మధ్య కుదిరిన దిల్లీ డిక్లరేషన్‌ (G20 Declaration)పై ఏకాభిప్రాయం సాధించడానికి భారత దౌత్యవేత్తల బృందం విశేష కృషి చేసినట్లు షెర్పా అమితాబ్‌ కాంత్‌ ఆదివారం తెలిపారు..

దాదాపు 200 గంటల పాటు నిరంతర చర్చలు జరిపినట్లు వెల్లడించారు. అదనపు కార్యదర్శులైన ఈనం గంభీర్, కె.నాగరాజు నాయుడుతో కూడిన దౌత్యవేత్తల బృందం 300 ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహించినట్లు తెలిపారు. వివాదాస్పద ఉక్రెయిన్ అంశంపై ఇతర దేశాల్లోని తమ సహచరులతో 15 ముసాయిదాలను పంచుకున్నట్లు వివరించారు. వీరందరి కృషి వల్లే జీ20 సదస్సు (G20 Summit) తొలిరోజే నేతల మధ్య ఏకాభిప్రాయం సాధ్యమైందన్నారు..

"మొత్తం G20 సదస్సు (G20 Summit)లో అత్యంత సంక్లిష్టమైన భాగం భౌగోళిక రాజకీయాలపై (రష్యా-ఉక్రెయిన్) ఏకాభిప్రాయం తీసుకురావడం. ఇది 200 గంటల పాటు నిరంతర చర్చలు, 300 ద్వైపాక్షిక సమావేశాలు, 15 ముసాయిదాల వల్లే సాధ్యమైంది. నాగరాజు నాయుడు, గంభీర్ ఈ విషయంలో తనకు ఎంతో సహకరించారు'' అని అమితాబ్‌ కాంత్‌ చెప్పారు..

Chandrababu Arrest: కక్షసాధింపు రాజకీయాలకు వేదికగా ఏపీ: సీపీఐ రామకృష్ణ

తిరుపతి: చంద్రబాబు అరెస్ట్‌ (Chandrababu Arrest) నేపథ్యంలో రేపు విజయవాడలో అన్ని పక్షాలతో సమావేశం నిర్వహిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (CPI Ramakrishna) తెలిపారు..

తర్వాత చంద్రబాబును కలిసి సంఘీభావం తెలుపుతామని చెప్పారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కక్షసాధింపు రాజకీయాలకు రాష్ట్రం వేదికగా మారిందని ఆక్షేపించారు. రాష్ట్ర అభివృద్ధి కంటే సీఎం జగన్‌కు ప్రతీకారం తీర్చుకోవడమే ప్రాధాన్యమైపోయిందని దుయ్యబట్టారు. 

సీఐడీ తీరుపైనా రామకృష్ణ (CPI Ramakrishna) ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐడీ జగన్‌ ప్రైవేట్‌ సైన్యంగా వ్యవహరిస్తోందన్నారు. రెండేళ్ల నుంచి చంద్రబాబును విచారణకు ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. పోలీసుల రాజ్యంలో విలువలు పతనమవుతున్నాయని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు..

మహిళా చైతన్యానికి ప్రతీక చాకలి ఐలమ్మ: మంత్రులు హరీష్ రావు శ్రీనివాస్ యాదవ్

చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిర్ణయించారని, అధికారికంగా నిర్వహించడం మనందరికి గర్వ కారణం అని రాష్ట్ర మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు అన్నారు.

జిల్లా కేంద్రమైన సిద్ధిపేట హౌసింగ్ బోర్డు సర్కిల్ లో చాకలి ఐలమ్మ వర్థంతి పురస్కరించుకుని ఆదివారం ఉదయం చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

జోహార్ చాకలి ఐలమ్మ అంటూ మంత్రులు నినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ పోరాట స్పూర్తిని పునికి పుచ్చుకుని తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసుకున్నాం.

కుల వృత్తులకు పూర్వ వైభవం తెచ్చేలా సీఎం కేసిఆర్ కృషి చేస్తున్నారని, సిద్దిపేటలో అన్ని సౌకర్యాలతో మోడరన్ దోబి ఘాట్ రజకుల సౌకర్యార్థం నిర్మించాం. ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా రజకులకు పెద్ద ఎత్తున రుణాలు, స్వయం ఉపాధి యూనిట్లను మంజూరు చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.

మంత్రి వెంట ఏంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ రోజాశర్మ, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు... ..

నలగొండ పద్మ నగర్ వాసి బాసాని సైదులు గారి తల్లి మృతి పట్ల సంతాపం తెలియజేసి ఆర్థిక సాయం అందజేసిన నాగం వర్షిత్ రెడ్డి

నల్లగొండ పట్టణం 17 వార్డు కి చెందిన బాసాని సైదులు గారి అమ్మ గారు పరమపదించారని తెలుసుకొని వెళ్లి వారి పార్ధీవ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేసి ఆర్థిక సహాయం అందచేసి వారి

కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటానని బరోసా కల్పించిన బిజెపి నాయకులు డా" నాగం వర్షిత్ రెడ్డి గారు మరియు 35వ వార్డు కౌన్సిలర్ గుర్రం ధనలక్ష్మి వెంకటేశ్వర్లు రాష్ట్ర చేనేత సెల్ కో కన్వీనర్ మిర్యాల వెంకటేశం,వెంకన్న,తారకరామ, రామలింగం,సతీష్ , శీను మరియు వార్డు నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Chidambaram: ప్రజాస్వామ్య దేశాల్లో ఎప్పుడూ ఇలా జరగలేదు: చిదంబరం

Kipp

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న జీ-20 సదస్సును పురస్కరించుకుని భారత్‌ మండపంలో ఏర్పాటు చేసిన విందుకు కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ( Mallikarjun Kharge)ను ఆహ్వానించకపోవడంపై పార్టీ శ్రేణులు భగ్గుమంటున్నాయి..

ఈ అంశంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి. చిదంబరం (P. Chidambaram) అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం ఆయన ట్విటర్‌ వేదికగా మోదీ సర్కారు తీరును విమర్శించారు.

విందుకు ప్రతిపక్ష నేతను ఆహ్వానించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. 'ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే జీ-20 సదస్సులో ఏర్పాటు చేసిన విందుకు గుర్తింపు ఉన్న ప్రతిపక్ష నాయకుడిని ఆహ్వానించకపోవడం బాధాకరం. ప్రజాస్వామ్య దేశాల్లో ఎక్కడా కూడా ఇలా జరిగి ఉండకపోవచ్చు. ఇలాంటి చర్య ప్రజాస్వామ్యం లేని దేశాల్లో మాత్రమే జరుగుతుంది. ఇంకా మన దేశంలో ప్రతిపక్షం ఉనికిని కోల్పోయే దశకు చేరుకోలేదనే నేను భావిస్తున్నాను' అని ట్వీట్‌ చేశారు. ఇదిలా ఉండగా.. యూరప్‌ పర్యటనలో ఉన్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ జీ20 సదస్సుకు పక్ష నేతను పిలవకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌లోని 60 శాతం మందికి ప్రతినిధిగా ఉన్న నేతకు ప్రస్తుత నాయకత్వం విలువ ఇవ్వడం లేదని అర్థమవుతోంది. వాళ్లు ఎందుకలా భావిస్తున్నారు అని ప్రశ్నించారు..

Kodali Nani: బాలకృష్ణపై కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు

బాలకృష్ణ ఏపీ సీఎం జగన్ మీద ఈ వ్యాఖ్యలు చేయడంతో మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర స్థాయిలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. పురందేశ్వరి, చంద్రబాబు కలిసి ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచారని.. అందుకే ఆయన అరెస్టును పురందేశ్వరి ఖండిస్తున్నారని మంత్రి కొడాలి నాని అన్నారు.

తలపై ఎవరిదో బొచ్చు పెట్టుకొని(విగ్) తిరుగుతున్న బాలకృష్ణ, ఇప్పుడైనా కనీసం బ్రెయిన్ అయినా వాడాలని అన్నారు. అంతేకాక 'బాలకృష్ణ బొచ్చు లెస్.. బ్రెయిన్ లెస్' అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నుంచి ప్యాకేజీ తీసుకొనే పవన్.. ఆయనకు మద్దతుగా మాట్లాడటం సహజమే అని కూడా పేర్కొన్నారు. ఇక అంతకముందు చంద్రబాబు అరెస్ట్ పై కొడాలి నాని ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ఇన్నాళ్లూ వ్యవస్థలను మేనేజ్ చేస్తూ వచ్చిన చంద్రబాబు పాపం పండింది అంటూ ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. తన పోస్ట్ కింద కరప్షన్ కింగ్ సీబీఎన్, స్కామ్ స్టార్ చంద్రబాబు అనే హ్యాష్ ట్యాగ్లు కూడా జత చేశారు..

తెలంగాణ ఇంజనీర్ల నైపుణ్యం మహా అద్భుతం

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఓ సాంకేతిక అద్భుతం. తెలంగాణ ఇంజినీర్ల నైపుణ్యానికి కొలమానం. శ్రీశైలం గట్టు నుంచి ప్రాజెక్టులో చివరిదైన కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ వరకు ఏర్పాటు చేసిన వాటర్‌ కండక్టర్‌ సిస్టమ్‌ పొడవు మొత్తంగా 112 కిలోమీటర్లు కాగా.. అందులో 61.08 కిలోమీటర్లు భూగర్భంలోనే ఉండడం విశేషం.

ప్రధాన ఓపెన్‌ కెనాల్‌ పొడవు కేవలం 50 కిలోమీటర్లు.. అంటే కృష్ణమ్మ నీళ్లు ఎక్కువ భాగం భూగర్భంలోనే పరవళ్లు తొక్కనున్నాయి. అదీగాక భారీ జలాశయాలు, వాటిలోకి నీళ్లుపోసే సిస్టర్న్‌లు, సబ్‌ స్టేషన్లు, సిబ్బంది క్వార్టర్స్‌ మాత్రమే భూ ఉపరితలంపై కనిపిస్తాయి. మిగతా నిర్మాణాలన్నీ పెద్దపెద్ద పంప్‌హౌస్‌లు, సర్జ్‌పూల్స్‌ భూగర్భంలోనే ఉన్నాయి. భూ ఉపరితలం నుంచి సగటున వంద మీటర్ల లోతులో నిర్మితమయ్యాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రాజెక్టు యావత్తు ఓ భూగర్భ అద్భుతం.

ఒక్కో సర్జ్‌పూల్‌ సగటు లోతు 75 మీటర్లు కావడం విశేషం. ప్రాజెక్టులో పంప్‌హౌస్‌లోని మోటర్ల వద్దకు చేరుకోవాలంటే ఉపరితలం నుంచి టన్నెల్‌ ద్వారా సగటున కిలో మీటర్‌ వరకు ప్రయాణించాల్సి ఉంది.

మొత్తం 11 ప్రధాన సొరంగాలు

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ప్రధాన నీటి తరలింపు నెట్‌వర్క్‌ పొడవు 112.06 కిలోమీటర్లు కాగా, అందులో ప్రధాన ఓపెన్‌ కాలువ 50.49 కిలో మీటర్లు.. కాగా మిగిలిన 61.08 కిలోమీటర్ల మార్గమంతా సొరంగమే కావడం విశేషం.

అదీగాక ప్రాజెక్టుకు నీటిని తీసుకునే ఇన్‌టేక్‌ పాయింట్‌ నుంచే సొరంగ నిర్మాణాలు ప్రారంభం కావడం మరో విశేషం. నీటిని శ్రీశైలం రిజర్వాయర్‌ బ్యాక్‌వాటర్‌ నుంచి తొలుత ఓపెన్‌ అప్రోచ్‌ కెనాల్‌ ద్వారా నార్లాపూర్‌ హెడ్‌రెగ్యులేటర్‌కు తీసుకెళ్తారు. అక్కడ దాదాపు ఒక కిలోమీటర్‌ పొడవుతో నిర్మించిన 3 సొరంగ మార్గాల ద్వారా నీటిని నార్లాపూర్‌ సర్జ్‌పూల్‌కు తీసుకెళ్తారు........