తెలుగు రాష్ట్రాల నుంచి హద్దులు దాటుతున్న గంజాయి: 8 మంది అరెస్టు

ఒడిశాలోని మాల్కన్‌గిరి నుండి ఆంద్రప్రదేశ్ లోని అమరావతి, వయా వరంగల్ మీదుగా మహారాష్ట్రకు గంజాయి రవాణా చేస్తున్న 8 మంది స్మగ్లర్లతో పాటు 75 లక్షల విలువజేసే 150 కిలోల ఎండు గంజాయిని వరంగల్ పోలీసులు గురువారం సాయంత్రం పట్టుకున్నారు. హసన్ పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లాపూర్ మీదుగా 4 కార్లలో గంజాయి అక్రమ రవాణా చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

ఒక్కో ప్యాకెట్లో రెండేసి కిలోలు ఉండే విధంగా 75 ప్యాకెట్లుగా చేసుకొని గుట్టుగా గంజాయి తరలిస్తుండగా అనుమానంతో కార్లను వెంబడించి గంజాయి స్మగ్లింగ్ వ్యవహారాన్ని బట్టబయలు చేశారు.

వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, హసన్ పర్తి పోలీసులు సంయుక్తంగా గంజాయి అక్రమ రవాణా ముఠాను చకచక్యంగా పట్టుకొన్నారు.

టాస్క్ ఫోర్స్ ఏసీపీ అలిగేటి మధుసూదన్, టాస్క్ ఫోర్స్ ఇన్స్ పెక్టర్లు పులి రమేశ్ , అల్లం రాంబాబు, పెండ్యాల దేవేందర్,హసన్ పర్తి సిఐ తుమ్మ గోపి, ఎసై నర్సింహారావు , వంశీలు చేజ్ చేసి పట్టుకొన్నారు. ధరవత్ రవి (38), చిలుక సురేష్ (32), గుగూలోతు హరిసింగ్ (45), జటోతూ.చంద్రు (40), జటోతూ. ప్రవీణ్ (21), సలవోద్దీన్ (29), అజాజ్ ఖాన్ (41),షేక్ శమీర్ (28)లను అరెస్ట్ చేశారు. ఇంకా కొందరు స్మగ్లర్లు పోలీసుల కళ్లుగప్పి జెస్ట్ కారులో పారి పోయారు........

Love Marriage: కుమార్తె ప్రేమ వివాహం.. దగ్గరుండి జరిపించిన వైకాపా ఎమ్మెల్యే

ప్రొద్దుటూరు: వైఎస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరు వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి తన మొదటి కుమార్తె పల్లవికి ప్రేమ వివాహం జరిపించారు. పవన్‌ అనే యువకుడితో సంప్రదాయబద్ధంగా బొల్లవరంలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో పెద్దల సమక్షంలో వివాహం చేశారు..

అనంతరం ప్రొద్దుటూరులోని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లి మ్యారేజ్‌ రిజిస్ట్రేషన్‌ చేయించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాచమల్లు మాట్లాడుతూ తన కుమార్తె ఇష్టప్రకారం వారిని ఆశీర్వదించి ప్రేమ వివాహం జరిపించానన్నారు. కలిసి చదువుకున్న రోజుల్లో ఇష్టపడటంతో పవన్‌తో పెళ్లి చేశామన్నారు. డబ్బు, హోదా, కులానికి విలువ ఇవ్వకుండా వారి ఇష్టప్రకారమే అంగీకరించి వివాహం చేశామని ఎమ్మెల్యే చెప్పారు.

ప్రశాంతంగాఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు.. సీపీ రెమా రాజేశ్వరి

రాబోయే అసెంబ్లీ ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా అంతర్ జిల్లా పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించినట్లు రామగుండం పోలీస్ కమిషనర్‌ రెమా రాజేశ్వరి తెలియజేశారు.

గురువారం రామగుండం కమిషనరేట్ లో పెద్దపల్లి డిసిపి గైక్వాడ్ వైబావ్ రఘునాథ్, నిర్మల్ ఎస్పి ప్రవీణ్ కుమార్, కొమురం భీమ్ ఆసిఫాబాద్ ఎస్పి సురేష్ కుమార్, జగిత్యాల్ ఎస్పి ఎ,భాస్కర్, జయశంకర్ భూపాలపల్లి ఎస్పి పి.కర్ణాకర్, కరీంనగర్ రూరల్ ఏసీపీ టి.కర్ణాకర్ రావులతో పాటు రామగుండం కమీషనరేట్ పరిదిలోని ఎసిపి, సిఐ, ఎస్ఐలతో అంతర్‌ జిల్లాల సరిహద్దు సమావేశం నిర్వహించారు.

  

అనంతరం మాట్లాడుతూ… అంతర్ జిల్లా సరిహద్దు చెక్‌పోస్టుల ఏర్పాటుకు ప్రాంతాలను గుర్తించడం,

సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టు కదలికలపై నిఘా, ఉమ్మడి కూంబింగ్ ఆపరేషన్, ఏరియా డామినేషన్స్, కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమాల కార్యాచరణ ప్రణాళికలపై చర్చించామన్నారు.

ఉమ్మడి అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ఓటింగ్ సంబంధిత పరికరాల రవాణా, బందోబస్తు ఏర్పాట్ల గురించి, సరిహద్దు ప్రాంతాల్లో మాదక ద్రవ్యాలు, మద్యం, ఆయుధాలు, ఇతర అక్రమ రవాణాను నియంత్రించడానికి ఉమ్మడి కార్యకలాపాల మీద సమాచారం సేకరించామన్నారు.

ఎన్నికల సంబంధిత పరస్పర సమాచార మార్పిడి, వివిఐపి, విఐపిల కదలికల సమయంలో పరస్పర సమాచార మార్పిడి, బందోబస్తు ఏర్పాట్లలో సహకారం అందించుకోవాలన్నారు.

ఎన్నికల ముందు, ఎన్నికల సమయంలో నేరాలకు పాల్పడే అవకాశం ఉన్న అనుమానితులను గుర్తించి వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించామన్నారు. 80 సంవత్సరాల పైబడిన వృద్దులకు, మూడోవంతు అంగవైకల్యం ఉన్న వారికీ భారత ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వుల ప్రకారం వారికీ ఓటు వేసే విధంగా ప్రత్యేక విభాగాల ఏర్పాటు కోసం చర్చించామన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒక ప్రత్యేక ప్రణాళికను రూపొందించి ఏజెన్సీ, సరిహద్దు ప్రాంతాల్లో ఎన్నికల ముందు, ఎన్నికల సమయంలో సరిహద్దు జిల్లాల పోలీసుల పరస్పరం సమాచార వ్యవస్థను సమన్వయం చేసుకొంటూ సాఫీగా ఎన్నికలు సాగేలా చూడాలని నిర్ణయించామన్నారు...

బిజెపి గూటికి చందూలాల్ కుమారుడు :అజ్మీరా ప్రహ్లాద్?

ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో వలసల పర్వం ఊపందుకుంది. ఒక పార్టీలో అసంతృప్తితో ఉన్న నేతలు వేరే పార్టీలోకి జంప్ అవుతున్నారు. వేరే పార్టీల నుంచి హామీలు లభిస్తే గోడ దూకేందుకు రెడీ అవుతున్నారు.

అధికార పార్టీ బీఆర్ఎస్‌లో అసంతృప్తితో ఉన్న నేతలు, టికెట్ ఆశించి భంగపడ్డ నేతులు వేరే పార్టీలవైపు చూస్తున్నారు. కాంగ్రెస్ లేదా బీజేపీలో చేరేందుకు అడుగులు వేస్తున్నారు.

ఈ క్రమంలో బీఆర్ఎస్‌కు మరో షాక్ తగిలింది. మాజీ మంత్రి చందూలాల్ కుమారుడు డాక్టర్ ఆజ్మీరా ప్రహ్లాద్ కాషాయ కండువా కప్పుకోనున్నారు. గత కొంతకాలంగా ఆయన బీఆర్ఎస్‌లో అసంతృప్తితో ఉన్నారు.

దీంతో ఇప్పుడు ఎన్నికల వేళ బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 12న ఆయన కమలం గూటికి చేరనున్నారు. ఆ రోజు ములుగులో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి,. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారు...

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ... అధిక ధరలు, నిరుద్యోగం, ఉపాధి కుదింపునకు

నిత్యావసర సరుకుల ధరలు ఆకాశంలో.... ఉద్యోగాల్లేక నిరుద్యోగులు ఎదురుచూపులు... ఉపాధి పథకానికి కేటాయింపులు కుదించడంతో కూలీల బ్రతుకులు ఆగమాగం... మహిళల బ్రతుకులు ఛిద్రం... కుల, మత ఘర్షణలు తాండవిస్తున్నది. దేశంలో బిజెపి ప్రభుత్వం సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైంది. ఒక వైపు పేదలపై భారాలు వేస్తూ, ప్రజావ్యతిరేక విధానాలను అమలు చేస్తూ మరోవైపు కార్పొరేట్లకు, పెట్టుబడిదారులకు లక్షల కోట్ల రూపాయలను రాయితీ ఇస్తున్నది. రాష్ట్రాల హక్కులను హరిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఈనెల 7 నుండి నుండి వచ్చేనెల 7 వరకు

 సిపిఐ(ఎం ఎల్) కార్యదర్శి కామ్రేడ్ జే ఎస్ ఆర్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు.

 ప్రజలు ప్రజాస్వామికవాదులు ప్రజాసంఘాలు ఎక్కడికక్కడ ప్రజాస్వామిక పోరాటాలకు ఉద్యమాలకు సిద్ధం కావాలని ప్రజలందరూ ప్రజా ఉద్యమాలలో పాల్గొనాలని సిపిఐ ఎంఎల్ కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీ కామ్రేడ్

 జే ఎస్ ఆర్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రజలకు ప్రజాస్వామ్యవాదులకు విజ్ఞప్తి చేశారు.

మోడీజీ! ప్రజల ధరల కన్నీళ్లు కనపడ్తలేవా?

దేశంలో రోజురోజుకీ నిత్యావసర సరుకుల ధరలు హద్దూ అదుపు లేకుండా పెరుగుతున్నాయి. బియ్యం ధరలకు రెక్కలొచ్చాయి. పప్పుల ధరలు కొండెక్కాయి. కూరగాయలు, నూనెల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. దేశంలో.... కోట్ల మంది ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారు. వీరిపై పన్నుల భారం పెంచి మరింత దారిద్య్రంలోకి నెడుతున్నారు. నిత్యావసర సరుకుల ధరలు 2014లో ఉన్న ధరలను పరిశీలిస్తే నేడు 50శాతం నుండి 200శాతం వరకు సరుకుల ధరలు పెరిగాయి, కూరగాయల ధరలు ఈ నెలలోనే 37శాతం వరకు పెరిగాయి. పప్పులు 45శాతం పెరిగాయి. బియ్యం ధర కేజి రు. 60లకు చేరింది. గ్యాస్ ధరలు నేడు రు. 1200కు చేరింది. పాల ధరలు పెరిగాయి. ఇదే అదునుగా వ్యాపారస్తులు కృత్రిమ కొరతను సృష్టించి ధరలు మరింత పెంచేశారు. ధరలు అదుపు చేయాల్సిన ప్రభుత్వం వారి కొమ్ము కాస్తున్నది. నిత్యావసర సరుకులపై 12-18 శాతం పన్నులు వేయడంతో అనివార్యంగా ధరలు పెరుగుతున్నాయి. దీనికి తోడు విద్య, వైద్యం కోసం వేలకోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి రావడంతో ప్రజలు అప్పులు చేస్తూ వడ్డీ కోరల్లో చిక్కుకుంటున్నారు. పన్నులు తగ్గించడం ద్వారా ధరలు తగ్గుతాయని సిపిఐఎం ఎల్ వామపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయనీ కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీ కామ్రేడ్ జే ఎస్ ఆర్ పేర్కొన్నారు.

ప్రజల కొనుగోలుశక్తి దెబ్బతినే విధంగా ఉపాధి, ఆదాయం తగ్గింది. కరోనా తరువాత నేటికీ తిరిగి ఉపాధి అవకాశాలు మెరుగుపడలేదు. పట్టణాలలో వ్యాపారాలు, హోటళ్ళలో పనిచేసేవారు నిరుద్యోగులుగా మారారు. గ్రామీణ ప్రాంతంలో నేడు కొద్దో గొప్పో ఉపాధి దొరకుతుందంటే అది వామపక్షాల కృషితో వచ్చిన ఉపాధి హామీపథకం వల్లనే. ఈ పథకాన్ని కూడా ఎత్తివేయాలని కుట్రలు పన్నుతోంది నేటి బిజెపి ప్రభుత్వం. కనీస జీవనాధారంగా ఉన్న ఉపాధిహామీ పథకానికి కేటాయింపులు తగ్గించారు. 2021-22లో రూ. 98,468 కోట్లు, 2022-23లో రూ. 89,400 2324లో రూ.60,000కోట్లకు తగ్గించారు. గ్రామీణ ప్రాంతాలలో 40శాతం ప్రజలు పౌష్టికాహారలోపంతో ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధిహామి పథకాన్ని పట్టణ ప్రాంతాలకు విస్తరించడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తున్నది. 57శాతం మహిళలు, 67 శాతం పిల్లలు రక్తహీనతతో బాధపడుతున్నారని మానవవనరుల అభివృద్ధి సూచిక పేర్కొన్నది. పేదరికంలో ప్రపంచంలోని 121 దేశాలలో మన దేశం 107వ ర్యాంకులో ఉంది. 2016 నుండి మనదేశ ర్యాంకు పడిపోతూనే వున్నది. ఇప్పటికే 19శాతం గ్రామాల్లో మరుగుదొడ్ల సౌకర్యం లేదు.

సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలెక్కడ?

మన దేశంలో యువత 65 శాతం వరకు వున్నారు. వీరిలో గణనీయమైన సంఖ్యలో ఉపాధి, ఉద్యోగం కరువై నిరుద్యోగులుగా తిరుగుతున్నారు. డిగ్రీలు, పిజీలు చదివిన వారు కూడా కూలి పనులకు వెళుతున్నారు. 2014 ఎన్నికల సందర్భంగా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానని మోడీ హామినిచ్చారు. కానీ ఆచరణలో వున్న ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. ఈ కాలంలో దాదాపు ఒక కోటి 50లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలే లక్షలాదిగా ఖాళీలున్నాయి. వాటిని భర్తీ చేయడానికి ప్రభుత్వం సిద్ధపడటం లేదు. దళిత, గిరిజన బ్యాక్లాగ్ పోస్టులు నింపడం లేదు. సైన్యంలో రిక్రూట్మెంట్ కొరకు యువత ఎదురుచూస్తున్న తరుణంలో అగ్నిపథ్ పేరుతో కాంట్రాక్ట్ ఉద్యోగాలను నింపాలని చూసిందనీ ప్రజాతంత్ర ఉద్యమకారుడు కామ్రేడ్ జే ఎస్ ఆర్ పేర్కొన్నారు.దీన్ని యువత పెద్దఎత్తున వ్యతిరేకించి, ఆందోళనలు చేసింది. అయినా మోడీ ప్రభుత్వం అమలు చేసింది. నేడు దేశంలో నిరుద్యోగం 10శాతం వరకు వున్నదని లెక్కలు చెపుతున్నాయి. ప్రయివేటు కంపెనీలలో నిర్ధాక్షిణ్యంగా ఉ ద్యోగులను తొలగిస్తున్నారనీ. ప్రజాస్వామిక వాది కామ్రేడ్ జే ఎస్ ఆర్ తెలిపారు. దీంతో పాటు మోడీ సర్కార్ లేబర్ కోడ్లు తెచ్చి కార్పొరేట్లకు రక్షణ కల్పిస్తున్నది. యువతే దేశానికి దిక్సూచి అని ప్రగల్భాలు పలుకుతున్న మోడీ ప్రభుత్వం యువతను నిర్వీర్యం చేస్తున్నది. వారి అసంతృప్తి మతోన్మాదంవైపు మళ్లించి చెలగాటమాడుతున్నది. మతోన్మాదం ఆవహించిన ఆర్ఎస్ఎస్ మూకలు పేదలు, మైనార్టీలపై దాడులకు తెగబడుతున్నారనీ వామపక్ష ప్రజాతంత్ర ఉద్యమకారుడు కామ్రేడ్ జెఎస్ఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

మోడీ ప్రభుత్వం కార్పొరేట్ల పక్షమే..

ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తూ కార్పోరేట్లకు లాభాలు కట్టబెడుతున్నారు. పన్నుల భారాన్ని పేదలపై పెద్దఎత్తున పెంచారు. పరోక్ష | పన్నులు అనగా జిఎస్టి, నిత్యావసర సరుకులపై సెస్సులు వేస్తున్నారు. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వానికి 2022-23లో రూ.19.35 లక్షల కోట్ల ఆదాయం రాగా, 2023-24కు రూ.23.30 లక్షల కోట్లకు పెరిగింది. పరోక్ష పన్నులు 39శాతం నుండి 42.74 శాతానికి పెంచారు. ధనికులపై వేసే ప్రత్యక్ష పన్నులు మాత్రం ఇతర దేశాలలో 35శాతం ఉండగా మన దేశంలో 25-28శాతం మాత్రమే విధిస్తున్నారు. ఇది ప్రత్యక్షంగా కార్పోరేట్లకు లాభాలు కట్టబెట్టడమే. అంతేకాక ఉపాధి కల్పించే ప్రభుత్వరంగ సంస్థలను తక్కువ ధరలకు కార్పోరేట్లకు అమ్మేసి లక్షల కోట్లు ఖజానాలో వేసుకుంటున్నారు. రిజర్వుబ్యాంకు మిగులు నిధులను పేదలకు ఉపయోగపడే పథకాలకు బదులుగా కార్పోరేట్లకు ఈ కాలంలోనే రూ.4.69 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం ద్వారా అందించారు. బ్యాంకులలో లక్షల కోట్లు రుణాలు తీసుకుని ఎగవేసిన సంస్థలు. ప్రభుత్వ సహకారంతో వారు దేశం విడిచి వెళ్ళారు. దేశంలో 22శాతం సంపద ఒక్క శాతం కోటీశ్వరుల చేతుల్లో వున్నది. మరోవైపు 40శాతం సంపద కేవలం 20శాతం మంది వద్ద వున్నది. ఇదిలా వుంటే కేంద్ర ప్రభుత్వం ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేస్తూ ప్రజలను అప్పుల్లోకి దించుతోంది. గత 67 ఏళ్లలో దేశం మొత్తం అప్పు 55.87లక్షల కోట్లు ఉండగా గత 9 ఏండ్లలో మోడీ ప్రభుత్వం 100 లక్షల కోట్లు ఎఫ్ఆర్ఎం పరిధికి మించి అప్పు చేసింది. జిడిపిలో 40శాతానికి మించి అప్పు చేయకూడదనే నిబంధన ఉంది. నేడు మొత్తం అప్పు 57 శాతానికి చేరింది. ఈ అప్పుల వల్ల ప్రతి భారతీయుని తలపై ఒక లక్షా 10 వేల రూపాయల అప్పు కత్తిలా వేలాడుతున్నది.

పేదలపైనే భారాలన్నీ.. దళిత, గిరిజన, మైనార్టీలే టార్గెట్....

తిమ్మిని బమ్మిని చేయడం, లేనిది వున్నట్లు చూపడం మోడీకి వెన్నతో పెట్టిన విద్య, దళిత, గిరిజన, మైనారిటీలకు కేటాయించిన ఉప ప్రణాళిక నిధులను, సబ్సిడీలను 50శాతం వరకు తగ్గించారు. ఆ వర్గాలను సంతృప్తిపరడానికి రకరకాల పథకాలున్నాయని మభ్యపెడుతోంది. ప్రభుత్వం. ఉపాధితోపాటు, ఆవాసాలు లేకుండా చేయడానికి చట్టాలను మారుస్తోంది. వారి స్వాధీనంలో ఉన్న భూములను కార్పోరేట్ల హస్తగతం చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఈ కాలంలో అటవీహక్కుల చట్టానికి సవరణలు తెచ్చారు. భూసేకరణ చట్టానికి మార్పులు తెచ్చారు. నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా తరిమివేస్తున్నారు. విద్యా, వైద్యానికి దూరం చేస్తున్నారు.

తెలంగాణకు శుష్క వాగ్దానాలే..

రాష్ట్ర విభజన అనంతరం కేంద్రం తెలంగాణకు అనేక వాగ్దానాలు చేసింది. కాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హెూదా, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ, నిజామాబాద్ లో పసుపుబోర్డు, రాష్ట్రానికి గిరిజన యూనివర్సిటీ, రాష్ట్రంలో మూడు ఎయిర్పోర్టులు, చేనేతపై జిఎస్టీ తొలగింపు వంటివి వున్నాయి. వాటి ఊసే లేదు. అతీగతీ లేదు. రాష్ట్ర విభజన సమస్యలు పెండింగులోనే వున్నాయి. నీటి వాటా కేటాయింపు నానుతూనే వున్నది. చట్టబద్ధంగా రావాల్సిన నిధులు కూడా సకాలంలో విడుదల చేయకుండా వేధిస్తున్నది. కేంద్రం తెలంగాణపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది.

చ్చిన హామీలను అమలుచేయని రాష్ట్రప్రభుత్వం

రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అనేక హామీలనిచ్చింది. 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం 11.5 లక్షల ఎకరాలకు హక్కుపత్రాలు ఇస్తామని, కేవలం 4లక్షల ఎకరాలకు మాత్రమే ఇచ్చారు. దళితులు, గిరిజనులకు 3ఎకరాల భూమి ఇవ్వలేదు. కార్మికులకు కనీస వేతనాలు సవరించలేదు, సమ్మెల పట్ల అసహనాన్ని ప్రదర్శిస్తున్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం పక్కనపెట్టి కొత్తగా గృహలక్ష్మి పథకం తెచ్చారు. అదికూడా అర్హులకు అందే అవకాశం లేదు. రాష్ట్రంలో 16లక్షల మంది కౌలురైతులకు 2011 చట్టం ప్రకారం రుణార్హత కార్డులు ఇచ్చి, రుణమాఫీతో పాటు వడ్డీకూడా మాఫీ చేయాలి. సాగునీటి ప్రాజెక్టులు ప్రాధాన్యతా క్రమంలో పూర్తిచేయకపోవడం వల్ల వెనకబడిన ప్రాంతాలకు సాగునీటి సౌకర్యం లేదు. ఖాళీగా వున్న ఉద్యోగాలను పూర్తిస్థాయిలో భర్తీ చేయడంలేదనీ కమ్యూనిస్టు విప్లవకారుడు కామ్రేడ్ జే ఎస్ ఆర్ పేర్కొన్నారు.

అందువల్ల పేదలు, సామాన్య మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితుల నేపథ్యంలో తక్షణమే క్రింది కోర్కెలు నెరవేర్చాలని వామపక్ష ప్రజాతంత్ర ఉద్యమకారుడు కామ్రేడ్ 

జే ఎస్ ఆర్ డిమాండ్ చేశారు.. నిత్యావసర సరుకుల ధరలను తక్షణమే తగ్గించాలి. మార్కెటింగ్ వ్యవస్థను పట్టిష్టపరిచి, బ్లాక్ మార్కెట్ను అరికట్టాలి. పేదలపై వేసిన పన్నుల భారాన్ని పూర్తిగా తగ్గించాలి. కార్పోరేట్ సంస్థలపై ఆదాయపు పన్నును 50శాతానికి పెంచాలి. ఉపాధిహామీ పనులకు కేటాయింపులను 3 రెట్లు పెంచాలి. విద్య, వైద్య సౌకర్యాలు ఉచితంగా కల్పించాలి. పేదలందరికీ ఆవాసాలు కల్పించాలి. కేంద్ర ప్రభుత్వ ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలనీ శ్రమజీవుల హక్కులకై నిరంతరం పోరాటం కొనసాగిస్తున్న సిపిఐ ఎమ్మెల్ సెక్రటరీ కామ్రేడ్

 జే ఎస్ ఆర్ డిమాండ్ చేశారు.

పై కోర్కెల సాధనకు ఈనెల 7 నుండి వచ్చేనెల 7 వరకు నెలరోజుల పాటు జరుగు జన చైతన్య జైత్రయాత్ర కార్యక్రమాలలో... దేశవ్యాపితంగా జరిగే నిరసన ఉద్యమంలో ప్రజలందరూ పెద్దఎత్తున

పాల్గొనాలనీ 

నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ కూలి ఇద్దరు దుర్మరణం

హైదరాబాద్:

నిర్మాణంలో ఉన్న భవనం కూలి ఇద్దరు మృతి చెందిన ఘటన హైదర్ నగర్ డివిజన్ అడ్డగుట్టలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం..

అడ్డగుట్టలో ఓ బిల్డింగ్ నిర్మాణం వద్ద పనిచేస్తున్న క్రమంలో నిర్మాణంలో ఉన్న భవనం పై అంతస్తులో ఒకవైపు గోడ కూలిపోయింది. ఈ ఘటనలో ఒడిశా రాష్ట్రానికి చెందిన వలస కూలీలు సోనీ, సంతోష్ అనే ఇద్దరు కార్మికులు అక్కడిక్కడే మృతి చెందారు.

మరో ముగ్గురు తీవ్రంగా గాయపడడంతో వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

అక్కడికి చేరుకున్న పోలీసులు స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు.

*5555 మందితో ఈనెల 13న రక్త దానం శిబిరం*

పెద్దపల్లి జిల్లా:

ఆపదలో ఉన్నవారికి ప్రాణదానం చేసేందుకు పెద్దపల్లి పోలీసులు మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారు.

ఈనెల 13న పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల మైదానంలో మెగా రక్తదాన శిబిరం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. 5,555 మంది యువతీ యువకులతో రక్తదానం చేయించేందుకు సనాహాలు చేశారు.

ఇంత పెద్ద సంఖ్యలో గతంలో ఎన్నడూ రక్తదాన శిబిరం జరగలేదని, ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకోబోతుందన్నారు.

రామగుండం సిపి రెమా రాజేశ్వరి, డిసిపి వైభవ్ గైక్వాడ్ ల ఆదేశాల మేరకు పెద్దపల్లి సబ్ డివిజన్ లోని శిబిరం ఏర్పాటు చేశామని, ఇప్పటికే 5వేల మందికి పైగా యువతీ యువకులు రక్తదానం చేసేందుకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు.

యువత రక్తదానం చేసిన ముందుకు రావాలని, రక్తదానం ఆపదలో ఉన్న వారికి ప్రాణదానం చేస్తుందన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ, లయన్స్ క్లబ్ సహకారంతో శిబిరం నిర్వహిస్తున్నామన్నారు........

*సైబర్‌ నేరాలను అరికట్టాలి : హోంమంత్రి*

సైబర్‌ నేరాలను అరికట్టాలని హోంమంత్రి మహమూద్‌ అలీ పోలీసు అధికారులకు సూచించారు. డీజీపీ, మూడు కమిషనరేట్ల సీపీలతో హోంమంత్రి మహమూద్‌ అలీ బుధవారం సాయంత్రం సమీక్ష సమావేశం నిర్వహించారు.

సాంకేతిక వినియోగం, నేరాల నియంత్రణపై చర్చించారు. పోలీసుల పనితీరును ఈ సందర్భంగా అభినందించారు. మరింత కృషి చేస్తూ నేరాలను అరికట్టాలని సూచించారు.

సీసీఐటీవీ కెమెరాల ఏర్పాటు, నిఘాలో దేశంలోనే అగ్రస్థానంలోనే ఉన్నామన్నారు. కాలనీ, బస్తీలు, కూడళ్లలో మరిన్ని కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. వివాదాస్పద పోస్టులు పెట్టేవారిపై చర్యలు తీసుకోవాలని, కొత్త ఠాణాలు, జోన్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

సైబర్‌ నేరాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి అరికట్టాలని, సైబర్‌ నేరాలపై అవగాహన పెంచాలని సూచించారు........

ఈ నెల 9 న ప్రజాకవి కాళోజీ కళాక్షేత్రం ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్*

ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌ ఈ నెల 9న వరంగల్‌ నగరానికి రానున్నారని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ తెలిపారు.

ఈ మేరకు బుధవారం కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో పురపాలక శాఖ ముఖ్య స్పెషల్‌ కార్యదర్శి అరవింద్‌కుమార్‌, మేయర్‌ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్‌, అరూరి రమేశ్‌, ఎమ్మెల్సీ బస్వరాజ్‌ సారయ్య, కుడా చైర్మన్‌ సుందర్‌రాజ్‌తో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దాస్యం మాట్లాడుతూ..

వరంగల్‌ నగరంలో నిర్మించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు కళాక్షేత్రాన్ని ఈ నెల 9న ఆయన జయంతి సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ప్రారంభిస్తారని తెలిపారు. ఇప్పటికే కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయని, ప్రారంభానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.

ప్రారంభ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌తో పాటు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌ పాల్గొంటారని, కవులు, కళాకారులతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.

నగరంలో మధ్య తరగతి వర్గాల కోసం కుడా ఆధ్వర్యంలో అపార్ట్‌మెంట్లను నిర్మిస్తామని, కాస్ట్‌ టు కాస్ట్‌ పద్ధ్దతిలో మధ్య తరగతి వర్గాలు అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లు కోనుగోలు చేసుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని వివరించారు. వరంగల్‌లో కార్మికుల కోసం కార్మిక భవన్‌ నిర్మిస్తున్నామని, 6 మాడల్‌ లేబర్‌ అడ్డాలకు షెల్టర్లను నిర్మించనున్నామని, సమ్మయ్యనగర్‌ నాలా పక్కనున్న వరద భాదితులకు 9 అంతస్తులతో అపార్ట్‌మెంట్‌ నిర్మించి ఫ్లాట్లు అందజేస్తామని పేర్కొన్నారు.

పెద్దమ్మగడ్డ రోడ్డు విస్తరణలో ఇండ్లు కోల్పోయిన వారికి ఆ గృహ సముదాయంలో ఇండ్లు కేటాయిస్తామని చెప్పారు. చారిత్రక వరంగల్‌ నగరంపై సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక దృష్టిసారిస్తున్నారని వినయ్‌ భాస్కర్‌ తెలిపారు. హైదరాబాద్‌ తర్వాత రెండో నగరంగా ఉన్న వరంగల్‌ అభివృద్ధి కోసం తొమ్మిదేండ్లలో రూ.4,500 కోట్లు ఖర్చు చేశారని వెల్లడించారు.

నగరంలో రూ.3 కోట్లతో చేపట్టిన 19 జంక్షన్ల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, వరదల వల్ల జరిగిన నష్టానికి మంత్రి కేటీఆర్‌ రూ.250 కోట్లు మంజూరు చేశారని చీఫ్‌ విప్‌ తెలిపారు. నగరానికి విచ్చేసిన ఎంఏయూడీ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అరవింద్‌కుమార్‌ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కాళోజీ కళాక్షేత్రం పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు.......

*మనీషా, శివానీల మృతి పై సమగ్ర విచారణ చేపట్టాలి, వారి కుటుంబాలను ఆదుకోవాలి.*

 AISF, PDSU,TSU,PYL సంఘాల డిమాండ్

నల్లగొండ నడిబొడ్డులో నిన్న సాయంత్రం ఉమెన్స్ డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థినిలు మనీషా, శివానిలో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది, ఇప్పటికీ 24 గంటలు గడుస్తున్న పోలీసులు సమగ్ర విచారణ చేపట్టకపోవడం దురదృష్టకరమని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. వెంటనే వారి మృతిపై తగిన విచారణ చేపట్టి కారణాలను వెలికి తీయాలని ఏఐఎస్ఎఫ్, పి డి ఎస్ యు, టి ఎస్ యు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

  స్థానిక మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థినిలతో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా పిడిఎస్ యూ జిల్లా ఇన్చార్జి ఇందూరు సాగర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముదిగొండ మురళి కృష్ణ, టి ఎస్ యు జిల్లా అధ్యక్షులు కొండేటి మురళి పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని ఇలాంటి క్రమంలో ధైర్యంతో ఉండాలని సూచించారు. విద్యార్థులపై అసాంఘిక శక్తులు ప్రేమ పేరుతో వేధించినా, కాలేజీలో, హాస్టల్లో ఇబ్బందులు జరిగిన పోలీసులకు, విద్యార్థి సంఘ నాయకులకు, మహిళా సంఘాల నాయకులకు సమాచారం ఇవ్వాలి తప్ప ఆత్మహత్యలు చేసుకోవద్దని తెలిపారు. నల్లగొండలో నిన్న విద్యార్థినిలు ఆత్మహత్యలు చేసుకోవడం దురదృష్టకరమని, ఆత్మహత్యలు సరైన విధానం కాదని వారు తెలిపారు. మనిషా, శివానీల ఆత్మహత్యపై పోలీసులు సమగ్రంగా విచారణ చేపట్టాలని, దోషులను శిక్షించాలని వారు డిమాండ్ చేశారు, రాష్ట్రంలో విద్యార్థులకు రక్షణగా ఎన్ని చట్టాలు వచ్చినా, "షీ"టీం, నిర్భయ చట్టాలాంటి వచ్చినప్పటికీ మహిళలకు, విద్యార్థులకు భరోసా కల్పించలేకపోయారని, రక్షణ కల్పించలేకపోయారని వారు అన్నారు. ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థినిల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.సోషల్ మీడియాపై విద్యార్థులకు ప్రభుత్వం అవగాహన కల్పించాలని అన్నారు.సోషల్ మీడియాలలో చెడును గ్రహించి విద్యార్థులు దూరంగా ఉండాలని అన్నారు.

  ఈ కార్యక్రమంలో పిడిఎస్ యూ జిల్లా కార్యదర్శి పోలే పవన్, ఏఐఎస్ఎఫ్ పట్టణ నాయకులు ఎర్ర వినయ్, పి వై ఎల్ జిల్లా కార్యదర్శి బీవీ చారి, విద్యార్థినిలు రేణుక, స్వప్న, పల్లవి ,భార్గవి, లలిత ,స్నేహ సునీత, స్పందన ,మల్లేశ్వరి, సురేఖ తదితరులు పాల్గొన్నారు.