NLG:డిగ్రీ కళాశాల అధ్యాపకులకు బదిలీలు నిర్వహించాలని నిరసన
నల్గొండ: జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది బుధవారం భోజన విరామ సమయంలో బదిలీలు చేపట్టాలని నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. గత ఐదు సంవత్సరాలుగా డిగ్రీ కళాశాల అధ్యాపకులకు బదిలీలు నిర్వహించకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందికి బదిలీలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం టీచర్లకు బదిలీ నిర్వహిస్తున్నారు, అదేవిధంగా డిగ్రీ కళాశాల అధ్యాపకులకు కూడా వెంటనే బదిలీలు చేపట్టాలని, అదేవిధంగా పిఆర్సి బకాయిలను కూడా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో అధ్యాపకుల సంఘం నాయకులు నాగుల వేణు యాదవ్, డాక్టర్ సీతారాం రాథోడ్, డాక్టర్ దుర్గాప్రసాద్, డాక్టర్స్ శీలం యాదగిరి, వివి సుబ్బారావు, వెల్దండ శ్రీధర్, శివరాణి, యాదగిరి రావు, ఫిజికల్ డైరెక్టర్ మల్లేష్, డాక్టర్ కృష్ణ కౌండిన్య, డాక్టర్ లక్ష్మణ్ గౌడ్, మల్లేష్, వెంకట్ రెడ్డి భాస్కర్, మధు, భరణి, తదితరులు పాల్గొన్నారు.
Sep 07 2023, 15:21