ఆశా లకు కనీస వేతనం రూ. 18000 అందజేయాలని వినతిపత్రం
మర్రిగూడ: ఆశా వర్కర్స్ కు కనీస వేతనం రూ.18000/- ఇవ్వాలని, మండలంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో వివిధ డిమాండ్ల పరిష్కరించాలని ఆశాలు మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఈసందర్బంగా ఆశా వర్కర్స్ కు కనీస వేతనం రూ.18000/- నిర్ణయించి అర్హులైన వారికి సెకండ్ ఏఎన్ఎం గా ప్రమోషన్లు కల్పించాలని సిఐటియు నల్లగొండ జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య డిమాండ్ చేశారు.
పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఇస్తున్న పారితోషికాలు 18,000/- లకు పెంచి ఫిక్స్డ్ వేతనం నిర్వహించాలని, అదనపు పనులు ఆశా లతో చేయించకూడదని, ఆశా ల పని భారం తగ్గించాలని, పెండింగ్లో ఉన్న కరోనా రిస్క్ అలవెన్స్ బకాయి డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా ప్రమాద బీమా, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 11న ఆశ వర్కర్లు వారి సమస్యలను పరిష్కరించాలని చలో హైదరాబాద్ నిర్వహిస్తున్నట్లు, దీనిలో ఆశా వర్కర్లు అందరు పాల్గొని జయప్రదం చేయాలని ఆయన ఆశ వర్కర్లను కోరారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ మర్రిగూడ మండల అధ్యక్షులు కార్యదర్శి మట్టం భాగ్యమ్మ, జంపాల వసంత, ఏర్పుల పద్మ, సైదా బేగం తదితరులు పాల్గొన్నారు.
Sep 06 2023, 15:05