NLG: ఏఎన్ఎం ల సమ్మె తాత్కాలికంగా వాయిదా
నల్లగొండ: రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీయూసీ ఆద్వర్యంలో రెండవ ఏఎన్ఎం లు చేస్తున్న నిరవధిక సమ్మెను, ప్రభుత్వం సమస్యల పరిష్కారం కోసం త్రీమెన్ కమిటీ వేసినందున, సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి తెలిపారు. సోమవారం నల్లగొండ డిఎంహెచ్ఓ కొండల్ రావు కు తాత్కాలిక సమ్మె వాయిదా లెటర్ అందజేశారు.
ప్రభుత్వం వేసిన త్రీమెన్ కమిటీ సభ్యులు తక్షణమే ఏఎన్ఎం లకు ఇచ్చిన హామీలు అమలు చేయడం కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా కోరారు. గత 20 రోజులుగా ఎన్నో వ్యయ ప్రయాసలతో ఏఎన్ఎం లు ఆందోళన నిర్వహించడం జరిగిందని, ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆయన కోరారు.
ప్రభుత్వం తరుపున హామీ ఇచ్చిన డైరెక్టర్ ఆఫ్ హెల్త్ గడల శ్రీనివాస్, హామీలను పరిష్కారం చేయకపోతే మళ్లీ సమ్మె చేపడతామని దేవేందర్ రెడ్డి స్పష్టం చేశారు. గత 20 రోజులుగా జరిగిన సమ్మె కు సహకరించిన వివిధ రాజకీయ పార్టీల, ప్రజాసంఘాల నాయకులకు, అధికారులకు, పోలీసులకు పత్రిక విలేకరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రెండవ ఏఎన్ఎం ల యూనియన్ జిల్లా అధ్యక్షురాలు పోలే రత్నకుమారి ,కార్యదర్శి నరసమ్మ, సునిత, రుక్సాన, గీతా రాణి, వసుమతి, హైమవతి, సాలమ్మా, ఫోజియ, శకుంతల, సరళ, అన్నమ్మ, లక్ష్మి, రమాదేవి, అండాలు, విజయలక్ష్మి, శైలజ, జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.
Sep 06 2023, 09:06