NLG: నాగార్జున ప్రభుత్వ కళాశాల అధ్యాపకులకు 'ఉత్తమ అధ్యాపకుల అవార్డు'
తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో,  సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి మరియు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నాగార్జున ప్రభుత్వ కళాశాలలో విధులు నిర్వర్తిస్తున్న అధ్యాపకులు రాష్ట్ర ఉత్తమ అధ్యాపకులుగా ఎంపికైనారు. హైదరాబాదులో ఈరోజు  రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి, మరియు రాష్ట్ర హోం శాఖ మంత్రి అహ్మద్ అలీ ఉత్తమ అధ్యాపకులకు అవార్డులు ప్రధానం చేశారు. నల్లగొండ లోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో విధులు నిర్వహిస్తున్న అధ్యాపకులు డాక్టర్ అంతటి శ్రీనివాసులు (రశాయన శాస్త్రం), డాక్టర్ ఎన్. దీపిక (తెలుగు)  ఉత్తమ అధ్యాపకులు అవార్డ్ -2023 మంత్రుల చేతుల మీదుగా అవార్డులు  స్వీకరించారు. ఈ సందర్భంగా కళాశాల  ప్రిన్సిపల్ డాక్టర్ గన్ శ్యామ్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ మునీర్, ఇతర అధ్యాపకులు అవార్డులు పొందిన  అధ్యాపకులను అభినందిస్తూ హర్షం వ్యక్తం చేశారు.
NLG: గురుకులంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
నల్లగొండ: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల మరియు కళాశాల నిడమనూరు నందు మంగళవారం ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రిన్సిపల్ అరుణ మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. అనంతరం ప్రిన్సిపల్ అరుణ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరి జీవితం పాఠశాల నుండే ప్రారంభమవుతుందని, పాఠశాలలో కష్టపడి చదువుకోవాలని ప్రతి ఉపాధ్యాయుడు ఉపాధ్యాయురాలు కోరుకుంటారని, తమ విద్యార్థులు అభివృద్ధి చెంది ఉన్నత శిఖరాలలో ఉన్నప్పుడు మా విద్యార్ది అని గొప్పగా చెప్పుకుంటారు. ఉపాధ్యాయులకు అంతకుమించిన ఆస్తి మరేమి ఉండదని అన్నారు. విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అవరోదించాలని, తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా  సాంఘిక సంక్షేమ గురుకుల సంస్థలో నల్లగొండ రీజియన్ నుండి ఇంగ్లీష్ సబ్జెక్టు నందు ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎంపికై  శివరాణి ని ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయ బృందం ఘనంగా సన్మానించారు.
NLG: ఉపాధ్యాయులను సన్మానించిన తల్లిదండ్రుల సంఘం
నల్లగొండ: ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకొని, చండూరు గురుకుల పాఠశాల/ కళాశాలలో తల్లిదండ్రుల సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులను శాలువల తో సత్కరించి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రుల సంఘం కమిటీ సభ్యులు గ్యార యాదగిరి జనరల్ సెక్రెటరీ, సుష్మ, నాగన్న, అద్దంకి కిరణ్, రాజు, శ్రీను, సత్తయ్య, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు
చండూర్ రెవిన్యూ డివిజన్ ఏర్పాటును స్వాగతించిన సిపిఎం మర్రిగూడ మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య
నల్లగొండ జిల్లా, మర్రిగూడ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చండూరు మండలాన్ని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయుటకు ప్రతిపాదనల నోటిఫికేషన్ ఉత్తర్వులు జారీ చేసినందుకు సిపిఎం పార్టీ మర్రిగూడ మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య స్వాగతిస్తూ వర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పుల యాదయ్య మంగళవారం మాట్లాడుతూ..  మర్రిగూడ, నాంపల్లి మండలాలు దేవరకొండ రెవెన్యూ డివిజన్ లో ఉన్నందున  రవాణా సౌకర్యం సరిగా లేకపోవడం, తదితర ఇబ్బందులు ఏర్పడేవని, చండూరు రెవిన్యూ డివిజన్ అయితే స్థానిక ప్రజలకు దగ్గరగా ఉండి రాకపోకలకు అనుకూలంగా ఉంటుందని అన్నారు. 

చండూరు, మునుగోడు, గట్టుప్పల్ మండలాలకు నల్గొండ రెవెన్యూ డివిజన్ గా ఉండే, ఇప్పుడు చండూరు రెవెన్యూ డివిజన్ 5 మండలాలకు అతి దగ్గర అయినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. వెనువెంటనే ఆర్డిఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని, నూతన భవనాన్ని ఏర్పాటు చేసి అధికారులను, సిబ్బందిని కేటాయించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన పెయింటర్ అసోసియేషన్ సభ్యులు
మునుగోడు నియోజకవర్గం, చౌటుప్పల్ మరియు నారాయణపురం మండలాలకు చెందిన పెయింటర్ అసోసియేషన్ కు చెందిన దాదాపు150 మంది సభ్యులు,  మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు.

ఈ సందర్భంగా నూతనంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ.. బిఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
NLG: ఆన్లైన్ మోసాల గురించి అవగాహన కల్పించిన పోలీస్ కళాబృందం
నల్లగొండ: పట్టణంలోని గ్రంథవారిగూడెం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/ కళాశాలలో నల్లగొండ జిల్లా పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో విద్యార్థులకు  అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సైబర్ నేరాలు, రోడ్డు భద్రత, డ్రంక్ అండ్ డ్రైవ్ గంజాయి, డ్రగ్స్ నిషేధం మరియు బ్యాంకింగ్, ఆన్లైన్ మోసాల గురించి  వివరించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో  విద్యార్థులు, ఉపాధ్యాయులు, పోలీస్ కళాబృందం తదితరులు పాల్గొన్నారు.
అంగరంగ వైభవంగా ప్రారంభమైన పిఆర్టియు  తెలంగాణ నల్లగొండ జిల్లా శాఖ కార్యాలయం

నల్లగొండ: PRTU తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి బిక్షం గౌడ్ మరియు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మారెడ్డి అంజిరెడ్డి చేతుల మీదుగా, సోమవారం పి ఆర్ టి యు తెలంగాణ నల్లగొండ జిల్లా శాఖ కార్యాలయం వందలాదిమంది పిఆర్టియు సభ్యుల మధ్య అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా పిఆర్టియు జిల్లా శాఖ అధ్యక్షులు కందిమల్ల కృష్ణారెడ్డి అధ్యక్ష స్థానంలో వేద పండితుల ఆశీర్వచనాల మధ్య అధ్యక్ష కుర్చీలో ఆశీనులు గావించారు. ఈ కార్యక్రమంలో పిఆర్టియు తెలంగాణ సీనియర్ నాయకులు మేడిశెట్టి వెంకటరమణ, కొప్పు అంజయ్య, ఇమ్మడి పరమేశం, గాదరి శరణార్థి, కోర్ కమిటీ సభ్యులు మారెడ్డి వెంకట్ రెడ్డి, జనగాం వెంకన్న గౌడ్, పిఆర్టియు తెలంగాణ వివిధ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర జిల్లా బాధ్యులు మరియు పిఆర్టియు తెలంగాణ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

NLG: పెద్దవూర మండలంలో ప్రారంభమైన బహుజన చైతన్య సైకిల్ యాత్ర
నాగార్జున సాగర్ నియోజకవర్గ బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో, అక్టోబర్ 1వ తేదీన హాలియా పట్టణ కేంద్రంలో 'బహుజన సింహగర్జన సభ' ను విజయవంతం చేయడం కోసం,  'బహుజన చైతన్య సైకిల్ యాత్ర' లో బాగంగా సోమవారం పెద్దవూర మండలంలో మొదటి రోజు కొత్తలూరు గ్రామం నుండి సైకిల్ యాత్ర బయలుదేరి తమ్మడపల్లి మరియు శిరసనగండ్ల గ్రామానికి చేరుకుని రాత్రి బస చేశారు. ఈ గ్రామాలలో ప్రజలను ఉద్దేశించి బహుజన్ సమాజ్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆదిమల్ల వెంకటేష్ మాట్లాడుతూ.. ఏ గ్రామంలో చూసినా వీధిలైట్లు సరిగా లేక, రోడ్లు, మురికి కాలువలు సరిగా లేక, దోమల  సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ప్రజలు అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉందని, ఏ గ్రామానికి రోడ్లు సరిగ్గా లేవని, రవాణా సౌకర్యం సరిగ్గా లేదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో హామీలు తప్ప ఆచరణలేదని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీని ఆదరించి ఏనుగు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కత్తుల కాన్సిరాం , సాగర్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు బత్తుల  ప్రసాద్ , సాగర్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ముదిగొండ వెంకటేశ్వర్లు , సాగర్ నియోజకవర్గ మహిళా కన్వీనర్ బైరాగి విజయ , పెద్దవూర మండల బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షుడు కుక్కముడి ముత్యాలు , మండల ప్రధాన కార్యదర్శి ఆదిమల్ల సత్యనారాయణ , తరి రవి కుమార్, తదితరులు పాల్గొన్నారు.

NLG: ఏఎన్ఎం ల సమ్మె తాత్కాలికంగా వాయిదా
నల్లగొండ: రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీయూసీ ఆద్వర్యంలో రెండవ ఏఎన్ఎం లు చేస్తున్న నిరవధిక సమ్మెను, ప్రభుత్వం  సమస్యల పరిష్కారం కోసం త్రీమెన్ కమిటీ వేసినందున, సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి తెలిపారు. సోమవారం నల్లగొండ డిఎంహెచ్ఓ కొండల్ రావు కు తాత్కాలిక సమ్మె వాయిదా లెటర్ అందజేశారు. ప్రభుత్వం వేసిన త్రీమెన్ కమిటీ సభ్యులు తక్షణమే ఏఎన్ఎం లకు ఇచ్చిన హామీలు అమలు చేయడం కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా కోరారు. గత 20 రోజులుగా ఎన్నో వ్యయ ప్రయాసలతో ఏఎన్ఎం లు ఆందోళన నిర్వహించడం జరిగిందని, ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆయన కోరారు. ప్రభుత్వం తరుపున హామీ ఇచ్చిన డైరెక్టర్ ఆఫ్ హెల్త్ గడల శ్రీనివాస్,  హామీలను పరిష్కారం చేయకపోతే మళ్లీ సమ్మె చేపడతామని దేవేందర్ రెడ్డి స్పష్టం చేశారు. గత 20 రోజులుగా జరిగిన సమ్మె కు సహకరించిన వివిధ రాజకీయ పార్టీల, ప్రజాసంఘాల నాయకులకు, అధికారులకు, పోలీసులకు పత్రిక విలేకరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో రెండవ ఏఎన్ఎం ల యూనియన్ జిల్లా అధ్యక్షురాలు పోలే రత్నకుమారి ,కార్యదర్శి నరసమ్మ, సునిత, రుక్సాన, గీతా రాణి, వసుమతి, హైమవతి, సాలమ్మా, ఫోజియ, శకుంతల, సరళ, అన్నమ్మ, లక్ష్మి, రమాదేవి, అండాలు, విజయలక్ష్మి, శైలజ, జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.
నూతన రెవెన్యూ డివిజన్ గా చండూర్.. ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

TS: నల్లగొండ జిల్లా, మునుగోడు నియోజకవర్గంలోని చండూర్ ను నూతన రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి నవీన్ మిట్టల్ రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రాథమిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రజల వద్ద నుండి అభ్యంతరాలు, సూచనలు నేటి నుండి 15 రోజులపాటు స్వీకరించినట్లు తెలిపారు. రాతపూర్వకంగా జిల్లా కలెక్టర్ కు తెలుపవచ్చని పేర్కొన్నారు. నల్లగొండ జిల్లాలో ప్రస్తుతం నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ రెవెన్యూ డివిజన్ ఉండగా.. నల్లగొండ రెవెన్యూ డివిజన్ పరిధిలోని చండూర్ ను నూతన రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయుటకు నోటిఫికేషన్ విడుదల చేయడంతో, జిల్లాలో నాలుగో రెవెన్యూ డివిజన్ గా చండూరు ఏర్పాటు కానున్నది. నల్లగొండ రెవెన్యూ డివిజన్ పరిధిలోని చండూరు, మునుగోడు, గట్టుప్పల్ మండలాలను మరియు దేవరకొండ డివిజన్ పరిధిలోని నాంపల్లి, మర్రిగూడ మండలాలను కలుపుకొని నూతన రెవెన్యూ డివిజన్ గా చండూరు ఏర్పాటు కానున్నది. మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం చండూర్ ను రెవిన్యూ డివిజన్ గా ఏర్పాటు చేస్తూ, ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై డివిజన్ పరిధిలోని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావాన్ని స్థానిక ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.