తెలంగాణ ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో ఆట-పాట-మాటలతో.. గద్దర్ కు జోహార్లు
చింతపల్లి మండలం, మాల్: తెలంగాణ ప్రజా నాట్యమండలి మరియు పిఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, ప్రజానాట్యమండలి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు పాండురంగారావు అధ్యక్షతన మంగళవారం ప్రజా గాయకుడు గద్దర్ సంతాప సభలో ఆట-పాట-మాటలతో.. గద్దర్ కు జోహార్లు సమర్పించారు.

చింతపల్లి మండలం, మాల్: తెలంగాణ ప్రజా నాట్యమండలి మరియు పిఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, ప్రజానాట్యమండలి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు పాండురంగారావు అధ్యక్షతన మంగళవారం ప్రజా గాయకుడు గద్దర్ సంతాప సభలో ఆట-పాట-మ

NLG: ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన మర్రిగూడ మండల బిఆర్ఎస్ నాయకులు
నల్లగొండ జిల్లా, మర్రిగూడెం: మండలానికి చెందిన బిఆర్ఎస్ నేతలు మంగళవారం మునుగోడు నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిశారు. మరోసారి బిఆర్ఎస్ మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ప్రకటించినందుకు సీఎం కేసీఆర్ కు, మంత్రి జగదీష్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మర్రిగూడెం మండలం బిఆర్ఎస్ నాయకులు.. ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని శాలువాతో సత్కరించి, పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మర్రిగూడ సర్పంచ్ నల్ల యాదయ్య గౌడ్, బిఆర్ఎస్ యువనేత అభి సందేశ్, ఇతర నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
NLG: మెడికల్ కాలేజీ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలి: పల్లా దేవేందర్ రెడ్డి
నల్లగొండ: మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ గార్డ్ కార్మికుల నాలుగు నెలల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని మెడికల్ కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్ AITUC రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈరోజు AITUC ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కర్ణన్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. మెడికల్ కాలేజిలో పనిచేసే కార్మికులకు నాలుగు నెలల దాటిపోయినా నేటికీ  వేతనాలు రాకపోవడం వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాలేజీ ప్రిన్సిపాల్ ను ఎన్నిసార్లు కలిసినా కూడా ప్రయోజనం లభించలేదని వాపోయారు. అతి తక్కువ వేతనాలతో పని చేస్తున్న కార్మికులకు నెల నెల వేతనాలు ఇవ్వకపోతే ఎలా బతుకుతారని ప్రశ్నించారు. జీతాలు రాక ఇంటి కిరాయి, ఆటో కిరాయిలు, పెరిగిన ధరలు భరించలేకపోతున్నారని అన్నారు. వెంటనే పెండింగ్ వేతనాలు చెల్లించాలని మరియు జీవో 60 ప్రకారం వేతనాలు పెంచాలని దేవేందర్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎండీ జకీర్, అండాలు, చంద్రమ్మ, స్వర్ణ, జానయ్య, విజయ, రేణుక, కవిత, చంద్రమ్మ, కోటేశ్వరి, సీత, లక్ష్మి, శిల్ప, జమీర్, శ్రీను, శిల్ప, కృష్ణవేణి, కరుణ, ఇద్దమ్మ, మంగమ్మ, అన్నపూర్ణ, తదితరులు పాల్గొన్నారు.
TSCPGET-2023లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఎన్జీ కళాశాల విద్యార్థిని
నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర ఉమ్మడి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రవేశ పరీక్ష TSCPGET-2023 ఫలితాల్లో ఎన్జీ కళాశాల విద్యార్థులు, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఘన శ్యామ్ తెలిపారు. కళాశాల విద్యార్థిని 'సుమ' రాష్ట్ర స్థాయిలో ఎంఎస్సీ జియాలజీలో మొదటి 1 St ర్యాంక్  సాధించారు. అదేవిధంగా భూపతి -జియాలజీ 10 వ ర్యాంకు, లక్ష్మణ్ ప్రభు ఆకాష్ - ఆర్కియాలజీ - 13 వ ర్యాంకు, శృతి -ఫిజిక్స్ 26 వ ర్యాంకు, శ్రావణి- గ్రంథాలయ సమాచార శాస్త్రం 27 వ ర్యాంకు, భావన జియాలజీ - 27వ ర్యాంకు, అమూల్య స్టాటిస్టిక్స్ - 29వ ర్యాంకు, భూపతి -జియో ఇన్ఫర్మేషన్ 52 వ ర్యాంకు, వెన్నెల -ఫిలాసఫీ 56 ర్యాంకు, సంజిత్ కుమార్- జాగ్రఫీ-73 వ ర్యాంకు, మనీషా- జువాలజీ-77 వ ర్యాంకు, అన్నమయ్య- రసాయన శాస్త్రం-78వ ర్యాంకు, గౌతమ్- కంప్యూటర్ సైన్స్- 84వ ర్యాంకు, కౌనిన్- బయోటెక్నాలజీ 85 వ ర్యాంకు, దుర్గ భవాని- చరిత్ర 100 వ ర్యాంకు, శృతి- వృక్షశాస్త్రం122వ ర్యాంకు, సిద్ధిక్- ఎకనామిక్స్ 130 వ ర్యాంకు, మల్లిక- మైక్రోబయాలజీ 157 వ ర్యాంకు, సిద్ధిక్ - గ్రంథాలయ సమాచార శాస్త్రం 169 వ ర్యాంకు, శిరీష- జువాలజీ 180 వ ర్యాంకు , ఇంకా చాలామంది విద్యార్థిని విద్యార్థులు పీజీ ప్రవేశ పరీక్షలో ఉత్తమ ర్యాంకులు సాధించారని కళాశాల గ్రంథ పాలకులు డాక్టర్ దుర్గాప్రసాద్ తెలిపారు. కళాశాల విద్యార్థులకు రాష్ట్రస్థాయిలో ఉత్తమ ర్యాంకులు రావడం పట్ల వైస్ ప్రిన్సిపల్ మునీర్ మరియు శ్రీనివాసులు, కళాశాల అధ్యాపకులు, కళాశాల సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.
NLG: మంత్రి జగదీష్ రెడ్డిని కలిసిన ఎమ్మేల్యే కూసుకుంట్ల
మునుగోడు సిట్టింగ్ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని.. సీఎం కేసీఆర్ రానున్న ఎన్నికల సందర్భంగా మరోసారి మునుగోడు నియోజకవర్గ బిఆర్ఎస్ ఎమ్మేల్యే అభ్యర్ధి గా ప్రకటించినందుకు, సీఎం కేసీఆర్ కు   కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా తనను అభ్యర్థిగా ప్రకటించడానికి సహకరించిన జిల్లా మంత్రి జగదీష్ రెడ్డిని, మంగళవారం ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మరియు వారి కుమారుడు కూసుకుంట్ల శ్రీనివాస్ రెడ్డి  మర్యాద పూర్వకంగా కలిసి ధన్యవాదములు తెలిపారు.
NLG: పిడిఎస్యూ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మ దగ్ధం
అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ పరిస్థితి అగమ్య గోచారంగా మారిందని, సీఎం కేసీఆర్ ప్రభుత్వం విద్యారంగాన్ని పట్టించుకోవడంలేదని, విద్యార్థుల సంక్షేమాన్ని తుంగలో తొక్కిందని పిడిఎస్యూ జిల్లా ఇన్చార్జి ఇందూరు సాగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలే పవన్ లు అన్నారు. మంగళవారం నల్లగొండ పట్టణంలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద PDSU ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి, సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు పాల్గొని మాట్లాడుతూ.. పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు 16 లక్షల మంది పైగా ప్రభుత్వం చెల్లించే ఫీజు రియంబర్స్మెంటు స్కాలర్షిప్ లపై ఆధారపడి ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని అన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లను అందించకపోవడంతో అనేకమంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని తెలిపారు. ప్రభుత్వం అనేక కొత్త హామీలనిస్తూ ప్రజలను మభ్యపెడుతుందని, విద్యార్థులను పట్టించుకోవడంలేదని, విద్యార్థి సంక్షేమాన్ని తుంగలో తొక్కిందని ఏద్దేవా చేశారు. విద్యారంగంలో అనేక సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించకపోగా ప్రభుత్వమే వారిని సంక్షోభంలోకి నేడుతున్నదని తెలిపారు. జిల్లాలో 12 ప్రభుత్వ పాఠశాలకు పైగా విద్యార్థులు లేరన్న సాకుతో మూసివేతకు సిద్ధంగా ఉంచారని, విద్యాసంస్థలలో కనీస, మౌలిక వసతులు కల్పించకుండా ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులు భర్తీ చేయకుండా విద్యాసంస్థలను మూసివేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.

సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్, కాస్మొటిక్ చార్జీలు పెంచలేదని నెలల తరబడి కాస్మొటిక్ చార్జీలు చెల్లించడం లేదని అన్నారు. గురుకులాలలో విద్యార్థులు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని సమస్యల వలయంలో సంక్షేమ హాస్టల్, గురుకుల విద్యార్థులు ఉన్నారని పేర్కొన్నారు. తక్షణమే తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ విద్యాసంస్థల్లో కనీసం మౌలిక సదుపాయాలు కల్పించి విద్యారంగాన్ని మెరుగుపరచాలని రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ ,అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలని 5,500 కోట్లకు పైగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు, లేని పక్షంలో వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు

ఈ కార్యక్రమంలో పివైఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.వి చారి, పిడిఎస్ యూ నాయకులు బి. రాఘవ్, ఎన్. ప్రశాంత్, టి. సుధాకర్, ప్రభు, శివశంకర్, రాజు, ఈశ్వర్, ప్రవీణ్, మధు, సురేష్, శేఖర్, మాధవ్, తదితరులు పాల్గొన్నారు
మర్రిగూడ: ముదిరాజులకు ఒక్క సీటు కూడా కేటాయించకపోవడం అన్యాయం: గణేష్
బిఆర్ఎస్ పార్టీ అధినేత కే. చంద్రశేఖర్ రావు.. నిన్న ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో, ముదిరాజులకు ఒక్క సీటు కూడా కేటాయించకపోవడం అన్యాయమని, లెంకలపల్లి గ్రామానికి చెందిన దాసరి గణేష్, మర్రిగూడ మండల ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (MEPA) అధ్యక్షులు  మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర జనాభాలో ముదిరాజ్ బిడ్డలు రెండో స్థానంలో ఉండగా వారికి ఒక్క సీటు కూడా కేటాయించకపోవడం ముదిరాజ్ బిడ్డలను అవమానించడమే అని అన్నారు.

ఇకనైనా ముదిరాజ్ బిడ్డలు మేలుకొని, మన సత్తా ఏంటో చాటి చూపిద్దామని ముదిరాజ్ బిడ్డలకు పిలుపునిచ్చారు. ముదిరాజుల ఐక్యతను చాటాలని, రానున్న ఎలక్షన్లలో ముదిరాజులకు జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించేలా తగు చర్యలు చేపట్టాలని అన్నారు.
పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
యాదాద్రి జిల్లా:  భువనగిరి లో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వరకు 1 కోటి 43 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా మంజూరైన భవన నిర్మాణానికి, సోమవారం భువనగిరి ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
TS: పెండింగ్ లో నాలుగు అసెంబ్లీ స్థానాలు

బిఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్, సోమవారం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులను ప్రకటించారు. 119 నియోజకవర్గాలకు గాను 115 అభ్యర్థులను ప్రకటించారు. నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఎమ్మెల్యే అభ్యర్థులు ఖరారు చేయలేదు. పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది.
1. నాంపల్లి 2. నర్సాపూర్ 3. జనగామ 4. గోషామహాల్ టికెట్ మిస్సైన  బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు:
సుభాష్ రెడ్డి - ఉప్పల్,
రాజయ్య - స్టేషన్ ఘనపూర్
రాములు నాయక్ - వైరా
రేఖా నాయక్ - ఖానాపూర్
చెన్నమనేని రమేష్ - వేములవాడ
గంప గోవర్ధన్ -కామారెడ్డి
రాథోడ్ బాపురావు -బోధ్
విద్యాసాగర్ రావు - కోరుట్ల ( అభ్యర్థిగా  కుమారుడు)
లెంకలపల్లి: బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని ప్రకటించినందుకు సంబరాలు జరిపిన బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు

నల్లగొండ జిల్లా: మునుగోడు నియోజకవర్గ అసెంబ్లీ స్థానానికి మరోసారి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ ప్రకటించినందుకుగాను సోమవారం మర్రిగూడెం మండలం లెంకలపల్లి గ్రామంలో, లెంకలపల్లి బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు రేణికుంట్ల నరేందర్ ఆధ్వర్యంలో.. బాణాసంచా కాల్చి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మరోసారి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం పట్ల బిఆర్ఎస్ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ కు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. కెసిఆర్ నాయకత్వం వర్ధిల్లాలని, కూసుకుంట్ల నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో గ్రామానికి చెందిన పలువురు బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.