మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా రాష్ట్రస్థాయి అవార్డులు అందుకున్న నల్లగొండ ఫోటో జర్నలిస్టులు
HYD: వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా నల్లగొండ జిల్లా ది హన్స్ ఇండియా ఫోటో జర్నలిస్ట్ ముచ్చర్ల శ్రీనివాస్ గౌడ్ కు తెలంగాణ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ నిర్వహించిన ఫోటోగ్రఫీ పోటీల్లో 2022 పల్లె ప్రగతి ఫోటోకు, 2023 తెలంగాణ పండుగలు ఫోటోకు రాష్ట్రస్థాయి అవార్డు లభించింది. అదేవిధంగా ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్ట్ ముచ్చర్ల విజయ్ కు రాష్ట్రస్థాయి అవార్డు లభించింది. ఈ సందర్భంగా ఆదివారం నాడు  రవీంద్రభారతిలో ఆర్థిక శాఖ మరియు ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, టిపిజేఏ రాష్ట్ర అధ్యక్షులు భాస్కర్ చేతుల మీదుగా ముచ్చర్ల శ్రీనివాస్ అవార్డు ను అందుకున్నారు. సూర్యాపేటలో నేడు సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఉన్నందున ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్ట్ ముచ్చర్ల విజయ్ ఆ కార్యక్రమానికి హాజరు కావడం వల్ల, ఆయన బదులుగా వారి కుమారుడు అఖిల్ గౌడ్ అవార్డును అందుకున్నారు.
HYD: విద్యార్థినీల చదువుకు ఎమ్మెల్సీ కవిత కుమారుల చేయూత
హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకంట్ల కవిత కుమారులు ఆదిత్య, ఆర్యా చిన్న వయస్సులోనే పెద్ద మనస్సును చాటుకున్నారు. సమాజ సేవ కోసం ఇటీవల ఆదిత్య, ఆర్యా కలిసి మొదలుపెట్టిన సినర్జీ ఆఫ్ మైండ్స్ (ఎస్ఓఎం) ఫౌండేషన్ ద్వారా ఆడబిడ్డల చదవుకు చేయుతనిచ్చారు. హైదరాబాద్ లోని సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా కాలేజీలో అడ్మిషన్ లభించి, ఆర్థికంగా వెనుకబడిన 10 మంది విద్యార్థినీలకు ఫౌండేషన్ నుండి స్కాలర్ షిప్ లను వారు అందజేశారు. 10 మంది విద్యార్థినీలలో ఆరుగురు అండర్ గ్రాడ్యుయేట్, ముగ్గురు పోస్ట్ గ్రాడ్యుయేట్  విద్యార్థులు ఉన్నారు. ఈ మేరకు కాలేజీలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, కాలేజీ ప్రతినిధుల సమక్షంలో విద్యార్థులకు స్కాలర్షిప్ ను ఆదిత్యా, ఆర్యా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ... మహిళా సాధికారతకు తాము ఎప్పుడూ మద్ధతిస్తుంటామని తెలిపారు. తన కుమారులు ఇద్దరు సమాజ సేవ కోసం ఫౌండేషన్ ను స్థాపించి విద్యార్థులకు చేయుతనందించడం సంతోషంగా ఉందన్నారు.
చిన్న వయస్సుల్లోనే వాళ్ళు గొప్పగా ఆలోచించడం తల్లిగా తాను గర్వపడుతున్నానని అన్నారు. భవిష్యత్తులోనూ ఫౌండేషన్ ద్వారా మరిన్ని  కార్యక్రమాలు చేపట్టి సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. స్కాలర్ షిప్ అందుకున్న విద్యార్థులకు కవిత అభినందనలు తెలిపారు. ఉన్నత చదువులలో బాగా రాణించి, ఉన్నత శిఖరాలకు ఎదగాలని సూచించారు.
SRPT: జిల్లాలో ప్రతి గ్రామపంచాయతీకి రూ.10 లక్షల నిధులు: సీఎం కేసీఆర్
సూర్యాపేట: జిల్లా కేంద్రంలో సీఎం కేసీఆర్ ఆదివారం జిల్లా కలెక్టర్ కార్యాలయం, జిల్లా ఎస్పీ కార్యాలయం, సమీకృత వ్యవసాయ మార్కెట్, మెడికల్ కాలేజ్, బిఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం సీఎం కేసీఆర్ ప్రగతి నివేదన సభలో  మాట్లాడుతూ..సూర్యాపేట చాలాబాగా అభివృద్ధి చెందిందని, రూ.100 కోట్లతో పరిపాలన భవనాలు నిర్మించుకున్నామని, మానవభివృద్ధి సూచికలో రాష్ట్రం మంచి స్థానంలో ఉండటం గర్వకారణం అని అన్నారు. తలసరి ఆదాయం, విద్యుత్ వినియోగంలో అగ్రస్థానంలో ఉన్నాం అని తెలిపారు. ఇంత అద్భుత కలెక్టరేట్లు, పోలీస్ భవనాలు ఎక్కడా లేవని, కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలు కూడా మన కలెక్టరేట్ల వలే లేవు అని అన్నారు. రిజిస్ట్రేషన్లు మండలాలలోని 15 నిమిషాల్లోనే పూర్తి అయ్యేలా ధరణి తీసుకొచ్చామన్నారు. ఎవరి మధ్యవర్తిత్వం లేకుండా రైతుబంధు, రైతుబీమా  డబ్బులు నేరుగా రైతుల ఖాతాలో పడుతుందని చెప్పారు. ధరణి తీసిస్తే రైతుబంధు, రైతుబీమా ఎలా వస్తుందని కేసీఆర్ ప్రశ్నించారు. పైరవీకారుల చుట్టూ రైతులు తిరగవద్దనే ధరణి తీసుకువచ్చామని వివరించారు. కుల వృత్తులు చేసుకునే బీసీ బిడ్డలకు రూ.లక్ష చొప్పున ఇస్తున్నామని వివరించారు. కాళేశ్వరం జలాలు 480 కి.మీ. ప్రయాణించి సూర్యాపేట జిల్లాలోకి వస్తున్నాయని తెలిపారు.

జిల్లాలో ప్రతి గ్రామపంచాయతీకి రూ.10 లక్షల నిధులు ఇస్తామన్నారు. కళాభారతి నిర్మాణానికి రూ. 25 కోట్లు మంజురు చేస్తామని తెలిపారు. మున్సిపాలిటీలకు రూ. 25 కోట్లు కేటాయించామన్నారు. సూర్యాపేట అద్భుత ప్రగతితో దూసుకుపోతోందని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
NLG: మేడి ప్రియదర్శిని హౌస్ అరెస్ట్
నల్లగొండ జిల్లా, చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలో, నకిరేకల్ నియోజకవర్గ బిఎస్పి ఇంచార్జి మేడి ప్రియదర్శిని ని  ఈ రోజు పోలీస్ లు  హౌస్ అరెస్ట్ చేశారు. నేడు సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరుగుతున్న బిఆర్ఎస్ పార్టీ ప్రగతి నివేదన సభకు సీఎం కెసిఆర్ హాజరైతున్న నేపథ్యంలో, బిఎస్పి పార్టీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని మాట్లాడుతూ.. అప్రజాస్వామిక చర్యలను ఖండిస్తున్నామని తెలిపారు.
ప్రతిపక్షాల  గొంతు నొక్కడం సరికాదన్నారు. కెసిఆర్ కు ఓటమి ఖాయం అని అభిప్రాయపడ్డారు.
అనుముల: మాల మహానాడు నియోజకవర్గ అధ్యక్షులుగా రువ్వ వెంకటేశ్వర్లు, మండల అధ్యక్షులుగా బూరుగు వెంకటయ్య
నల్లగొండ జిల్లా, అనుముల: మండల కేంద్రంలో  మాల మహానాడు సాగర్ నియోజకవర్గ అధ్యక్షులుగా రువ్వ వెంకటేశ్వర్లు ను, అనుముల మండల మాలమహానాడు అధ్యక్షులుగా బూరుగు వెంకటయ్య ను మాల మహానాడు ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి, మాల మహానాడు నల్గొండ జిల్లా అధ్యక్షులు చింతపల్లి బాలకృష్ణ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జంగయ్య, రాష్ట్ర నాయకులు జంగాల భిక్షం, సీనియర్ నాయకులు చింతపల్లి లింగమయ్య, నల్గొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ భూతం అర్జున్, జిల్లా ఉపాధ్యక్షులు నాగాబ్ జోసెఫ్, జిల్లా ఉపాధ్యక్షులు వేణు ఎంపీటీసీ, జిల్లా ఉపాధ్యక్షులు భూతం యాదగిరి, జిల్లా ప్రధాన కార్యదర్శి జార్జి రవి, జిల్లా మహిళా అధ్యక్షురాలు గీత, రాష్ట్ర నాయకులు గండమల జానయ్య, మిర్యాలగూడ నియోజకవర్గ అధ్యక్షులు మీసాల జగదీష్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు బోగరి అనిల్, దేవరకొండ డివిజన్ ఉపాధ్యక్షులు భూతం పెద్ద సైదులు, జిల్లా సీనియర్ నాయకులు భూతం సైదులు, రెడ్డిమల్ల సురేష్, మండలి చెన్నయ్య, రెడ్డిమల్ల రవి, పీఏ పల్లి మండల అధ్యక్షులు మోటమర్రి సురేందర్, తదితరులు పాల్గొన్నారు.
SRPT: ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి: తగుళ్ళ జనార్దన్ యాదవ్
సూర్యాపేట: జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని జన సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు తగుళ్ళ జనార్ధన్ యాదవ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిరసన తెలుపుతూ విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విద్యత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత మెడికల్ కళాశాల తీసుకొచ్చారని, పేద విద్యార్థులకు అందుబాటులో ఉండే డిగ్రీ కళాశాల తీసుకరాకపోవడం శోచనీయమన్నారు. మహిళలకు ప్రత్యేకంగా మహిళా డిగ్రీ కళాశాలను కూడా మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని కోరారు. పేద విద్యార్థుల గురించి ఏ రాజకీయ నాయకుడు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. రేపు సభలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల డిక్లరేషన్ చేయని యెడల సీఎం కేసీఆర్ సభను అడ్డుకుంటామని తెలిపారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పోలోజు మహేష్, సాగర్ల అశోక్, లింగంపల్లి మధుకర్, దుబాని మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.
NLG: టిపిజేఏ ఆధ్వర్యంలో ఘనంగా 184వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు
నల్లగొండ: ఈ రోజు 184 వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని, తెలంగాణ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ (TPJA ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో, జిల్లా అధ్యక్షులు సింగం వెంకటరమణ అధ్యక్షతన  పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు  కంచర్ల భూపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్  మందడి సైదిరెడ్డి  ముఖ్య అతిథులుగా పాల్గొని,  కేక్ కట్ చేసి ఫోటో జర్నలిస్టులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయిలో ఉత్తమ అవార్డు అందుకున్న  ఫోటో జర్నలిస్టులు  ముచ్చర్ల విజయ్ కుమార్, ముచ్చర్ల శ్రీనివాస్, ఆకాష్  లను వారు అభినందించారు. TPJA ప్రధాన కార్యదర్శి కంది వేణుగోపాల్, సహాయ కార్యదర్శి నగర భాస్కర్, ప్రచార కార్యదర్శి కారింగ్ వెంకటేష్, కార్యవర్గ సభ్యులునాగేశ్వరరావు, సందీప్, తదితరులు పాల్గొన్నారు.
NLG: ఏఎన్ఎం బాధలు తీర్చండి: పల్లా దేవేందర్ రెడ్డి
నల్గొండ: ఏఐటియుసి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న, 2వ ఏఎన్ఎం లు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ ఆఫీస్ ముందు చేపట్టిన నిరవధిక సమ్మె నేడు నాల్గవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. సమ్మె చేస్తున్నా ప్రభుత్వం ఏఎన్ఎం ల పట్ల కనికరం చూపక పోవటం అన్యాయమని, గత16 ఏళ్లుగా రెండవ ఏఎన్ఎంలు నిర్విరామమంగా ఆరోగ్యవంతమైన సమాజం తయారు చేయడం కోసం పనిచేస్తున్నారని అన్నారు.
అలాంటి వారిని మళ్లీ పరీక్ష రాసి ఉద్యోగం సాధించుకోవాలని చెప్పడం అన్యాయమని, ప్రస్తుతం పని చేస్తున్న ఏఎన్ఎం లందరిని బే షరతుగా రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. కరోనా వంటి కష్టకాలంలో ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని తమ ప్రాణాలను పణంగా పెట్టి, ప్రజలకు సేవలందించారు. వారిని కాదని 1520 మంది ఏఎన్ఎం లను కొత్తగా నియమించేందుకు ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసిందని, ఇది అన్యాయమని, నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలన్నారు. ఏఎన్ఎం ల పట్ల ప్రభుత్వం మొండి వైఖరి సరికాదన్నారు. ఐక్యంగా పోరాడితే ప్రభుత్వం దిగిరాక తప్పదు అన్నారు. ఒక్కొక్క ఏఎన్ఎం 36 రిజిస్టర్లు ఆన్లైన్ మరియు అఫ్ లైన్ లో నిర్వహిస్తున్నారని తెలిపారు. ఆరోగ్య వంతమైన సమాజాన్ని తయారు చేస్తున్న ఏఎన్ఎం లను పట్టించుకోక పోవటం అన్యాయం అని అన్నారు. యూనిఫాం అలవెన్స్ కూడా ఇవ్వటం లేదు. ప్రభుత్వం టాబ్ లు ఇచ్చినా, నెట్ బాలెన్స్ ఇవ్వటం లేదని అన్నారు. ఆరు నుండి పది వేల మంది జనాభాకు ఒక్క ఏఎన్ఎం పనిచేస్తుందని, ఎక్కడికి వెళ్ళినా టిఎ ,డిఎ లు ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో రెండవ ఏఎన్ఎం ల యూనియన్ జిల్లా అధ్యక్షురాలు రత్నకుమారి, జిల్లా కార్యదర్శి నర్సమ్మ, పద్మ, నాగమణి, వసంత, సుశీల, గీత, భూదేవి, లత, సైదమ్మ, రేణుక, సరిత, గాయత్రి, సత్యమ్మ, విజయసుధ, నిర్మల, లత, కౌసల్య, పార్వతి, సులోచన, సాలమ్మ, గీత, నీలవేణి, లక్ష్మమ్మ, జ్యోతి, శారద, పుష్ప, విజయలక్ష్మి, చంద్రకళ, రజిత, రెహానా, అనిత, సుప్రియ, నాగలక్ష్మి మాధురి, సుచిత్ర, తదితరులు పాల్గొన్నారు.
చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ కు వినతి పత్రం అందజేసిన సిపిఎం నాయకులు
యాదాద్రి జిల్లా, చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని పలు వార్డులలో ఉన్న సమస్యల గురించి పురపాలక సంఘం కార్యాలయంలో, శనివారం మున్సిపల్ చైర్ పర్సన్ వెన్ రెడ్డి రాజు కు సిపిఎం పార్టీ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా వెన్ రెడ్డి రాజు మాట్లాడుతూ.. తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తానని అన్నారు. అదేవిధంగా చేయాల్సినటువంటి పనులన్నీ పూర్తి చేపిస్తున్నామని, పెండింగ్లో ఉన్న పనులను త్వరలోనే పూర్తి చేసి, ప్రజలకు అనుగుణంగా ప్రతి సమస్యను పరిష్కరిస్తామనిన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్యదర్శి బండారు నరసింహ, జిల్లా కమిటీ సభ్యులు ఎం.డి పాషా, మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం, ఫ్లోర్ లీడర్ లక్ష్మణ్, ఆకుల ధర్మయ్య, ఎర్ర ఉషయ, భావనపల్లి స్వామి, తూర్పునూరు మల్లేశం, సాతిరి మనోజ్, దాసరి ప్రకాష్, కొంగరి కనకయ్య, ఏనుగుల యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.
NLG: ఫోటో జర్నలిజంలో రాణిస్తున్న ముచ్చర్ల బ్రదర్స్ కు రాష్ట్రస్థాయి అవార్డులు
NLG: ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ( ఆగస్టు 19 ) సందర్భంగా తెలంగాణ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ TPJA ఆధ్వర్యంలో, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో హైదరాబాదులోని రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ పోటీలలో పాల్గొన్న ఫోటో జర్నలిస్టుల విజేతల ఫలితాలు శుక్రవారం వెలువడినాయి. ఈ ఫలితాలలో విజేతలుగా నిలిచిన వారికి ఈనెల 20న సాయంత్రం గం. 4:00 లకు మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా బహుమతి ప్రధానోత్సవం ఉంటుందని టిపిజేఏ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు జి భాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. నల్లగొండ జిల్లా నుండి ఫోటో జర్నలిస్టులు ముచ్చర్ల విజయ్ - ఆంధ్రజ్యోతి, ముచ్చర్ల శ్రీనివాస్ - హన్స్ ఇండియా, ఆర్. ఆకాష్ -నమస్తే తెలంగాణ  రాష్ట్రస్థాయి విజేతలుగా నిలిచారు. అయితే వీరిలో ముచ్చర్ల విజయ్, ముచ్చర్ల శ్రీనివాస్ సొంత అన్నదమ్ములు కావడం విశేషం. ఒకే కుటుంబానికి చెందిన వీరిరువురు ఫోటోగ్రఫీ పైన మక్కువతో గత కొన్ని సంవత్సరాలుగా పత్రికా రంగంలో విశేషమైన సేవలను అందిస్తున్నారు. ఈ సందర్భంగా ముచ్చర్ల బ్రదర్స్ ను పలువురు ఫోటో జర్నలిస్టులు, రిపోర్టర్లు, మీడియా మిత్రులు అభినందిస్తున్నారు.