Emergency Landing: ఎమర్జెన్సీ ల్యాండింగ్‌లో రన్‌వేపై దొర్లిన విమానం.. వీడియో వైరల్
![]()
బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్‌ఏఎల్) ఎయిర్‌పోర్ట్‌లో ఓ విమానం ప్రమాదానికి గుర్తింది. హెచ్‌ఏఎల్ ఎయిర్ పోర్టు నుంచి బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి బయల్దేరిన ప్రీమియర్ 1ఏ ఎయిర్ క్రాఫ్ట్ లో సాంకేతిక సమస్య తలెత్తింది..
నోస్ ల్యాండింగ్ గేర్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో టేకాఫ్ అయిన కాసేపటికే వెనక్కి తిరిగి వచ్చింది. ఈ క్రమంలో అత్యవసరంగా ల్యాండ్ అవుతున్న సమయంలో రన్‌వేపై ప్రమాదానికి గురైంది. అయితే ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో విమానం రన్‌వేపై అదుపుతప్పి ప్రమాదకరంగా దిగింది..
రన్ వేపై నీరు నిలవడంతో.. ఆ నీటిలో అలాగే ముందుకు వెళ్లింది. అప్పటికే విమానం నోస్ గేర్ సరిగా లేకపోవడంతో విమానం ఒక్కసారిగా ముందుకు దొర్లింది. అయితే అదృష్టవశాత్తూ విమానం సురక్షితంగా ల్యాండ్ అయినట్లు డీజీసీఏ వెల్లడించింది. ఆ సమయంలో విమానంలో ఇద్దరు పైలెట్లు మాత్రమే ఉన్నట్లు తెలిపింది. హాల్ ఎయిర్ పోర్టులో విమానం ల్యాండ్ అవుతున్న వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అదృష్టవశాత్తూ విమానం సురక్షితంగా ల్యాండ్ అవడంతో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు..


Jul 12 2023, 14:36
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
23.7k