మెదక్ జిల్లాలో ఘోర ప్రమాదం.. కారు, ఆటో ఢీకొని నలుగురు దుర్మరణం
మెదక్ జిల్లా :
మెదక్ జిల్లాలోని నార్సింగ్ మండలం మల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం మల్లూరు వద్ద జాతీయరహదారిపై వేగంగా దూసుకొచ్చిన కారును అదుపుతప్పి ఆటోను ఢీకొట్టింది.
దీంతో అందులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు పంపించారు.
మృతులను తండ్రీ కొడుకులైన శేఖర్, యశ్వంత్ (9), దంపతులు బాలనర్సయ్య, మణెమ్మగా, గాయపడినవారిని కవిత, అవినాశ్‌గా గుర్తించారు. వీరంతా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందినవారిగా గుర్తించారు.
కామారెడ్డి నుంచి చేగుంటవైపు వెళ్తుంగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
SB NEWS











May 21 2023, 12:41
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
30.1k