Pakistani drones: పంజాబ్ సరిహద్దుల్లో పాకిస్థాన్ డ్రోన్లు...నేలకూల్చిన బీఎస్ఎఫ్ దళాలు

అమృత్‌సర్‌(పంజాబ్): పంజాబ్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి శుక్రవారం ఎగురుతున్న రెండు పాకిస్థాన్ డ్రోన్‌లను బీఎస్‌ఎఫ్ కూల్చివేసింది.

(Pakistani drones)పంజాబ్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద(International border in Punjab) భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న పాకిస్థాన్‌కు చెందిన రెండు డ్రోన్‌లను బీఎస్‌ఎఫ్ దళాలు నేలకూల్చాయి.

(shot down by BSF) డ్రోన్‌లలో ఒకదాంట్లో అనుమానాస్పద మత్తుపదార్థాలు ఉన్న బ్యాగ్‌ని కూడా బీఎస్ఎఫ్ దళాలు స్వాధీనం చేసుకున్నాయి.

అమృత్‌సర్ జిల్లాలోని ఉధర్ ధరివాల్ గ్రామం నుంచి డ్రోన్లను స్వాధీనం చేసుకున్నట్లు బీఎస్ఎఫ్ ప్రతినిధి తెలిపారు.అమృత్‌సర్ జిల్లాలోని రత్తన్ ఖుర్ద్ గ్రామం నుంచి రాత్రి 9:30 గంటలకు బీఎస్ఎఫ్ దళాలు కాల్పులు జరిపిన తర్వాత డ్రోన్ ను స్వాధీనం చేసుకున్నట్లు ప్రతినిధి పేర్కొన్నారు.

రెండవ డ్రోన్‌కు 2.6 కిలోల రెండు హెరాయిన్‌ ప్యాకెట్లను జోడించగా వాటిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు బీఎస్ఎఫ్ ప్రతినిధి తెలిపారు.

అవినాష్ రెడ్డికి మళ్లీ నోటీసులు..ఈసారి సీబీఐ ప్లాన్ మార్చుతుందా?

YS Avinash Reddy: వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి (Ys Avinash Reddy)కి CBI మళ్లీ నోటీసులు జారీ చేసింది..

ఈనెల 22న విచారణకు రావాలని సీబీఐ అధికారులు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా మొదట ఈనెల 16న విచారణకు రావాలని అవినాష్ రెడ్డి (Ys Avinash Reddy)కి సీబీఐ నోటీసులు ఇచ్చింది.

అయితే ముందే ఫిక్స్ అయిన షెడ్యూల్ కారణంగా విచారణకు హాజరు కాలేనని..4 రోజుల సమయం ఇవ్వాలని సీబీఐకి లేఖ రాశారు. దీనితో ఈనెల 19న విచారణకు రావాలని సీబీఐ రెండోసారి నోటీసులు జారీ చేసింది..

అయితే తన తల్లికి అనారోగ్య కారణంగా విచారణకు రాలేనని రెండోసారి కూడా అవినాష్ (Ys Avinash Reddy) సీబీఐ విచారణకు డుమ్మా కొట్టారు. ఈ క్రమంలో సీబీఐ మూడోసారి నోటీసులు జారీ చేసింది.

అయితే మొదటి రెండు సార్లు విచారణకు డుమ్మా కొట్టిన అవినాష్ (Ys Avinash Reddy) ఈసారైనా విచారణకు వస్తారా అనేది ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ విచారణకు రాకపోతే సీబీఐ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? తప్పనిసరైతే అరెస్ట్ చేస్తారా? లేక కోర్టును ఆశ్రయిస్తారా? సీబీఐ ప్లాన్ ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్సే..

Nellore: నేను ప్రతీకారం మొదలెడితే ఊహకు కూడా అందదు!: నెల్లూరు డిప్యూటీ మేయర్‌

నెల్లూరు: నెల్లూరు డిప్యూటీ మేయర్‌ రూప్ కుమార్ యాదవ్ అనుచరుడు, వైకాపా విద్యార్థి నేత హాజీపై శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు..

ప్రస్తుతం హాజీ నెల్లూరులోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హాజీని ఇవాళ రూప్‌కుమార్ యాదవ్‌ పరామర్శించారు. తన అనుచరుడిపై జరిగిన దాడిపై రూప్ కుమార్ యాదవ్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

రూప్‌కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. ''వైకాపా ఆవిర్భావం నుంచి హాజీ పార్టీలో ఉన్నారు. హాజీపై కత్తులతో హత్యాయత్నం చేశారు. కేవలం నాతో ఉన్నాడనే కక్షతోనే దాడి జరిగింది. బాధితుడు చెబుతున్నట్టు ఈ దాడి వెనుక స్థానిక ఎమ్మెల్యే అనిల్‌ కుమార్ యాదవ్‌ ఉన్నారు. ఇలాంటి దాడులు చేయడం మంచిది కాదు. గతంలోనూ నా అనుచరులపై దాడులు చేశారు.

ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు చర్యలు తీసుకొని ఉంటే ఇవాళ మరోసారి దాడి జరిగి ఉండేది కాదు. ఇకపై మా కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదు. నేను ప్రతీకారం మొదలుపెడితే ఊహకు కూడా అందదు. ఈ ఘటనను సీఎం జగన్‌, పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తా. నెల్లూరులో వైకాపాను సర్వనాశనం చేస్తున్నారు'' అని రూప్‌కుమార్ యాదవ్‌ వ్యాఖ్యానించారు.

ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్‌ తీరుపై ఆయన బాబాయ్‌ (డిప్యూటీ మేయర్) రూప్ కుమార్ యాదవ్ పద్యం రూపంలో విమర్శలు గుప్పించారు. వేమన పద్యాన్ని ఉదహరిస్తూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు..

ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలకు హాజరుకావడం లేదు : జూనియర్ ఎన్టీఆర్..

హైదరాబాద్‌లో ఇవాళ సాయంత్రం ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలు అట్టహాసంగా జరగనున్నాయి. నగరంలోని కూకట్‌పల్లి ఖైతాలపూర్ మైదానంలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి..

ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ మనవడు.. జూనియర్ ఎన్టీఆర్ వస్తారని భావించగా.. ఈ కార్యక్రమానికి తాను హాజరుకావట్లేదని తాజాగా జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు. తన పుట్టినరోజు కార్యక్రమాలు, టూర్‌ దృష్ట్యా హాజరు కాలేకపోతున్నట్లు స్పష్టం చేశారు..

SB NEWS

SB NEWS

SB NEWS

Liquor Allergy: మందు బాబులు అలర్ట్.. లిక్కర్‌ అలర్జీ ముప్పు.. హైదరాబాద్‌లో తొలి కేసు..

సంతోషం వచ్చినా.. బాధ కలిగినా.. ప్రమోషన్‌ వచ్చినా.. డిమోషన్‌ వచ్చినా.. బంధువులు వచ్చినా.. ఫ్రెండ్స్‌ కలిసినా.. ఇలా ఏది జరిగినా..

వచ్చేది ఒక్కటే మాట.. అదే మందు వేద్దామా? అని అంతలా చాలా మంది లిక్కర్‌లో మునిగితేలుతున్నారు.. అయితే, మందు బాబులు అలర్ట్ కావాల్సిన సమయం వచ్చేసింది.. ఇప్పటి వరకు లిక్కర్‌తో లివర్‌ చెడిపోతుందని మాత్రమే అనుకొనేవాళ్లు.. కానీ, ఇప్పుడో షాకింగ్ వ్యవహారం వెలుగు చూసింది..

హైదరాబాద్‌లో వెలుగు చూసిన అరుదైన కేసు.. మందు బాబులు ఒక్కసారి ఉలిక్కిపడేలా చేస్తోంది.. ఇది ఎందరిలో ఉంది.. ఎలా వస్తుంది.. ఎలాంటి రియాక్షన్‌ ఉంటుంది? ఎలా గుర్తించాలి? లాంటే అనేక సందేహాలను తెరపైకి తెచ్చింది..

మందు తాగేవారిలో ఎర్రటి దద్దుర్లతో 'లిక్కర్‌ అలర్జీ' అనే అరుదైన వ్యాధి సోకుతుందని చాలా మందికి ఇప్పటి వరకు తెలిసి ఉండదు.. కానీ, దాని గురించి తెలుసుకోవాల్సిన సమయం వచ్చేంది.. ఎందుకంటే మనదేశంలో లిక్కర్‌ అలర్జీని ఇటీవల తొలిసారి హైదరాబాద్‌లోనే గుర్తించారు.

ఆగ్రా నుంచి వచ్చిన జాన్‌ అనే 36 ఏళ్ల యువకుడికి ఈ వ్యాధిని గుర్తించారు.. జాన్‌కు ఈ వ్యాధి సోకినట్టు హైదరాబాద్‌లోని అశ్విని అలర్జీ సెంటర్‌ వైద్యులు తేల్చారు.. ఇది చాలా అరుదైన వ్యాధి అని, మద్యం సేవించడం వల్ల కొంతమంది శరీరంలో అలర్జీకి సంబంధించిన మార్పులు కనిపిస్తాయంటున్నారు డాక్టర్‌ వ్యాకరణం నాగేశ్వర్‌.. అయితే, చాలా అరుదైన కేసు.. ప్రపంచంలోనే ఈ తరహా కేసులు వందకు మించి ఉండవని పేర్కొన్నారు..

శత్రువు కూడా జాలిపడే పరిస్థితిలో పాకిస్తాన్

ఇస్లామాబాద్:

ప్రపంచంలో ఉన్న ఏ ముస్లిం అయినా జీవితంలో ఒక్క సారైన సౌదీ అరేబియాలో ని మక్కా మసీదును సందర్శించాలని కోరుకుంటారు. హజ్ యాత్ర కు సంబంధించి సౌదీ అరేబియా ప్రపంచంలో ని అన్ని దేశాల్లో ఉన్నముస్లింలకు సందర్శించడానికి అవకాశం ఇస్తుంది.

అందులో ఒక్కో దేశానికి సంబంధించి ఇంతమంది రావడానికి వీసాలు ఇస్తామని చెబుతుంది. ఏయే దేశాలకు ఎంతమందికి ఇవ్వాలో సౌదీ నిర్ణయిస్తుంది. గతంలో పాకిస్థాన్ మా కోట పెంచండి, మాది ముస్లిం దేశం ఇక్కడి నుంచి మక్కాకు రావడానికి ఎంతోమంది సిద్ధంగా ఉన్నారని అడిగేది. అయితే అలా ఎక్కువ ఇవ్వడం కుదరదని సౌదీ చెప్పేది.

ఈ సంవత్సరం మాత్రం పాకిస్థాన్ అప్పుల ఊబిలో కూరుకుపోయి దీనావస్థలో ఉంది. ఎంతలా అంటే హజ్ యాత్రకు సౌదీ అనుమతించిన వీసాల్లో సగానికి సగం మాకు అవసరం లేదు. మీరే ఎవరికైనా ఇచ్చేసుకోండని చెప్పింది. ఎందుకంటే హజ్ యాత్రకు సంబంధించి ప్రభుత్వం రాయితీలు ఇవ్వాలి. రాయితీలు ఇచ్చేంత సొమ్ము ఇప్పుడు పాక్ వద్ద లేదు. ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాక్ తమకు ఇచ్చిన వీసాలను తిరిగి వెనక్కి ఇచ్చేసింది. ఇది అతి పెద్ద సంచలనంగా మారింది.

సౌదీ ఇచ్చిన అవకాశం ప్రకారం అందరూ వెళ్లాలంటే సౌదీకి 4500 డాలర్లు పాక్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇదే పాకిస్థాన్ కరెన్సీలో 1.2 మిలియన్ల వరకు అవుతుంది. దీంతో 70 శాతం ఖర్చు పెరిగింది. ఇది హజ్ యాత్ర కు సంబంధించిన కోటాను వెనక్కి ఇవ్వడంతో పాక్ పరిస్థితి ఎలా మారిందో అర్థం చేసుకోవచ్చు.

ఈ కోటాకు సంబంధించిన హజ్ యాత్ర వీసాలను ఇండోనేషియాకు సౌదీ ఇచ్చింది. ప్రస్తుతం పాక్ పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో ఈ హజ్ యాత్ర కోటానే ఉదాహరణ గా తీసుకోవచ్చు. ఈ ఆర్థిక సంక్షోభం ముదిరి ఎటు వైపు దారి తీస్తుందో.. ఎలాంటి దారుణాలు జరుగుతాయో చూడాలి.

శంషాబాద్ మెట్రో రైలుకు టెండర్లు

రాయదుర్గం–శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు మధ్య నిర్మించిన ఈ ప్రాజెక్టు కోసం.. 2023, మే 16వ తేదీన టెండర్లను ఆహ్వానిస్తూ.. హెచ్ఏఎంఎల్ నోటిఫికేషన్ జారీ చేసింది. మే 17వ తేదీ నుంచి బిడ్డింగ్ పత్రాలను జారీ చేయనుంది. హైద్రాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఈ నోటిఫికేషన్ జారీ చేసింది.

ఎయిర్ పోర్టు మెట్రో బిడ్డింగ్ కు చివరి తేదీ జూలై 5 గా నిర్ణయించారు. శంషాబాద్ మెట్రో కాంట్రాక్టు విలువ 5 వేల 648 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. 2022 డిసెంబర్ 9వ తేదీన మెట్రో నిర్మాణ పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు.

రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు 31 కిలోమీటర్ల మైట్రో ఏర్పాటు చేయనున్నారు. రాయదుర్గం నుంచి ఎయిర్ పోర్ట్ కు కేవలం 31 నిమిషాల్లోనే చేరుకునే విధంగా ప్లాన్ చేశారు.

31 కిలోమీటర్ల మార్గంలో.. రెండున్నర కిలోమీటర్లు భూగర్భంలో లైన్ను నిర్మించనున్నారు. తొమ్మిది స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు. మూడేళ్లలో హైద్రాబాద్ ఎయిర్ పోర్టు మెట్రో రైలు పనులను పూర్తి చేయాలని కేసీఆర్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

SB NEWS

Heat Waves Effect: ఏపీలో ఇవాళ 20 మండలాల్లో వడగాల్పులు. హై అలర్ట్..

నేడు 20 మండలాల్లో వడగాల్పులు ప్రభావం ఉండబోతోంది..

అనకాపల్లి జిల్లా 2, గుంటూరు 2, కాకినాడ 1, ఎన్టీఆర్ 3, పల్నాడు 3, వైఎస్సార్ జిల్లాలో 9 మండలాల్లో వడగాల్పులు ప్రభావం ఉంటుంది. మిగిలిన చోట్ల కూడా ఎండ ప్రభావం ఉంటుందని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.

ఈరోజు ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు,తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 44డిగ్రీలు నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 41డిగ్రీల నుంచి – 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది..

వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాల్లో ఉన్నవారు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి..

SB NEWS

PM Rozgar Mela: 10 నెలల్లో పది లక్షల ఉద్యోగాలు.. అక్రమాలకు తావు లేకుండా నియామకాలు..

పది నెలలో పది లక్షల ఉద్యోగాలు భర్తీ ప్రక్రియను మోడీ నేరుగా చూస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు..

దేశ వ్యాప్తంగా 45 ప్రాంతాల్లో పీఎం రోజ్ గార్ మేళను మోడీ సర్కార్ నిర్వహించనుందని వెల్లడించారు. ఇవాళ పిఎం రోజ్ గార్ మేళలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పీఎం రోజ్ గార్ మేళలో మోడీ పాల్గొననున్నారు.

ఇక హైదరాబాద్ లో పీఎం రోజ్ గార్ మేళలో పాల్గొన్న కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో రిక్రూట్ అయిన 71 వేల మందికి పీఎం రోజ్ గార్ మేళలో నియామక పత్రాలు జారీ కానున్నట్లు వెల్లడించారు.

కేంద్ర ప్రభుత్వ శాఖలలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని మోడీ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. అనంతరం 232 మందికి నియామక పత్రాలను కిషన్ రెడ్డి అందజేసారు..

SB NEWS

YSR Matsyakara Bharosa: నేను మంచిని నమ్ముకున్నా.. ప్రజలను నమ్ముకున్నా: సీఎం జగన్‌

వైఎస్సార్‌ మత్స్యకార భరోసా కార్యక్రమంలో సీఎం జగన్‌ స్పీచ్‌

మన ప్రభుత్వాన్ని చూసి గత పాలకులు తట్టుకోలేకపోతున్నారు..

పేదవాడికి మంచి చేస్తుంటే చూడలేకపోతున్నారు.

ఎన్నికలప్పుడే చంద్రబాబుకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు గుర్తొస్తారు.

నేను మంచిని నమ్ముకున్నా.. ప్రజలను నమ్ముకున్నా.

ప్రతి అడుగులోనూ మంచి చేస్తున్నాం.

గత ప్రభుత్వంలో మత్స్యకారులకు అరకొర సాయం.

టీడీపీ ప్రభుత్వంలో రూ. 4వేలు.. అది కూడా కేవలం కొందరికి మాత్రమే అందేది.

చంద్రబాబు ఐదేళ్లలో ఇచ్చింది కేమన ప్రభుత్వంలో ఒక్క ఏడాదిలోనే రూ. 231 కోట్లు ఇస్తున్నాం.

గత ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి తేడా గమనించాలి.

గతంలో 1100 బోట్లు, ఇప్పుడు 20వేల బోట్లకు సబ్సిడీ ఇస్తున్నాం.

గతంలో డీజిల్‌పై రూ.6 ఇస్తే.. ఇప్పుడు రూ.9 సబ్సిడీ ఇస్తున్నాం.