కర్ణాటక ఫలితాలే తెలంగాణలో రిపీట్ చేస్తాం
హైదరాబాద్ :
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ దాదాపు మేజిక్ ఫిగర్ సాధించే దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు అందుతున్న ట్రెండ్స్ మేరకు కాంగ్రెస్ 125 స్థానాల వరకు ఆధిక్యతలో కొనసాగుతోంది. బీజేపీ 70 స్థానాల్లోనే ప్రస్తుతం ఆధిక్యతలో ఉంది. ముఖ్యమంత్రి బొమ్మ పరోక్షంగా పరాజయం అంగీకరించారు.
ఈ సమయంలో కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు ట్రెండ్స్ పైన టీపీసీసీ చీఫ్ రేవంత్ స్పందించారు. కర్ణాటక ఫలితాలే తెలంగాణలో రిపీట్ అవుతాయని ధీమా తో కనిపించారు. కేసీఆర్ పాత్రపై కీలక వ్యాఖ్యలు చేసారు.
తెలంగాణలో కర్ణాటక ఎఫెక్ట్: దక్షిణాదిన బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం చేజారింది. హస్తం వశం అవుతోంది. వెల్లడవుతన్న ట్రెండ్స్ కాంగ్రెస్ కు స్పష్టమైన ఆధిక్యతను సూచిస్తున్నాయి. మేజిక్ ఫిగర్ ను కాంగ్రెస్ సొంతగా చేరుకోవటం ఖాయంగా కనిపిస్తోంది. జేడీఎస్ సహకారం లేకుండానే కాంగ్రెస్ అధికారం దక్కించుకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
కాంగ్రెస్ కు ఈ ఫలితాలు దేశ వ్యాప్తంగా జోష్ ను ఇచ్చాయి. ఇప్పుడు తెలంగాణలో ఎన్నికల కు సిద్దం అవుతున్న వేళ ఈ ఫలితాలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ స్పందించారు. బజరంగ్ బలీ కాంగ్రెస్ ను గెలింపించారని వ్యాఖ్యానించారు. ఎవరి మద్దతు అవసరం లేకుండా ప్రజలు పూర్తిగా కాంగ్రెస్ కు అనుకూల తీర్పు ఇచ్చారని వ్యాఖ్యానించారు..
SB NEWS
May 14 2023, 10:06