Karnataka Results: కన్నడ పోరులో.. కాంగ్రెస్‌ అఖండ విజయం

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Assembly election Results) కాంగ్రెస్‌ (Congress) పార్టీ అఖండ విజయం సాధించింది. శనివారం వెలువడిన ఫలితాల్లో మొత్తం 224 స్థానాలకు గానూ హస్తం పార్టీ 135 స్థానాల్లో జయకేతనం ఎగురవేయగా.. మరో చోట ఆధిక్యంలో ఉంది. ఇక భాజపా (BJP) 64 స్థానాలతో రెండో స్థానానికి పరిమితమైంది. జేడీఎస్‌ (JDS) 20 చోట్ల గెలుపొందగా.. ఇతరులు 4 చోట్ల విజయం సాధించారు..

SB NEWS

SB NEWS

SB NEWS

SB NEWS

అలిపిరిలో మాజీ సీజేఐ ఎన్వీ రమణ శ్రమదానం

చిత్తూరు జిల్లా:

తిరుపతి సామూహిక శ్రమదానంతో సుందర తిరుమల కార్యక్రమాన్ని అలిపిరి వద్ద సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ శనివారం ఉదయం జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ కార్యక్రమాన్ని గత 13 రోజులుగా టీటీడీ నిర్వహించడం చాలా సంతోషకరమన్నారు. స్వచ్ఛంద సేవతో సుందర తిరుమలకు అందరూ పూనుకోవటం అభినందనీయమన్నారు. న్యాయమూర్తులకు స్వచ్ఛందసేవకు అవకాశం కల్పించాలని 2008లో అప్పుడు జాయింట్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్‌గా ఉన్న ధర్మారెడ్డిని కోరినట్లు తెలిపారు. అది గుర్తుపెట్టుకున్న ఆయన ఈ రోజు తనను ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానించారన్నారు.

తిరుమల పవిత్రత తమ కర్తవ్యంగా భక్తులు భావించాలని ఎన్వీ రమణ అన్నారు. సుందర తిరుమల కార్యక్రమంలో పాల్గొనడం దేవుడు ఇచ్చిన వరంగా భావిస్తున్నానన్నారు.

అనేక దేవతలు సంచరించిన సప్తగిరులకు ఎంతో పవిత్రత ఉందన్నారు. శ్రీవారి దర్శనార్ధం వచ్చే ప్రతి ఒక్క భక్తుడు ఈ ప్రాంతాన్ని పవిత్రంగా చూసుకోవాలని సూచించారు. భక్తులు కూడా శుద్ధ తిరుమల.. సుందర తిరుమల కార్యక్రమంలో పాల్గొనాలని ఎన్వీ రమణ పిలుపునిచ్చారు.

SB NEWS

కేసీఆర్ ఒక హంతకుడు : వైయస్ షర్మిల

హైదరాబాద్ :

సీఎం కేసీఆర్ ఒక హంతకుడని.. ఒకేరోజు ముగ్గురిని పొట్టన పెట్టుకున్నాడని వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శనివారం విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. డిగ్రీ చదివి నాలుగేళ్లయినా ఉద్యోగం రాక శివకుమార్ ఉరి వేసుకున్నాడన్నారు. 20 రోజులైనా వడ్లకు కాంటాలు వేయక రైతు యల్లయ్య గుండె ఆగిందన్నారు.

15రోజులుగా సమ్మె చేస్తున్నా.. సర్కారు స్పందించక జీపీ కార్యదర్శి సోనీ తనువు చాలించిందని షర్మిల పేర్కొన్నారు. తెలంగాణ బిడ్డల ప్రాణాలు తీసుకుంటున్నా.. కేసీఆర్ దొరకు దున్నపోతు మీద వాన పడ్డట్టే ఉందన్నారు. కొలువులు లేక పుట్టెడు దు:ఖంతో యువత ఉందన్నారు.

వడ్లు కొనక కన్నీటి వ్యధతో రైతులున్నారని షర్మిల పేర్కొన్నారు. ‘‘ఉద్యోగ భరోసా లేక మనస్తాపంతో కార్యదర్శులు.. చచ్చిపోతున్నా కనికరించవా కేసీఆర్? ఇంకెంతమంది ఉసురు తీసుకుంటావ్? నీ కుటుంబానికి పదవులు కావాలె! మా బిడ్డలకు ఉద్యోగాలు వద్దా? నీ కుటుంబం ఆస్తులు సంపాదించుకోవాలె!

మా రైతులు అప్పులు తీర్చుకోవద్దా? నీ కుటుంబం కోట్లకు పడగలెత్తాలె! మా బిడ్డలు పాడె ఎక్కాల్నా? ఇంకా నువ్ ఎందుకు బతికున్నట్టు కేసీఆర్? బంగారు తెలంగాణ పేరుతో ఆత్మహత్యల తెలంగాణగా మార్చావు కదా?’’ అని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.

SB NEWS

కర్ణాటక ముఖ్యమంత్రి : ఎవ్వరు❓️

బెంగళూరు :

కాంగ్రెస్‌కు తగిన మెజారిటీ వస్తే కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారా? ప్రజాధరణ ఎక్కువగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అవుతారా? అన్న చర్చ ఉత్కంఠకు దారితీస్తోంది.

కర్ణాటక ఎలక్షన్ రిజల్ట్స్ టేబుల్: కొనసాగుతున్న కాంగ్రెస్ ఆధిక్యం

లింగాయత్ ఓట్లలో చీలిక.. 30 శాతం వరకు కాంగ్రెస్‌కు

లింగాయత్‌ల ఓట్లలో చీలిక ఏర్పడినట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వీరిలో 30 నుంచి 40 శాతం ఓట్లు బీజేపీ నుంచి కాంగ్రెస్‌కు మొగ్గు చూపినట్టు అంచనా వేస్తున్నారు.

కాంగ్రెస్‌కు దక్కిన దళితుల మద్దతు

ఎస్సీ ఓట్లు గతంలో బీఎస్పీకి మద్దతుగా పడేవి. గత ఎన్నికల అనంతరం బీఎస్పీ ప్రభావం కనుమరుగైంది. ఈ నేపథ్యంలో దళితులు కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చారు.

ధరల పెరుగుదల, నిరుద్యోగిత ప్రభావం

నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, నిరుద్యోగం, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల దుస్థితి, పట్టణ ప్రాంతాలలో మంచినీటి సమస్య తదితర అంశాలపై అధికార బిజెపి పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ ఎగ్జిట్ పోల్స్‌లో విశ్లేషించింది. ఈ వ్యతిరేకత కారణంగానే బిజెపి అధికారం కోల్పోయే అవకాశాలు కనబడుతున్నాయని ముందుగానే అంచనా వేసింది.

40 శాతం సర్కారు నినాదం ఫలించిందా?

ప్రస్తుత బీజేపీ ప్రభుత్వంలోని అవినీతిని ఎండగడుతూ చేసిన ‘40% సర్కారు’ కమీషన్‌ నినాదం ద్వారా కాంగ్రెస్‌ విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లగలిగింది. కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన ఆకర్షనీయమైన మేనిఫెస్టో వల్ల ఆ పార్టీకి లాభం చేకూరింది.

సిలిండర్, పెట్రోలు ధరల ప్రభావం?

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారం కోల్పోయే స్థితికి రావడానికి సిలిండర్ ధరల పెరుగుదల, పెట్రోలు, డీజిల్ పెరుగుదల ప్రభావం చూపిందని ఎన్నికల విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఎస్సీ, ఎస్టీ సీట్లలో కాంగ్రెస్ సంపూర్ణ ఆధిక్యం

ఎస్సీ, ఎస్టీ రిజర్వ్‌డ్ సీట్లలో ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ సంపూర్ణ ఆధిక్యం కనబరుస్తోంది. మొత్తంగా రాష్ట్రంలో కాంగ్రెస్ 43 శాతం ఓట్లతో ముందంజటలో ఉంది. బీజేపీ 36.1 శాతం ఓట్లు దక్కించుకుంది. జేడీఎస్ 13 శాతం ఓట్లు దక్కించుకుంది.

స్పష్టంగా కాంగ్రెస్‌కు ఆధిక్యం

కాంగ్రెస్‌కు ఇప్పటి వరకు 119 సీట్లలో స్పష్టమైన ఆధిక్యం కనబడుతోంది. అయితే చివరి వరకు ఫలితాలు ఉత్కంఠగా మారనున్నాయి.

ప్రజలు బీజేపీతో విసిగిపోయారు. సిద్దరామయ్య

కర్ణాటకలో నరేంద్ర మోడీ, అమిత్ షాల ప్రచారం ఏ మాత్రం మార్పు తీసుకురాలేదని సిద్ధరామయ్యా అన్నారు. బీజేపీతో ప్రజలు విసిగిపోయారన్నారు. తాను మొదటి నుంచి చెబుతున్నది నిజమైందని సిద్ధరామయ్య విశ్లేషించారు.

సొంతంగానే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం: సిద్ధరామయ్య

కర్ణాటక: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ హవా కొనసాగుతోంది. కాంగ్రెస్‌కు మంచి మెజారిటీ వస్తోందని, సొంతంగానే అధికారంలోకి వస్తామని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ధీమా వ్యక్తం చేశారు.

అన్నారు. ప్రధాని పర్యటన ప్రభావం చూపలేదన్నారు. మత రాజకీయాలు కర్ణాటకలో పనిచేయవన్నారు.

120 స్థానాలకుపైగా గెలుస్తాం బీజేపీపై ప్రజలు విసిగిపోయారని, మాకు ఎవరి మద్దతు అవసరం లేదని సిద్ధరామయ్య అన్నారు. కాగా, కాంగ్రెస్‌ రెబల్స్‌తో డీకే శివకుమార్‌ టచ్‌లోకి వెళ్లారు. రెబల్స్‌ను గూటికి తీసుకొచ్చే పనిలో పడ్డారు. ఐదుగురు రెబల్స్‌తో డీకే శివకుమార్‌ మంతనాలు జరుపుతున్నారు..

SB NEWS

SB NEWS

SB NEWS

NV Ramana | తిరుమల పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ భక్తుడిది: జస్టిస్ ఎన్వీ రమణ

తిరుమల: కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వర స్వామివారి నిలయమైన తిరుమల (Tirumala) పవిత్రతను, పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ భక్తుడిపై ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ (Justice NV Ramana) అన్నారు.

తిరుపతి-తిరుమల ఘాట్ రోడ్లు, అలిపిరి, శ్రీవారి మెట్ల నడక మార్గాల్లోని ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడం కోసం టీటీడీ (TTD) నిర్వహించిన సుందర తిరుమల-శుద్ధ తిరుమల కార్యక్రమంలో జస్టిస్ రమణ పాల్గొన్నారు. అలిపిరి టోల్ గేట్ వద్ద ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీ వెంకట రమణా రెడ్డితో కలసి జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

SB NEWS

SB NEWS

SB NEWS

కర్ణాటక కాబోయే సీఎం ఎవరు?

11:24 AM: విజయనగర్‌ నియోజవర్గంలో కాంగ్రెస్ గెలుపు. ఆనంద్ సింగ్ కొడుకు ఓటమి.

11:20 AM: కర్ణాటకలో తొలి ఫలితం వచ్చేసింది.. కుందాపుర నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కిరణ్ కుమార్ విజయం సాధించారు.

11:15 AM: ఉదయం 11 గంటలకు ఎన్నికల సంఘం విడుదల చేసి డేటా ఇదే...

కర్ణాటక ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ లీడ్‌లో కొనసాగుతున్నట్టు స్పష్టమవుతోంది. ఇదే విషయం ఉదయం 11 గంటలకు ఎన్నికల సంఘం విడుదల చేసిన డేటాను బట్టి స్పష్టమైంది. ఈసీ డేటా ప్రకారం.. కాంగ్రెస్ 120 నియోజకవర్గాలు, బీజేపీ 69 సీట్లు, జేడీఎస్ 26 స్థానాల్లో, ఇతరులు 3 చోట్లలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

10:58 AM: హుబ్లీ నియోజకవర్గంలో వెనుకంజలో ఉన్న కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ షెట్టర్.

10:55 AM: కేజీఎఫ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ హవా..

కోలార్ జిల్లా కేజీఎఫ్ నియోజకవర్గంలో 8వ రౌండ్ ముగిసే సమయానికి కాంగ్రెస్ పార్టీ 18,997 ఓట్ల మెజారిటీతో కొనసాగుతోంది. కాంగ్రెస్‌కు 37,849 ఓట్లు రాగా.. బీజేపీకి 18,852 ఓట్లు వచ్చాయి.

10:40 AM: కోలాహలంగా ఏఐసీసీ కార్యాలయం..

కర్ణాటకలో విజయం దిశగా కాంగ్రెస్ పయనిస్తుండటంతో.. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం కోలాహలంగా మారింది. ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. కాంగ్రెస్ కార్యాలయానికి కార్యకర్తలు భారీగా చేరుకున్నారు.

10:34 AM: బళ్ళారి సిటీలో కాంగ్రెస్ లీడ్. కాంగ్రెస్ అభ్యర్థి నారా భరత్ రెడ్డి 2926 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

దేశవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కర్ణాటక ఎన్నికల కౌంటింగ్

ఉదయం 8 గంటలకు పోస్టల్ ఓట్ల కౌంటింగ్ మొదలైంది...* 

 కౌంటింగ్ మొదలైన గంట తర్వాత ట్రెండ్ ఇదీ... ఫలితాలపై స్పందించిన కుమారస్వామి

08:55 AM: వరుణ నియోజకవర్గంలో లీడ్‌లో దూసుకెళ్తున్న సిద్ధారమయ్య.

08:53 AM: బళ్లారిలో శ్రీరాములు ముందంజ

08:52 AM: ఉదయం హనుమాన్ ఆలయాన్ని సందర్శించిన సీఎం బసవరాజ్ బొమ్మై.

08:50 AM: 100కు పైగా స్థానాల్లో కాంగ్రెస్ ముందంజ. 83 స్థానాల్లో లీడ్‌లో ఉన్న బీజేపీ అభ్యర్థులు. మరోవైపు జేడీఎస్ అభ్యర్థులు 19 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నారు.

08:46 AM: చెన్నపట్నలో జేడీఎస్ అధినేత కుమారస్వామి వెనుకంజ. రామనగర నియోజకవర్గంలో కుమారస్వామి కొడుకు నిఖిల్ కుమారస్వామి కూడా వెనుకంజ

08:44 AM: కనకపురలో డీకే శివకుమార్ ముందంజ

08:38 AM: ఈవీఎం ఓట్ల కౌంటింగ్ మొదలు.

08:35 AM: కౌంటింగ్ మొదలైన అరగంట తర్వాత పరిస్థితి ఇదీ..

కర్ణాటక ఎన్నికల కౌంటింగ్ మొదలైన అరగంట తర్వాత ఫలితాల సరళిపై ఒక స్పష్టత వచ్చింది. కాంగ్రెస్ 82 స్థానాల్లో, బీజేపీ 66 చోట్ల, జేడీఎస్ 17 చోట్ల ముందంజలో ఉన్నాయి.

08:28 AM: ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో నిన్న రాత్రి సింగపూర్ నుంచి బెంగళూరు చేరుకున్న కుమారస్వామి ఫలితాల ట్రెండ్‌పై స్పందించారు. ఇప్పటివరకు తమను ఏ పార్టీ సంప్రదించలేదని చెప్పారు. ప్రస్తుతానికి తనకు డిమాండ్ లేదని వ్యాఖ్యానించారు.

08:28 AM: కర్ణాటక కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో సంబరాలు మొదలయ్యాయి..

కొడుకును చూసి గర్వపడుతున్నా : మంత్రి హరీష్ రావు

ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకుల్లో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ రావు.. ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రాజకీయాల్లో మాత్రమే కాక.. సోషల్‌ మీడియాలో కూడా చాలా యాక్టీవ్‌గా ఉంటారు. రాజకీయాలు మాత్రమే కాక.. అన్ని విషయాల గురించి రియాక్ట్‌ అవుతారు.

ఇక సోషల్‌ మీడియాలో ఎంత యాక్టీవ్‌గా ఉన్నప్పటికి.. తన పర్సనల్‌ విషయాల గురించి మాత్రం షేర్‌ చేయరు. ఆయన కుటుంబం గురించి చాలా తక్కువ మందికే తెలుసు. ఈ క్రమంలో తాజాగా హరీష్‌ రావు.. ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. తన కుమారుడికి సంబంధించిన ఫొటోలు షేర్‌ చేసిన హరీష్‌ రావు.. పుత్రోత్సాహంతో పొంగిపోతున్నట్లు వెల్లడించారు.

హరీష్‌ రావు కుమారుడు అర్చిష్మాన్ అమెరికాలోని కొలరాడో యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్ పూర్తి చేసి.. పట్టా అందుకున్నాడు. ఈ మేరకు యూనివర్సిటీ స్నాతకోత్సవం అమెరికాలోని కొలరాడో కౌంటీ బౌల్డర్‌లో జరగింది.

హరీష్‌ రావు ఈ వేడుకలో పాల్గొనడం కోసం అమెరికా వెళ్లాడు. ఇక ఈ స్నాతకోత్సవ కార్యక్రమంలో అర్చిష్మాన్‌ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టాతో పాటు గ్లోబల్ ఎంగేజ్‌మెంట్ అవార్డు కూడా అందుకున్నాడు. ఇక దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు హరీష్ రావు.

ఈవేడుకకు సంబంధించిన ఫొటోలు షేర్‌ చేస్తూ.. ‘‘మా అబ్బాయి ఆర్చిష్మాన్ సాధించిన ఈ అద్భుతమైన ఘనత పట్ల గర్వించకుండా ఎలా ఉంటాను. ఇది నీలోని పట్టుదలకు, మార్పు తీసుకురావాలన్న నీ ఆకాంక్షకు నిదర్శనం. తనలోని ఈ నైపుణ్యం ద్వారా ప్రపంచంపై సానుకూల ప్రభావాన్ని చూపడానికి అర్చిష్మాన్ సిద్ధంగా ఉన్నాడు. అచ్చూ.. ఈ ఘనమైన మైలురాయిని అందుకున్న సందర్భంగా నీకు అభినందనలు. నిన్ను చూసి గర్వంగా ఫీలవుతున్నాను’’ అంటూ తన కొడుకు గురించి గర్వంగా చెప్పుకొచ్చారు హరీశ్‌ రావు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరలవుతోంది.

అడవులే కేంద్రంగా ఉగ్రవాద శిక్షణ

ఆయుధాలుసమీకరించింది మహ్మద్‌ సలీం

అక్కడి బృందానికీ ఇతడితోనే శిక్షణ

ఈ ఐదుగురి నుంచి విదేశాలకు ఫోన్‌ కాల్స్‌

నగరంతో పాటు భోపాల్‌లో పట్టుబడిన 16 మంది ఉగ్రవాదులు సమీపంలో ఉన్న అటవీ ప్రాంతాల్లోనే శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసుకున్నారు. నగర శివార్లలో ఉన్న వికారాబాద్‌లోని అనంతగిరి అడవుల మాదిరిగానే భోపాల్‌ సరిహద్దుల్లోని రైసెన్‌ అడవిని ఎంచుకున్నట్లు ఏటీఎస్‌ అధికారులు నిర్థారించారు. అక్కడ అరెస్టయిన 11 మందితో పాటు నగరంలో చిక్కిన ఐదుగురినీ ప్రస్తుతం ఏటీఎస్‌ తమ కస్టడీలోకి తీసుకుని విచారిస్తోంది.

భోపాల్‌లోని సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ సయ్యద్‌ డానిష్‌ అలీ ఇంటిలో సూత్రధారి యాసిర్‌ ఖాన్‌ నిర్వహించిన సమావేశాలకు నగరం నుంచి సలీంతో పాటు అబ్దుల్‌ రెహా్మన్, షేక్‌ జునైద్‌ కూడా హాజరయ్యారని ఏటీఎస్‌ చెప్తోంది. దానికి సంబంధించిన ఆధారాలు సైతం తమకు లభించినట్లు స్పష్టం చేస్తోంది...

SB NEWS

SB NEWS