కొండగట్టులో అంజన్న ఉత్సవాలు : భద్రాది నుంచి పట్టు వస్త్రాలు
మల్యాల మండలం కొండగట్టులో పెద్ద హనుమాన్ జయంతి వేడుకలకు రంగం సిద్ధమైంది. కొండగట్టు అంజన్న ఆలయంలో హనుమాన్ పెద్ద జయంతి వేడుకల ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ వెంకటేశం తెలిపారు.
మొదటి రోజు ఉదయం స్వస్తిక్వచనం, రక్షాబంధనం, రుత్విక్ వరణం, అరుణి మథనం, దేవతాహవనం, ఉత్సవ మూర్తి యాగశాల ప్రవేశం, దేవతాపూజలు, అగ్నిప్రతిష్ట, హవనం, స్వామివారికి అభిషేకాలు, సహస్ర నామార్చన ఏర్పాటు చేశారు. సాయంత్రం విష్ణసహస్రనామ పారాయణం, స్థాపిత దైవం, బలిహరణం, సుందరకాండ పారాయణం, అమ్మవారి సహస్రమమకుంకుమార్చన, బలిహరణం, మంత్రపుష్ప జరుగుతాయని పేర్కొన్నారు.
కొండగట్టులో నేడు హనుమాన్ పెద్ద జయంతి వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 15 వరకు వేడుకలు జరగనుండగా.. అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 14న హనుమంతుని జయంతి కావడంతో లక్షలాది మంది అంజనా దీక్షాపరులు రానున్నారు. హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా భద్రాచలం సీతారాచంద్రస్వామి ఆలయం నుంచి స్వామివారికి పట్టువస్త్రాలు పంపారు. వాటిని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్‌కుమార్, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్, స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్వామికి అందజేయనున్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం ముందస్తుగా 3.60 లక్షల లడ్డూలను సిద్ధం చేశారు.
ఇవి సరిపోకపోతే వెంటనే సిద్ధం చేసేందుకు అదనపు సిబ్బందిని నియమించినట్లు ప్రసాద తయారీ ఇన్ చార్జి ధర్మేందర్ తెలిపారు. భక్తుల సంఖ్యకు అనుగుణంగా వెంటనే పులిహోర సిద్ధం చేస్తామని తెలిపారు. 14 కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం వైశాఖ ముల్దశమి రోజున హనుమంతుని తిరునక్షత్ర జయంతి వేడుకలను ఆలయ సంప్రదాయం ప్రకారం నిర్వహిస్తారు.
మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు ఆలయంలో త్రికుండమంతిమ యజ్ఞం నిర్వహించి వార్షికోత్సవం రోజున పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఉత్సవాల సందర్భంగా కొండగట్టు ఆలయంలో నిఘా పెంచేందుకు 104 సీసీ కెమెరాలతో పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. ఆలయం తరపున ఆలయం లోపల, బయట ఏర్పాటు చేసిన 64 సీసీ కెమెరాలకు అదనంగా 40 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.











May 12 2023, 14:56
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
14.8k