కావలిలో సీఎం జగన్ పర్యటన..
నెల్లూరు జిల్లా:
చుక్కల భూముల అనుభవదారులకు పట్టాలు పంపిణీ ..పాల్గొననున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి..
జిల్లాలో 18 వేల మంది రైతులకు 43 వేల 270 ఎకరాల భూమిపై యాజమాన్య హక్కు..
మినీ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్న జగన్..
SB NEWS
SB NEWS
SB NEWS
ముస్లింలుగా మారింది ఎందరు? ఉగ్ర కేసులో రంగంలోకి NIA
ఉగ్ర కుట్ర కేసులో ఎన్ఐఏ త్వరలో రంగంలోకి దిగనున్నట్టు తెలి సింది. హిజ్బుత్ తెహ్రీర్ నెట్వర్క్ వేర్వేరు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నందున కేసు విచారణను చేపట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇప్పటికే పట్టుబడ్డ వారిని జరిపిన విచారణలో దేశంలో ని ప్రధాన పట్టణాల్లో విధ్వంసానికి కుట్రలు చేసి నట్టు వెల్లడైన విషయం తెలిసిందే. కేసు తీవ్రత, విస్తృతి నేపథ్యంలోనే ఎన్ఐఏ ఇందులో విచారణ చేపట్టాలని నిర్ణయించినట్టు సమాచారం.
‘హిజ్బుత్ తహ్రీర్’ కేసుపై స్టేట్ ఇంటలిజెన్స్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఈ కేసులో 17 మందిని మధ్యప్రదేశ్ ఏటీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో ఆరుగురు హైదరాబాద్ లో దొరికారు. కాగా, హిజ్బుత్ తహ్రీర్ సంస్థ మత మార్పిడులూ చేస్తూ, దాడులకు ప్లాన్ చేస్తున్నట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిసింది.
అయితే హైదరాబాద్‌లో కూడా మత మార్పిడులు జరిగాయా? అలా జరిగితే ఎంత మందితో మతం మార్పించారు? అనే వివరాలను కౌంటర్ ఇంటలిజెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. మధ్యప్రదేశ్ ఏటీఎస్ పోలీసులు సీజ్ చేసిన ఫోన్ల ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు. కాగా, హైదరాబాద్‌లో దొరికిన నిందితుడు మహమ్మద్ సలీం మత మార్పిడుల్లో కీలక పాత్ర పోషించినట్టు భావిస్తున్నారు.
భోపాల్‌కు చెందిన సౌరబ్ వైద్యను జిమ్ ట్రైనర్, హిజ్బుత్ తహ్రీర్ సంస్థ సభ్యుడైన యాసీన్ మతం మార్పించినట్లు విచారణలో తేలినట్లు సమాచా రం. సలీంగా పేరు మార్చిన తర్వాత అతడిని హైదరాబాద్ పంపినట్టు తెలిసింది. ఓ బడా వ్యాపారి సిఫార్సుతో సలీం ప్రముఖ మెడికల్ కాలేజీలో హెచ్వోడీగా చేరాడు.
ఆ తర్వాత వే టు రైట్ పాత్ పేరుతో యు ట్యూబ్ ఛానల్ ను కూడా ప్రారంభించినట్టు మధ్యప్రదేశ్ పోలీసుల విచారణలో తేలింది. మతం మార్చుకున్న వారి కోసమే ఈ ఛానల్ ను సలీం నడుపుతున్నట్టు వెల్లడైంది. ఈ క్రమంలోనే సలీం ఎంత మందితో మతం మార్పించాడు అన్నది తెలుసుకోవటానికి తెలంగాణ కౌంటర్ ఇంటలిజెన్స్ సిబ్బంది రంగంలోకి దిగినట్టు సమాచారం.
మగవాళ్లే టార్గెట్
నగరంలో చైన్ స్నాచర్లు పెట్రేగిపోతున్నారు. సరికొత్త మార్గాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నారు. రద్దీగా ఉన్న బస్సులను టార్గెట్ చేస్తూ.. మగవారి మెడలోని బంగారు గొలుసులను తస్కరిస్తున్నారు. ఇలా దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను మాదాపూర్ పోలీసులు పట్టుకున్నారు.
హైదరాబాద్ నగరంలో ఇటీవల కాలంలో దొంగతనాలు ఎక్కువయ్యాయి. నగరంలో తిష్ట వేసిన అంతరాష్ట్ర ముఠాలు పగలు రెక్కీ నిర్వహించి రాత్రిళ్లు దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇక చైన్ స్నాచర్లు కూడా రెచ్చిపోతున్నారు. ఉదయం వేళలో ఇంటి ముందు మగ్గులు వేసే ఆడవారు, వాకింగ్‌కి వెళ్లేవాళ్లను లక్ష్యంగా చేసుకొని స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు.
తాజాగా.. స్నాచర్లు సరికొత్త పద్దతుల్లో దొంగతనాలకు తెరతీశారు. రద్దీగా ఉన్న బస్సులను టార్గెట్ చేశారు. అందులోనూ మగవారే వారి లక్ష్యం. ముఠాగా ఏర్పడిన పలువురు స్నాచర్లు రద్దీ బస్సులను టార్గె్ట్ చేసి స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు. మగవారి మెడలోని బంగారు గొలుసు, బ్రాస్లెట్‌లు స్నాచింగ్ చేస్తు్న్నారు. ఇటీవల కాలంలో నగర వ్యాప్తంగా బాధితులు పోలీసులను ఆశ్రయించటంతో స్నాచింగ్ ముఠా గుట్టు వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని కొందరు పాత నేరస్థులు కాంబ్లే లక్ష్మణ్ నేతృత్వంలో ఒక ముఠాగా ఏర్పాడి దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈ చైన్ స్నాచర్లు కేవలం రష్‌గా ఉన్న బస్సులను మాత్రమే టార్గెట్‌గా చేసుకొని చోరీలకు పాల్పడుతున్నారు. అందులోనూ ఆడవారి జోలికి వెళ్లకుండా బస్సుల్లో ప్రయాణించే మగవారి మెడలో ఉన్న బంగారు గొలుసులు, చేతులకు ఉండే బ్రాస్లెట్‌లను దోచుకుంటున్నారు. రష్‌గా ఉన్న బస్సులో ముందుగా ప్రయాణికుల మాదిరిగా ఎక్కుతారు. కొందరు బస్సు మధ్యలో మరికొందరు ఫుట్‌బోర్డుల్లో ప్రయాణిస్తారు.
బస్సు మధ్యలో ఉన్న వారు అటూ ఇటూ తిరుగుతూ.. ఎవరి మెడలో బంగారం ఉందనే దానిపై రెక్కీ నిర్వహిస్తారు. అనంతరం మెల్లిగా వారి మెడలోంచి బంగారు ఆభరణాలు స్నాచింగ్ చేస్తారు. అనంతరం వాటిని ఫుట్‌బోర్డులో ఉండేవారికి అందిస్తారు. వారు మధ్యలోనే దిగి అక్కడి నుంచి ఎస్కేప్ అవుతారు. ఒకవేళ గోల్డ్ చైన్ పోయిందని ఎవరైనా గుర్తించినా.. వారికి అనుమానం రాకుండా జాగ్రత్తలు పడతారు. గత కొంత కాలంగా నగరంలోని గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం, హుమాయున్ నగర్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలాంటి కేసులు వెలుగులోకి వచ్చాయి.
రామగుండం కమిషనరేట్ పరిధిలోని 11 మంది ఎస్ఐలు బదిలీలు*
రామగుండం కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న 11 మంది సబ్ ఇన్స్ పెక్టర్లను బదిలీ చేస్తూ రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
దేవాపూర్‌లో పనిచేస్తున్న విజయేందర్‌ను సుల్తానాబాద్‌కు, పొత్కపల్లిలో పనిచేస్తున్న మహేందర్‌ను పెద్దపల్లికి, పెద్దపల్లిలో పనిచేస్తున్న రాజేశ్‌ను మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌కు, టాస్క్‌ఫోర్స్ మంచిర్యాలలో పనిచేస్తున్న రామకృష్ణను పొత్కపల్లికి, బసంత్‌నగర్‌లో పనిచేస్తున్న శ్రీనివాస్‌ను కాల్వశ్రీరాంపూర్‌కు, గొదావరిఖని వన్‌టౌన్‌లో పనిచేస్తున్న వెంకటేశ్‌ను బసంత్‌నగర్‌కు, పెద్దపల్లిలో 2వ ఎస్‌ఐగా పనిచేస్తున్న మౌనికను మంచిర్యాల సీసీఆర్‌బీకి,
వీఆర్ మంచిర్యాలలో ఉన్న రవికుమార్‌ను బెల్లంపల్లి రెండో ఠాణాకు, బెల్లంపల్లి రెండో ఠాణాలో పనిచేస్తున్న ఆంజనేయులును దేవాపూర్‌కు, శ్రీరాంపూర్‌లో పనిచేస్తున్న మానసను మంచిర్యాల వీఆర్‌కు, సీసీఎస్‌లో పనిచేస్తున్న సమ్మయ్యను గోదావరిఖని వన్‌టౌన్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
SB NEWS
SB NEWS
అంబటి రాయుడు.. YCPలో చేరనున్నాడా❓️
గతకొద్ది రోజులుగా క్రికెటర్ అంబటి రాయుడు రాజకీయాల్లోకి రాబోతున్నాడనే ప్రచారం సాగుతోంది. నేడు ఏపీ సీఎం జగన్‌ను కలవడంతో ఆ ప్రచారానికి మరింత ఆజ్యం పోసినట్లుంది
గుంటూరు జిల్లాకు చెందిన అంబటి రాయుడు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నట్లు గతంలోనే తెలిపాడు. దీంతో ఏ పార్టీలో చేరనున్నాడనే విషయంపై ఆసక్తి నెలకొంది. రాయుడిని ఏపీ బీఆర్‌ఎస్‌లోకి తీసుకునేందుకు ఆ పార్టీకి చెందిన ఏపీ అధ్యక్షుడు తోటం చంద్రశేఖర్ అంబటి రాయుడిని కలిసినట్లుగా కూడా వార్తలొచ్చాయి.
అంతేకాకుండా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి టికెట్ కూడా ఆఫర్ చేసినట్లుగా కథనాలు వెలువడ్డాయి. కాపు సామాజిక వర్గానికి చెందిన రాయుడు జనసేనలో చేరుతారనే ప్రచారం కూడా సాగింది. టీడీపీలో చేరే అవకాశం ఉందని పలువురు భావించారు.
ఇటీవల ఏపీ సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టు శంకుస్థాపన సందర్భంగా చేసిన ప్రసంగాన్నిరాయుడు ట్విట్టర్‌లో రీట్వీట్ చేశాడు. అంతేకాకుండా.. ‘గొప్ప స్పీచ్ సార్.. మీ మీద రాష్ట్ర ప్రజలకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉన్నాయి’ అని ట్వీట్ చేశాడు. దీంతో అంబటి రాయుడు వైసీపీలో చేరనున్నాడనే ప్రచారం జోరుగా సాగింది.
వైసీపీలో చేరనున్నాడనే వార్తలకు బలం చేకూరుస్తూ అంబటి రాయుడు నేడు ఏపీ సీఎం జగన్‌ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే అంబటి రాయుడు క్రికెట్ అకాడమీ పెట్టే ఆలోచనలో ఉన్నాడని, దానికి సంబంధించి భూమి అడిగేందుకు జగన్‌ను కలిశారన్న అభిప్రాయం సైతం వ్యక్తమవుతోంది. జగన్‌తో భేటీపై అటు రాయుడు గానీ, సీఎంవో గానీ ఎలాంటి ప్రకటన చేయలేదు.
Terrorists Links In Hyderabad : హైదరాబాద్ ఉగ్రవాదుల కేసులో కొత్త కోణం .. ప్రజాస్వామ్యదేశాలే టార్గెట్‌గా కుట్రలు
హైదరాబాద్ ఉగ్రవాదుల కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. హిజబ్ ఉట్ తెహ్రిర్ సంస్థతో సంబంధాలున్నట్లుగా ఏటీఎస్ గుర్తించింది..
హైదరాబాద్‌లో మరోసారి ఉగ్రవాద కదలికలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ నగరంలో మరోసారి ఉగ్రవాద మూలాలు కనిపిస్తుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. నగరంలో మొత్తం ఆరుగురు ఉగ్రవాద సానుభూతిపరులను అధికారులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న సల్మాన్ సైతం అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లో అరెస్టైన ఆరుగురు, భూపాల్ లో అదుపులోకి 11 మందిని ఏటీఎస్ అధికారులు కోర్టులో హాజరు పర్చారు. దీనికి మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ ప్రత్యేక న్యాయస్థానం మే19 వరకు కస్టడీ విధించింది..
విచారణలో భోపాల్ టు హైదరాబాద్ కు ఉగ్రవాదుల లింక్స్ ఉన్నట్లు తెలుస్తోంది. దాడుల కోసం అడవుల్లో ఉగ్రవాద శిక్షణ ఇస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఒకరితో మరొకరికి నేరుగా కాంటాక్టు లేకుండా డార్క్ వెబ్ ద్వారా సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం. పెద్ద నగరాలను టార్గెట్ చేసుకున్న నిందితులు అక్కడే సాధారణ పౌరులుగా స్థిరపడినట్లుగా తెలుస్తోంది..
కేంద్ర ఇంటెలిజెన్స్ సమాచారంతో మధ్యప్రదేశ్ ఏటీఎస్, తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్ నిర్వహించాగా..మహమ్మద్ సలీల్, అబ్దుల్ రెహ్మాన్, షేక్ జునైద్, మహమ్మద్ అబ్బాస్, హమీద్ లను అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వీరిలో సలీమ్ ఓ మెడికల్ కాలేజీలో హెచ్ఓడీగా పని చేస్తున్నాడు.
అబ్దుల్ రెహ్మాన్ ఎంఎన్ సీ కంపెనీలో క్లౌడ్ ఇంజినీర్ గా పని చేస్తున్నాడు. షేక్ జునైద్ పాతబస్తీలో డెంటిస్ట్ గా పని చేస్తున్నాడు. మరో ఇద్దరు మహమ్మద్ అబ్బాస్, హమీద్ రోజువారీ కూలీలు. సల్మాన్ అనే కూలీ పరారీలో ఉన్నాడు. సల్మాన్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. పట్టుబడ్డ వారికి హిజ్బుత్ తహ్రీర్ సంస్థతో సంబంధాలు ఉన్నాయని అధికారులు గుర్తించారు..
నేడు ‘దోస్త్’ నోటిఫికేషన్
వచ్చేవిద్యాసంవత్సరానికి డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) నోటిఫికేషన్‌ను గురువారం రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి, కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్‌మిట్టల్ విడుదల చేయనున్నారు. ఇంటర్ ఫలితాలు మంగళవారం విడుదలైన విషయం తెలిసిందే. ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించి డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
SB NEWS
SB NEWS
SB NEWS
SB NEWS
Pawankalyan: ఆఖరి ధాన్యం గింజ కొనేవరకు జనసేన ఉద్యమం ఆగదు..
రైతాంగ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. ఆఖరి ధాన్యం గింజ కొనే వరకు జనసేన ఉద్యమం చేపడుతుందని హెచ్చరించారు..
రాజమండ్రిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. క్షేత్రస్థాయి పర్యటనలో పంట నష్టాలను తన దృష్టికి తీసుకుని వచ్చిన రైతులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే సహించేది లేదని మంత్రులు, ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు. అన్నం పెట్టే రైతులపై దాడి చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అన్నారు. అతివృష్టి, అనావృష్టితో రైతులు తీరని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు..
ప్రభుత్వం తాత్సారం చేయడం వలనే రైతులకు ఈ దుస్థితి ఏర్పడిందని ఆరోపించారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయడంలేదని, క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయకపోయిన ముఖ్యమంత్రి జగన్ స్పందించాలని సూచించారు. రుణమాఫీ చేయకపోయిన పర్వాలేదు. పంటలు వేసుకోవడానికి రైతులు పెట్టుబడులు కోరుతున్నారని తెలిపారు. ప్రభుత్వం సక్రమంగా చర్యలు తీసుకోకపోవడం వలన రైతులు ఇబ్బందులు పడుతున్నారని పవన్ కల్యాణ్ అన్నారు..
SB NEWS
SB NEWS
Delhi vs Centre: దిల్లీలో పాలనాధికారం స్థానిక ప్రభుత్వానిదే..
దిల్లీ: దేశ రాజధాని దిల్లీ (Delhi)లో పాలనా సర్వీసులపై (Administrative Services) నియంత్రణాధికారం ఎవరికి ఉండాలనే వివాదంలో అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) సర్కారుకు సుప్రీంకోర్టు (Supreme Court)లో భారీ విజయం లభించింది..
ప్రభుత్వాధికారులపై ఎన్నికైన ప్రభుత్వానికే సర్వాధికారాలు ఉంటాయని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఈ మేరకు ఐదుగురు సభ్యుల ధర్మాసనం గురువారం ఏకగ్రీవ తీర్పు వెలువరించింది. ఎన్నికైన ప్రభుత్వ నిర్ణయాలకు లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్‌జీ) కట్టుబడి ఉండాలని ధర్మాసనం స్పష్టం చేసింది. శాంతిభద్రతలు మినహా మిగతా అన్ని అంశాలపై దిల్లీ ప్రభుత్వానికే నియంత్రణ ఉండాలని తెలిపింది..
SB NEWS
SB NEWS
SB NEWS
May 12 2023, 10:35