ముస్లింలుగా మారింది ఎందరు? ఉగ్ర కేసులో రంగంలోకి NIA
ఉగ్ర కుట్ర కేసులో ఎన్ఐఏ త్వరలో రంగంలోకి దిగనున్నట్టు తెలి సింది. హిజ్బుత్ తెహ్రీర్ నెట్వర్క్ వేర్వేరు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నందున కేసు విచారణను చేపట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇప్పటికే పట్టుబడ్డ వారిని జరిపిన విచారణలో దేశంలో ని ప్రధాన పట్టణాల్లో విధ్వంసానికి కుట్రలు చేసి నట్టు వెల్లడైన విషయం తెలిసిందే. కేసు తీవ్రత, విస్తృతి నేపథ్యంలోనే ఎన్ఐఏ ఇందులో విచారణ చేపట్టాలని నిర్ణయించినట్టు సమాచారం.
‘హిజ్బుత్ తహ్రీర్’ కేసుపై స్టేట్ ఇంటలిజెన్స్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఈ కేసులో 17 మందిని మధ్యప్రదేశ్ ఏటీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో ఆరుగురు హైదరాబాద్ లో దొరికారు. కాగా, హిజ్బుత్ తహ్రీర్ సంస్థ మత మార్పిడులూ చేస్తూ, దాడులకు ప్లాన్ చేస్తున్నట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిసింది.
అయితే హైదరాబాద్‌లో కూడా మత మార్పిడులు జరిగాయా? అలా జరిగితే ఎంత మందితో మతం మార్పించారు? అనే వివరాలను కౌంటర్ ఇంటలిజెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. మధ్యప్రదేశ్ ఏటీఎస్ పోలీసులు సీజ్ చేసిన ఫోన్ల ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు. కాగా, హైదరాబాద్‌లో దొరికిన నిందితుడు మహమ్మద్ సలీం మత మార్పిడుల్లో కీలక పాత్ర పోషించినట్టు భావిస్తున్నారు.
భోపాల్‌కు చెందిన సౌరబ్ వైద్యను జిమ్ ట్రైనర్, హిజ్బుత్ తహ్రీర్ సంస్థ సభ్యుడైన యాసీన్ మతం మార్పించినట్లు విచారణలో తేలినట్లు సమాచా రం. సలీంగా పేరు మార్చిన తర్వాత అతడిని హైదరాబాద్ పంపినట్టు తెలిసింది. ఓ బడా వ్యాపారి సిఫార్సుతో సలీం ప్రముఖ మెడికల్ కాలేజీలో హెచ్వోడీగా చేరాడు.
ఆ తర్వాత వే టు రైట్ పాత్ పేరుతో యు ట్యూబ్ ఛానల్ ను కూడా ప్రారంభించినట్టు మధ్యప్రదేశ్ పోలీసుల విచారణలో తేలింది. మతం మార్చుకున్న వారి కోసమే ఈ ఛానల్ ను సలీం నడుపుతున్నట్టు వెల్లడైంది. ఈ క్రమంలోనే సలీం ఎంత మందితో మతం మార్పించాడు అన్నది తెలుసుకోవటానికి తెలంగాణ కౌంటర్ ఇంటలిజెన్స్ సిబ్బంది రంగంలోకి దిగినట్టు సమాచారం.
May 12 2023, 10:22