Andrapradesh

Sep 24 2020, 15:09

ఆంధ్ర యూనివర్సిటీ విషయంలో అధికారులకు నోటీసులు జారీ చేసిన హై కోర్ట్...

ఆంధ్ర యూనివర్సిటీ విషయంలో అధికారులకు నోటీసులు జారీ చేసింది హై కోర్ట్. ఈ యూనివర్సిటీ లో జరిగిన అక్రమాలపై వైస్ ఛాన్స్లర్ ఆచార్య, పి.వి.జి. డి. ప్రసాద్ రెడ్డి, , రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఉన్నత విద్యా శాఖ, ఏయూ రిజిస్ట్రార్ లకు నోటీసులు జారీ చేసింది ఆంధ్ర ప్రదేశ్ హై కోర్ట్. ఆంధ్ర యూనివర్సిటీ లో జరిగిన అవినీతి అక్రమాల పై రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసారు టి.ఎన్.ఎస్.ఎఫ్. రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి.ప్రణవ్ గోపాల్. అయితే ఈ కేసును నవంబర్ 2కు వాయిదా వేసింది హై కోర్ట్.

Andrapradesh

Sep 24 2020, 12:14

బిజెపి కార్యాలయం వద్ద భారీ పోలీసు బందోబస్తు

మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలు పై బిజెపి ఆందోళన

పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీ గా బయలుదేరిన నేతలను అడ్డుకున్న పోలీసులు

విష్ణువర్ధన్ రెడ్డి, పాతూరి నాగభూషణం, నూతలపాటి బాల, వంగవీటి నరేంద్ర అరెస్ట్

విష్ణువర్ధన్ రెడ్డి.. బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

జగన్మోహన్ రెడ్డి ఎంత కాలం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తారు

కొడాలి నాని, రోజా వంటి వారు ఉద్దేశపూర్వకంగా రెచ్చ గొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారు

మోడి, యోగి ఆదిత్యనాధ వంటి వారి గురించి మాట్లాడే అర్హత ఉందా

యోగిల గురించి నాని వంటి భోగిలు మాట్లాడుతారా

రాష్ట్రం లో ఉన్న ఐఎయస్, ఐపీయస్ లు.. ప్రభుత్వానికి అయ్యా.. యస్ అనవద్దు

కొడాలి నాని వ్యాఖ్యలు పై ఫిర్యాదు చేసినా ఎందుకు కేసులు పెట్టలేదు

అదే చర్చి పై రాళ్లు వేస్తే 41 మందిని అరెస్టు చేశారు

అమరావతి లో మహిళల పై కేసులు పెట్టి అరెస్ట్ లు చేశారు

నాని పై కేసు పెట్టి అరెస్ట్ చేయాలనేదే మా డిమాండ్

హిందూ సమాజం ఓపిక ఉన్బంత వరకే... ఆతర్వాత ఎవరూ ఆపలేరు

ఎపి లో ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తున్న మంత్రులు క్యాబినెట్ లో ఉండకూడదు

జగన్ చర్యలు తీసుకోకపోతే .. నాని చేత ఆయనే ఇలా మాట్లాడిస్తున్నది‌ వాస్తవం అవుతుంది

Andrapradesh

Sep 24 2020, 12:12

అందమైన లోకంలో అగాథాలు
 మత్తులో తేలిపోతున్న యువతరం

 సీసీబీ విచారణకు దిగంత్‌ హాజరు

బెంగళూరు (యశ్వంతపుర) : రోజుకో కొత్తపేరు వెలుగులోకి వస్తుండటంతో మాదక ద్రవ్యాల కేసు తిరగరాని మలుపులు తిరుగుతూ.. చందనసీమలో సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. ఈ కేసులో అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో పేరున్న నటుడు దిగంత్‌ మరోసారి బెంగళూరు కేంద్ర నేర నియంత్రణ దళం (సీసీబీ) అధికారుల ఎదుట హాజరుకాక తప్పలేదు. ఆయన బుధవారం ఉదయం 11.30 గంటలకు చామరాజపేటలోని సీసీబీ కేంద్ర కార్యాలయానికి న్యాయవాదితో కలిసి చేరుకున్నారు. ఇన్‌స్పెక్టర్‌ పునీత్‌ నేతృత్వంలో అధికారులు ఆయనను ఐదుగంటల పాటు సుదీర్ఘంగా విచారించడం ప్రస్తావనార్హం. ఈనెల 16న ఆయన భార్య ఐంద్రితారైతో కలిసి సీసీబీ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. మరోసారి విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసు జారీ చేశారు. మొదటిసారి హాజరైనప్పుడే దిగంత్‌ చరవాణిని పోలీసులు స్వాధీనం చేసుకుని ఎఫ్‌ఎస్‌ఎల్‌ ప్రయోగశాలకు పంపించారు. అందులోని సమాచారం పోలీసు చేతికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆయనను మరోసారి విచారించారు. ఆ సమాచార ఆధారంగా ప్రశ్నల వర్షం కురిపించారు. ముంబయి, గోవా, శ్రీలంక, బెంగళూరు తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పెద్ద విందులకు దిగంత్‌ హాజరైనట్లు గుర్తించారు. ఈకేసులో ఇప్పటికే జుడీషియల్‌ రిమాండులో ఉన్న వారు దిగంత్‌ పేరు చెప్పడవ΄ తాజా సంకటానికి కారణంగా భావిస్తున్నారు. పార్టీలకు హాజరైనప్పుడు రెండువ΄డు సార్లు మత్తు పదార్థాలను వినియోగించినట్లు దిగంత్‌ అంగీకరించాడనే పోలీసు వర్గాల సమాచారం అధికారికంగా నిర్ధరణ కావాల్సి ఉంది. నేనేమీ మత్తు పదార్థాలను విక్రయించలేదని స్పష్టం చేశారు. 
* మాదకద్రవ్యాల కేసుకు సంబంధించి మరో నలుగురు బుల్లితెర నటుల్ని రాష్ట్ర అంతర్గత భద్రత విభాగం పోలీసులు విచారించారు. వారి పేర్లను వెల్లడించేందుకు అధికారులు నిరాకరించారు. ఖరీదైన విందులకు సంబంధించిన వివరాలను సేకరించుకుని వారిని పంపించారు. అవసరమైతే విచారణకు మరోసారి హాజరు కావాలని అధికారులు సూచించారు. ఓ మాజీ ఎంపీ కుమారుడు, ప్రస్తుత ఎంపీ కుటుంబ సభ్యులొకరిని విచారించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

 • Andrapradesh
   @Andrapradesh మత్తు పదార్ధాల వినియోగం, సరఫరా కేసులకు సంబంధించి ఇప్పటి వరకు అరెస్టు చేసిన 17 మంది నుంచి స్వాధీనం చేసుకున్న చరవాణిల్లో సమాచారం ఆధారంగా సీసీబీ పోలీసులు ఇంకా కొందరిని అరెస్టు చేస్తారని సమాచారం. ఛాయాచిత్రాలు, వాట్సాప్‌ సందేశాల సారాన్ని సంక్షిప్తీకరిస్తున్నారు. నిందితుడు వీరేన్‌ ఖన్నా చరవాణిలో అనేక మంది రాజకీయ నాయకులు, శ్రీమంతుల పిల్లలు, సినీ రంగానికి చెందిన కొందరు ప్రముఖుల వివరాలను విశ్లేషిస్తున్నారు.
   సినీ నటి రాగిణి ద్వివేది స్నేహితుడు రవిశంకర్‌ మొదటి భార్య అర్చన నాయక్‌కు సీసీబీ పోలీసులు నోటీసులు పంపించారు. 2018లో రవిశంకర్‌ నుంచి ఆమె విడాకులు తీసుకుని బిడ్డతో కలిసి పుణేలో ఉంటున్నారు. ఆమె చరవాణి వాట్సాప్‌కు నోటీసును పంపించారు. రవిశంకర్‌కు సంబంధించి మరింత సమాచారం రాబట్టేందుకు విచారించాలని నిర్ణయించారు. బాణసవాడిలో ప్రతీక్‌శెట్టిని అరెస్టు చేసినప్పుడు రవిశంకర్‌ పేరు బయటకు వచ్చింది. బెంగళూరు జలమండలి కార్యాలయంలో రవిశంకర్‌ గుమాస్తాగా పని చేస్తున్న విషయం తెలిసిందే. 
Andrapradesh

Sep 24 2020, 12:11

బేగంపేట్ చేరుకున్న జగన్.. నేరుగా ఆసుపత్రికి !

సీఎం జగన్ మోహన్ రెడ్డి షెడ్యూల్ లో స్వల్ప మార్పులు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన 10 గంటలకు తిరుమల నుండి నేరుగా హైదరాబాద్ వచ్చారు. 
రేణిగుంట ఎయిర్ పోర్టు నుండి నేరుగా బేగంపేట ఎయిర్ పోర్టుకి సీఎం జగన్ చేరుకున్నారు. అక్కడి నుండి నేరుగా 11:20కి హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూన్న వైస్ భారతి తండ్రి ఈసీ గంగిరెడ్డిని పరమర్శించనున్నారు సీఎం.

తిరిగి నేరుగా బేగంపేట ఎయిర్ పోర్ట్ నుండి ప్రత్యేక విమానంలో 1:20కి గన్నవరం రానున్న సీఎం, అక్కడి నుండి రోడ్డు మార్గంలో తాడేపల్లి వెళ్లనున్నారు. కాగా, మూడు రోజులుగా ఆయన పర్యటన బిజీ బిజీగా సాగుతోంది. ఢిల్లీకి వెళ్లి పలువురు కేంద్ర మంత్రులను కలిసిన జగన్ నేరుగా తిరుమలకు వచ్చారు. అక్కడ బ్రహ్మోత్సవాలు సహా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అక్కడి నుంచి తాడేపల్లికి వెళ్లాల్సి ఉన్నా మార్పులు చేసుకోవాల్సి వచ్చింది.

Andrapradesh

Sep 24 2020, 10:38

సత్తెనపల్లిలో ఎమ్మెల్యే అంబటి పేరుతో భూకబ్జాదారుల బెదిరింపులు 

స్థలం దగ్గరకు వస్తే ముక్కలుగా నరుకుతామంటూ భూకబ్బాదారులు వార్నింగ్ 

మంచిగా చెబుతున్నా వినకపోతే నీ ఇష్టం... రేపు అంబటి కూడా వస్తున్నారు 

అక్కడే నీ అంతు తేలుస్తానంటూ ఫోన్లో భూకబ్జాదారుల బెదిరింపులు 

పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైన బాధితుడు భానుప్రసాద్ 

2017లో సర్వే నెంబర్ 174లో 11 సెంట్ల స్థలం కొనుగోలు చేసిన బాధితుడు 

కొన్ని రోజుల క్రితం భూకబ్జా బాధితుల మీడియా సమావేశం 

మీడియాకి ఎక్కడంతో చంపుతానంటూ భూకబ్జాదారుల హెచ్చరికలు

Andrapradesh

Sep 24 2020, 10:34

సుందరకాండ పారాయణంలో ముఖ్యమంత్రులు

తిరుమల: తిరుమల శ్రీవారిని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఉదయం మరోసారి దర్శించుకున్నారు. సీఎం జగన్‌తో కలిసి కర్ణాటక సీఎం యడియూరప్ప స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానికి వచ్చిన కర్ణాటక సీఎంకు, మహాద్వారం ప్రవేశ మార్గం వద్ద ముఖ్యమంత్రి‌ స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేదపండితులు ఇరు ముఖ్యమంత్రులకు తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌తో పాటు టీటీడీ చైర్మన్ వై.వి సుబ్బారెడ్డి, డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మంత్రులు పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే రోజా పాల్గొన్నారు.
శ్రీవారి దర్శనము ముగించుకుని ఆలయం ఎదురుగా ఉన్న నాద నీరాజనంకు ఇరు రాష్ట్రాలు ముఖ్యమంత్రులు చేరుకున్నారు. లోక కళ్యాణర్ధం కరోనా నేపథ్యంలో టీటీడీ గత మార్చి నెలనుంచి ధన్వంతరి మహా యాగం, ధన్వంతరి యోగ వశిష్ట్యం, గీతా పారాయణం, సుందరకాండ పారాయణం నిర్వహిస్తోన్న కార్యక్రమంలో ఇరువురు సీఎం పాల్గొన్నారు. ఉదయం 8:10 గంటలకు కర్ణాటక సీఎం యడియూరప్పతో కలిసి సీఎం జగన్ కర్ణాటక సత్రాల భవన నిర్మాణ భూమి పూజలో పాల్గొననున్నారు. అనతంరం ఉదయం 10:20కి రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌ నుంచి సీఎం జగన్‌ గన్నవరం బయల్దేరనున్నారు.

Andrapradesh

Sep 24 2020, 10:24

అవును.. ఆ చేప ధర రూ.1.70లక్షల ధర పలికింది..!

రికార్డు స్థాయిలో పలికిన ఆ ధరకు ఆ చేపను పట్టిన మత్య్సకారుడు మురిసిపోయాడు.. 

ఇంతకూ ఒక చేపకు అంత ధర ఎందుకు పలికింది? అన్నది ఒక ప్రశ్న. ఏపీలోని ప్రకాశం జిల్లా చీరాల వాడరేవులో లభించిన ఈ చేప ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.చీరాలకు చెందిన దోని దేవుడు అనే మత్స్యకారుడు ఉన్నాడు. రోజు మాదిరే మంగళవారం కూడా సముద్రంలోకి చేపల వేటకు వెళ్లాడు. అతనేమాత్రం ఊహించని రీతిలో అతడి సుడి తిరిగిపోయింది. వల విసిరినప్పుడు భారీ బరువు పడటంతో ఒక్కసారిగా అలెర్టు అయ్యాడు. వల పైకి లాగగా ఒక భారీ చేప పడినట్లుగా గుర్తించాడు.

వెంటనే దాన్ని తీసుకొని ఒడ్డుకు చేరుకున్నాడు. తీరా చూస్తే..ఆ చేప కాస్త అరుదైనదిగా తేలింది. 28 కేజీల బరువు ఉన్న ఆ చేపను కొనుగోలు చేసేందుకు పలువురు పోటీ పడ్డారు. చూస్తుండగానే వేలు దాటేసి ఏకంగా రూ.1.70లక్షల భారీ మొత్తానికి బేరం వెళ్లింది. చివరకు అక్కడి స్థానిక వ్యాపారి దారకొండ అనే వ్యక్తి ఆ చేపను రూ.1.70లక్షలు ఇచ్చి దోనిదేవుడి నుంచి సొంతం చేసుకున్నాడు.

అంత భారీగా ఖర్చు చేసి కొన్న ఆ చేప కచ్చిలిగా చెబుతున్నారు. ఈ చేప ప్రత్యేకత ఏమంటే.. దాని పొట్ట భాగాన్ని మందుల్లో వినియోగిస్తారని చెబుతున్నారు. ఈ కారణంతోనే దీనికి భారీగా ధర పలికినట్లుగా చెబుతున్నారు. ఏమైనా.. ఒకే చేపకు రూ.1.70లక్షల మొత్తం రావటం చాలా అరుదుగా జరుగుతుందన్న మాట మత్స్యకారుల నోటి నుంచి వినిపిస్తోంది. ఏమైనా దోనిదేవుడి సుడి తిరిగిందని.. దాన్ని సొంతం చేసుకున్న వ్యాపారికి కూడా భారీ లాభమే ఉంటుందని చెబుతున్నారు.

Andrapradesh

Sep 23 2020, 15:59

రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి  నేడు తిరుమల శ్రీవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాల సమర్పించనున్న నిమిత్తం రోడ్డుమార్గాన తిరుమల బయలు దేరి వెళ్లారు. 

విమానాశ్రయంలో స్వాగతం పలికిన ఉప ముఖ్యమంత్రులు శ్రీ కె.నారాయణ స్వామి, ఆళ్ల నాని, జిల్లా ఇంచార్జి మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి శ్రీ పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి, బిసి సంక్షేమ శాఖ మంత్రి టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, జెసి మార్కండేయులు ( ఇంచార్జి కలెక్టర్) నగరపాలక కమిషనర్ గిరీషా, అసిస్టెంట్ కలెక్టర్ విష్ణు చరణ్, డిఐజి కాంతిరణా టాటా, అర్బన్ ఎస్.పి.రమేష్ రెడ్డి, చిత్తూరు ఎస్.పి.సెంథిల్ కుమార్,  జె ఈ ఓ బసంత్ కుమార్, ఎం.ఎల్.సి. యండవల్లి శ్రీనివాసులు రెడ్డి, శాసన సభ్యులు తిరుపతి కరుణాకర రెడ్డి, శ్రీకాళహస్తి బియ్యపు మధుసూధనరెడ్డి, సత్యవేడు ఆదిమూలం,పుత్తూరు రోజా, పూతలపట్టు ఎం.ఎస్.బాబు, పలమనేరు వెంకటే గౌడ, కోడూరు శ్రీనివాసులు,  ఐజి శశిధర్ రెడ్డి, ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ సురేష్, డిప్యూటీ కమాండెంట్ దుర్గేష్ చంద్ర శుక్లా, సి.ఎస్.ఓ. రాజశేఖర్ రెడ్డి, రాజంపేట మేడా మల్లిఖార్జున రెడ్డి, డిసిసిబి చైర్మన్ రెడ్డెమ్మ, స్విమ్స్ డైరెక్టర్ వెంగమ్మ , టర్మీనల్ మేనేజర్ గోపాల్, 

ముఖ్యమంత్రి వెంట డిల్లి నుండి పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి వచ్చారు

Andrapradesh

Sep 23 2020, 15:54

పిడుగురాళ్ల వాసికి ఆంధ్రా విశ్వ‌విద్యాల‌యం నుంచి డాక్ట‌రేట్‌

పిడుగురాళ్ల‌, సెప్టెంబ‌ర్ 23, 2020: గుంటూరు జిల్లా పిడుగురాళ్ల ప్రాంతానికి చెందిన దొంతిరెడ్డి శివారెడ్డికి ఆంధ్రా విశ్వ‌విద్యాల‌యం నుంచి డాక్ట‌రేట్ అందింది. హైద‌రాబాద్‌లో డాక్ట‌ర్ రెడ్డీస్ ల్యాబ్స్‌లో ప‌నిచేస్తున్న ఆయ‌న‌.. అక్క‌డి మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి విభాగంలో అమ‌లు చేస్తున్న వివిధ విధానాల స‌మ‌ర్ధ‌త‌పై ప‌రిశోధ‌న చేసి, త‌న ప‌రిశోధ‌న వ్యాసాన్ని స‌మ‌ర్పించారు. ఈ వ్యాసాల‌ను ప‌రిశీలించిన త‌ర్వాత‌.. మాన‌వ‌వ‌న‌రుల నిర్వ‌హ‌ణ విభాగం (హెచ్ఆర్ఎం)లో పీహెచ్‌డీ ప్ర‌దానం చేస్తున్న‌ట్లు ఆంధ్రా విశ్వ‌విద్యాల‌యం త‌న నోటిఫికేష‌న్‌లో తెలిపింది. ఈ సంద‌ర్భంగా డాక్ట‌ర్ రెడ్డీస్ ల్యాబ్స్ యాజమాన్యం డాక్ట‌ర్ శివారెడ్డికి అభినంద‌న‌లు తెలియ‌జేసింది.


గుంటూరు జిల్లా పిడుగురాళ్ల ప్రాంతానికి చెందిన డాక్ట‌ర్ శివారెడ్డి బాల్య‌మంతా పిడుగురాళ్ల మండ‌లం బ్రాహ్మ‌ణ‌ప‌ల్లిలోనే జ‌రిగింది. ఆయ‌న తండ్రి దొంతిరెడ్డి బాపిరెడ్డి సామాన్య రైతు. త‌ల్లి అన‌సూయ గృహిణి. ప‌దోత‌ర‌గ‌తి వ‌ర‌కు బ్రాహ్మ‌ణ‌ప‌ల్లిలో చ‌దువుకున్న ఆయ‌న‌.. ఆ త‌ర్వాత ప్రైవేటుగా డిగ్రీ, ఆంధ్రా యూనివ‌ర్సిటీ నుంచి ఎంహెచ్ఆర్ఎం డిగ్రీలు చేశారు. 1994లో డాక్ట‌ర్ రెడ్డీస్ ల్యాబ్స్‌లో కాంట్రాక్టు ఉద్యోగిగా చేరిన ఆయ‌న‌.. నాలుగేళ్ల త‌ర్వాత శాశ్వ‌త ఉద్యోగిగా నియామ‌క ఉత్త‌ర్వులు అందుకున్నారు. ప్ర‌స్తుతం లీడ్, ఎంప్లాయీ రిలేష‌న్స్ గా ఉన్నారు. మారుమూల ప్రాంతం నుంచి వ‌చ్చినా స్వ‌శ‌క్తితో ఎదిగి, డాక్ట‌రేట్ కూడా సాధించిన ఆయ‌న‌.. త‌న డాక్ట‌రేటును త‌ల్లి అన‌సూయ‌కు అంకితం చేస్తున్న‌ట్లు తెలిపారు. మారుమూల ప‌ల్లెల నుంచి వ‌చ్చినా, ఆస‌క్తి ఉంటే ఎంత ఎత్తుకైనా ఎద‌గొచ్చ‌ని, చ‌దువు విష‌యంలో కూడా ప్ర‌తిభ‌కు ఆకాశ‌మే హ‌ద్ద‌ని డాక్ట‌ర్ శివారెడ్డి తెలిపారు. బ్రాహ్మ‌ణ‌ప‌ల్లి లాంటి గ్రామాలు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో చాలా ఉన్నాయ‌ని, గ్రామీణ ప్రాంత విద్యార్థులు త‌మ‌కు అవ‌కాశాలు లేవ‌ని బాధ‌ప‌డ‌కుండా వాటిని అందిపుచ్చుకుని ఎద‌గాల‌ని సూచించారు.

Andrapradesh

Sep 23 2020, 13:55

తిరుమల చరిత్ర ఏనాటిది? నాని చరిత్ర ఏపాటిది?: పరిపూర్ణానంద

అమరావతి: హిందూ దేవాలయాలపై ఆంధ్రప్రదేశ్‌ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలు సరికావని స్వామి పరిపూర్ణానంద అన్నారు. ‘‘బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన మంత్రి విచిత్రంగా మాట్లాడుతున్నారు. తిరుమల చరిత్ర ఏనాటిది..? నాని చరిత్ర ఏపాటిది..? జగన్ మౌనంతో.. ఆయనే మాట్లాడిస్తున్నారనే తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉంది. మావాళ్లు ఇలాగే మాట్లాడతారంటే పునాదులు కదిలిపోతాయి. ఇలాంటి వ్యాఖ్యలతో ప్రభుత్వానికి చాలా ప్రమాదం. హిందూ దేవాలయాలపై మాట్లాడేందుకు మీకు ఏ హక్కుంది? నానికి చట్టాలు, చరిత్ర తెలియదా? 1810లో డిక్లరేషన్‌ పెట్టారు. ప్రభుత్వ అధికారులు ఎవరూ దేవాలయాల జోలికి రావొద్దు’’ అని స్వామి పరిపూర్ణానంద హెచ్చరించారు.