భువనగిరి : సూరేపల్లి కి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలి: చిరంజీవి ఎస్టీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్
![]()
భువనగిరి జిల్లా కేంద్రం నుంచి సూరేపల్లి గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ చిరంజీవి డిమాండ్ చేశారు. శుక్రవారం భువనగిరి బస్ స్టేషన్ కంట్రోలర్ లింగయ్య కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ భువనగిరి జిల్లా కేంద్రం నుండి ఆర్టీసీ బస్సు సౌకర్యం లేక ప్రజలు , ప్రయాణికులు, విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారని ఆయన అన్నారు. గత రెండు నెలల నుంచి సూరేపల్లి గ్రామానికి బస్సు రావడం లేదని, ఈనెల నుంచి పాఠశాలలు, కళాశాలలు తెరవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని ఆయన అన్నారు. ప్రైవేట్ ఆటోలలో ఇతర వాహనాల ద్వారా విద్యార్థులు పాఠశాల, కళాశాలలకు వెళ్తున్నారని ఆయన తెలిపారు. అనంతరం భువనగిరి ఎమ్మెల్యే కుంబం అనిల్ కుమార్ రెడ్డి, యాదగిరిగుట్ట డిపో మేనేజర్ శ్రీనివాస్ లకు ఫోన్ ద్వారా సమాచారం అందజేశారు. వారు స్పందించి సూరేపల్లి గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు చిరంజీవి తెలిపారు. వినతి పత్రం అందజేసిన వారిలో గ్రామానికి చెందిన వెంకట నరసింహారెడ్డి , మురళి, ప్రభాకర్, నవీన్ ,మహేందర్, విద్యార్థులు పాల్గొన్నారు.
![]()


హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా చైర్మన్ గా వలిగొండ పట్టణ కేంద్రానికి చెందిన మారగోని శ్రీనివాస్ గౌడ్ ను నియమిస్తూ హ్యూమన్ రైట్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు,గుండారెడ్డి మల్లికార్జున రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో తనకు బాధ్యతలు అప్పగించిన జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ రెడ్డికి, నియామకానికి సహకరించిన సౌత్ ఇండియా చైర్మన్ రావులపల్లి తిరుపతయ్య, తెలంగాణ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఇటికాల మాధవి, ఎండి. సమిమ్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. మానవ హక్కులకు భంగం కలగకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా పోరాడుతానని తెలిపారు.
Jun 28 2024, 18:32
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
3- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
4.4k