వలిగొండ: పాఠశాలల బంద్ విజయవంతం: ABVP
![]()
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ABVP) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం వలిగొండ మండల కేంద్రంలో పాఠశాలల బంద్ విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థి పరిషత్ నాయకులు మాట్లాడుతూ 1,ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కలిపించాలని, 2,ప్రవేట్,కార్పొరేట్, ఇంటర్నేషనల్ పాఠశాలలో అక్రమంగా ఎక్కువ మొత్తంలో ఫిజులు వసూలు చేస్తున్న యజమాన్యాలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని, 3, ఫిజుల నియంత్రణ చట్టం వెంటనే అమలు చేయాలని, 4,ప్రభుత్వ గుర్తింపు మరియు నిబంధనలను పాటించని ప్రవేట్ పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలని, 5,నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవేట్ పాఠశాలలో బుక్స్,యూనిఫామ్స్,అమ్ముతున్న యజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, 6,ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత లేకుండా,వెంటనే DEO,MEO అధికారులను నియమించాలని, 7,ప్రభుత్వ పాఠశాలలో పెడుతున్న మధ్యాహ్న భోజనం లో జరుగుతున్న అవకతవకలపైన విచారణ జరిపి నాణ్యత లేని ఆహారాన్ని అందిస్తున్న అధికారులపై చర్యలు తీసుకొని నాణ్యమైన ఆహారాన్ని అందించాలని, 8,వెంటనే మెగా డిఎస్సి ద్వారా 24వేల పైగా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు అన్ని భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో సతీష్,మహేందర్,సన్నీ,చరణ్ శ్రీకాంత్ తదితర నాయకులు పాల్గొన్నారు.
![]()


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బుధవారం యాంటీ డ్రగ్స్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొని డ్రగ్స్ పై ప్రజలకి అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, తమ బంగారు భవిష్యత్తును అంధకారం చేసుకోకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో వలిగొండ ఎంపీపీ నూతి రమేష్ రాజ్,జడ్పిటిసి వాకిటి పద్మ అనంతరెడ్డి, వలిగొండ ఎస్సై మహేందర్, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను డిమాండ్ చేశారు 7 మండలాలకు ఒకరే ఎంఈఓ ఉండడం వలన విద్యాశాఖ నిర్లక్ష్యం కనబడుతుందని అన్నారు మోడల్ స్కూల్ కు క్రొత్తగా వేసిన సి సి రోడ్డుకు ఇరువైపులా మట్టి పోయకుండా పిఆర్ఏఈ సుగుణాకర్ రావు నిర్లక్ష్యం వహిస్తున్నారు అని అన్నారు విద్యార్థులకు ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి సుద్దాల సాయికుమార్, ఏఐఎస్ఎఫ్ నాయకులుబూడిద సాయి చరణ్, ఎస్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Jun 26 2024, 20:07
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
10.3k