భువనగిరి: హత్య కేసులో 14 మందికి జీవిత ఖైదు
యాదాద్రి భువనగిరి జిల్లా లోని మోటకొండూరు మండలం దిలావర్‌పూర్ గ్రామంలో జరిగిన సామూహిక హత్య కేసులో భువనగిరి కోర్టు సంచలన తీర్పు..
2018 ఆగస్టు 13వ తేదీ... ఆరేళ్ళ క్రితం దిలావర్‌పూర్ లో జరిగిన హత్య కేసులో 14 మందికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చిన భువనగిరి జిల్లా కోర్టు..
మంత్రాల నెపంతో దిలావర్‌పూర్ కు చెందిన సీస యాదగిరిని కొట్టి చంపిన గ్రామస్తులు..
![]()
ఇద్దరు మహిళలతో పాటు మరో పన్నెండు మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన జిల్లా నాయస్థానం..
సీస యాదగిరి మంత్రాలు చేస్తున్నాడని ఆరోపిస్తూ అతనిపై కర్రలతో దాడి చేసి కొట్టి చంపిన 15 మంది గ్రామస్తులు..
అందులో
A 14 నిందితుడు చనిపోయాడు
మిగతా 14 మందికి జీవిత ఖైదు
*సీస యాదగిరి కొడుకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, సాక్ష్యాధారాలను కోర్టు ముందుంచిన పోలీసులు...ఈ కేసు దర్యాప్తు విషయంలో అప్పటి మోటకొండూరు ఎస్సై గండికోట మధు, సిఐ ఆంజనేయులు కీలకంగా వ్యవహరించారు.

యాదాద్రి భువనగిరి జిల్లా లోని మోటకొండూరు మండలం దిలావర్‌పూర్ గ్రామంలో జరిగిన సామూహిక హత్య కేసులో భువనగిరి కోర్టు సంచలన తీర్పు..









యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ పట్టణంలో గాయత్రి హైస్కూల్ నందు జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహించారు . పవిత్రాత్మ, గాయత్రి పాఠశాలల విద్యార్థులకు అవగాహన సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యాదాద్రి భువనగిరి జిల్లా రవాణా శాఖ అధికారి జి రవీందర్ హాజరై ,మాట్లాడుతూ... మైనర్లు బైక్ నడపడం నేరం, ఒకవేళ ఆక్సిడెంట్ జరిగిన మీతో పాటు మీ తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించవలసి వస్తుందని అన్నారు .ముఖ్యంగా ఆడపిల్లల తల్లిదండ్రులు కారులో గాని, బైకుల మీద గాని, బయలుదేరినప్పుడు హెల్మెట్ ,సీటు బెల్టు, పెట్టుకొమని కూతురు చెప్తే దాన్ని తప్పకుండా వింటారు, కావున ఈ విషయాన్ని తప్పకుండా.. గుర్తు చేయాలని అన్నారు. డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ఫోఫోన్ వాడరాదు .ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయాలని విద్యార్థులతో అన్నారు .ఈ కార్యక్రమంలో యాజమాన్యం, ఉపాధ్యాయులు ,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిదాన్ పల్లి గ్రామంలో 15.00 లక్షల వ్యయంతో ,నిర్మించనున్న సి.సి రోడ్డు నిర్మాణ పనులకు, 10.00 లక్షల వ్యయంతో ,నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం ..అదనపు గదులను సోమవారం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు . అనంతరం గ్రామ పంచాయతీ పాలకవర్గం ని సన్మానించినారు.
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పరిధిలోని గొల్నేపల్లి గ్రామంలో ఆదివారం రోజు రాత్రి మిర్యాల గూడెం రోడ్డు ప్రమాదంలో, గొల్నేపల్లి గ్రామానికి చెందిన ఒకే కుటుంబం లో, ముగ్గురు మృతి చెందారు. మృతి చెందిన పార్థివ దేహాలకు, పూల మాలలు వేసి నివాళులు అర్పించిన స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. ఒకే కుటుంబంలో మృతి చెందిన వారికి తక్షణమే 50వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. వారి కుటుంబాన్ని ఆదుకుంటానని హామీ ఇచ్చారు. మృతి చెందిన వారు బొమ్మ మచ్చేందర్, అతని కుమారుడు నియాన్ష్ ప్రమాదం జరిగిన సమయంలో చనిపోయారు. అతని భార్య మాధవి చికిత్స పొందుతూ.. మరణించారు. కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. అదేవిధంగా గొల్నేపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎమ్మెల్యే వెంట సీనియర్ నాయకులు బెలిదె నాగేశ్వర్ గంగాపురం దైవాధీనం గౌడ్ గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలోని గూడూరు గ్రామంలో, నూతన గ్రామపంచాయతీ భవనాన్ని రోడ్లు ,భవనాలు మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడుతూ... కేసీఆర్ కాలి గోటికి కూడా రేవంత్ రెడ్డి సరిపోడని, నీచంగా కేటీఆర్ మాట్లాడడం తగదని అన్నారు. కష్టపడి జడ్పిటిసి, ఎమ్మెల్సీ, ఎంపీ, సీఎంగా ఎదిగిన వ్యక్తి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి కూడా తండ్రి మాధవరెడ్డి ద్వారానే జడ్పీ చైర్మన్ పదవి పొందాడని... అనడంతో జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి మంత్రి ప్రసంగాన్ని అడ్డుకున్నారు .దీంతో సభలో గందరగోళం ఏర్పడింది.

Jan 30 2024, 23:11
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
8.8k