భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన వలిగొండ ఎస్సై
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ పోలీస్ స్టేషన్ లో నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించి డి మహేందర్ లాల్ ఆదివారం భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డిని హైదరాబాద్ లో వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అందరినీ కలుపుకొని ముందుకు వెళ్లాలని అన్నారు. స్థానిక యువతకు క్రీడల పట్ల సూచనలు చేస్తూ వారికి అవగాహన కలిగేలా కృషి చేస్తూ ముందుకు తీసుకు వెళ్లాలని అన్నారు. యువతలో ఎలాంటి చెడు ప్రభావాలు రాకుండా చర్యలు తీసుకుని
అవగాహన కల్పించాలని ఎస్సై కి సూచించారు. 
Jan 28 2024, 16:34
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
8.7k