సూర్యాపేట: అభివృద్ధి పనుల్లో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలి:కొత్తపల్లి శివకుమార్ సీపీఐ(ఎం.ఎల్)ప్రజాపంథా జిల్లా కార్యదర్శి
అభివృద్ధి పనుల్లో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలి
- కొత్తపల్లి శివకుమార్ సీపీఐ(ఎం.ఎల్)ప్రజాపంథా జిల్లా కార్యదర్శి
సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన అభివృద్ధి పనుల్లో అవినీతి పై ఎంక్వయిరీ కమిటీ వేసి సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిపి, అవినీతికి పాల్పడ్డ కాంట్రాక్టర్లను దానికి సపోర్టుగా నిలిచిన అధికారులను, గతంలో ఉన్న అధికార పార్టీ నాయకులను శిక్షించి అవినీతి సొమ్మును ప్రజలకు పంచాలని కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ విక్రమ్ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
గత ప్రభుత్వంలో తొమ్మిదిన్నర సంవత్సరాలలో అభివృద్ధి పేరుతో వందల కోట్లు ప్రజాధనాన్ని వృధా చేసి, కాంట్రాక్టర్లు అధికారులు కుమ్మక్కై అవినీతికి పాల్పడి ప్రజల సొమ్మును దోచుకున్నారని అన్నారు. ఈ పనులన్నీ ఒక్క శ్రీనివాస్ రెడ్డికి ఇచ్చి అవినీతి కుంభకోణానికి మార్గమేశాల చేశారన్నారు. సూర్యాపేట కేంద్రంలో అభివృద్ధి పనులు జరిగేటప్పుడు వాటిని పరిశీలించి అనేకసార్లు మా పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు,ధర్నాలు, పాదయాత్రలు చేశాము. దానికి మా పైన గత ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించారు. కానీ అవినీతి కాంట్రాక్టర్ పైన అధికారుల పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అందువల్లనే అభివృద్ధి పనులలో నాణ్యత లోపించి నాలుగు రోజుల కింద ఈ మధ్యన పోస్ట్ ఆఫీస్ దగ్గర రోడ్డు కుంగిపోవడం జరిగిందనీ తెలిపారు.అదేవిధంగా ట్యాంక్ బండ్ పనులు మొత్తం కూడా నాణ్యత లోపంతో ఉన్నాయి. ఇవే కాకుండా పట్టణ కేంద్రంలో జరిగిన ప్రతి అభివృద్ధి పనిలో నాణ్యత లోపం స్పష్టంగా కనిపిస్తుంది అన్నారు.కాబట్టి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వీటిపైన సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిపించి, అవినీతి కాంట్రాక్టర్లు గత ప్రభుత్వంలో ఉన్నవాళ్లు, అధికారులను కటకటాలకు పంపించి శిక్షించాలని,దోచుకున్న సొమ్మును వెలికి తీసి ప్రజలకు పంచాలని మా పార్టీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం అని తెలిపారు. లేనియెడల ముందు ముందు పోరాటాలను ధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐపికేఎంస్ రాష్ట్ర నాయకులు మట్టిపల్లి అంజయ్య, పిఓడబ్ల్యు జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రేణుక,పిడిఎస్యు రాష్ట్ర సహయ ఎర్ర అఖిల్ కుమార్,పార్టీ జిల్లా నాయకులు పేర్ల నాగయ్య, లక్ష్మయ్య , నర్సయ్య, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి భూక్యా రాంజీ, పద్మ, జీవన్ తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి పనుల్లో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలి
నగరి టికెట్‌పై మంత్రి రోజా కామెంట్స్
బిగ్ బ్రేకింగ్:

హైదరాబాద్: పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల రాయితీపై జీవో విడుదల.. జీవో విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం.. నేటి నుంచే పెండింగ్ చలాన్లపై రాయితీ వర్తింపజేస్తున్నట్లు ఆదేశాలు.
తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్ధుల్లో గందరగోళం నెలకొంది. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన ఈ పరీక్షలు ఈ సారైనా జరుగుతాయో లేదోనని సందిగ్ధంలో ఉన్నారు. షెడ్యూల్ ప్రకారం గ్రూప్ 2 పరీక్షలు జనవరి 6, 7 తేదీల్లో నిర్వహిస్తామంటూ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్విస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) రెండు నెలల క్రితమే ప్రకటించింది. తాజాగా గ్రూప్- 2 పరీక్ష మళ్లీ వాయిదా పడినట్లు సమాచారం అందుతోంది. వాస్తవానికి ఈ ఏడాది నవంబర్ 2, 3 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు టీఎస్పీయస్సీ తేదీలు ప్రకటించినప్పటికీ పరీక్షల సన్నద్ధతకు మరింత సమయం ఇవ్వాలంటూ అభ్యర్థులు విజ్ఞప్తి చేసుకున్నారు. ఇంతలో ఎన్నికల షెడ్యూల్ వెలువడటం, పోలీసులు ఎన్నికల విధుల్లో ఉండటంతో 2024 జనవరిలో పరీక్షలు నిర్వహిస్తామని కమిషన్ ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఉందా? లేదా? అనే డౌట్‌కు చెక్ పెడుతూ స్ట్రాటెజీస్‌కు క్లాప్ కొట్టింది కాంగ్రెస్ హైకమాండ్. ఏపీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా మాణిక్యం ఠాకూర్‌కు బాధ్యతలు అప్పగించారు. కర్ణాటక, తెలంగాణలో పవర్ చేజిక్కింది. అంతే వైట్ నాట్ ఏపీ? అంటూ రాహుల్ గాంధీ బెల్ మోగించారు. తెలంగాణ ఎన్నికల టైమ్ నుంచే ఆయన ఇప్పుడు ఏపీపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. రాహుల్ మాట రీసౌండ్ ఇవ్వడమే కాకుండా ఏపీ కాంగ్రెస్‌లో కదలిక కన్పించింది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనలు, బెజవాడలో పొలిటికల్ ఎఫైర్స్ మీటింగ్, ఇలా చాన్నాళ్ల తరువాత ఢిల్లీతో ఫోన్-ఇన్‌ల పర్వం మొదలైంది.
ఇవాళ గుంటూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలను ఆయన ప్రారంభించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయల్దేరి నల్లపాడు చేరుకుంటారు. అనంతరం.. నల్లపాడు లయోలా పబ్లిక్ స్కూల్‌లో ఆడుదాం ఆంధ్రా పోటీలను సీఎం జగన్ ప్రారంభిస్తారు. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ పోటీలను నిర్వహించనున్నారు. ఏపీలో తొలిసారిగా గ్రామ, వార్డు సచివాలయాల స్థాయి నుంచి.. రాష్ట్ర స్థాయి వరకు పండుగ వాతావరణంలో ఈ క్రీడా సంబరాల నిర్వహణ జరుగుతోంది.
ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టీ.. సీఎం హోదాలో తొలిసారి ప్రధానిని కలవనున్న రేవంత్.. తెలంగాణకు ఇచ్చిన విభజన హామీలపై వినతులు.. అలాగే, కాంగ్రెస్ పెద్దలతో భేటీకానున్న రేవంత్, భట్టీ.. నామినేటెడ్ పోస్ట్‌లతో పాటు లోక్‌సభ ఎన్నికలపై చర్చించే అవకాశం.
Dec 27 2023, 07:45
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
11.8k